దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం బలమైన ప్రారంభాన్ని అందుకున్న దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 అన్ని సెక్టార్‌లలో బలహీనమైన ట్రేడింగ్‌తో ఫ్లాట్‌గా ముగిశాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 12 పాయింట్లు లేదా 0.02 శాతం క్షీణించి 80,425 వద్ద ముగిసింది. అదేవిధంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 31.5 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 24,573 వద్ద ముగిసింది.
బెంచ్‌మార్క్‌ల లాభాల్లో హిందాల్కో, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎల్‌టీఐఎండీట్రీ, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి. ఈ స్టాక్స్ 1.8 శాతం నుంచి 4 శాతం వరకు లాభపడ్డాయి. మహీంద్రా&మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్, టాటా మోటార్స్ 2.5 శాతం వరకు పడిపోయాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment