ఔషధ మొక్క నల్లేరు గురించి ఎపుడైనా విన్నారా? అసలు పచ్చడి ఎపుడైనా తిన్నారా? పూర్వకాలంలో పెద్దలు దీన్ని ఆహారంగా వాడేవారు. పోషకాలమయమైన నల్లేరు చేసే మేలు చాలా గొప్పదని ఆయుర్వేదం చెబుతోంది. నల్లేరు ప్రకృతి ప్రసాదించిన వరం. దీన్నే వజ్రవల్లి అని కూడా పిలుస్తారు. అంటే వజ్రంలాంటి శక్తినిస్తుందన్నమాట. నల్లేరు కాడలతో చేసిన పచ్చడి మోకాళ్లు, నడుము నొప్పులను, బీపీ షుగర్ సహా పలు రకాల వ్యాధులను బాగా తగ్గిస్తుందని చెబుతారు.
నల్లేరు (సిస్సస్ క్వాడ్రాంగులారిస్) తీగలోని ప్రతి భాగాన్ని వివిధ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఆంగ్లంలో వెల్డ్ గ్రేప్ అని పిలుస్తారు. ముఖ్యంగా బోలు ఎముకల వ్యాధి, ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, పైల్స్,మధుమేహం వంటి అనేక వ్యాధులను నయం చేయడానికి దీన్ని వాడతారు.
నల్లేరు పచ్చడి
కావలసినవి
10 నల్లేరు కాడలు, తరిగినవి ( లేత కాడలు అయితే బావుంటాయి.)
½ కప్పు వేరుశెనగలు
కొద్దిగా చింతపండు
రెండు ఎర్ర మిరపకాయలు
నాలుగు లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, పసుపు
ధనియాలు, పచ్చిమిర్చి పోపు దినుసులు జీలకర్ర ,తాజా కొత్తిమీర
తయారీ
ముందుగా లేత నల్లేరు కాడలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి, చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఒక బాణలిలో వేరుశెనగలను వేయించి పక్కన పెట్టండి. అదే బాణలిలో కొత్తిమీర, జీలకర్ర, ఎర్ర మిరపకాయలను సువాసన వచ్చేవరకు వేయించాలి. చల్లారనిచ్చి వీటిని మెత్తగా మెత్తగా రుబ్బుకోవాలి.
తరువాత నూనె వేడి చేసి, తరిగిన నల్లేరు కాడలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఈ ముక్కల్లో పల్లీల మిశ్రమం, చింతపండు, వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తరువాత ఆవాలు, శనగ పప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఇంగువ, పసుపు వేసి ఈ పచ్చడిని పోపు పెట్టాలి. దీన్ని ఒక నిమిషం పాటు ఆ నూనెలో మగ్గనిచ్చి తాజాగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే రుచికరమైన నల్లేరు పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో, రవ్వంత నెయ్యి వేసుకుని తింటే జిహ్వకు భలే ఉంటుంది. ఇది ఫ్రిజ్‌లో ఒక వారం పాటు నిల్వ ఉంటుంది. (మురారి మోపెడ్ సంబరం, రూ. 60వేలతో డీజే పార్టీ...కట్ చేస్తే!)
లాభాలు
- నల్లేరు కాడలతో చేసిన పొడిని రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు
- నల్లేరులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వాపులను తగ్గిస్తాయి.
- నల్లేరు ఆస్పిరిన్ వలె ప్రభావవంతంగా పనిచేస్తుంది.
- రక్తహీనత నివారణలో సహాయపడుతుంది.
- నల్లేరు బహిష్టు సమస్యలకు చక్కటి పరిష్కారం
- నల్లేరులో పీచు పదార్థం యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
నోట్ : మోకాలి నొప్పికి కారణాలను నిపుణులైన వైద్యుల ద్వారా నిర్ధారించుకోవాలి. వారి సలహా మేరకు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి. శరీరంలో విటమిన్ డీ, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండేలా జాగ్రత్తపడాలి.
Comments
Please login to add a commentAdd a comment