
జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు ఇలా..
గ్యాస్‌ధర పెంపు దారుణం
గ్యాస్ సిలిండర్‌పై ఒకేసారి రూ.50 ధర పెంచడం దారుణం. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇది ఇబ్బందికర పరిస్థితి. సామాన్య కుటుంబాలు ఏడాదికి రూ.300 వరకు అదనంగా గ్యాస్‌కు చెల్లించాలంటే కష్టం. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పెంచిన ధరను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి.
– బొంతా మణి, గృహిణి రాజమహేంద్రవరం
సాక్షి, రాజమహేంద్రవరం: నిత్యావసర ధరలు, విద్యుత్ చార్జీల పెంపుతో ఇప్పటికే సతమతమవుతున్న ప్రజలపై ప్రభుత్వం వంట గ్యాస్ బండ భారం మోపింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధర మంగళవారం నుంచి అమల్లోకి తీసుకురావాలని చమురు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్‌పురి స్పష్టం చేశారు. ధరల పెంపుతో ప్రస్తుతం జిల్లాలో రూ.832 ఉన్న గ్యాస్ సిలిండర్ రూ.50 పెరిగి.. రూ.882కు చేరింది. ఇది కేవలం సాధారణ వినియోగదారులకే కాకుండా ఉజ్వల పథకం లబ్ధిదారులకు సైతం వర్తింప చేశారు. ఈ పరిణామం సాధారణ, మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళన నింపుతోంది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగాయి. విద్యుత్ చార్జీల బాదుడు కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో గ్యాస్ ధర పెరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
రోజుకు రూ.6 లక్షల భారం
తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 3 ప్రధాన కంపెనీలు, 43 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతోంది. మొత్తం 6,68,641 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి రోజూ 13 వేల వరకు వంట గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్నట్టు సమాచారం. సిలిండర్‌పై రూ.50 పెంపుతో రోజుకు రూ.6.50 లక్షల వరకు వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. నెలకు రూ.1.95 కోట్లు వరకు భారం పడుతుంది.
ఉజ్వలకూ వర్తింపు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాలకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్, స్టవ్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద జిల్లాలో 41,055 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. ప్రస్తుత పెంపును వారికి సైతం వర్తింప చేశారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు మంజూరు చేసిన పథకాన్ని సైతం పెంపులో భాగస్వామ్యం చేయడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.
నిత్యావసరాలతో
ఇబ్బందులు
ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కందిపప్పు, మినపప్పు, వంట నూనె తదితర ధరలు పెరిగి సామాన్యుడు కొనలేని పరిస్థితి తలెత్తింది. ఇలాంటి తరుణంలో గ్యాస్ రూ.50 పెరగడంతో మరిన్ని ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వెల్లడవుతోంది. నలుగురున్న ఒక మధ్య తరగతి కుటుంబానికి ఒక సిలిండర్ రెండు నెలల వరకు వినియోగించుకోవచ్చు. అంటే ఏడాదికి 6 సిలిండర్లు అవసరం అవుతాయి. ఏడాదికి అదనంగా రూ.300 చెల్లించాల్సి వస్తోంది.
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
కేంద్రం గ్యాస్ ధర ఏకంగా రూ.50 పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైంది. రాష్ట్ర పరిధిలో నియంత్రించేందుకు ముందుకురాకపోవడంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పెంచిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాగే పెంచుతూ పోతే తాము వంట ఎలా వండుకోవాలని ప్రశ్నిస్తున్నారు.
పెట్రోల్‌పై రూ.2 పెంపు
గ్యాస్ ధరతో పాటు పెట్రోల్, డీజిల్ లీటర్‌పై ఎక్సైజ్ సుంకం రూ.2 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ భారం వాహనదారులపై పడదని, ఇంధనాల రిటైల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని ఆయిల్ కంపెనీలు పేర్కొన్నా.. భవిష్యత్తులో ప్రజలపై భారం తప్పదన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజలపై వంటగ్యాస్ ధరల వడ్డన
సిలిండర్‌పై రూ.50 పెంచుతూ నిర్ణయం
ఇప్పటికే నిత్యావసర
ధరల పెరుగుదలతో సతమతం
తాగాజా గ్యాస్ ధర పెరగడంతో
సామాన్య, మధ్యతరగతి
ప్రజల్లో అసహనం
జిల్లావ్యాప్తంగా 6 లక్షల గ్యాస్ కనెక్షన్లు
రూ.50 పెంచడంతో ప్రతి నెలా
ప్రజలపై రూ.1.95 కోట్ల భారం
పెట్రోల్ ధర రూ.2 పెంపు
వాహనాలు ఎలా
నడపాలంటున్న వాహనదారులు
కంపెనీ ఏజెన్సీలు జనరల్ దీపం ఉజ్వల 5 కిలోల
సిలిండరు్ల
హెచ్‌పీసీఎల్ 28 3,35,472 1,19,701 24,644 2,513
ఐవోసీఎల్ 12 64,191 53,245 16,252 14
బీపీసీఎల్ 3 27,456 13,262 159 28

జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు ఇలా..