Rage Applying Is The New Workplace Trend Among Employees After Quiet Quitting - Sakshi
Sakshi News home page

Rage Applying: కంపెనీలను కుదిపేస్తున్న'రేజ్‌ అప్లయింగ్‌' సునామీ

Published Mon, Jan 16 2023 9:02 PM | Last Updated on Mon, Jan 16 2023 9:34 PM

Rage Applying Is The New Workplace Trend Among Employees After Quiet Quitting - Sakshi

దేవుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించినట్టే..యజమాని ప్రతి విభాగంలో రివాల్వింగ్‌ చెయిర్‌ వేసుకుని కూర్చోలేడు కాబట్టి, తన ప్రతినిధిగా బాసును పంపాడు. అలాంటి బాస్‌లతో వేగ‌లేక‌ ఉద్యోగాలకు భారీ ఎత్తున రాజీనామా చేస్తున్నారు. కొత్త ఏడాది ప్రారంభమై 15 రోజులే అవుతున్నా..రానున్న రోజుల్లో ‘రేజ్‌ అప్లయింగ్‌’ అంటూ రాజీనామాల సునామీ రాబోతున్నట్లు తెలుస్తోంది.

రేజ్‌ అప్లయింగ్‌.. 2023లో ఐటీ వర్గాల్లో ఈ పదం తెగ వినపడుతోంది. గతేడాది  మూన్‌లైటింగ్‌,క్వైట్‌ క్విటింగ్‌, దిగ్రేట్‌ రిజిగ్నేషన్‌ వంటి పదాలు ప్రాచుర్యంలోకి రాగా..ఈ ఏడాది రేజ్‌ అప్లయింగ్‌ అనే పదం బాగా వినిపిస్తోంది. 

ఈ ఏడాది జాబ్‌ మార్కెట్‌లో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో తలెత్తిన సంక్షోభంతో చాలా మంది ఉద్యోగులు కొత్త కొత్త సవాళ్లను స్వీకరించడానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, ఒక రంగం నుంచి మరో రంగానికి షిఫ్ట్‌ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరీ ముఖ్యంగా,  మునుపెన్నడూ లేనంతగా ఆఫీస్‌ వర్క్‌- పర్సనల్‌ లైఫ్‌ రెండూ బ్యాలెన్స్‌ చేసుకునేందుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. దీంతో ఉద్యోగుల పని విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది.

అలా మార్పులు చోటు చేసుకుంటున్న జాబ్‌ మార్కెట్‌ 'క్వైట్ క్విట్టింగ్' అనే కాన్సెప్ట్ గత ఏడాది సోషల్ మీడియాలో ట్రెండ్‌ అయ్యింది. క్వైట్‌ క్విటింగ్‌ అంటే నెమ్మదిగా జారుకోవడం అని అర్థం.  కార్పొరేట్‌ పరిభాషలో పని భారాన్ని తగ్గించుకోవడం. కేవలం తమ పాత్ర ఎంత వరకో అక్కడికి మాత్రమే పరిమితం కావడం. ముఖ్యంగా కొవిడ్‌ తర్వాత వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడంలో భాగంగా ఉద్యోగులు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇప్పుడు, ఫార్చ్యూన్ మ్యాగజైన్‌ నివేదిక ప్రకారం..క్వైట్‌ క్విట్టింగ్‌కు కొనసాగింపుగా రేజ్‌ అప్లయింగ్‌ అనే పదం బాగా పాపులర్‌ అవుతుంది.  రేజ్‌ అప్లయింగ్‌ అంటే మీరు ఓ ఉద్యోగంలో చేరి 4,5 నెలల అవుతుంది. బాస్‌ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అలా ఉంటే వెంటనే రిజైన్‌ చేసి కొత్త జాబ్‌లో చేరడాన్ని రేజ్‌ అప్లయింగ్‌ అంటారు. ఈ రేజ్‌ అప్లయింగ్‌ చేస్తున్న జాబ్‌లో అలసిపోవడం, పనికి తగ్గ ప్రతిఫలం లేకపోతే మూకుమ‍్మడిగా ఉద్యోగులు రిజైన్‌ చేయడం. పదుల సంఖ్య కొత్త ఉద్యోగాలు అప్లయ్‌ చేయడం లాంటివి కూడా ఇందులో ఉన్నాయి.


ఫార్చ్యూన్ ప్రకారం, ఉద్యోగి మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్ లాటిస్ పీపుల్ గతేడాది ఏప్రిల్ నెలలో సర్వే చేసింది. ఆ సర్వేలో మూడు నెలలు లేదా అంతకంటే తక్కువ కాలం ఉద్యోగం చేస్తున్న వారు.. మరో ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న 52 శాతం మంది ఉద్యోగులు చెప్పారు. మూడు నుంచి ఆరు నెలల పాటు ఉద్యోగంలో ఉన్నవారు.. తమ అంచనాలకు అనుగుణంగా లేదని రాజీనామా చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 59 శాతానికి పెరిగింది. ఈ సందర్భంగా లాటిస్ పీపుల్  వైస్ ప్రెసిడెంట్ డేవ్ కార్హార్ట్ మాట్లాడుతూ.. జాబ్‌ మార్కెట్‌లో ఉద్యోగుల అవసరాల్ని, లేదా అంచనాల్ని అందుకోలేని ఉద్యోగంలో 12 లేదా 18 నెలల పాటు కొనసాగించాల్సిన అవసరం లేదని గ్రహించినట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement