మూడు హోటళ్లపై కేసులు
● అపరిశుభ్రత, నాణ్యతాలోపం ఉన్న
8 హోటళ్లకు నోటీసులు జారీ
అమలాపురం టౌన్: స్థానిక పలు హోటళ్లపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆహార నియంత్రణ అధికారులు గురువారం దాడులు చేసి ఎనిమిది హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. ఒకసారి మరిగిన నూనెతోనే పదే పదే వంటకాల తయారీ, వంట గదుల్లో అపరిశుభ్రతలను అధికారులు గుర్తించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆహార నియంత్రణ అధికారి బి.శ్రీనివాస్, కోనసీమ జిల్లా ఆహార నియంత్రణ అధికారి శ్రీకాంత్ చౌదరి, తూర్పు గోదావరిజిల్లా అధికారి రుక్కయ్య, కాకినాడ జిల్లా అధికారి సుబ్బారావు బృందం ఈ తనిఖీలు చేపట్టింది. అమలాపురంలోని సుబ్బారావు హోటల్, బొండం బాబాయ్ హోటళ్లలో ఒకే నూనె చాలాసార్లు మరిగించడంపైన, గాయత్రి టిఫిన్స్‌పై రెన్యువల్ కాకపోవడంపై కేసు నమోదు చేసినట్టు ఉమ్మడి జిల్లా అధికారి శ్రీనివాస్ చెప్పారు. విష్ణుశ్రీ హోటల్, గాయత్రి టిఫిన్స్, విజయదుర్గ హోటల్, శ్రీదేవి బార్ అండ్ రెస్టారెంట్, గణపతి టిఫిన్స్, గ్రీన్ ట్రీ హోటల్‌కు పరిశుభ్రత లేకపోవడంపై నోటీసులు ఇచ్చారు. ఈ ప్రతికూల పరిస్థితులు సరిదిద్దే వరకు హోటళ్లు మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ కేవీ ఆర్‌ఆర్ రాజుకు బృందం సూచించింది. దీంతో శుక్రవారం నుంచి ఆ హోటళ్ల మూసివేతకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో ఎక్కడైనా ఆహార కలుషితం, కల్తీ వంటివి జరిగితే జిల్లా ఆహార నియంత్రణాధికారి శ్రీకాంత చౌదరి–89771 63695 నంబర్‌కు కాల్ చేయాలని ఉమ్మడి జిల్లా ఆహార నియంత్రణాధికారి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment