న్యూఢిల్లీ: కోవర్కింగ్ కంపెనీ వియ్‌వర్క్ ఈ కేలండర్ ఏడాది(2022) ఆదాయంలో భారీ వృద్ధిని ఆశిస్తోంది. 70 శాతం అధికంగా రూ. 1,300 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్లెగ్జిబుల్ ఆఫీసు స్పేస్‌కు పెరుగుతున్న డిమాండు నేపథ్యంలో భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు కంపెనీ సీఈవో కరణ్ వీర్వాణీ పేర్కొన్నారు.
వచ్చే ఏడాది(2023)లోనూ ఇదే స్థాయి వృద్ధిని సాధించేందుకు వీలుగా పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. బెంగళూరు కంపెనీ వియవర్క్ ఇండియా ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబైసహా ఆరు ప్రధాన నగరాలలో కార్యకలాపాలు కలిగి ఉంది. 6 మిలియన్ చదరపు అడుగుల విభిన్న వినియోగ కార్యాలయ ప్రాంతంతో పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకుంది. వీటిలో భాగంగా 41 కేంద్రాల ద్వారా 70,000 డెస్క్‌లను నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment