పట్టుబడిన మద్యం ధ్వంసం
అంబాజీపేట: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ చైతన్యమురళీ, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్‌కేబీవీ ప్రసాద్ ఆదేశాల మేరకు కొత్తపేట డివిజన్ పరిధిలో ఏడు పోలీస్ స్టేషన్‌లకు సంబంధించి రూ.90 లక్షలు విలువైన అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసినట్లు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ చెప్పారు. సోమవారం అంబాజీపేట మార్కెట్ యార్డులో అక్రమ మద్యం ధ్వంసం చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ పి.గన్నవరం సర్కిల్ పరిధిలోని అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, నగరం పోలీస్ స్టేషన్‌లతో పాటు రాజోలు సర్కిల్ పరిధిలోని రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం పోలీస్ స్టేషన్‌లకు సంబంధించి ఆరేళ్ల నుంచి నమోదు చేసిన 258 కేసుల్లో మద్యాన్ని ధ్వంసం చేశామన్నారు. 9,124 బాటిళ్లలో ఉన్న వివిధ రకాల 2,700 లీటర్ల మద్యాన్ని రోడ్డు రోలర్ ద్వారా ధ్వంసం చేయించారు. 300 లీటర్ల నాటు సారాను గోతిలో కప్పెట్టారు. కాగా నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తామని, డ్రోన్‌లు ఉపయోగించి పేకాట, కోడి పందేల నిర్వహణ తదితర అసాంఘిక కార్యక్రమాలపై చర్యలు చర్యలు చేపడతామన్నారు. పి.గన్నవరం, రాజోలు సీఐలు ఆర్.భీమరాజు, టీవీ నరేష్‌కుమార్, ఎస్సైలు కె.చిరంజీవి, బి.శివకృష్ణ, ఎ.చైతన్యకుమార్, కె.మనోహర్‌జోషి, బి.రాజేష్‌కుమార్, పి.సురేష్, కె.డి.శ్రీనివాస్, ఎకై ్సజ్ సీఐ వీటీవీవీ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
రావులపాలెం: వివిధ కేసుల్లో పట్టుపడిన అక్రమ మద్యాన్ని సోమవారం పోలీసులు, ఎకై ్సజ్ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. స్థానిక గౌతమీ గోదావరి పాత ఇసుక ర్యాంపు బాటలో మద్యం బాటిళ్ల సారాను జేసీబీ సాయంతో ధ్వంసం చేశారు. రావులపాలెం టౌన్ సీఐ శేఖర్‌బాబు మాట్లాడుతూ ఆలమూరు, అత్రేయపురం, కొత్తపేట, రావులపాలెం స్టేషన్ల పరిధిలో 296 కేసుల్లో సీజ్ చేసిన డీపీఎల్, ఎన్‌డీపీఎల్ మద్యం బాటిళ్లు మొత్తం 11,687, నాటు సారా 1944.50 లీటర్లను అసిస్టెంట్ సూపరింటెండెంట్ ప్రొఫెషన్ ఎకై ్సజ్ అధికారి అమర్‌బాబు ఆధ్వర్యంలో ధ్వంసం చేశామన్నారు. వీటి విలువ రూ. 15 లక్షలు ఉంటుందన్నారు. రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఎస్సైలు సురేంద్ర, అశోక్, రాము, వీఆర్వోలు సత్యప్రసాద్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment