
గల్లంతైన యువకుడి మృతదేహం గుర్తింపు
రావులపాలెం: స్నేహితుల తో సరదాగా గోపాలపురం కాలువ వద్ద స్థానానికి వెళ్లి గల్లంతయిన యువకుడు షేక్ ఖాదర్ (21) మృత దేహం సోమవారం సంఘటన ప్రాంతానికి వంద మీటర్ల దూరంలో కాలువలో గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం గోపాలపురం ఆరుమామిళ్ల గట్టు రేవు వద్ద స్నానానికి దిగిన ఖాదర్ గల్లంతైన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం రేవుకు 100 మీటర్ల దూరంలో మృతదేహం తేలడంతో ఖాదర్ బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని కొత్తపేట ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు టౌన్ సీఐ శేఖర్‌బాబు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించగా స్థానిక నెక్కంటి కాలనీలో ఉన్న బరియల్ గ్రౌండ్‌లో ఖననం చేసినట్టు బంధువులు తెలిపారు.
బాయిలర్ డ్రైన్‌లో పడి వ్యక్తి మృతి
పెద్దాపురం: బాయిలర్ డ్రైన్‌లో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానిక వాలు తిమ్మాపురం రహదారిలో ఉన్న పట్టాభి ఆగ్రో ఫుడ్స్ రైస్ మిల్లులో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ నగరానికి చెందిన వేముల శివ (29) ఫ్యాక్టరీకి పనిమీద వచ్చి, ప్రమాదవశాత్తూ కాలుజారి కాలువలో పడిపోయాడు. ఇంతలో బాయిలర్ నుంచి విడుదలైన వేడినీటి కారణంగా అతడు మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ మౌనిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గల్లంతైన యువకుడి మృతదేహం గుర్తింపు