డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్‌లో పీఈ సంస్థ సిల్వర్ లేక్ వాటా కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ ఆర్‌ఐఎల్‌తో చర్చలు నిర్వహిస్తున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఈ కథనం ప్రకారం ఇప్పటికే చర్చలు ప్రారంభమైనట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. రిలయన్స్ రిటైల్‌లో 1.7-1.8 శాతం వాటా కొనుగోలుకి పీఈ సంస్థ సిల్వర్ లేక్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వాటా విలువను రూ. 7,500 కోట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
భారీ విలువ
సిల్వర్ లేక్‌తో 1.8 శాతం వాటాకుగాను రూ. 7,500 కోట్లకు డీల్ కుదిరితే.. రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.3 లక్షల కోట్ల(57 బిలియన్ డాలర్లు)కు చేరవచ్చని నిపుణులు ఊహిస్తున్నారు. డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో బాటలో రిలయన్స్ రిటైల్‌లోనూ మైనారిటీ వాటా విక్రయం ద్వారా మరిన్ని నిధులు సమకూర్చుకునే ప్రణాళికల్లో ముకేశ్ అంబానీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కాగా.. కంపెనీ విధానాల ప్రకారం ఊహాజనిత వార్తలపై స్పందించబోమంటూ ఆర్‌ఐఎల్ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే వృద్ధికి వీలుగా కంపెనీ వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. డీల్ తదితర అంశాలకు తెరతీస్తే సెబీ నిబంధనల ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తామని స్పష్టం చేశారు. కాగా.. రిలయన్స్ జియోలో ఇప్పటికే సిల్వర్ లేక్ రూ. 10,202 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలకు రిలయన్స్ రిటైల్‌లోనూ వాటా కొనుగోలుకి వీలు కల్పిస్తున్నట్లు వార్తా కథనంలో మీడియా పేర్కొంది.
కన్సాలిడేషన్
గత నెలలో కిశోర్ బియానీ సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ బిజినెస్‌లను ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 24,713 కోట్ల డీల్‌ను కుదుర్చుకుంది. తద్వారా దేశీ రిటైల్ రంగంలో కన్సాలిడేషన్ ద్వారా రిలయన్స్ గ్రూప్.. రిటైల్ బిజినెస్‌ను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు నిపుణులు తెలియజేశారు. రిలయన్స్ రిటైల్‌లో 10 శాతంవరకూ వాటాను విక్రయించే ప్రణాళికల్లో ముకేశ్ అంబానీ ఉన్నట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment