నిత్యావసర ధరలు నియంత్రించాలి : జేసీ నిశాంతి
అమలాపురం రూరల్: మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులు నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరల నియంత్రణలో కీలక భూమిక పోషించాలని జేసీ టి.నిశాంతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ని గోదావరి భవన్‌లో పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ, ఎస్టేట్ అధికారులతో ధరల నియంత్రణ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. రైతు బజార్ల వల్ల బహిరంగ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టాయని, వాటి నిర్వహణను మరింత మెరుగుపరచి అన్నిరకాల నిత్యావసరాలు కూరగాయలు ఒకే చోట లభించేలా, జిల్లా వ్యాప్తంగా సరసమైన ధరలు ఒకేలా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. తూనికలు కొలతల్లో వ్యత్యాసాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని ఆమె స్పష్టం చేశారు. గ్యాస్ డెలివరీ బాయ్‌లు అధిక ధర వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి కె.విశాలాక్షి, డీఎస్‌ఓ ఎ.ఉదయ భాస్కర్, పౌర సరఫరాల సహాయ మేనేజర్ నాగేశ్వరరావు, తూనికలు కొలతలు శాఖ కంట్రోలర్ రాజేష్, ఎస్టేట్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment