షుగర్ లేదా మధుమేహం(Diabetes) ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న అతి ముఖ్యమైన సమస్యల్లో ఒకటి. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు కారణంగా రోజు రోజుకు మధుమేహం బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అలాగే లక్షలాదిమంది ప్రీడయాబెటిస్‌తో జీవిస్తున్నారు. అయితే రోజూ వ్యాయామంతోపాటు కొన్ని ఆహార జాగ్రత్తలు, మరికొన్ని చిట్కాల వల్ల షుగర్ లెవెల్స్ ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. మన వంట ఇంట్లో సులువుగా లభించే ఆవాలతో ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
ఆవాలు చూడ్డానికి చిన్నవిగా ఉన్నా, ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే మాత్రం చాలా శక్తివంతమైనవి. మన ఆహారంలో ఆవాలకు చాలా ప్రాధాన్యత ఉంది. రోజూ పోపు దినుసుగా వాడటంతోపాటు, మన ఆహారంలో భాగమైన ఆవకాయ లాంటి పచ్చళ్ళలో ఆవ పిండిని బాగా వాడతాము. కొన్ని ప్రాంతాలో ఆవకూర, ఆవనూనెను కూడా బాగా బాడతారు.
ఆవాలు ఆరోగ్య ప్రయోజనాలు
పుష్కలంగాపోషకాలు: ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి వివిధ పోషకాలకు ఆవాలు మంచి మూలం.
ఆవపిండిలో గ్లూకోసినోలేట్స్, మైరోసినేస్ వంటి సమ్మేళనాలు శరీరంలో కేన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. ఆవపిండిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన ఐసోథియోసైనేట్స్ అనే సమ్మేళనాలుంటాయి. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఆవాలు లేదా ఆవాల నూనెతో శరీరంలో మంట తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. జీర్ణశక్తికి కూడా చాలా మంచిది.
ఎముకలకు కూడా చాలా మేలు చేస్తుంది. ఆవలోని సెలీనియం ఎముకలకు బలాన్నిస్తుంది.
జుట్టు, దంతాలను బలోపేతం చేయడానికి కూడా ఆవాలు సహాయపడతాయి.
ఆవాలులో కార్బోహైడ్రేట్లు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయ పడుతుంది. అలాగే ఆవాలు తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది.
గతంలో జరిగిన అధ్యయనం ప్రకారం ఆవాల వినియోగం ద్వారా రక్తంలో గ్లూకోజ్ ,వారి కొలెస్ట్రాల్ స్థాయిలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ముగ్గురికి గ్లూకోజ్ స్థాయిలు 46శాతం తగ్గాయి. కొలెస్ట్రాల్ స్థాయి సగటున 10శాతం తగ్గింది. చిగుళ్ళు, ఎముకలు, దంతాల నొప్పిని తగ్గించడంలో తోడ్పడతాయి ఈ గింజలు. చర్మానికి కాంతినిస్తాయి. పైల్స్ నొప్పి నివారణలో కూడా ఆవనూనె బాగా ఉపయోగపడుతుంది.
ఆహారంలో ఎలా చేర్చుకోవాలి
ఆవ కూరను తినవచ్చు. ఆవపొడిరూపంలో గానీ, గింజలుగా గానీ రోజూ కూరల్లో వాడు కోవచ్చు. ఆవనూనె కూరగాయలను వేయించడానికి, మాంసం లేదా చేపల వంటకాల్లో లేదా సలాడ్‌లపై చల్లుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment