తగ్గిన బంగారం, వెండి: ఎంతంటే? | Today Gold And Silver Price 3 August 2024 | Sakshi
Sakshi News home page

Gold And Silver Price: తగ్గిన బంగారం, వెండి: ఎంతంటే?

Published Sat, Aug 3 2024 10:59 AM | Last Updated on Sat, Aug 3 2024 11:55 AM

Today Gold And Silver Price 3 August 2024

మూడు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు శనివారం (ఆగష్టు 3) స్వల్పంగా తగ్గాయి. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. దేశ వ్యాప్తంగా ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం.

విజయవాడ, హైదరాబాద్‌లలో ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64700 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 70580 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.100, రూ.110 మాత్రమే తగ్గింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉన్నాయి.

చెన్నైలో పసిడి ధరలు నేడు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64500 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ పసిడి ధర రూ. 70360 వద్ద ఉన్నాయి.

దేశ రాజధాని నగరంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 64850 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70730 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 100 తగ్గింది.

వెండి ధరలు
బంగారం మాదిరిగానే దేశంలో వెండి ధరలు కూడా టగ్గాయి. శుక్రవారం రూ. 100 పెరిగిన వెండి ధర శనివారం (ఆగష్టు 3) గరిష్టంగా రూ. 1700 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 85500కు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement