దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 23,243కు చేరింది. సెన్సెక్స్ 77 పాయింట్లు దిగజారి 76,410 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 105.15 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 78.01 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.26 శాతం, నాస్‌డాక్ 0.38 శాతం లాభాల్లోకి చేరాయి.
డీప్‌ఫేక్ వీడియోలను నమ్మొద్దు: ఎన్‌ఎస్‌ఈ
డీప్‌ఫేక్ వీడియోల పట్ల జాగ్రత్త వహించాలంటూ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేజీ(ఎన్‌ఎస్‌ఈ) ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో అశిష్‌కుమార్ చౌహాన్ పెట్టుబడులకు సంబంధించి సలహాలిస్తున్నట్లు వైరల్ అవుతున్న నకిలీ వీడియోల నేపథ్యంలో ఎక్స్ఛేజీ ఈ హెచ్చరిక జారీ చేసింది.
మేలో ఈక్విటీ ఎంఎఫ్‌ల రికార్డు
మే నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)కు ఇన్వెస్టర్లు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ మే నెలలో రూ.34,697 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 83 శాతం అధికం. సిప్‌కు సైతం రూ.20,904 కోట్ల పెట్టుబడులు లభించినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా(యాంఫీ) వెల్లడించింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment