గోల్డెన్ అవర్‌లో వైద్యం అందించాలి
అమలాపురం రూరల్: రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువచ్చే లోపు గోల్డెన్ అవర్‌లో వైద్యం అందేలా చూడాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సమావేశాన్ని స్థానిక కిమ్స్ కాలేజీలో జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ మాట్లాడుతూ చాలామంది వైద్య విద్యార్థులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్నారని, అది సరికాదన్నారు. విద్యార్థులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాలేజీకి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాలని జిల్లా రవాణా అధికారి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. రహదారి భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ ఓలేటి శ్రీనివాస్ రహదారి భద్రతా అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌్ ఇచ్చారు. అనంతరం ఎస్పీ, డీటీఓ విద్యార్థులతో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, జ్యోతి సురేష్, కాశీ విశ్వేశ్వరరావు, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment