Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Mohan Reddy fires on Chandrababu coalition govt1
ఈ ప్రభుత్వం భయపడుతోంది: వైఎస్‌ జగన్‌

కేవలం 500 మంది మాత్రమే రావాలట! అంటే, కేవలం 500 మంది రైతులు మాత్రమే నష్టపోయారా? సమాధానం చెప్పండి. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తోంది? జగన్‌ వస్తే తప్పేమిటి? నేను రైతులతో మాట్లాడితే, వారి సమస్యలు లేవనెత్తితే తప్పేముంది? రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టే ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి వాళ్ల ఆవేదన చెబుతున్నారు.ఇవాళ ఇక్కడికి జగన్‌ వస్తున్నాడని తెలిసి 2 వేల మంది పోలీసులను మోహరించారు. ప్రతి గ్రామంలో ఏ రైతూ ఇక్కడికి రాకూడదని కట్టడి చేయాలని చూశారు. మీరు కనుక ఈ కార్యక్ర­మంలో పాల్గొంటే రౌడీషీట్లు తెరుస్తామని రైతులను బెదిరించారు. అయినా రైతులు స్వచ్ఛందంగా తరలి వస్తారు కాబట్టి, టూవీలర్స్‌పై ఎవరైనా వస్తే పెట్రోలు పోయొద్దంటూ బంక్‌ల యజమానులను ఆదేశించారు. మరీ ఇంత దుర్మార్గమా?మామిడిని ఫ్యాక్టరీలు కొనుక్కోక, రైతులకు కనీసం రెండున్నర, మూడు రూపాయలు కూడా దక్కని పరిస్థితుల్లో.. ఆ సరుకు వాహనాల్లోనే కుళ్లిపోతోంది. మామిడి రైతులు చివరకు లారీ కిరాయి కూడా ఇవ్వలేక అగచాట్లు పడుతున్నారు. అందుకే ఆ రైతులకు తోడుగా ఉండాలని కోరుతున్నాను. ప్రభుత్వం స్వయంగా వెంటనే మామిడి కొనుగోలు చేసి, రైతులను ఆదుకోకపోతే వారి పక్షాన వైఎస్సార్‌సీపీ గట్టిగా ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నాను. -వైఎస్‌ జగన్‌సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘రాష్ట్రంలో ఇవాళ రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి. వరి తీసుకుంటే దాదాపు రూ.300 నుంచి రూ.400 తక్కువకు అమ్ముకుంటున్నారు. మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్క­జొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు, చివరికి మామిడి.. ఏ రైతు పరిస్థితి చూసుకున్నా దారుణం. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కిలో మామిడి రూ.2కే దొరుకుతుందా? కిలో మామిడికి కనీసం రెండున్నర రూపా­యలు కూడా రావడం లేదని మామిడి రైతులు చెబుతున్నారు. ఇంత దుర్భర స్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం’ అని వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్ర­హం వ్యక్తం చేశారు. కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరా­మర్శించేందుకు బుధవారం ఆయన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డును సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి కష్టాలు విన్నారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ‘ఇవాళ నేను మామిడి రైతుల సమ­స్యలను ఆరా తీసేందుకు ఇక్కడికి వస్తుంటే కూటమి ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ఎక్కడా లేని విధంగా ఆంక్షలు పెట్టింది. నా పర్యటనను అడ్డుకు­నేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ఎక్కడికక్కడ రైతులను సైతం అడ్డుకుంది. రైతులకు మంచి జరగకూడదని కోరుకుంటోంది. ఎవరూ బయటకు తొంగి చూడకూడదని, రైతులు ఎన్ని అగచాట్లు పడుతున్నా కూడా, వాళ్ల జీవితాలు నాశనమైపో­తున్నా కూడా ఎవరూ స్పందించ కూడదని ఉద్దేశంగా పెట్టుకుంది. అసలు జగన్‌ రైతుల్ని కలిస్తే తప్పేమిటి? రైతుల కోసం మాట్లాడితే తప్పేముంది? పోనీ రైతులు అగచాట్లు పడకుండా ఉండి ఉంటే, వారికి అసలు సమస్యే లేకపోతే ఇక్కడికి ఇంత మంది ఎలా వస్తారు? జగన్‌ వచ్చాడు కాబట్టి.. జగన్‌ వాళ్లకు తోడుగా నిలబడుతున్నాడు కాబట్టి.. వాళ్ల సమస్య ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి కచ్చితంగా పోతుందని భావిస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కుంభకర్ణుడి నిద్ర నుంచి లేపడం కోసమే ఇక్కడికి ఇన్ని వేల మంది వచ్చి తమ ఆక్రందన వినిపిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కిలో మామిడికి కనీసం రూ.12 (టన్నుకు రూ.12 వేలు) వచ్చేలా చూడాలి. ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేదంటే వారి తరఫున వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇన్నాళ్లూ గాడిదలు కాశారా?⇒ చంద్రబాబు ప్రభుత్వానికి సూటిగా నా ప్రశ్నలు.. ఏటా మామిడి కొనుగోళ్లు మే 10 నుంచి 15వ తేదీ మధ్యలో మొదలు పెడతారు. మరి ఈ ఏడాది ఎందుకు అలా మొదలు పెట్టలేదు?⇒ జూన్‌ 3వ వారం వరకు కొనుగోళ్లు ఎందుకు మొదలు కాలేదు?⇒ ఎప్పటిలాగే మే రెండో వారంలో మామిడి కొనుగోళ్లు జరిగేలా ఈ ప్రభుత్వం చొరవ చూపక పోవడం వల్ల జూన్‌ 3వ వారం నాటికి మామిడి పంట మార్కెట్‌ను ముంచెత్తడం నిజం కాదా?⇒ రైతులంతా మామిడి పల్ప్‌ కంపెనీల వద్ద బారులు తీరడం మీకు కనిపించ లేదా? ఎవరి వల్ల ఈ దుస్థితి ఏర్పడింది?⇒ పల్ప్‌ ఫ్యాక్టరీలకు ఒకేసారి పంట మొత్తం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీంతో వాహనాల్లోనే మామిడి పంట కుళ్లిపోవడం మీకు కనిపించ లేదా? కేజీ మామిడి రూ. 2తో కొంటుండటం వాస్తవం కాదా? మీ పుణ్యాన ఈ పంటకు ఇక ధర రాదనే బాధతో చెట్లను కొట్టేసుకున్న రైతులను బెదిరిస్తారా?అశేష జనసందోహం నడుమ మార్కెట్‌ యార్డు లోపలికి వెళుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ⇒ చిత్తూరు జిల్లాలో 52 మామిడి పల్ప్‌ కంపెనీలు ఉన్నాయి. మే 10–15 తేదీల్లో తెరవాల్సిన ఆ ఫ్యాక్టరీలు జూన్‌ 3వ వారం వరకు తెరవకపోతే మీరు ఏం గాడిదలు కాశారు?⇒ ఎంత మంది రైతుల నుంచి ఈ ఫ్యాక్టరీలు కిలో మామిడి రూ.8 చొప్పున కొన్నాయి?⇒ మీరు గొప్పగా ప్రచారం చేస్తున్న అదనంగా రూ.4 ఎంత మంది రైతులకు ఇచ్చారు? ఈ రోజు రైతులకు ఏ ఒక్కరికీ కూడా గిట్టుబాటు రాని పరిస్థితి ఉందంటే అది మీ నిర్వాకం కాదా?⇒ పక్కన కర్ణాటకలో జనతాదళ్‌కు చెందిన కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే, కిలో మామిడి రూ.16 చొప్పున కొనేందుకు కేంద్రం ముందుకొచ్చిందట. నిజానికి అది మంచి రేటు అని కాదు.. కనీస రేటు అని చెప్పి, అదే పని మీరెందుకు చేయలేకపోయారు? మీరు ఎందుకు కేంద్రాన్ని అడగలేక­పోయారు? ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తోంది?⇒ చిత్తూరు జిల్లాలో 6.45 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుంది. 2.20 లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. 76 వేల మంది రైతులు వ్యవసా­యం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఆ 76 వేల రైతుల కుటుంబాల్లో ఎంత మందికి, చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీ మామిడి ధర రూ.12 చొప్పున దక్కింది? ⇒ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో నిరుడు కిలో మామిడి రూ.29కి రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు ప్రభు­త్వంలో రైతులు కేవలం రూ.2 కే కిలో అమ్ము­కుంటున్నారు. అలా ఆ రైతుల్ని నడిరోడ్డుపై నిలబెట్టడం భావ్యమా? ⇒ ఇక్కడికి జగన్‌ వస్తున్నాడని చెప్పి, మూడు రోజుల నుంచి కిలో మామిడికి రూ.6 ఇస్తామని మెసేజ్‌లు పెడుతున్నారు. అయ్యా చంద్రబాబూ.. రైతులకు వాస్తవంగా కనీసం కిలో మామిడికి రూ.2 కూడా రావడం లేదంటే.. మీరు నిద్రపోతున్నారా?రైతన్నలకు అండగా గత ప్రభుత్వంమా ప్రభుత్వ హయాంలో వ్యవసాయం రూపురేఖలు మారుస్తూ రైతులకు తోడుగా ఉండేవాళ్లం. రైతన్నలకు మే మాసం వచ్చే సరికి పెట్టుబడి సహాయం అందేది. అడుగడు­గునా రైతన్నలకు ఆర్బీకేలు తోడుగా ఉండేవి. అవి వారిని చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం జరిగేది. ఇదే జిల్లాలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.22 నుంచి రూ.29 వరకు రైతులు అమ్ముకున్నారు. నాడు రైతులకు కనీస మద్దతు ధర రానప్పుడు మా ప్రభుత్వ హయాంలో సీఎం యాప్‌ ఉండేది. ఆర్బీకేల పరిధిలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా వెంటనే అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌గా ఉన్న ఆర్బీకే అసిస్టెంట్‌ నోటిఫై చేసే వారు. జాయింట్‌ కలెక్టర్లు, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ, మార్క్‌ఫెడ్‌ పాత్ర పోషించే వారు. అలా అందరూ వెంటనే ఇన్వాల్వ్‌ అయ్యి.. ఆ ఆర్బీకే పరిధిలో ఈ–క్రాప్‌ ఆధారంగా పంటను కొనుగోలు చేసే వారు.ఇప్పుడవన్నీ కనుమరుగుఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో రైతుల బతుకులు తలకిందుల­య్యాయి. వారు తీవ్ర కష్ట నష్టాల్లో కూరుకుపోయారు. ఈ రోజు ఏం జరుగుతోంది? మొదటి ఏడాది దాటిపోయింది. రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు భరోసా రూ.20 వేలు ఎగరగొట్టేశారు. ఈ ఏడాది జూన్‌ కూడా అయిపోయింది. జూలైలో ఉన్నాం. ఇంత వరకు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. ఇంకా చంద్రబాబు­నాయుడు గారి పుణ్యాన రైతులకు సమయానికే రావాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రాకుండా పోయింది. ఆయన పుణ్యాన ఉచిత పంటల బీమా కూడా పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితి. ఆర్బీకే­లన్నీ నిర్వీర్యమ­య్యాయి. ఈ – క్రాప్‌ లేకుండా పోయింది. రైతులకు నాణ్య­మైన విత్తనాలు, పురుగు మందులు, యూరి­యా, ఎరువులు ఇవన్నీ కూడా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే సరఫరా చేసే పరిస్థితి ఇవాళ లేకుండా పోయింది. నియో­జకవర్గానికి ఒక అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ కూడా ఇవాళ నిర్వీర్య­మైపోయిన పరిస్థితి. వ్యవసా­యానికి సంబంధించిన అన్ని విభాగాలు ఇవాళ నిర్వీర్యమైపో­యిన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది.భారీ జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కట్టడి ప్రయత్నాలు అత్యంత దారుణంశశిధర్‌రెడ్డి అనే వ్యక్తి రైతు కుటుంబానికి చెందిన వారు కాదా? పోలీసుల దాడిలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకొచ్చింది అని అడుగుతున్నా.. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 80 శాతం మంది ఆ రంగం మీద బతుకుతున్నారు. మరి వీళ్లంతా రైతు బిడ్డలు కాదా? ఇక్కడికి రావొద్దని దాదాపు 1200 మంది రైతులను నిర్బంధించారు. ఇక్కడికి వచ్చిన రైతులపై విచ్చలవిడిగా లాఠీఛార్జ్‌ చేశారు. ఇది అత్యంత దారుణం.

Sakshi Editorial On Donald Trump2
ట్రంప్‌ తిరుగుబాట!

ఈసారి ఎలాగైనా నోబెల్‌ శాంతి బహుమతి చేజిక్కించుకోవాలన్న ఆత్రపడుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఆగ్రహించి ఉక్రెయిన్‌కు తిరిగి ఆయుధాలు సరఫరా చేయబోతున్నట్టు మంగళవారం ప్రకటించారు. ట్రంప్‌ వచ్చే నాటికే రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతుండగా దాన్ని ఆపాలంటూ పిలుపునిచ్చి పలు దఫాలు రెండు దేశాలతోనూ మాట్లాడారు. దూతల్ని పంపారు. కానీ పుతిన్‌ ముందు అవేమీ పనిచేయలేదు. మారణాయుధాల డ్రోన్‌లతో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌తో పాటు పలు నగరాలపై దాడులు సాగిస్తూనే ఉన్నారు. అమెరికా నుంచి ఆయుధ సరఫరా నిలిచి పోవటం, దాడులకు అనువైన వేసవి కాలం కావటం రష్యాకు కలిసొచ్చింది. తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెస్క్‌ ప్రాంతాన్ని కైవసం చేసుకోవటం ఆయన లక్ష్యంగా కనబడుతోంది. 2022 తర్వాత ఈ ప్రాంతంలో రష్యాది పైచేయి కావటం ఇదే తొలిసారి. ఇప్పటికే డొనెస్క్‌ ప్రాంతంలో మూడింట రెండొంతుల ప్రాంతం రష్యా దళాల అధీనమైంది. అక్కడి కాస్టన్‌టేనుకా నగరం తమ వశమైతే డొనెస్క్‌ ప్రాంతంలో వరసగా ఉన్న నగరాలన్నీ కుప్పకూలుతాయని ఆ దళాలు భావిస్తున్నాయి.దౌత్యం నెరపదల్చుకున్నప్పుడు నిర్దిష్టమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలి. మధ్యవర్తిగా రెండు పక్షాలతో మాట్లాడి వారి డిమాండ్లేమిటో ముందు తెలుసుకోవాలి. అటు ఉభయ పక్షాలూ కొంత తగ్గటానికి సిద్ధపడాలి. తగ్గటం మాట అటుంచి రష్యా–ఉక్రెయిన్‌లు రెండూ యుద్ధం కొన సాగింపులోని నిరర్థకతను గుర్తించటం లేదు. ఎప్పటిలా అమెరికా ఆయుధాలు అందజేస్తే తన వంతుగా రష్యాపై దాడులు సాగిస్తాననీ, పర్యవసానంగా ఎప్పటికైనా ఆధిక్యత సాధించగలననీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెబుతున్నారు. ఈ మాటలు మాట్లాడేది ఆయనే అయినా, పలికి స్తున్నది పాశ్చాత్య దేశాలు. ట్రంప్‌ ఊగిసలాట ధోరణి, దేనికీ కట్టుబడి ఉండని ఆయన వైఖరి వగైరాలు ఏదో దశలో ఉక్రెయిన్‌కు అక్కరకొస్తాయని అవి భావిస్తున్నాయి. నిజానికి ఉక్రెయిన్‌ ఈ యుద్ధంలో ఎప్పుడో ఓటమిపాలైంది. దాన్ని కప్పిపుచ్చటానికి బైడెన్‌ ఏలుబడిలోని అమెరికా, పాశ్చాత్య దేశాలూ ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌కు అధునాతన ఆయుధాలందిస్తూ రష్యా నగరాలపై, దాని యుద్ధ నౌకలపై, ఇతరేతర కీలక ప్రాంతాలపై దాడులు కొనసాగేలా చూశాయి. కానీ ట్రంప్‌ వచ్చాక ఆయుధ సాయం ఆగిపోయింది. ఆర్థిక సాయమూ నిలిచిపోయింది. పాశ్చాత్య దేశాలు అతి కష్టమ్మీద తమ వంతుగా ఆ బరువును భుజాలకెత్తుకున్నా అది ఏ మూలకూ చాలటం లేదు. అందుకే గత పక్షం రోజులుగా రష్యా సాగిస్తున్న వరస దాడులతో ఉక్రెయిన్‌కు ఊపిరాడటం లేదు. డొనెస్క్‌ నగరాన్ని రక్షించటంలో నిమగ్నమైన తన దళాలకు ఆహారమూ, ఆయుధాలూ పంపటం మాట అటుంచి కనీసం గాయపడినవారిని వెనక్కి తీసుకొచ్చే వెసులుబాటు కూడా దొరకటం లేదు. ఆ నగరం చుట్టూవున్న ప్రాంతాలన్నీ రష్యా చేజిక్కించుకుంది. నిజానికి ఈ యుద్ధం ఉక్రెయిన్‌ స్వయంకృతం. అమెరికా, పాశ్చాత్య దేశాల మాట విని రష్యాపై గిల్లికజ్జాలకు పోయింది. పక్షంరోజుల్లో రష్యాను దారికి తీసుకురాగలమని పాశ్చాత్య దేశాలు విశ్వసించాయి. రష్యా తమపైకి దండెత్తి వస్తే ‘నాటో’ సైన్యాలతో దాన్ని సులభంగా మట్టికరిపించగలమను కున్నాయి. ఇందుకోసం ఉక్రెయిన్‌లో తమకు అనుకూలుడైన జెలెన్‌స్కీకి పట్టంగట్టాయి. రష్యాతో సమవుజ్జీ కాకపోవటంతో ఇప్పటికే ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. పాశ్చాత్య దేశాల బాసటతో రష్యాకు నష్టం కలిగించిన మాట నిజమే అయినా, అదే ఇప్పుడు రష్యా పట్టుదలకు కారణమైంది. యుద్ధం ఆపాలని ట్రంప్‌ నేరుగా పుతిన్‌తో ఫోన్‌ సంభాషణలు సాగించినప్పుడు ఆయన ‘మూల కారణాల’ను ప్రస్తావించారని, అవి పరిష్కారం అయితే తప్ప యుద్ధం ఆపేది లేదన్నారని కథనాలు వెలువడ్డాయి. ఆ మూల కారణాల్లో నాటో దూకుడు ఒకటైతే, ఉక్రెయిన్‌ను ఉసిగొల్పటం రెండోది. యూరప్‌ భద్రతకు సంబంధించి కొత్త అమరిక ఉండాలని, యుద్ధం ఆగాక ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వమీయరాదని పుతిన్‌ కోరుతున్నారు. నాటో కూటమి ఏర్పడినప్పుడు సోవియెట్‌ యూనియన్‌ నుంచి పశ్చిమ యూరప్‌ను పరిరక్షించటమే ధ్యేయమని అది ప్రకటించింది. అదే నిజమైతే 1989లో సోవియెట్‌ కుప్పకూలి అనేక దేశాలుగా విడివడినాక నాటో అవసరం ఏముంది? సోవియెట్‌ చివరి అధినేత గోర్బచెవ్‌ అప్పట్లో ఒక ప్రతిపాదన చేశారు. ‘నాటోను రద్దయినా చేయండి... లేక ఆ కూటమిలో మాకు చోటైనా ఇవ్వండి’ అన్నదే దాని సారాంశం. అందువల్ల యూరప్‌ బలపడుతుందనీ, సౌభాగ్యవంతమవుతుందనీ ఆయన చెప్పారు. కానీ అమెరికా ఇందులో కీడు శంకించింది. యూరప్‌ తనను మించి ఎదుగుతుందని భయపడింది.తూర్పు యూరప్‌ దేశాలను నాటోలో చేర్చుకోబోమని అప్పట్లో గోర్బచెవ్‌కి హామీ ఇచ్చారు. కానీ అర డజను దేశాలకు సభ్యత్వమిచ్చారు. వేరే దేశాలతో సరిహద్దు తగాదాలు లేని దేశాలను మాత్రమే చేర్చుకోవాలన్న నిబంధనకు మంగళం పాడారు. చివరకు ఉక్రెయిన్‌ను చేర్చుకోవటానికీ సిద్ధపడ్డారు. రష్యాపైకి ఉసిగొల్పారు. వీటిని చర్చించకుండా, ఎలాంటి పరిష్కారం అవసరమో యోచించకుండా ట్రంప్‌ తన ట్రూత్‌ సామాజిక మాధ్యమం ద్వారా ‘యుద్ధం ఆపండం’టూ సందేశాలు పెడుతూ, నోబెల్‌ శాంతి బహుమతి కోసం ఎదురుచూస్తూ కాలం గడిపితే ఫలితం ఉండదు. ట్రంప్‌ నిజంగా యుద్ధం ఆపదల్చుకుంటే తటస్థ ఉక్రెయిన్‌కు పూచీపడాలి. నాటో విస్తరణ ఉండబోదని తెలపాలి. ట్రంప్‌ ఆ పని చేయగలరా?

 India and Namibia signed four key agreements and bilateral cooperation 3
కలిసి సాగుదాం..ప్రగతి సాధిద్దాం.. నమీబియాకు ప్రధాని మోదీ పిలుపు

విండోహెక్‌: అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆఫ్రికా పాత్రను భారత్‌ గుర్తిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అధికారం, ఆధిపత్యం ద్వారా కాకుండా, భాగస్వామ్యం, దౌత్యంతో భవిష్యత్తును నిర్ణయించేందుకు భారత్, నమీబియా కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం రిపబ్లిక్‌ ఆఫ్‌ నమీబియా పార్లమెంట్‌ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఆఫ్రికా ఖండం కేవలం ముడి సరుకులకు వనరుగా మిగిలిపోవద్దని.. విలువ సృష్టి, సుస్థిరాభివృద్ధిలో నాయకత్వ పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.రక్షణ రంగంలో ఆఫ్రికాతో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఇండియా అభివృద్ధి అనుభవాలను నమీబియాతో, ఆఫ్రికాతో పంచుకోవడం గర్వకారణమని చెప్పారు. ‘‘ఆఫ్రికాతో బంధానికి 2018లో 10 సూత్రాలు ప్రతిపాదించా. వాటికి కట్టుబడి ఉన్నాం. గౌరవం, సమానత్వం, పరస్పర ప్రయోజనాల ఆధారంగా ఆ సూత్రాలు రూపొందాయి. మనం ఒకరితో ఒకరు పోటీ పడడం కాదు.. ఒకరికొకరం సహకరించుకోవాలి. కలసికట్టుగా ఎదగడం మన లక్ష్యం కావాలి’’ అని స్పష్టంచేశారు. ఇది క్రికెట్‌ గ్రౌండ్‌లో వార్మప్‌ భారత్, నమీబియా మధ్య బలమైన చరిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. నమీబియాతో స్నేహ సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టంచేశారు. ఇండియాలో చీతాల పునరుద్ధరణ ప్రాజెక్టుకు నమీబియా ఎంతగానో సహకరించిందని అన్నారు. నమీబియాలో తదుపరి తరం శాస్త్రవేత్తలు, డాక్టర్లు, నాయకులకు సహకారం అందిస్తామని ప్రకటించారు. రేడియో థెరఫీ మిషన్లు సరఫరా చేయబోతున్నామని వివరించారు. ఇండియా–నమీబియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 800 మిలియన్‌ డాలర్లకు చేరిందని, ఇది క్రికెట్‌ గ్రౌండ్‌లో వార్మప్‌ మాత్రమేనని, ఇకపై మరింత వేగంగా పరుగులు చేయాలని పిలుపునిచ్చారు. నమీబియాకు తొలి అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు నెటుంబో నంది–ఎన్‌డైత్వాను ప్రధాని మోదీ అభినందించారు. భిన్న నేపథ్యం కలిగిన పౌరుల ఎదుగుదలకు నమీబియా రాజ్యాంగం చక్కటి తోడ్పాటు అందిస్తోందని ప్రశంసించారు. భారత రాజ్యాంగం సమానత్వం, స్వేచ్ఛ, న్యాయాన్ని బోధిస్తోందన్నారు. ఒక నిరుపేద గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యారంటే అది భారత రాజ్యాంగం గొప్పతనమేనని వ్యాఖ్యానించారు. సాధారణ కుటుంబంలో జన్మించిన తాను ప్రధానమంత్రి అయ్యానంటే అందుకు తమ రాజ్యాంగమే కారణమన్నారు. సంబంధాలు బలోపేతం చేసుకుందాం ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని, కీలక రంగాల్లో కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని భారత్, నమీబియా నిర్ణయించుకున్నాయి. ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నమీబియా చేరుకున్నారు. అధికార లాంఛనాలతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. తొలుత స్టేట్‌హౌస్‌లో నమీబియా అధ్యక్షురాలు నెటుంబో నంది–ఎన్‌డైత్వాతో మోదీ సమావేశమయ్యారు. డిజిటల్‌ సాంకేతికత, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, అరుదైన ఖనిజాలు, విద్య తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులో ఉన్న మార్గాలపై చర్చించారు.నాలుగు ఒప్పందాలపై సంతకాలు నాలుగు ముఖ్యమైన ఒప్పందాలపై భా రత్, నమీబియా సంతకాలు చేశాయి. ఆరోగ్యం, ఔషధ రంగాల్లో సహకారంతోపాటు నమీబియాలో ఆంట్రప్రెన్యూ ర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్, సీడీఆర్‌ఐ ఫ్రేమ్‌వర్క్, గ్లోబల్‌ బయోఫ్యూయెల్స్‌ అలయెన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఏర్పాటు కోసం రెండు దేశాల మధ్య ఈ ఒప్పందాలు కుదిరాయి. మోదీకి నమీబియా అత్యున్నత పురస్కారం ప్రధాని మోదీని నమీబియా ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ద మోస్ట్‌ ఏన్షియెంట్‌ వెలి్వవిషియా మిరాబిలిస్‌’తో సత్కరించింది. నమీబియా అధ్యక్షురాలు నెటుంబో ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేశారు. భారత్, నమీబియా మధ్య చెదిరిపోని స్నేహానికి ఈ అవార్డు ఒక ప్రతీకగా నిలుస్తోందని మోదీ పేర్కొన్నారు. ఇరుదేశాల ప్రజలకు దీన్ని అంకితం చేస్తున్నానని తెలిపారు. నమీబియా అత్యున్నత పౌర పురస్కారం స్వీకరించిన తొలి భారతీయ నాయకుడిగా మోదీ రికార్డుకెక్కారు.

Rasi Phalalu: Daily Horoscope On 10-07-2025 In Telugu4
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: పౌర్ణమి రా.1.56 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: పూర్వాషాఢ పూర్తి (24 గంటలు), వర్జ్యం ప.3.26 నుండి 5.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.48 వరకు, తదుపరి ప.3.07 నుండి 3.59 వరకు, అమృతఘడియలు: రా.1.30 నుండి 3.11 వరకు, గురుపూర్ణిమ; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.35. మేషం.... వ్యయప్రయాసలు. బంధువర్గంతో వైరం. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.వృషభం... మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగవు.మిథునం.... బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విచిత్ర సంఘటనలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.కర్కాటకం... ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.సింహం... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.కన్య... వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.తుల... శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.వృశ్చికం... శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.ధనుస్సు... ఆకస్మిక ధనప్రాప్తి. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి ఒప్పందాలు. సోదరులతో సఖ్యత. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి.మకరం.... పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం. దేవాలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.కుంభం...... శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.మీనం... దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

Gambhira Bridge collapses in Vadodara5
గుజరాత్‌లో ఘోరం

వడోదర: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితంనాటి పాత వంతెన కుప్పకూలిన ఘటనలో 13 మంది వాహనదారులు జలసమాధి అయ్యారు. నదీప్రవాహంలో పడి ప్రయాణికులతోసహా ట్రక్కులు, వ్యాన్‌లు, ఆటో, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు వడోదర జిల్లాలోని మహీసాగర్‌ నదిపై నిర్మించిన గంభీర వంతెన కూలడంతో ఈ ఘోరం జరిగింది. పద్రా పట్టణ సమీపంలో నిర్మించి ఈ వంతెన కూలడంతో వడోదర, ఆనంద్‌ నగరాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపో యాయి. నదీ ప్రవాహంలో నిర్మించిన రెండు పిల్లర్ల మధ్యలోని శ్లాబులు పూర్తిగా కుప్పకూలడంతో ప్రమాదతీవ్రత ఎక్కువగా ఉందని వడోదర రూరల్‌ ఎస్పీ రోహన్‌ ఆనంద్‌ చెప్పారు. నదిలో పడగా నే కొందరిని స్థానికులు కాపాడారు. రక్షించిన వారిలో గాయాలపాలైన వారిని ఆస్పత్రులకు తరలించారు. బ్రిడ్జ్‌ కూలడంతో ఒక ట్యాంకర్‌ కొనకు వేలాడుతూ ప్రమాదకరంగా మారింది. దీంతో 4 గంటలపాటు శ్రమించి వెనక్కిలాగారు. కానీ అందులోని డ్రైవర్‌ ఆచూకీ గల్లంతైంది.బిడ్డను కాపాడాలంటూ తల్లి రోదనబ్రిడ్జి కూలినప్పుడు కొన్ని వాహనాలు నది ప్రవాహం మధ్యలో పడి కొట్టుకుపోతే మరికొన్ని ఒడ్డు వైపున పడిపోయాయి. అప్పుడు ఒక ప్రయాణికుడు కారుతోసహా నదినీటిలో చిక్కుకు పోయాడు. అతని తల్లి మాత్రం క్షేమంగా బయటపడింది. నడుం లోతు ఉన్న నీటిలో నిలబడి ఒడ్డు వైపున్న స్థానికులను తల్లి ఏడుస్తూ వేడుకుంటున్న వీడియో చూపరులను కంటతడి పెట్టించింది. ‘‘నా బిడ్డ ఇందులో ఇరుక్కుపోయాడు. నది నీటిలో మునిగిపోయి విలవిల్లాడిపోతున్నాడు. కాపాడండయ్యా’’ అంటూ ఆమె దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్‌ అవుతోంది. స్థానికుల సమాచారం ప్రకారం ఆ మహిళ తన భర్త, కుమారుడు, కుమార్తె, అల్లుడితో కలిసి కారులో బాగ్దానాకు వెళ్తోంది. కారు నీటిలో పడినప్పుడు వెనకవైపు అద్దం పగలగొట్టి బయ టపడింది. కుమారుడు మాత్రం నదిలో మునిగిన వాహనంలో ఇరుక్కుపోయాడు.దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని మోదీదుర్ఘటన వార్త తెల్సి మోదీ, రాష్ట్ర సీఎంభూపేంద్ర పటేల్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రధాని సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగా త్రులకు తలో రూ.50వేల సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తలో రూ.4 లక్షలు ఇస్తామని సీఎం చెప్పారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ వంతెన కూలడంతో ఇలాంటి పాత వంతెన పటిష్టతపై సమీక్ష జరపాలని రాష్ట్ర అధికారులకు ప్రధాని సూచించారు. 1981లో వంతెన నిర్మాణాన్ని మొదలెట్టి 1985లో వాహన రాకపో కలకు అందుబాటులోకి తెచ్చారు. మరమ్మతులు ఎప్పటికప్పుడు చేయిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. 23 పిల్లర్లతో నదిపై 900 మీటర్ల పొడవునా బ్రిడ్జిని నిర్మించారు. అయితే వడోదర, ఆనంద్‌ నగరాలను కలిపే ఏకైక వంతెన కావడంతో దీనిపై వాహన రద్దీ ఎక్కువై పాడైందని స్థానికులు చెబుతున్నారు. కొత్త వంతెన కోసం మూడు నెలల క్రితమే రూ.212 కోట్లతో నిధులు మంజూరు అయ్యాయని తెలు స్తోంది. వంతెన పరిస్థితి దారుణంగా ఉందని, రాకపోకలను నిలిపివేయాలని 2017లోనే కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

CM Revanth Reddy challenges KCR about waters of Krishna and Godavari6
మీరు ఎప్పుడంటే అప్పుడే.. కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌

సాక్షి, హైదరాబాద్‌: మాజీ సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయన ఏ తారీఖు ఇచ్చినా శాసనసభ, మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత తొమ్మిదిన్నరేళ్లలో మీరు, ఏడాదిన్నరలో మేము తీసుకున్న నిర్ణయాలపై చర్చిద్దాం..’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. న్యాయ, సాగునీటి రంగ నిపుణులను పిలిపించి వారి అభిప్రాయాన్ని కూడా ప్రజలకు వినిపిద్దామని అన్నారు. ‘ఏ చిన్న గందరగోళం ఏర్పడకుండా, ఎవరి గౌరవానికి భంగం కలిగించకుండా చట్ట పరిధిలో సభ నిర్వహించే బాధ్యత నాది. ఆరోగ్యం సహకరించక కేసీఆర్‌ రాకపోతే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు మా మంత్రుల బృందాన్ని పంపిస్తా. తారీఖు చెప్తే మా వాళ్లు మొత్తం సెటప్‌ తీసుకుని వస్తారు. అక్కడే మాక్‌ అసెంబ్లీ నిర్వహించి చర్చ పెడదాం. కోదండరాం అందులో కూర్చోవాలి. కేసీఆర్‌ పిలిస్తే నేనూ వస్తా..’ అని సీఎం సవాల్‌ విసిరారు. మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించి తప్పుడు నిర్ణయాలు, ఏపీ కృష్ణా జలాల అక్రమ తరలింపు అంశాలపై బుధవారం ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్‌ నిర్వహించిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ సందర్భంగా ఆయన మాట్లాడారు. చట్ట సభల్లో చర్చిద్దాం..లేదంటే ఫామ్‌హౌస్‌కు వస్తా ‘చట్టసభల్లో కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్‌ ఏ తారీఖున వస్తారో చెబుతూ స్పీకర్‌కు లేఖ రాయమన్నాం. అంతేకానీ సవాలు విసరలేదు. ఆయన (కేటీఆర్‌) సడన్‌గా బయలుదేరిండు. పేరు ప్రస్తావిస్తే నా స్థాయి తగ్గుతుంది. పొద్దటి పూట క్లబ్బుల్లో, రాత్రిపూట పబ్బుల్లో చర్చజేద్దామని ఉబలాటపడుతున్నడు. వీధుల్లో, క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా మనం చట్టసభల్లో చర్చిద్దాం. క్లబ్బులు, పబ్బులకు, ఆ కల్చర్‌కు నేను చదువుకునే రోజుల నుంచే దూరం. నన్ను వాటికి పిలవద్దు. అయితే అసెంబ్లీకి, లేకుంటే మండలికి, లేకపోతే ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌కి వస్తా..’ అని రేవంత్‌ అన్నారు. వీధి భాగోతాలు మంచివి కావు.. ‘ప్రదాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్‌ ఆరోగ్యం బాగుండాలి. ప్రజలకు ఉపయోగపడాలని అని నేను అంటుంటే ఆయన ఎందుకూ పనికి రాడు..ఆయనతో ఏం పని అని ఆయన కొడుకు (కేటీఆర్‌) అంటాడు. నేపాల్‌లో రాజ్యం రాలేదని డిన్నర్‌కి పిలిపించి (యువరాజు)16 మందిని ఏకే 47తో పటపటా కాల్చిండు. అందరూ పోయాక వాడొకడే మిగిలి నేపాల్‌కు రాజైండు. కుటుంబంలో సమస్యలుంటే కుటుంబ పెద్దలు, కుల పెద్దలతో కూర్చొని పంచాయతీ తేల్చుకోవాలి. తమ్ముడు చెల్లెలకు, బావబామ్మర్దికి పంచాయతీలు ఉంటాయి. కానీ ఈ వీధి భాగోతాలు మంచివి కావు..’ అని సీఎం వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ఏపీకి అన్ని రకాలుగా సహకరించారు ‘కృష్ణా జలాల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలను 2015, 2020లో కేసీఆర్‌ మంజూరు చేసి వచ్చిండు. సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీలను కృష్ణా బేసిన్‌కు అక్కడి నుంచి పెన్నా బేసిన్‌కు తీసుకెళ్లండని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సలహాలిచ్చిండు. ఏపీకి అన్ని రకాలుగా సహకరించిండు. రాయలసీమను రత్నాల సీమ చేస్తానని ప్రకటించిండు. కృష్ణా బేసిన్‌లోని రైతులకు శాశ్వత మరణ శాసనం రాసే అధికారం కేసీఆర్‌కు ఎవరూ ఇవ్వలేదు. హైదరాబాద్‌లో ఏపీ, ఇతర రాష్ట్రాల ప్రజలు 20 శాతం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్ర కోటా నుంచి నగర అవసరాలను వేరు చేసి మిగిలిన జలాలను పంపకాలు చేద్దాం అని ఆనాడు కేసీఆర్‌ అని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది..’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. కృష్ణా జలాల దోపిడీకి అవకాశం కల్పించారు ‘జూరాల ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల తరలింపు కోసం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణానికి సర్వేలు జరపాలని 2011లో కిరణ్‌కుమార్‌ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జీవో ఇచ్చారు. అయితే కేసీఆర్‌ సోర్సు(నీటిని తీసుకునే ప్రదేశం)ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది. తుంగభద్ర, కృష్ణా, భీమా నదుల నుంచి తెలంగాణలోని గద్వాల, ఆలంపూర్‌లో ముందుగా కృష్ణా జలాలు ప్రవేశిస్తాయి. ఆ నీళ్లను అక్కడే ఒడిసి పట్టుకుని తెచ్చుకుని ఉంటే.. ఈ రోజు శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ వద్ద ఏపీకి మనం పైనుంచి వదిలితేనే నీళ్లు దొరుకుతుండే. పోతిరెడ్డిపాడు, రాయలసీమ, మల్యాల, ముచ్చుమర్రి లిఫ్టుల ద్వారా నీళ్లు తరలించుకుపోవడానికి ఏపీకి అవకాశం ఉండేది కాదు. కిందికి పోయాక పట్టుకోవాలనే నిర్ణయంతో పూర్తిగా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తరలిపోతున్నాయి. అక్కడి నుంచి అక్కడే దారిదోపిడీ చేసే అవకాశాన్ని ఏపీకి కేసీఆర్‌ కల్పించాడు..’ అని ముఖ్యమంత్రి ఆరోపించారు. సీమాంధ్ర పాలకుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ద్రోహం ‘శ్రీశైలం నుంచి ఏపీ పెద్ద మొత్తంలో నీళ్లు తీసుకుంటుండడంతో శ్రీశైలం, సాగర్, పులిచింతలలో విద్యుదుత్పత్తి అవకాశాన్ని తెలంగాణ కోల్పోయి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది. ‘పాలమూరు’ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి టీఎంసీకి తగ్గించి కేసీఆర్‌ మరో అన్యాయం చేశారు. శ్రీశైలం నుంచి నీటి తరలింపు సామర్థ్యాన్ని ఏపీ రోజుకు 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు పెంచుకోగా, కేసీఆర్‌ మాత్రం తెలంగాణ సామర్థ్యాన్ని తగ్గించారు. కృష్ణా జలాల్లో కేసీఆర్‌ చేసిన ద్రోహం ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయం కంటే వెయ్యి రెట్లు ఎక్కువ. కేసీఆర్‌ను వంద కొరడా దెబ్బలు కొట్టాలి సీమాంధ్ర పాలకులను ఒక కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే కేసీఆర్‌ను వంద కొరడా దెబ్బలు కొట్టాల్సిందే. బేసిన్లు లేవు..భేషజాలు లేవని చెప్పే అధికారం కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారు? ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరంగా మార్చి రంగారెడ్డి జిల్లాలోని ఆయకట్టును పూర్తిగా, నల్లగొండ జిల్లాలోని 4 లక్షల ఆయకట్టును కేసీఆర్‌ తొలగించిండు. కృష్ణా బేసిన్‌లోని రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను తరలిస్తే కృష్ణా ట్రిబ్యునల్‌లో నీటి కేటాయింపుల సమస్య వస్తది అని సమర్థించుకుండు. ప్రాజెక్టుల నిర్మాణంతో ఉమ్మడి రాష్ట్రంలో 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే ఎకరాకు రూ.93 వేలు ఖర్చు కాగా, కేసీఆర్‌ ధనదాహంతో 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి ఎకరాకు రూ.11 లక్షలు ఖర్చు పెట్టిండు..’ అని రేవంత్‌ ధ్వజమెత్తారు. ఏపీ సీఎంకు అభ్యంతరం ఎందుకు? ‘బనకచర్లతో వరద జలాలే తీసుకెళ్తామంటున్న ఏపీ సీఎంకు, మా నల్లగొండకు వరద, నికర జలాలు తీసుకెళ్తే అభ్యంతరం ఏమిటి? మా ప్రాజెక్టులన్నీ కట్టుకుంటే వరద ఉందా? లేదా? అనేది తేలుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది కాబట్టి కింద మీకు వరద కనిపించవచ్చు..’ అని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. కాగా మంత్రి శ్రీధర్‌బాబుకు మాజీమంత్రి హరీశ్‌రావు ఫోన్‌ చేసి ప్రజాభవన్‌లో సమావేశాల నిర్వహణపై అభ్యంతరం తెలపడంపై రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది గడీ కాదని అన్నారు.

YSRCP chief YS Jaganmohan Reddy visits Chittoor district7
ఎందుకీ నిర్బంధం.. ఆంక్షలు?

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో బుధవారం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి హెలీప్యాడ్‌ నుంచి రోడ్డు మార్గంలో బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌కు వెళ్తున్న క్రమంలో వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు వచ్చిన రైతులు, మహిళలు, వృద్ధులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కొన్నిచోట్ల లాఠీచార్జ్‌ చేశారు.పోలీసుల దాడిలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం కార్యదర్శి శశిధర్‌ రెడ్డి తలకు తీవ్ర గాయమై, రక్తస్రావం అయింది. దీన్ని గమనించిన జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. ఇంత దారుణంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని నిలదీశారు. శశిధర్‌ రెడ్డికి వెంటనే మంచి వైద్యం అందించాలని వైఎస్సార్‌సీపీ నేతలకు సూచించారు. బాధితుడిని పరామర్శించడాన్ని కూడా ఎస్పీ అడ్డుకున్నారు. రూట్‌మ్యాప్‌ మార్చే యత్నంవైఎస్‌ జగన్‌ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌కి ముందుగా అనుమతి తీసుకున్న రూట్‌ మ్యాప్‌ ప్రకారం వెళ్తున్నా.. చిత్తూరు, అన్న­మయ్య జిల్లాల ఎస్పీలు మణికంఠ, విద్యాసాగర్‌ నాయుడు కాన్వాయ్‌ ముందుకు వచ్చి రూట్‌ మ్యాప్‌ మార్చే ప్రయత్నం చేశారు. సబ్‌వేలో వెళ్లాల్సిన కాన్వాయ్‌ని నేషనల్‌ హైవేపైకి మళ్లించమన్నారు. ముందుగా అనుమతి తీసుకున్న రూట్‌ మ్యాప్‌లోనే కాన్వాయ్‌ వెళ్తుంటే ఎందుకు అడ్డు పడుతున్నారని వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా నేషనల్‌ హైవేపై కాన్వాయ్‌ వెళితే అనేక మంది ప్రయాణికులు ఇబ్బంది పడతారని, అందుకే సబ్‌వేలో ముందుకు వెళతామన్నారు. అనంతరం సబ్‌ వే ద్వారానే బంగారుపాళ్యం చేరుకున్నారు. పోలీసుల ఓవర్‌ యాక్షన్‌ వల్ల చిత్తూరు, బెంగళూరు హైవే మీద చాలా సేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీనియర్‌ నేతలను సైతం అడ్డుకున్న వైనంమాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను సైతం పోలీసులు లెక్క చేయలేదు. వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా బంగారుపాళ్యం చేరుకునేందుకు వాహనాల్లో వస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారా­యణ­స్వామి, మాజీ మంత్రి ఆర్‌కే రోజా, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ సునీల్‌కుమార్, వెంకటేగౌడ్, వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి వాహనాలను అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అని పోలీసులు చులకనగా వ్యవ­హరిం­చారని ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్, ఆయన అనుచరులను అడ్డుకుని వారిపై లాఠీచార్జ్‌ చేశారు. విజయా­నందరెడ్డి పట్ల చాలా దురుసుగా వ్యవహరించారు. ఒకానొక సమయంలో పోలీసులు తోసెయ్యడంతో విజయానందరెడ్డి కింద పడిపోయారు. ‘సాక్షి’ విలేకరులపైనా ఎస్‌ఐ సుబ్బరాజు దురుసుగా వ్యవహరించారు. సాక్షి వారిని కొట్టుకుంటూ పోతే మరోసారి రారంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. మార్కెట్‌ యార్డు వద్ద కొందరు జర్నలిస్టులు తెల్ల చొక్కాలు ధరించడాన్ని కూడా పోలీసులు తప్పుపట్టారు. అక్రిడిటేషన్‌ కార్డు చూపించినా వారి వ్యవహార శైలి మారలేదు. ‘మామిడి’ వేదన.. రైతు రోదన!చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలానికి చెందిన నలుగురు రైతులు మామిడి కొనుగోలు చేసే వారు లేక విసిగిపోయారు. ప్రభుత్వం నుంచి భరోసా లేకపోవడంతో ఆవేదన గురయ్యారు. ఈ క్రమంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకోవాలని వచ్చారు. అదే సమయంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో మామిడి పంటను తిమ్మోజీపల్లి వద్ద రోడ్డుపై పారబోసి ఆవేదన వ్యక్తం చేశారు. కంట తడి పెడుతూ జగనన్నా.. నీవే దిక్కు అంటూ వెళ్లిపోయారు. రైతులను అడ్డుకోడానికి ఇంత మంది పోలీసులా?జగన్‌ రాకకు ముందు ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులుసాక్షి టాస్క్‌ఫోర్స్‌ : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయోగించిన పోలీస్‌ బలగాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రాయలసీమ డీఐజీ, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 17 మంది డీఎస్పీలు, సీఐలు, ఎస్‌లు సహా 2,000 మంది పోలీసులు జగన్‌ పర్యటనలో పాల్గొన్నారు. వీళ్లంతా జగన్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పించడానికి అనుకుంటే తప్పులో కాలేసినట్టే. కేవలం జగన్‌ అనే నాయకుడిని బంగారుపాళ్యం వెళ్లకుండా, మరీ ముఖ్యంగా ఆయన కోసం జనం ఎవరూ అటు వైపు కన్నెత్తి చూడకుండాం ఉండటం కోసమే పని చేశారు. ఎక్కడ చూసినా ఖాకీ యూనిఫాంలో గుంపులు గుంపులుగా కనిపించారు. యథేచ్ఛగా లాఠీలు సైతం ఝుళిపించారు. జగన్‌కు భద్రత కల్పించడంలో మాత్రం పోలీసుశాఖ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. వారంతా చిత్తూరు నుంచి పలమనేరు వరకు మోహరించి.. బస్సులు, స్కూటర్లు, బైక్‌లు, కార్లలో వచ్చే వాళ్లను నిలువరించడంపైనే దృష్టి సారించారు. తీరా వైఎస్‌ జగన్‌ బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డు లోపలకు అడుగు పెట్టగానే ఒక్క పోలీసు కూడా కనిపించలేదు. కేవలం ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది తప్ప.. కానిస్టేబుల్‌ కూడా సమీపంలో లేరు. దీంతో వేలాది సంఖ్యలో తరలి వచి్చన జనం.. వైఎస్‌ జగన్‌ను చుట్టేశారు. జగన్‌ను వెనుక వైపు నుంచి లాగుతూ, ఆయన చేతులు లాగేస్తూ మీద మీదకు వెళ్లిపోయారు. ఓ దశలో వైఎస్‌ జగన్‌ కిందకు తూలి పోతుండగా వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఇంత మంది జనం మధ్య ఆయన మార్కెట్‌ లోపల రైతుల వద్దకు వెళ్లడానికి అరగంట పైనే సమయం పట్టింది. జెడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న ఓ వీఐపీని ఇలా జన సమూహంలో వదిలేసి, పోలీసులు చోద్యం చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. జెడ్‌ ప్లస్‌ భద్రత అంటే ఇదేనా అని వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపట్టాయి.

India vs England third Test starts today8
ఆధిక్యమే లక్ష్యంగా...

భారత క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌ గడ్డపై లార్డ్స్‌ గ్రౌండ్‌లోనే మూడు టెస్టులు గెలిచింది. ఇతర ఏ మైదానంలోనూ రెండుకు మించి విజయాలు సాధించలేదు. మనకు కలిసొచ్చిన వేదికపై ఇప్పుడు మరో సమరం. మ్యాచ్‌లో బుమ్రా పునరాగమనంతో పెరిగిన పేస్‌ బలం. గత టెస్టులో సాధించిన ఘన విజయం ఇచి్చన అంతులేని ఆత్మవిశ్వాసం. వెరసి కొత్త ఉత్సాహంతో భారత జట్టు మూడో టెస్టుకు సిద్ధమైంది. మరోవైపు బలహీనమైన ఆటతో రెండో టెస్టును కోల్పోయిన ఆతిథ్య ఇంగ్లండ్‌ కోలుకోవాలని ఆశిస్తోంది. ఇక్కడా ఆ జట్టు ఓడిందంటే సిరీస్‌ చేజారినట్లే! లండన్‌: భారత్, ఇంగ్లండ్‌ సుదీర్ఘ టెస్టు సమరంలో మరో పోరుకు రంగం సిద్ధమైంది. 1–1తో సిరీస్‌ సమంగా ఉన్న స్థితిలో నేడు ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మొదలవుతుంది. భారత జట్టు బర్మింగ్‌హామ్‌ ప్రదర్శనను బట్టి చూస్తే అన్ని అస్త్రశ్రస్తాలతో ఎలాంటి లోపాలు లేకుండా జట్టు సన్నద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇక్కడా విజయం సాధిస్తే 2–1తో దూసుకుపోయి ఆపై సిరీస్‌ గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి గిల్‌ బృందం మరింత పట్టు బిగించాలని భావిస్తోంది. జట్టులో అక్కడక్కడా పూరించలేని లోపాలు కనిపిస్తున్న ఇంగ్లండ్‌ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం. ప్రసిధ్‌ స్థానంలో బుమ్రా... సిరీస్‌లో రెండు టెస్టుల్లో భారత జట్టు బలమైన బ్యాటింగ్‌ ప్రదర్శనను కనబర్చించింది. టాప్‌–6లో కరుణ్‌ నాయర్‌ మినహా మిగతా వారంతా సెంచరీ లేదా కనీసం అర్ధసెంచరీలు నమోదు చేశారు. యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, గిల్, రిషభ్‌ పంత్‌ శతకాలు బాదగా... రవీంద్ర జడేజా ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ హాఫ్‌ సెంచరీలు చేసి తన బ్యాటింగ్‌ పదును చూపించాడు. ముఖ్యంగా అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్న గిల్‌ను ఇంగ్లండ్‌ బౌలర్లు నిలువరించలేకపోతున్నారు. వైఫల్యాలు ఉన్నా సరే, నాయర్‌కు సిరీస్‌లో మరో అవకాశం దక్కవచ్చు. కాబట్టి బ్యాటింగ్‌ బృందంలో ఎలాంటి మార్పూ ఉండదు. బౌలింగ్‌లో బుమ్రా ఆడటం ఖాయం కావడంతో ప్రసిధ్‌ కృష్ణ స్థానంలో అతను నేరుగా జట్టులోకి వస్తాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో చెలరేగిన ఆకాశ్‌దీప్, సిరాజ్‌లకు ఇప్పుడు బుమ్రా జత కలిస్తే బౌలింగ్‌కు తిరుగుండదు. అదనపు స్పిన్నర్‌ కావాలని భావిస్తే నితీశ్‌ కుమార్‌ రెడ్డి స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ వస్తాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్లు జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ మరోసారి కీలకం కానున్నారు. నాలుగేళ్ల తర్వాత... ఎప్పటిలాగే ఇంగ్లండ్‌ మ్యాచ్‌కు ముందు రోజే తమ తుది జట్టును ప్రకటించింది. జోష్‌ టంగ్‌ స్థానంలో ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌కు చోటు కల్పించింది. అతని వేగం తమకు అదనపు బలంగా మారుతుందని జట్టు నమ్ముతోంది. అయితే ఆర్చర్‌ ఏకంగా నాలుగేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడు. అతను ఏమాత్రం ప్రభావం చూపుతాడనే చెప్పలేం. మరో ఇద్దరు పేసర్లు వోక్స్, కార్స్‌ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. వీరిద్దరు సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపకపోయినా... ఈ టెస్టు కోసం ఎంపిక చేసిన అట్కిన్సన్‌ గాయంతో తప్పుకోవడంతో మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 71 ఓవర్లలో 286 పరుగులు ఇచ్చినా స్పిన్నర్‌గా షోయబ్‌ బషీర్‌పైనే ఇంగ్లండ్‌ నమ్మకం ఉంచింది. అయితే ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ పదునెక్కాల్సి ఉంది. బ్యాటింగ్‌కు మరీ అనుకూలం కాని లార్డ్స్‌ పిచ్‌పై ఆతిథ్య బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. ఓపెనర్లు క్రాలీ, డకెట్‌ భారత పేసర్లను ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. ఒలీ పోప్‌తో పాటు జో రూట్‌ కూడా అంచనాలను అందుకోవాల్సి ఉంది. హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్‌ ఫామ్‌ సానుకూలాంశం కాగా, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ బ్యాటింగ్‌ ఆందోళన రేకెత్తిస్తోంది. అతను ఒక మంచి ఇన్నింగ్స్‌ ఆడి చాలా కాలమైంది. ఇప్పుడైనా స్టోక్స్‌ తన బ్యాటింగ్‌ బలాన్ని చూపించడం జట్టుకు ఎంతో అవసరం. తుది జట్ల వివరాలు భారత్‌ (అంచనా): గిల్‌ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్, నాయర్, పంత్, జడేజా, సుందర్, ఆకాశ్‌దీప్, సిరాజ్, బుమ్రా, కుల్దీప్‌. ఇంగ్లండ్‌: స్టోక్స్‌ (కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్మిత్, వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్‌.పిచ్, వాతావరణంఅటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సమాన అనుకూలతగా జీవం ఉన్న పిచ్‌ ఇది. ఆరంభంలోనే కాస్త పేస్‌కు అనుకూలిస్తుంది. ఆపై మంచి బ్యాటింగ్‌కు అవకాశం ఉంది. ఈసారి టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకోవచ్చు. మ్యాచ్‌ రోజుల్లో వర్ష సూచన లేదు.19 భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య లార్డ్స్‌ మైదానంలో జరిగిన టెస్టులు. 3 టెస్టుల్లో భారత్, 12 టెస్టుల్లో ఇంగ్లండ్‌ గెలిచాయి. 4 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి.148 లార్డ్స్‌ మైదానంలో ఇప్పటి వరకు జరిగిన టెస్టులు. 97 టెస్టుల్లో ఫలితాలు రాగా, 51 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి. ఈ వేదికపై ఇంగ్లండ్‌ 145 టెస్టులు ఆడింది. 59 టెస్టుల్లో నెగ్గి, 35 టెస్టుల్లో ఓడింది. 51 టెస్టులను ‘డ్రా’ చేసుకుంది.

Viceroy Research takes short position on Vedanta Group9
వేదాంత గ్రూప్‌ ఓ పేకమేడ..!

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ను హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ లక్ష్యంగా చేసుకున్నట్లుగా తాజాగా మరో దిగ్గజం వేదాంత గ్రూప్‌ను ఇంకో అమెరికన్‌ షార్ట్‌సెల్లింగ్‌ సంస్థ వైస్రాయ్‌ రీసెర్చ్‌ టార్గెట్‌ చేసింది. వేదాంత గ్రూప్‌ అనేది భారీ అప్పులు, కొల్లగొట్టిన ఆస్తులు, కల్పిత అకౌంటింగ్‌ గాధలతో కట్టిన ఓ పేకమేడలాంటిది అని ఓ సంచలన నివేదికలో ఆరోపించింది. హోల్డింగ్‌ కంపెనీ అయిన వేదాంత రిసోర్సెస్‌ (వీఆర్‌ఎల్‌), భారత అనుబంధ సంస్థను పారసైట్‌లాగా భ్రష్టు పట్టిస్తోందని 85 పేజీల రిపోర్టులో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘వేదాంత రిసోర్సెస్‌ ఓ పారసైట్‌లాంటి హోల్డింగ్‌ కంపెనీ. అదొక పోంజీ స్కీము నడిపిస్తోంది. దానికంటూ చెప్పుకోతగ్గ కార్యకలాపాలేమీ లేవు. భారతీయ విభాగం వేదాంత లిమిటెడ్‌ను (వీఈడీఎల్‌) కొల్లగొడుతూ బతికేస్తోంది‘ అని వీఆర్‌ఎల్‌ బాండ్లలో షార్ట్‌ పొజిషన్లు తీసుకున్న వైస్రాయ్‌ రీసెర్చ్‌ పేర్కొంది. మాతృ సంస్థకు డివిడెండ్ల రూపంలో వేల కోట్లు సమర్పించుకున్నాక వీఈడీఎల్‌ దగ్గర నగదు నిల్వలు పూర్తిగా ఖాళీ అయిపోయాయని, ఎక్కడా అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకుండా పోయిందని తెలిపింది. ఇంతగా నిధులు వస్తున్నప్పటికీ, వీఆర్‌ఎల్‌ వడ్డీ వ్యయాలు వార్షికంగా 200 మిలియన్‌ డాలర్ల మేర పెరిగినట్లు వివరించింది. కంపెనీ 9–11 శాతం వడ్డీ రేటుతో బాండ్లను ఇష్యూ చేయగా, వడ్డీ భారాన్ని చూస్తుంటే ఏకంగా 15.8 శాతం స్థాయిలో కనిపిస్తోందని నివేదిక తెలిపింది. ఇదంతా చూస్తుంటే ఓ స్థాయిలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు ఉందని వివరించింది. వేరే ఖర్చులను వడ్డీల రూపంలో మోసపూరితంగా చూపిస్తుండటం, సిసలైన రుణభారం తెలియకుండా అధిక వడ్డీ రేట్లకు స్వల్పకాలిక రుణాలను తీర్చేస్తుండటం, లేదా రుణ రేట్లు .. షరతులను సరిగ్గా వెల్లడించకపోవడంలాంటివి కారణాలుగా ఉండొచ్చని పేర్కొంది. నిరాధార ఆరోపణలు: వేదాంత గ్రూప్‌ వార్షిక సర్వ సభ్య సమావేశంలో వేదాంత లిమిటెడ్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ పాల్గొనడానికి ఒక రోజు ముందు ఈ నివేదిక వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. రిపోర్టును బైటపెట్టిన సమయం చూస్తే, వైస్రాయ్‌ రీసెర్చ్‌ తీరు సందేహాలకు తావిచ్చేదిగా ఉందని వేదాంత గ్రూప్‌ పేర్కొంది. ఇదంతా నిరాధార ఆరోపణలు, వారికి అనువైన సమాచారాన్ని ఉపయోగించుకుని చేస్తున్న విషపూరిత ప్రచారమని తెలిపింది. వివరణ కోసం వైస్రాయ్‌ రీసెర్చ్‌ తమను కనీసం సంప్రదించకుండానే రిపోర్ట్‌ తయారైందని పేర్కొంది. అయితే, దీనికి వైస్రాయ్‌ రీసెర్చ్‌ కౌంటర్‌ ఇచ్చింది. తమ రిపోర్టును వేదాంత గ్రూప్‌ తోసిపుచ్చలేదని, ప్రశ్నలేవైనా ఉంటే సమాధానాలివ్వడానికి సిద్ధంగా ఉన్నామని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. వైస్రాయ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ దెబ్బతో వేదాంత షేర్లు బుధవారం బీఎస్‌ఈలో 6 శాతం పడిపోయింది. తర్వాత కొంత కోలుకుని 3.4 శాతం నష్టంతో రూ. 440.80 వద్ద క్లోజయ్యింది.

Sakshi Guest Column On Chandrababu Govt10
వివేచన అవసరమైన కాలమిది!

రాష్ట్ర విభజన జరిగిన గత పదేళ్ళలో రెండు ప్రధాన పార్టీల చెరొక ఐదేళ్ల పాలన తర్వాత, మళ్ళీ బాబు పాలన అంటే, జగన్‌ సెట్‌ చేసి వెళ్ళిన వృత్తం పైన బాబు తన చతు రస్రం అయినా ఉంచాలి, లేదు జగన్‌ చతురస్రం మీద బాబు తన వృత్తం అయినా ఉంచాలి. కానీ ఇద్దరివీ కలవని మార్గాలు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అందుకే ఈ సారూప్యతను ఎన్నిసార్లు ఎటు తిప్పి చూసినా వాటి అంచులు బయటకు ఉంటున్నాయి. నిజానికి ఈ ఇద్దరివీ రెండు వేర్వేరు ‘పబ్లిక్‌ పాలసీలు’. పదేళ్లనాడు బాబు తనకు తాను పనిమాలా తెచ్చిపెట్టుకున్న సంకటం – ‘అమరావతి’ వీటికి అదనం. వైఎస్సార్‌సీపీ అనే ఒక యువ రాజకీయ పార్టీ వచ్చి, అది తన తొలి ఐదేళ్ల పాలనలో వేసిన ‘రన్‌ వే’ మీద టీడీపీ విమానం ‘టేకాఫ్‌’ అంటే, అందుకు బాబు నలభై ఏళ్ల అను భవం చాలడం లేదు. జగన్‌ ఇంజినీరింగ్‌ మారడంతో భవన నిర్మాణం కూడా మారింది. దేశంలో ఆర్థిక సంస్కరణలు 1991లో మొదలైతే, ఆ తర్వాత మూడేళ్లకే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. తిరిగి 2004లో వచ్చిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి డా‘‘ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ‘సంస్కరణల కాలం’ సాగుబడి సమస్యల పరిశీలన బాధ్యతలను తాను మీద వేసుకోకుండా దాన్ని జేఎన్‌యూ ఎకనా మిక్స్‌ ప్రొఫెసర్‌ డా‘‘ జయతీ ఘోష్‌కు అప్పగించారు. ఆమె ఇచ్చిన ‘రిపోర్ట్‌’ను ప్రభుత్వ వ్యవసాయ విధా నంగా అమలు చేశారు. దాపరికం లేదు. నిపుణుల నైపుణ్యం వాడుకోవలసిన విధానమది. ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాక మేధోమథనం ఇంకా చాలా పెద్ద స్థాయిలో జరగాల్సింది. ఖైరతాబాద్‌ గవర్నర్‌ బంగళా పక్కనున్న ప్రతిష్టాత్మక పరిశోధన శిక్షణా సంస్థ ‘అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ’ (ఆస్కీ) వంటి సంస్థను ఏపీ ప్రభుత్వానికి ఒక ‘రోడ్‌ మ్యాప్‌’ ఇవ్వ మని అడిగి ఉండాల్సింది. అది 46 దేశాలకు చెందిన వందకు పైగా సంస్థలకు సేవలు అందిస్తున్న సంగతి గమనార్హం. దాని సహాయం తీసుకోలేదు. మొదటి ఐదేళ్లు అలా గడిస్తే, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘నీతి ఆయోగ్‌ ‘ పర్యవేక్షణలో 2030 లక్ష్యంగా ‘యూఎన్‌డీపీ’ జారీ చేసిన– ‘సస్టెయినబుల్‌ డెవలప్మెంట్‌ గోల్స్‌’ ప్రాతిపదికన తన ‘పబ్లిక్‌ పాలసీ’ని రూపొందించుకుని; ‘కోవిడ్‌’ కాలంలో కూడా దాన్ని అమలు చేసింది. వివరం తెలియనివారు దాన్ని ‘సంక్షేమం’ అన్నారు. కొత్త రాష్ట్రంలో పరిపాలన ‘చివరి మైలు’కు చేరడానికి అవసరమైన గ్రామ సచివాలయ వ్యవస్థ ఆ కాలంలో ఏర్పాటు అయింది. ఇలా జరిగిన ప్రతిదీ ఒక ప్రభుత్వ చట్రం పరిధిలో జరగడం వల్ల, ప్రభుత్వం మారి ఏడాది గడిచినా గత ప్రభుత్వాన్ని ఇప్పటికీ ‘ఫైల్స్‌’లో తప్పు పట్టలేదు. పార్టీలు వేరైనా రాజ్యాంగం ఒక్కటే అయినప్పుడు, స్థూలంగా దాని పరిధిలో పనిచేయడం అనేది మౌలిక సూత్రం.ఈ ఇరువురి భిన్న వైఖరులు నేర్పుతున్న పాఠాలు ఏమిటో ఇప్పుడు గ్రహించవలసి ఉంది. టీడీపీ 2024 ఎన్నికల వరకు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో – ‘విధ్వంసం’ జరిగిందని అనేది. కానీ అది ఎక్కడ జరిగిందో తెలియదు. విధ్వంసాన్ని ఈ ఏడాది కాలంలో ఇది అని విడమర్చి ప్రజలకు చెప్పాలి కదా? వారంటున్న ‘విధ్వంసం’ వికేంద్రీకరణ అయ్యుండాలి. ఎందుకంటే బాబు అమరావతి కేంద్రంగా నేల తవ్వి పునాదులు వేస్తే, జగన్‌ గ్రామపాలనకు రాష్ట్ర మంతా పటిష్ఠమైన పునాదులు వేశారు. అందువల్ల అధికారిక అంచెలు (హైరార్కీ) తగ్గాయి. ‘ఆన్‌ లైన్‌’ సౌలభ్యంతో కొన్ని ప్రజా సమస్యలు గ్రామ సచివా లయాల్లోనే పరిష్కారం అయ్యాయి. ప్రజాప్రతినిధుల వరకు అవి రాలేదు. అన్ని పార్టీల నాయకులు ఈ కొత్త నొప్పిని మౌనంగా భరించారు. కానీ, ప్రభుత్వం మారాక జరిగింది ఏమిటి? బాబు తన ప్రభుత్వంలో దీన్ని మార్చలేదు సరికదా విస్తరించారు. అందుకు ఈ ఏడాది జూన్‌ 12న కూటమి ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ శాఖ జారీ చేసిన ‘జీవో’ 57ని చూడాల్సి ఉంటుంది. ఇది వైసీపీ ప్రభుత్వంలో వెలువడిన జీవో 08. తేదీ: 1.11.’23కి కొనసాగింపు. అందులో అప్పట్లో గత ప్రభుత్వం 77 ‘డివిజినల్‌ డెవలప్మెంట్‌ ఆఫీసర్‌’ పోస్టులు కొత్తగా మంజూరు చేసింది. అయితే గత నెలలో ఆ 77 మంది అధికారుల పరిధిలోకి గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకువచ్చి, వీరు డివిజన్‌ స్థాయిలో జరిగే పంచాతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, సంక్షేమ అభివృద్ధి పనులు పర్యవేక్షించేలా విస్తృతమైన ‘జాబ్‌ చార్ట్‌’తో ఉత్తర్వులు జారీ చేసింది. చిత్రంగా ఆ యా కార్యాలయాల పోస్టల్‌ అడ్రెస్‌ కూడా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రమంతా గ్రామ, వార్డు సచివాలయాలతో నిర్మించిన పరిపాలనా పరమైన పునాదులకు ఉన్న విశ్వసనీయత వల్ల, ఇప్పుడు వాటి పైన కొత్తగా కట్టే అదనపు భవంతులకు భద్రత హామీ దొరికింది. పాత జిల్లాలు చిన్నవై పర్యవేక్షణ పెరిగింది. పంచాయతీరాజ్‌ స్థానిక పరిపాలనా వ్యవస్థలతో వైసీపీ తెచ్చిన సచివాలయ వ్యవస్థ ‘ఇంటిగ్రేట్‌’ అయ్యి రెండింటి మధ్య ఒక ‘ఆర్గానిక్‌ లింకు’ ఏర్పడింది. పార్టీలు ఏవైనా ‘పొలిటికల్‌ అడ్మినిస్ట్రేషన్‌’ తీసుకునే విధానపర నిర్ణయాలు ప్రభుత్వ పరిపాలన చట్టపరిధిలో ఉన్నప్పుడు, అది ఎవరి ప్రభుత్వం అనే దానితో పని లేకుండా మొక్కకు అంటు కట్టినట్టుగా రెండూ ఒక్కటిగా ఎదుగుతూ విస్తరిస్తుంది. జాన్‌సన్‌ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement