
ఈక్విటీ మార్కెట్‌లు ఇటీవల కాలంలో తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దాంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,350 (22 క్యారెట్స్), రూ.72,380 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు.
చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.50, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.60 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.66,950 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,040 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.
దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,500.. 24 క్యారెట్ల ధర రూ.72,530 వద్ద ఉన్నాయి. మార్కెట్‌లో కేజీ వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.500 పెరిగి రూ.96,000 వద్దకు చేరింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
Comments
Please login to add a commentAdd a comment