న్యూఢిల్లీ: ప్రముఖ ఎనర్జీ డ్రింక్ రెడ్ బుల్ రెడ్ బుల్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్, డైట్రిచ్ మాటెస్చిట్జ్ (78) కన్నుమూశారు. రెడ్ బుల్ ఫార్ములా వన్ రేసింగ్ టీమ్ వ్యవస్థాపకుడు కూడా అయిన డైట్రిచ్ మరణానికి ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. రెడ్ బుల్ పశ్చిమ దేశాల్లో సైతం సక్సెస్‌ఫుల్ బ్రాండ్‌గా నిలపడలో చాలా కృషి చేశారు.
ఆస్ట్రియన్ పారిశ్రామికవేత్త డైట్రిచ్ ఫార్ములా వన్ రేసింగ్ టీమ్ యజమానిగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ డ్రింక్ రెడ్‌బల్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడమే కాకుండా, మోటార్ స్పోర్ట్స్, మీడియా, రియల్ ఎస్టేట్, గ్యాస్ట్రోనమీ రంగాలకు విస్తరించారు. ఫుట్‌బాల్ క్లబ్‌లు, హాకీ, రేసింగ్ జట్లను నిర్వహిస్తోంది రెడ్‌బుల్. ముఖ్యంగా.ఎయిర్ అక్రోబాటిక్స్ క్లిఫ్ డైవింగ్ వంటి ఈవెంట్‌లను స్పాన్సర్ చేస్తుంది రెడ్‌బుల్.
రెడ్ బుల్ ఫార్ములా వన్ జట్టు హెడ్ క్రిస్టియన్ హార్నర్ డైట్రిచ్ మరణంపై సంతాపం వెలిబుచ్చారు. రెండు వారాల క్రితం జపనీస్ గ్రాండ్ ప్రిక్స్‌ను గెలుచుకుని వెర్‌స్టాపెన్ వరుసగా రెండో టైటిల్‌ను సాధించేవరకు మాటెస్చిట్జ్ జీవించి ఉండటం అదృష్టమన్నారు. అన్నివిషయాల్లోనూ తమకు ఆయన ఎన్నెముకలా నిలిచారని పేర్కొన్నారు. ఫార్ములా వన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టెఫానో డొమెనికాలి ఫార్ములా వన్ కుటుంబంలో అత్యంత గౌరవనీయమైన , అత్యంత ప్రీతిపాత్రమైన సభ్యుడుగా అభివర్ణించారు.
కాగా పానీయాల డెవలపర్ థాయ్ వ్యాపారవేత్త చాలీయో యోవిధ్య మరో ఇద్దరితో కలిసి 1984లో రెడ్ బుల్‌ని స్థాపించారు. గ్లోబల్‌గా సూపర్ క్రేజ్ పొందిన రెడ్ బుల్ గత ఏడాది 172 దేశాల్లో ఏకంగా 100 కోట్ల క్యాన్లను విక్రయించడం విశేషం. దీంతో 2022లో 27.4 బిలియన్ల డాలర్ల నికర విలువతో ఫోర్బ్స్ ఆస్ట్రియా అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు డైట్రిచ్.
Comments
Please login to add a commentAdd a comment