దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి 24,463కు చేరింది. సెన్సెక్స్ 142 పాయింట్లు పుంజుకుని 80,181 వద్ద ట్రేడవుతోంది. వరుసగా ఐదు రోజుల నష్టాలకు ఈరోజు మార్కెట్ ప్రారంభంతో బ్రేక్ పడినట్లయింది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 104.35 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.2 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.5 శాతం, నాస్‌డాక్ 0.9 శాతం నష్టపోయాయి.
అకుమ్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఐపీఓ జులై 30న ప్రారంభమై ఆగస్టు 1న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.646- 679ను నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.1,857 కోట్లు సమీకరించనుంది. జులై 29న యాంకర్ మదుపర్లు బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. రిటైల్ మదుపర్లు కనీసం 22 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో గురువారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు ప్రభావం చూపాయి. షేర్ల లావాదేవీల రుసుముతో పాటు, స్వల్ప-దీర్ఘకాలిక లాభాలపై పన్ను పెంపు నేపథ్యంలో విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగాయి. చమురు, వాహన షేర్లు రాణించడంతో నష్టాలు తగ్గాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment