ప్రపంచంలోనే తొలిసారిగా జరుగుతున్న మిస్ ఏఐ అందాల పోటీలో తొలి కిరీటాన్ని మొరాకోకు చెందిన కెంజా లైలీ అనే ఇన్‌ఫ్లుయెన్సర్ గెలుచుకుంది. ఆమె కృత్రిమ మేథస్సు పరంగా అగ్ర స్థానంలో నిలిచింది. ఆమె ఈ ఏఐ అందాల పోటీల్లో సుమారు 1500 ఏఐ మోడళ్లను వెనక్కినెట్టి మరీ ఈ కిరీటాన్ని కైవసం చేసుకుంది. అందుకుగానూ ఆమెను సృష్టించిన మెరియం బెస్సా రూ. 16 లక్షల ప్రైజ్‌మనీ గెలుపొందింది. లైలీకి ఇన్‌స్టాగ్రాంలో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
ఆమె ఆహరం, సంస్కృతి, ఫ్యాషన్, అందరం, ట్రావెల్స్ వంటి వాటి గురించి కంటెట్ ఇస్తుంది. ఈ వర్చువల్ పాత్రలో కెంజా లేలీ మొరాకో గొప్ప వారసత్వాన్ని చాటుకుంది. ఆమె సంస్కృతి, సాంకేతికల ప్రత్యేక కలియికను కలిగి ఉంది. ఏడు వేర్వేరు భాషల్లో ఫాలోవలర్లతో 24/7 టచ్‌లో ఉంటంది. ఈ మేరకు వర్చవల్ ఏఐ మోడల్ మాట్లాడతూ..తన ఆశయం మొరాకో సంస్కృతిని గర్వంగా ప్రదర్శంచడమేనని అంటోంది. అలాగే తన ఫాలోవర్లకు బహుళ రంగాల్లో అదనపు సమాచారం అందించడం అని చెప్పింది. అంతేగాదు పర్యావరణాన్ని రక్షించడానికి సానుకూలమైన రోబోట్ సంస్కృతి గురించి అవగాహన పెంచుకుంటానని అన్నారు. ఏఐ అనేది మానవ సామర్థ్యాలను భర్తీ చేసేందుకు రూపొందించిన సాధనమే గానీ అన్నింటిని ఇది భర్తీ చేయలేదు.
మానవులు, ఏఐ సాంకేతకత మధ్య అంగీకారం, సహకారాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపింది. మన సమాజంలో ఏఐ సంబంధించిన మరింత సమాచారం పొందగలమనే ఆశావాహ దృక్పథాన్ని పెంపొందించుకోవచ్చు అని చెప్పడమేనని అంటోంది. తాను మొరాకో కోసం ఈ అవార్డును గెలుచుకున్నందుకు ఎంతగానో గర్వపడుతున్నాను అని లైలీ చెప్పుకొచ్చింది. అలాగే సదరు ఏఐ మోడల్ లైలీని సృష్టించిన బెస్సా మాట్లాడుతూ..మొరాకోకు ప్రాతినిధ్యం వహించడం అనేది గొప్ప అవకాశం.
సాంకేతిక రంగంలో మొరాకో, అరబ్, ఆఫ్రికన్ ముస్లిం మహిళలను హైలైట్ చేయడంలో తాను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ కెంజా లైలీ మహిళా సాధికారత , సోదరిత్వం తదితరాలు తనకు నచ్చిన విషయాలని చెప్పారు. ఈ పోటీల్లో ఫ్రాన్స్‌కు చెందిన లాలినా వాలినా రెండోస్థానంలో నిలవగా, రోబోటిక్ ప్రపంచాలను సామరస్యంగా తీసుకురావాలనుకునే పోర్చుగీస్ ట్రావెలర్ ఒలివియా సీ మూడో స్థానంలో నిలిచింది. ఇది ఏఐ క్రియేటర్ల విజయాలను జరుపుకోవడానికి భవిష్యత్తులో ఏఐ క్రియేటర్ల స్టార్డ్స్ పెరిగేలా చేసే ఒక అద్భుతమైన వేదిక.
(చదవండి: Anant Ambani Haldi Ceremony: 150 ఏళ్ల నాటి హైదరాబాదీ వస్రధారణలో నీతా..!)
Comments
Please login to add a commentAdd a comment