
Multibagger Stock: కోవిడ్-19 మహమ్మారి తర్వాత కొంత మందికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే.. కొందరికి మాత్రం కనక వర్షం కురుస్తుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత స్టాక్ మార్కెట్ శర వేగంగా పుంజుకోవాడంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వారి ఇంట కనక వర్షం కురుస్తుంది. కొన్ని చిన్న కంపెనీల స్టాక్స్ మాత్రం మదుపరులకు కళ్లు చెదిరే లాభాలను తెచ్చిపడుతున్నాయి. అలాంటి కోవకు చెందినదే రఘువీర్ సింథటిక్స్(Raghuvir Synthetics) కంపెనీ. ఈ కంపెనీ షేర్లు కొనుగోలు చేసిన వారి జాతకం ఆరు నెలల్లోనే మారిపోయింది.
ఈ ఏడాది జూలై నెల 6వ తేదీన రూ.18.90లుగా ఉన్న షేర్ ధర నేడు రూ.600 రూపాయలుగా ఉంది. అంటే, జూలై నెల 6వ తేదీన రూ.1 లక్ష రూపాయలు పెట్టి రఘువీర్ సింథటిక్స్ కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన మదుపరులకు రూ.30 లక్షలకు పైగా లాభం వచ్చేది. అందుకే అంటారేమో ఎంత రిస్క్ అంత లాభం(అన్ని వేళలా కాదు) వస్తుంది అని. ఈ రఘువీర్ సింథటిక్స్ కంపెనీని 1968లో స్థాపించారు. ఈ మధ్య యువత మార్కెట్ మీద ఆసక్తి కనబరచడం, కొత్త పెట్టుబడిదారులు మార్కెట్లోకి ప్రవేశించడంతో స్టాక్ మార్కెట్ జోరందుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ఒక బంగారు గనిలో మారింది. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి జాతకాలు ఏడాదిలో మారిపోతున్నాయి. లక్షల పెట్టుబడుతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment