కాకినాడ సిటీ: అంగన్‌వాడీ వర్కర్ల రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం కాకినాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, అంగన్‌వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి ఎం.రమణ మ్మ, ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు నీరజ, జ్యోతి, రాజేశ్వరి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారంలో చొరవ చూపించాలని, తక్షణమే గ్రాట్యూటీ అమలు చేయాలని, పెరిగి ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. ఏళ్ల తరబడి మినీ సెంటర్లలో మెయిన్ సెంటర్లుగా మార్చా లని పోరాటం చేస్తున్నా అమలు చేయడంలేదన్నారు. మెనూ చార్జీలను పెంచి ఇవ్వాలన్నారు. నేడు రాష్ట్ర ప్ర భుత్వం దిగివచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చే యాలని, గత ప్రభుత్వ హయాంలో రాసుకున్న మిని ట్స్ అంగీకరించిన అంశాలను అమలు చేయాలని డి మాండ్ చేశారు. అంగన్‌వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధపడుతున్నామన్నారు. ధర్నా అనంతరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి ఏ జ్యోతికి విన తి పత్రం అందజేశారు. రమ, విజయ, మున్ని, సరోజ, కనకదుర్గ, మేరీ రత్నం, సత్యవతి పాల్గొన్నారు.
వేతనాలు పెంచాలని ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలు
Comments
Please login to add a commentAdd a comment