On This Day April 15th: What Happened Today In History, Know Interesting Facts - Sakshi
Sakshi News home page

On This Day April 15th: ఏప్రిల్‌ 15 ముఖ్య సంఘటనలు, విశేషాలు ఇవే!

Published Sat, Apr 15 2023 12:57 PM | Last Updated on Sat, Apr 15 2023 1:26 PM

On This Day April 15th: What Happened Today In History, Know Interesting Facts - Sakshi

గడిచిన కాలంలో ఎన్నో ఆసక్తికర, వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందులో కోన్ని ఎప్పటికి చరిత్రలో నిలిచిపోయే అంశాలు ఉన్నాయి. మరి ఈ రోజు ఏప్రిల్‌ 15. ఈ రోజున గతంలో ఎన్నో వింతలు, విశేషాలు జరిగి ఉంటాయి కదా. మరి ఈ విశేషాలు ఏంటీ! చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి!

చరిత్రలో నేటి ముఖ్య సంఘటనలు

  • 1865: అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ మరణించిన రోజు. 
  • 1912: టైటానిక్‌ షిప్‌ మునిగిపోయింది ఈ రోజే.  బ్రిటిష్ ప్యాసింజర్ లైనర్ ఆర్‌ఎమ్‌ఎస్‌ టైటానిక్ ఉత్తర అట్లాంటిక్‌లో తెల్లవారుజామున 2:20 గంటల సమయంలో మంచుకొండను ఢీకొన్న రెండు గంటల నలభై నిమిషాల తర్వాత మునిగిపోయింది.  ఈ ఘటనలో 2,224 మంది ప్రయాణికులు, సిబ్బందిలో 710 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
  • 1923: ఇన్సులిన్‌ సాధారణంగా అందుబాటులోకి వచ్చిన రోజు
  • 1925: ప్రత్యేక గోదావరి జిల్లా ఏర్పడిన రోజు. గోదావరి జిల్లాను, కృష్ణా జిల్లాను విడదీసి, పశ్చిమ గోదావరి ప్రత్యేక జిల్లాగా ఏర్పరిచారు.
  • 1936: పాలస్తీనాలో అరబ్ తిరుగుబాటు మొదటి రోజు.
  • 1952: బోయింగ్ B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ మొదటి విమానంగా గుర్తించిన రోజు.
  • 1961: యూరి గగారిన్, అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తిగా ఆర్డర్ ఆఫ్ లెనిన్ లభించిన రోజు.
  • 1969 - EC-121 షూట్‌డౌన్ సంఘటన: జపాన్ సముద్రం మీదుగా యునైటెడ్ స్టేట్స్ నేవీ విమానాన్ని ఉత్తర కొరియా కూల్చివేసి అనంతరం అందులోని 31 మంది అమెరికా సైనికులను చంపింది ఈ రోజే. 
  • 1986: లిబియా ఉగ్రవాదానికి ప్రతీకారంగా అమెరికా యుద్ధ విమానాలు లిబియాలోని ట్రిపోలీపై బాంబు దాడి చేసింది ఈ రోజే.

ప్రముఖుల జననం

  • 1452: లియొనార్డో డావిన్సి గణితజ్ఞుడు, ఇంజనీర్ లియోనార్డో డావిన్సి జననం. ఆయన చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు కూడా. ఆయన 1519లో మరణించారు.
  • 1843: అమెరికన్ నవలా రచయితహెన్రీ జేమ్స్ జననం
  • 1932: మరాఠీ కవి సుదర్శన్ భట్ జననం. ఆయన 2003లో అనారోగ్యంతో మృతి చెందారు.

ప్రముఖుల మరణాలు

  • 1845: మహారాజా చందు లాల్ మృతి. హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త.
  • 1865 : అబ్రహం లింకన్, అమెరికా 16 వ అధ్యక్షుడు. ఆయన 1809లో జన్మించారు.
  • 1961: రాచాబత్తుని సూర్యనారాయణ, సాతంత్ర్యసమయోధుడు మృతి. ఆయన 1903 జన్మించారు
  • 1965: బండారు రామస్వామి, నాట్య కళాకారులు, బంధిఖానా, భక్త రామదాసు, కర్ణుని స్వామిభక్తి, దమయంతి మొదలైన ఏకపాత్రాభినయం రచనలను నిర్వహించారు.

పండుగలు, ముఖ్యమైన రోజులు

  • హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర దినోత్సవం.
  • ప్రపంచ కళా దినోత్సవం
  • సాంస్కృతిక సార్వత్రిక దినోత్సవం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement