పంచమహా వేదంగా పిలిచే మహాభారతం గురించి కథకథలుగా చదువుకున్నాం. అదీగాక వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి అన్న నానుడి కూడా ఉంది. ఎందుకంటే భారతం వింటూంటే రసవత్తరంగా ఉంటుంది. కథలో ఏం జరిగింతుందో.. అని చివరి వరకు ఉత్కంఠ రేకెత్తిస్తుంది. పలు ట్విస్ట్‌లు, భావోద్వేగాలు, సంఘర్షణలు,కుటుంబ విలువలతో మిళితమైన గొప్ప పురాణ గ్రంథం. అయితే ఈ పురాణ కథలోని కృష్ణుడికి, పాండవులకు దేవాలయాలు ఉన్నాయి. కానీ కౌరవులకు కూడా దేవాలున్నాయన్న విషయం తెలుసా..!. మొత్తం నూరుగురి కౌరవులకు దేవాలయాలు ఉన్నాయట. ఈ మూర్తులకు పెట్టే ప్రసాదంలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటంటే..
కేరళలోని కొల్లాంలో కౌరవుల యువరాజు దుర్యోధునుడి ఆలయం ఉందంట. ఏటా లక్షలాదిమంది ఈ ఆలయాన్ని దర్శించి పూజలు చేస్తుంటారట. అక్కడ ప్రజలు దుర్యోధనుడుని శక్తిమంతమైన దేవత అని, తమ కోరికలను తప్పక నెరవేరుస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. ఇక్కడ కేవలం దుర్యోధనుడి ఆలయమే కాదు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందమంది కౌరవులకు, కర్ణుడుకి ఆలయాలు ఉన్నాయట. కేరళలోని కురవ వంశ ప్రజలు కౌరవులను తమ పూర్వీకులుగా భావించి పూజిస్తారట. ఈ కౌరవుల ఆలయాలన్ని కొండల మీదే ఉండటం విశేషం.
శుక్రవారమే విడిచిపెట్టడంతో..
శుక్రవారంలో మరీ ప్రత్యేక పూజలు చేస్తుంటారట. ఎందుకంటే వనవాసం చేసిన పాండవులును వెంబడిస్తూ అలసిపోయి దాహంతో ఉన్న దుర్యోధనుడు తన వందమంది సోదరులతో కలిసి మలనాడ ప్రాంతానికి చేరుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు ఒక వృద్ధ మహిళ దుర్యోధనుడికి కల్లు (పామ్ వైన్) ఇచ్చి అతడి దాహాన్ని తీర్చిందట. పైగా అక్కడి గ్రామస్తుల ఆతిథ్యానికి ముగ్ధుడయ్యాడు" పైగా దురోధనుడు శుక్రవారమే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టాడట. అక్కడి ప్రజలకు మళ్లీ శుక్రవారం ఇక్కడకు వస్తానని హామీ కూడా ఇచ్చాడట. ఒకవేళ రాని పక్షంలో గ్రామస్థులు తాను చనిపోయాడని భావించి అంత్యక్రియలు చేయాలి అని దుర్యోధనుడు చెప్పాడని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
అయితే దుర్యోధనుడు తిరిగిరాలేదు. కానీ గ్రామస్థులు అతని ఆత్మ అక్కడికి తిరిగి వచ్చి పరబ్రహ్మను ఆరాధించిందని నమ్ముతారట. అందుకే అక్కడి ప్రజలు ఆయన పేరు మీద ఆలయాన్నికట్టి మరీ పూజలు నిర్వహిస్తున్నారు. అంతేగాదు ఈ ఆలయం పేరు మీదుగా చాలా భూములు కూడా ఉన్నాయట. ఒక్క దుర్యోధనునికే కాదు శకుని, దుస్సల, కర్ణునికి కూడా దేవాలయాలు ఉన్నాయట. పవిత్రేశ్వరంలో మలనాడ మహాదేవ శకుని ఆలయం ఉంది. ఈ ఆలయం దుర్యోధన ఆలయానికి 14 కి.మీ దూరం. ఈ పవిత్రేశ్వరంలోననే శకుని, ఇతర కౌరవులు కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన తమ ఆయుధాగారాన్ని సిద్ధం చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు.
వారు తమ బాణాల కొనను పదును పెట్టడానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన రాయి ఇప్పటికీ ఈ ఆలయం సమీపంలో ఉందంట. అంతేగాదు శకుని మోక్షం కోసం శివుడిని ప్రార్థించిన ప్రదేశంలో ఇప్పటికీ..ఒక నల్లని ఉందని చెబుతారు. మోసపూరిత శకుని ఇక్కడ శుద్ధి పొంది మోక్షాన్ని పొందాడు కాబట్టి ఇది పవిత్రమైన ప్రదేశం అని అక్కడి ప్రజల నమ్మకం. ఇక కున్నతుర్‌లోని శకుని ఆలయం నుంచి 30 నిమిషాల ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన కర్ణ దేవాలయం ఉంది.
కర్ణుడు కౌరవుల కోసం పోరాడాడు, దుర్యోధనుని అత్యంత మిత్రుడుగా పేరుగాంచినవాడు.పైగా పాండవులలో పెద్దవాడు. అలాగే
శూరనాద్‌లో, 100 మంది కౌరవ సోదరుల ఏకైక సోదరి అయిన దుస్సలకి కూడా ఆలయం ఉంది. కురుక్షేత్ర యుద్ధం తరువాత, దుస్సల ఇక్కడ ఒక వరి పొలానికి చేరుకుందనిని స్థానికులు నమ్ముతారు. నీటి అవసరం ఉండడంతో తాగునీరు దొరక్క కర్రతో పొలంలో తవ్వి ఆ కర్రను అక్కడే పూడ్చిపెట్టిందని కథలు కథలుగా చెబుతున్నారు. ఈ పొలం నుంచి వచ్చిన వరి ఇప్పటికీ ఈ ఆలయంలో పూజల కోసం ఉపయోగించడం విశేషం. ఇక ఈ దక్షిణ కేరళ అంతటా శకుని, కర్ణుడు కాకుండా 101 మంది కౌరవులకు ఆలయాలు ఉన్నాయట. వాటిలో కొన్నింటి జాడ తెలియాల్సి ఉందని వివరించారు స్థానికులు.
ప్రసాదం కూడా ప్రత్యేకమే..
దేవాలయాల ప్రత్యేకత మాత్రమే కాదు, పూజా విధానం, నైవేద్యాలు కూడా ప్రత్యేకమైనవి. కేరళలోని కురవలు దుర్యోధనుడు లేదా శకుని వంటి దేవతలను అప్పోప్పన్ (పూర్వీకుడు) గా భావించి పూజిస్తారు.
ఇక్కడి ప్రజలు తమ రక్షణ కోసం, మంచి పంటలు కోసం ఈ దేవతలను ప్రార్థిస్తారు.
ఇక్కడ ప్రధాన నైవేద్యం కల్లు, పొగాకు ఆకులతో పాటు కోడి, మేక, ఎద్దు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు.
2019లో ఇక్కడ ప్రసాదంగా పెట్టిన 101 ఓల్డ్ మాంక్ రమ్ సీసాలు హైలెట్‌గా నిలిచాయి.
అంతేగాదు భక్తులకు కూడా ఆ కల్లునే తీర్థంగా పంపిణీ చేయడం మరింత విశేషం.
ఈ దేవాలయాలు భారతదేశ విశ్వాసాల వైవిధ్యానికి మరియు భారతీయ సంస్కృతిలో కథల శక్తికి కూడా నిదర్శనం. ఇది ఒక వేద వ్యాసుని మహాభారతమే అయినా.. ఇక్కడ వంద మంది కౌరవులకు మాదిరిగా వారికి సంబంధించిన ఆలయాలు గురించి వంద కథనాలు ఉన్నాయి.
(చదవండి: వాల్‌నట్స్ తింటున్నారా..?ఐతే అలాంటివాళ్లు మాత్రం..!)
Comments
Please login to add a commentAdd a comment