రెస్టారెంట్లలోనూ, హోటల్‌లోనూ భోజనం చేశాక సర్వర్ ప్లేటులో సొంపు వేసి పట్టుకొస్తాడు. మనం కూడా నోరు మంచి వాసన వస్తుంది కదా !అని చక్కగా తింటాం. అయితే ఈ సోంపుని ఇలా భోజనం తర్వాత ఎందుకు ఇస్తారో తెలుసా..!. నోరు మంచి వాసన వస్తుందని మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయట. భోజనం తర్వాత నోట్లో కాస్త వేసుకోవడం వల్ల చక్కగా ఆహారం జీర్ణం మవుతుంది, పైగా కడుపులో ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తుంది. అలాంటి సోంపులో ఎలాంటి పోషకాలు ఉన్నాయి, ఎలా ఉపయోగించాలి తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందాం.!
కడుపులో అసౌకర్యాన్ని నివారిస్తుంది..
సోంపు గింజలను నేరుగా తినడంతో పాటు వీటితో చేసిన నీటిని తాగడం వల్ల కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సోంపు గింజల నీరు రిఫ్రెషింగ్ పానీయంగా పని చేయడంతో పాటు దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సోంపు గింజల నీరు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కడుపు నిండుగా భోజనం చేసిన తరువాత వచ్చే అసౌకర్యాన్ని తగ్గించడంలో సోంపు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. సోంపు గింజల నీటిని తాగడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. సోంపు గింజల నీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గి స్లిమ్‌గా అవ్వుతారు
బరువు తగ్గుతాం..
సోంపు గింజల నీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఈ సొంపు నీటిని తాగడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. దీంతో మనం ఆహారం తీసుకునే మోతాదు తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారు సోంపు గింజల నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ నీటిలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. సోంపు గింజల నీటిని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే ఫ్లూ, జలుబు వంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడడంలో ఈ నీరు మనకు ఎంతో దోహదపడుతుంది.
మధుమేహం అదుపులో ఉంటుంది..
అదే విధంగా సోంపు గింజలల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. సోంపు గింజలతో చేసిన నీటిని తాగడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. వయసు పైబడడం వల్ల వచ్చే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే సోంపు గింజల నీటిని తాగడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. మధుమేహం లేదా ఫ్రీడయాబెటిక్ లక్షణాలతో బాధపడే వారు సోంపు గింజల నీటిని తాగడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా స్త్రీలు సోంపు గింజల నీటిని తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో వచ్చే అసౌకర్యం నుంచి చక్కటి ఉపశమనం కలుగుతుంది. గర్భాశయ కండరాలను సడలించి నెలసరి సమయంలో నొప్పిని తగ్గించే సోంపు గింజలకు ఉంది.
చర్మం ఆరోగ్యం..
ముఖ్యంగా స్త్రీలు క్రమం తప్పకుండా సోంపు గింజల నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించడంతో పాటు నోటి దుర్వాసన తగ్గుతుంది. ఈ సోంపు గింజల నీటిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు ఫ్రీరాడికల్స్ తో పోరాడి చర్మ కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ నీటిని తాగడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు తగ్గడంతో పాటు వృద్దాప్య ఛాయలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. అలాంటి సోంపు గింజలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందచ్చని చెబుతున్నారు నిపుణులు.
Comments
Please login to add a commentAdd a comment