న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కార్లు, త్రిచక్ర, ద్విచక్ర వాహనాలు, క్వాడ్రిసైకిల్స్ హోల్‌సేల్ విక్రయాలు 2021 అక్టోబర్‌లో 17,99,750 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 25 శాతం తగ్గుదల. మొత్తం ఉత్పత్తి 22 శాతం క్షీణించి 22,14,745 యూనిట్లుగా ఉంది. కార్ల అమ్మకాలు 27 శాతం తగ్గి 2,26,353 యూనిట్లకు చేరాయి.
ద్విచక్ర వాహనాలు 25 శాతం క్షీణించి 15,41,621 యూనిట్లుగా ఉంది. వీటిలో మోటార్‌సైకిల్స్ 26 శాతం తగ్గి 10,17,874 యూనిట్లు, స్కూటర్స్ 21 శాతం క్షీణించి 4,67,161 యూనిట్లకు వచ్చి చేరాయి. సెమికండక్టర్ల కొరత కారణంగా ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment