దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 25,243కు చేరింది. సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 82,495 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 101.27 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.39 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.75 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం, నాస్‌డాక్ 0.3 శాతం నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లు పెద్దగా పెరిగే అవకాశాలు కనిపించడం లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ సమావేశం సెప్టెంబర్ 17-18 జరగనుంది. అట్లాంటా ఫెడ్ అధ్యక్షుడు బోస్టిక్ తాజాగా వడ్డీరేట్లకు సంబంధించి ప్రస్తావించారు. ద్రవ్యోల్బణం రెండు శాతానికి వస్తేనే కీలక వడ్డీరేట్లను తగ్గిస్తామనే ధోరణి సరికాదన్నారు. గడిచిన సెషన్‌లో ఎఫ్‌ఐఐలు రూ.975.46 కోట్లు, డీఐఐలు రూ.97.35 కోట్ల విలువగల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment