హెచ్.పైలోరీ ఇన్‌ఫెక్షన్‌తో గ్యా్రస్టిక్ క్యాన్సర్ ముప్పు
ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి
దేశంలో 50– 60% మందిలో ఈ బ్యాక్టీరియా ఆనవాళ్లు
నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ బ్యారీ మార్షల్
సాక్షి, హైదరాబాద్: నోటి దుర్వాసన దీర్ఘకాలంపాటు ఉంటే గ్యాస్ట్రిక్ కేన్సర్ సోకిందేమోనని అనుమానించాలని ఏఐజీ ఆస్పత్రులు చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. హెలికోబ్యాక్టర్ పైలోరి (హెచ్.పైలోరి) ఇన్‌ఫెక్షన్ వల్ల ఈ ప్రమాదం ఉన్నదని చెప్పారు. ఏఐజీ ఆస్పత్రిలో నూతనంగా స్థాపించిన బ్యారీ మార్షల్ సెంటర్ ఫర్ హెచ్ పైలోరీని నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ బ్యారీ మార్షల్‌తో కలిసి నాగేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని హెచ్.పైలోరీ స్ట్రెయిన్స్‌కు ప్రత్యేకమైన జన్యు లక్షణాలు ఉన్నాయని, దీంతో ఇన్‌ఫెక్షన్లపై ప్రత్యేక పరిశోధనలు అవసరమని అన్నారు.
హెచ్.పైలోరీ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడమే కాకుండా, అది సోకకుండా నిరోధించడమే లక్ష్యంగా బ్యారీ మార్షల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ పరిశోధనల్లో ప్రొఫెసర్ మార్షల్ పాల్గొనడం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. దేశంలో హెచ్.పైలోరీ విషయంలో కొత్త ప్రమాణాలు తీసుకురావడమే తమ ఉద్దేశమని తెలిపారు. హెచ్.పైలోరీ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు వెంటనే బయటపడవని, ఎండోస్కోపీతో మాత్రమే దీనిని గుర్తించొచ్చని వివరించారు. దీర్ఘకాలంపాటు నోటి దుర్వాసన వస్తే ఈ బ్యాక్టీరియా సోకిందని అనుమానించవచ్చని, అలాంటి వారు ఎండోస్కోపీ చేయించుకుంటే దీన్ని గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు.
60% మందిలో హెచ్ పైలోరీ
భారత్‌లో హెచ్.పైలోరీ ఇన్‌ఫెక్షన్లు 50% నుంచి 60% మందిలో ఉన్నాయని ప్రొఫెసర్ బ్యారీ మార్షల్ చెప్పారు. ఈ బ్యాక్టీరియా కారణంగా దేశంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. మధుమేహంతో వచ్చే సమస్యల కన్నా దాదాపు 10 రెట్లు హెచ్. పైలోరీ వల్ల వస్తాయని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ బ్యాక్టీరియాను కేన్సర్ కారకంగా వర్గీకరించిందని, దీన్నిబట్టే దీని తీవ్రత తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ బ్యాక్టీరియా కారణంగానే దేశంలో ఉదర సంబంధ కేన్సర్ శాతం పెరిగిందని, దీన్ని లక్ష్యంగా చేసుకుని పరిశోధనలు జరగడం చాలా ముఖ్యమని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment