
జులై ప్రారంభం నుంచి పెరుగుతూ ఉన్న పసిడి ధరలు అస్సలు తగ్గేదెలా అన్నట్టు దూసుకెల్తూనే ఉన్నాయి. ఈ రోజు కూడా ధరల్లో ఎటువంటి తగ్గుదల కనిపించలేదు. దీంతో నిన్నటి ధరలే ఈ రోజు (జులై 7) కూడా కొనసాగుతాయి. నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67650 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73800 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.
ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67800 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73950 వద్ద ఉంది.
హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో మాత్రమే కాకుండా చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 68200.. కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 74400 వద్ద ఉంది.
వెండి ధరలు
బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా ఈ రోజు స్థిరంగానే ఉన్నాయి. దీంతో నేడు (జులై 7) కేజీ వెండి ధర రూ. 94800 వద్ద ఉంది. అయితే వెండి ధర కూడా ఈ నెల ప్రారంభం నుంచి ఏ మాత్రం తగ్గలేదు. కాబట్టి వెండి దాదాపు ఒక లక్షలు చేరువవుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).