ఏప్రిల్ ప్రారంభం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఉలుకూ.. పలుకూ లేకుండా అన్నట్లు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66550 (22 క్యారెట్స్), రూ.72600 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 300 నుంచి రూ. 330 వరకు తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 66700 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 72750 రూపాయల వద్దే ఉంది. నిన్న రూ.300, రూ.330 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు ఏ మాత్రం పెరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి.
దేశంలోని ఇతర నగరాలలో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 67400 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 73530 రూపాయల వద్ద ఉంది.
వెండి ధరలు
బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం రూ. 100 తగ్గింది. కాబట్టి ఈ రోజు (ఏప్రిల్ 30) ఒక కేజీ వెండి ధర 83900 రూపాయల వద్ద నిలిచింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేదు.
Comments
Please login to add a commentAdd a comment