Beauty Tips In Telugu: How To Make Homemade Aloe Vera Gel Night Cream - Sakshi
Sakshi News home page

Aloe Vera Gel Night Cream: అలోవెరా జెల్‌తో నైట్‌ క్రీమ్‌ ఇలా తయారు చేసుకోండి! రోజూ రాసుకుంటే..

Published Mon, Aug 29 2022 3:40 PM | Last Updated on Mon, Aug 29 2022 4:44 PM

Beauty Tips In Telugu: How To Make Homemade Aloe Vera Gel Night Cream - Sakshi

సహజ సిద్ధమైన పదార్థాలతో చేసిన క్రీములు చర్మాన్ని ఆరోగ్యంగాను అందంగా ఉంచుతాయి. మరి మనకు నిత్యం అందుబాటులో ఉండే అలోవెరా జెల్‌తో నైట్‌ క్రీమ్‌ ఎలా చేసుకోవాలో చూద్దాం...

అలోవెరా జెల్‌తో నైట్‌ క్రీమ్‌
►గ్రీన్‌ టీ శాచెట్‌ ఒకటి తీసుకుని నీటిలో వేయాలి.
►దీనిలో రెండు టీస్పూన్ల కాఫీ పొడి వేసి మరిగించాలి.
►ఈ మిశ్రమం దగ్గర పడిన తర్వాత దించేసి.. రెండు విటమిన్‌ ఈ క్యాప్సూల్స్‌ని కట్‌ చేసి అందులో కలపాలి.
►దీనిలోనే రెండు టీస్పూన్ల తాజా అలోవెరా జెల్‌ వేసి చక్కగా కలపాలి.
►ఈ మిశ్రమాన్ని ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో నిల్వచేసుకోవాలి.

►రోజూ రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడుచుకుని ఈ క్రీమ్‌ను అప్లైచేసి ఐదునిమిషాలు మర్దన చేసి పడుకోవాలి.
ఉదయాన్నే నీటితో కడిగేయాలి.
►జిడ్డు చర్మం కలిగిన వారు క్రీమ్‌ తయారీలో గ్రీన్‌ టీకి బదులు టీ ట్రీ ఆయిల్‌ను వాడుకుంటే మంచిది.
►ఈ క్రీమ్‌ను రోజూ పడుకునే ముందు ముఖానికి రాసుకోవడం వల్ల కాలుష్యం, ఎండవేడికి చర్మం పాడకుండా ఉంటుంది.

►అలోవెరా జెల్‌ చర్మకణాలను లోతుగా శుభ్రం చేస్తే, కాఫీ పొడి నల్లటి మచ్చలను తొలగిస్తుంది.
►గ్రీన్‌ టీ మొటిమలను తగ్గిస్తుంది.
►విటమిన్‌ ఈ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి చర్మాన్ని మృదువుగా, కాంతిమంతంగా మారుస్తుంది. 

చదవండి: Eye Stress Relief: ఎక్కువ సేపు కంప్యూటర్‌ స్క్రీన్‌ చూసేవాళ్లు! రోజ్‌వాటర్‌, టీ బ్యాగ్‌లు, పుదీనా.. ఈ చిట్కాలు పాటిస్తే..
Tips To Increase Platelet Count: ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో పాటు గుమ్మడి, గోధుమ గడ్డి.. ఇంకా ఇవి తింటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement