దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 24,395కు చేరింది. సెన్సెక్స్ 161 పాయింట్లు దిగజారి 80,193 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 105 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 84.88 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.3 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.07 శాతం, నాస్‌డాక్ 0.15 శాతం లాభపడ్డాయి.
ఆటో, ఎఫ్‌ఎంసీజీతో పాటు కన్జూమర్ డ్యూరబుల్స్, రియల్టీ, వినిమయ, ఫార్మా, యుటిలిటీ, కన్జూమర్ డిస్క్రీషనరీ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. మంగళవారం ఒకానొక సమయంలో సెన్సెక్స్ 437 పాయింట్లు బలపడి 80,397 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు ఎగసి 24,444 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. రికార్డు ర్యాలీలోనూ టెలికం క్యాపిటల్ గూడ్స్, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా చట్ట సభల్లో ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగానికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి.
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.21,262 కోట్ల పెట్టుబడులు వచ్చా యి. ఇది నెలవారీ సరికొత్త గరిష్ట స్థాయి. మే నెల సిప్ పెట్టుబడులు రూ.20,904 కోట్లు. జూన్‌లో కొత్తగా 55.13 లక్షల సిప్ రిజిస్ట్రేషన్లు పెరిగాయి. దీంతో మొత్తం సిప్ ఖాతాల సంఖ్య మే చివరికి ఉన్న 8.76 కోట్ల నుంచి జూన్ చివరికి 8.99 కోట్లకు చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment