
ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థలు ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా టారిఫ్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వారి బాటలోనే టారిఫ్ రేట్లను పెంచుతూ జియో నిర్ణయం తీసుకుంది. సుమారు 20 శాతం మేర ప్లాన్ ధరలను జియో పెంచింది. పెరిగిన టారిఫ్ ప్లాన్ల రేట్లు డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. జియోఫోన్ ప్లాన్ రూ. 75 నుంచి రూ. 91కి పెరిగింది. ఆయా ప్లాన్లను బట్టి సుమారు రూ. 24 నుంచి రూ. 480 మేర ధరలు పెరిగాయి.
టెలికాం సర్వీసులను మరింత బలోపేతం చేయాలనే నిబద్ధతకు అనుగుణంగా కొత్త అపరిమిత ప్లాన్ రేట్లను పెంచుతున్నట్లు జియో ఒక ప్రకటనలో పేర్కొంది. టెలికాం పరిశ్రమలో ఈ కొత్త టారిఫ్ ప్లాన్స్ అత్యుత్తమ ప్లాన్స్‌గా నిలుస్తాయని జియో వెల్లడించింది.
జియో కొత్త ప్లాన్స్ ఇలా ఉన్నాయి..!
Comments
Please login to add a commentAdd a comment