దుబాయ్: కట్టుబాట్లకు మారుపేరైన దేశంలో అసభ్యతను వ్యాప్తి చేస్తున్నారనే కారణంతో పన్నెండు మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. బాల్కనీలో నిల్చుని నగ్న ప్రదర్శన చేసినందుకు వారిని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌లో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మెరీనా మార్కెట్ ఏరియాలోని ఓ అపార్టుమెంటు బాల్కనీలోకి పగటిపూట కొంతమంది మహిళలు వచ్చారు. వివస్త్రలుగా మారి అక్కడ నిల్చున్నారు. ఈ విషయాన్ని గమనించిన కొంతమంది వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు.
అసభ్య ప్రవర్తనతో ప్రజలను అసౌకర్యానికి గురిచేసినందుకు సదరు మహిళలపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు.. ‘‘ఎమిరాటి సంస్కృతీ సంప్రదాయాలను కాలరాసే విధంగా ఉన్న ఇలాంటి విలువలు లేని ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. అందుకే క్రిమినల్ కేసు నమోదు చేశాం’’ అని ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించి చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. కాగా సంప్రదాయాలకు మారుపేరైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇలాంటి ఘటనలకు పాల్పడిన వ్యక్తులకు 6 నెలల వరకు జైలు శిక్షతో పాటు 5 వేల దీరాంలు జరిమానా విధించే అవకాశం ఉంది. అదే విధంగా అశ్లీల వీడియోలు షేర్ చేసినందుకు షరియా చట్టాల ప్రకారం, కఠిన శిక్షలు విధించే ఆస్కారం ఉంటుంది.
చదవండి: ఏడాదిగా శృంగారానికి దూరం.. బిడ్డతో బలవంతంగా
Comments
Please login to add a commentAdd a comment