దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాటి సెషన్‌ను ఫ్లాట్ నోట్‌తో ముగించాయి. ఇంట్రాడే ట్రేడ్‌లో రికార్డు స్థాయిలో 25,129.60 వద్ద స్కేల్ చేసిన తర్వాత, నిఫ్టీ 34.60 పాయింట్లు లేదా 0.14 శాతం పెరిగి 25,052.35 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ మునుపటి ముగింపుతో పోలిస్తే కేవలం 73.80 పాయింట్లు లేదా 0.09 శాతం పెరిగి 81,785.56 వద్ద ముగిసింది.
నిఫ్టీకి చెందిన 50 లిస్టెడ్ స్టాక్‌లలో 29 నష్టాల్లో ముగిశాయి. మారుతీ సుజుకీ ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్ 1.34 శాతం వరకు పతనమై నష్టాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి.
బీఎస్‌ఈలో సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 20 నష్టాల్లో ముగియగా, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ ఇండియా, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు 1.24 శాతం వరకు క్షీణించాయి.
ఇక రంగాలవారీగా చూస్తే ఐటీ షేర్లు ఇతర రంగాల కంటే మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో విప్రో, ఎల్‌టీఐమైండ్‌ట్రీ 1.64 శాతం పెరిగాయి. ఇతర రంగాల సూచీలలో ఫార్మా, హెల్త్‌కేర్ 1.20 శాతం వరకు కొన్ని లాభాలను పొందగలిగాయి. మిగిలినవి నష్టాల్లో ముగిశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment