కొందరు చిన్నారులకు తలపైన వెంట్రుకలు కొంతమేర రాలిపోతుంటాయి. కొందరు పెద్దల్లోనూ ఇలా జరుగుతుంటుంది. ఇలా జుట్టురాలిపోయి ప్యాచ్‌లా రూపోందే కండిషన్‌ను ‘అలొపేషియా ఏరేటా’ అంటారు. కారణాలు: అలొపేషియాకు పలానా అంశమే కారణం అంటూ చెప్పడం సాధ్యం కాదు. అయితే సాధారణంగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఈ కండిషన్‌కు ప్రధాన కారణం. ఇలాంటి కండిషన్ ఉన్న పిల్లల్లో మాడు ఎర్రబారడం, ఆప్రాంతంలో పొట్టులా రాలడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. వీళ్లలో అలర్జీకి సంబంధించిన సమస్యలు, ఆస్థమా, అటోపిక్ డెర్మటైటిస్, చేతివేళ్ల గోళ్లలో కూడా సమస్యలూ కనిపించవచ్చు.
ఇలాంటి పిల్లల్లో థైరాయిడ్ సమస్యలు (హైపోథైరాయిడిజం), కడుపుకు సంబంధించిన సమస్యలు, కళ్ల సమస్యలు, ఇతర ఆటో ఇమ్యూన్ సమస్యలు కూడా కనిపించవచ్చు. ఆ కండిషన్ కనిపించే పిల్లల్లో దాదాపు 10% నుంచి 20% మందిలో ఇదే జబ్బుకు సంబంధించిన Mఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటుంది. కాబట్టి ఇది జన్యుపరమైన కారణాల వల్ల కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో పిల్లల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడులు, మానసికమైన ఉద్వేగాల వంటి అంశాలు కూడా ఈ సమస్యను ప్రేరేపించవచ్చు.
మానసికమైన అంశాలతో ΄ాటు... ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అలర్జీకి సంబంధించిన సమస్యలు, సెబోరిక్ డెర్మటైటిస్ అనే కండిషన్లలో సైతం వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. ఇలా జుట్టురాలిపోయే పిల్లల్లో సాధారణంగా ఆర్నెల్ల నుంచి ఏడాదిలోపు మళ్లీ వెంట్రుకలు వాటంతట అవే వచ్చే అవకాశం ఉంది.
ఈ అలొపేషియా ఏరేటా కండిషన్ చిన్న చిన్న ప్యాచెస్‌లా కనిపిస్తుంటే త్వరగా తగ్గే అవకాశం ఉంది. చికిత్స: జట్టు రాలిపోతున్నందు వల్ల ఇలాంటి పిల్లలు ఆత్మన్యూనతకూ, మానసిక ఒత్తిడికీ గురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు, సంరక్షకులు వారికి తగిన మానసిక స్థైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పైగా తమ తోటివారు ఎగతాళి చేస్తారన్న ఆందోళన పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇలా జుట్టు రాలిపోయేచోట్ల టాపికల్ స్టెరాయిడ్స్, స్టెరాయిడ్ క్రీమ్స్ రాయడం, ఆప్రాంతాల్లో చర్మంలోకి (సబ్ క్యూటేనియస్) ఇంజెక్షన్లు ఇవ్వడం, అల్ట్రా వయొలెట్ థెరపీ వంటి వాటివల్ల ప్రయోజనం ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో హెయిర్ గ్రోత్ ప్రమోటింగ్ ఏజెంట్స్ వంటి మందుల్ని వాడాలి. అయితే వాటితో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా డర్మటాలజిస్ట్‌ల పర్యవేక్షణలోనే వాటిని వాడాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment