రామనామమే రక్షణ కవచం | - | Sakshi

రామనామమే రక్షణ కవచం

Apr 7 2025 12:17 AM | Updated on Apr 7 2025 12:17 AM

రామనా

రామనామమే రక్షణ కవచం

శ్రీరాముడిని అందరూ

ఆదర్శంగా తీసుకోవాలి

బ్రహ్మంగారి మఠాధిపతి విరజానంద

వైభవంగా శ్రీరామనవమి శోభయాత్ర

సుమారు 5 వేల బైక్‌లతో ర్యాలీ

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): యావత్‌ మానవాళికీ శ్రీరామ నామం అద్భుతమైన రక్షణ కవచం వంటిదని, ఆ నామం ఉచ్చరిస్తేనే పాపాలు తొలగిపోతాయని వైఎస్సార్‌ కడప బ్రహ్మం గారి మఠాధిపతి విరజానంద స్వామి అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం సుమారు 5 వేల బైక్‌లతో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్రను ఆయన పుష్కర ఘాట్‌ వద్ద ప్రారంభించారు. ఈ యాత్ర త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, ఆర్యాపురం, పేపర్‌ మిల్లు, శ్రీరామ నగర్‌, కోరుకొండ రోడ్డు, కంబాల చెరువు, నందం గనిరాజు జంక్షన్‌, దానవాయిపేట, ఏవీ అప్పారావు రోడ్డు రామాలయం జంక్షన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డు, షెల్టాన్‌ హోటల్‌, ఆవ వాంబే గృహాలు, తాడితోట, స్టేడియం రోడ్డు, శ్యామలా సెంటర్‌ మీదుగా తిరిగి పుష్కర్‌ ఘాట్‌ వరకూ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, అందరిలోనూ సోదర భావం వెల్లివిరియాలని, భారతీయ సంప్రదాయాలు, కట్టుబాట్లు అందరికీ తెలిసేలా హిందూ ధర్మం పరిఢవిల్లేలా ఈ శోభాయత్ర శోభాయామానంగా జరిగిందని అన్నారు. ప్రతి పురుషుడూ శ్రీరామచంద్ర ప్రభువుకున్న సుగుణాలను అలవర్చుకోవాలని, అప్పుడే సంపూర్ణ మానవుడు అవుతాడని అన్నారు. దుష్ట శిక్షణార్థం విష్ణుమూర్తే త్రేతాయుగంలో రామునిగా అవతరించి, తన చర్యల ద్వారా మనిషి ఎలా బతకాలో లోకానికి ఆచరించి చూపించాడని అన్నారు. పితృవాక్య పరిపాలకునిగా, ఆదర్శవంతునిగా కీర్తి గడించాడన్నారు. పట్టాభిషేకానికి కొన్ని గంటల ముందు తండ్రి ఆదేశం మేరకు 14 సంవత్సరాల వనవాసం గడపాలని చెబితే.. తండ్రి మాటే వేదవాక్కుగా ఎంతో ఆనందంగా కట్టుబట్టలతో అరణ్యానికి వెళ్లిన త్యాగమూర్తి, సాహసవంతుడు శ్రీరాముడని అన్నారు. అటువంటి త్యాగ గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, ధర్మాన్ని కాపాడటం ఉత్తమ పురుషుల లక్షణమని చెప్పారు. అంతకు ముందు రథంపై ఉన్న శ్రీసీతారాముల మూర్తులను ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. రామ నామ జయ మంత్రాన్ని అశేష రామ భక్తులతో పలికించారు. కార్యక్రమంలో శ్రీరామ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది పతివాడ రామరాజు, కార్యదర్శి యడ్లపల్లి, అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ్‌ ఆలే శ్యామ్‌కుమార్‌, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ తదితరులు పాల్గొన్నారు.

రామనామమే రక్షణ కవచం1
1/2

రామనామమే రక్షణ కవచం

రామనామమే రక్షణ కవచం2
2/2

రామనామమే రక్షణ కవచం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement