సెప్టెంబర్ నెలలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. అక్టోబర్ ప్రారంభంలో కొంత శాంతించాయి. దీంతో పసిడి ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మంగళవారం) దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. దీంతో హైదరాబాద్, విజయవాడలలో 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రేటు రూ. 70,500 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.76,910 వద్ద ఉంది. నిన్నటి ధరలో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 300, రూ. 330 తగ్గింది. గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా ఇదే ధరలు ఉంటాయి.
చెన్నైలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 70,500 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 76,910గా ఉంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర నిన్నటి కంటే కూడా రూ. 300, రూ. 330 తగ్గినట్లు స్పష్టమవుతోంది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 70,650 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.77,060 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. బంగారం ధర ఈ రోజు రూ. 300, రూ. 330 తగ్గింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్
వెండి ధరలు
బంగారం ధరల కొంత తగ్గినప్పటికీ.. వెండి మాత్రం స్థిరంగా ఉంది. సిల్వర్ రేటులో గత మూడు రోజులుగా ఎలాంటి మార్పు లేదు. కాబట్టి వెండి ధర రూ. 1,01,000 (కేజీ) వద్ద ఉంది. ఇదే ధరలు దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఉండే అవకాశం ఉంటుంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment