ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం
అమలాపురం రూరల్: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని ఆర్డీఓ కె.మాధవి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి భవన్‌లో అమలాపురం డివిజన్ పరిధిలో 45 పోలింగ్ కేంద్రాలకు ఈ నెల 27న నిర్వహించనున్న పోలింగ్ సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ ఇతర ప్రీసైడింగ్ అధికారులకు మొదటి దశ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ శాసనమండలి పట్టభద్రుల పోలింగ్ ప్రక్రియను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సుమారు వెయ్యి మంది లోపు ఓటర్లు ఉంటారని ఆమె స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రం ముందు భాగంలో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్ల జాబితాను ప్రదర్శించాలని, సిట్టింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని, గుర్తింపు కార్డు ఆధారంగా ఓటర్‌ను ధ్రువీకరించాలన్నారు. డీఆర్వో బీఎల్‌ఎన్ రాజకుమారి, తహసీల్దార్ పి.అశోక్ కుమార్, కో ఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ పాల్గొన్నారు.
ప్రవర్తన నియమావళికి అనుగుణంగా విధులు
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా విధులు సక్రమంగా నిర్వహించాలని మాస్టర్ ట్రైనీ, మండపేట తహసీల్దార్ తేజేశ్వరరావు ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సంబంధించి కొత్తపేట, రామచంద్రపురం డివిజన్లలో 50 పోలింగ్ కేంద్రాల పోలింగ్ సిబ్బందికి, ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం స్థానిక గోదావరి భవన్‌లో జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఎన్నికల విధులు నిర్వహించాలని సృష్టం చేశారు. సెక్షన్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment