ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే ట్యాగ్ లైన్లు, టీవీలోనూ, సినిమాల్లోనూ తప్పనిసరిగా కింద్ర స్రోల్ అవ్వుతుంటాయి. చూస్తారే తప్ప మారరు. పొగతాగటాన్ని అదో స్టయిల్‌గా, ప్రెస్టేజ్ ఇష్యూగా భావిస్తారు చాలామంది. చివరికి అనారోగ్యం బారిన పడి తనపై ఆధారపడిన కుటుంబాన్ని నట్టేట వదిలేస్తారు. ఈ వ్యసనం కారణంగా ఎన్నో కుటుంబాలో రోడ్డున పడ్డాయి. అందువల్లే దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది మార్చి రెండో బుధవారం 'నో స్మోకింగ్ డే'ని జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆ వ్యసనం నుంచి ఎలా బయటపడాలి? అందుకు ఎలాంటి ఆహార పదార్థాలు ఉపకరిస్తాయో తెలుసుకుందామా!.
ప్రతి ఏడాది మార్చి రెండో బుధవారం రోజున ఈ 'నో స్మోకింగ్ డే' పేరుతో మిలియన్ల మంది ప్రజల్లోకి పొగ సేవించకూడదనే నినాదాన్ని బలంగా తీసుకువెళ్లిన చైతన్యవంతులను చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు ధూమాపానం మానేయడమే ఒక ప్రధాన ఆరోగ్య విషయమని నొక్కి చెబుతున్నారు. ఈవ్యసనాన్ని సమతుల్య ఆహారంతోనే చెక్‌పెట్టగలమని, అదే శక్తిమంతమైన ఆయుధం అని తెలియజేస్తున్నారు. పోగ సేవించడం మానేయడంతోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందగలరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణుల.
స్మోకింగ్ మానేసే ప్రతీక్షణం మీ శరీరం మెరుగుపడుతుందని అర్థం అంటున్నారు. ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం..ప్రపంచవ్యాపంగా ధూమపానం చేసేవారిలో దాదాపు 12% మంది భారతీయులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ నివేదిక భవిష్యతులలో ధూమపాన రహిత భారత్‌గా మారుతుందనే కొత్త ఆశను రేకెత్తించింది. ఇక ఈ ధూమపాన వ్యసనం నుంచి బయటపడేందుకు ఈ ఆహారపదార్థాలు కీలక పాత్ర వహిస్తాయనిన నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
యాంటీఆక్సిడెంట్ పవర్‌హౌస్: బెర్రీలు, ఆకు కూరలు, సిట్రస్ పండ్లు, క్యారెట్‌లు వంటి కూరగాయలు ధూమపానం వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కొనడానికి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. పైగా సెల్ రిపేర్‌ను ప్రోత్సహిస్తాయి.
ఇన్‌ఫ్లమేషన్ ఫైటర్స్: ఫ్లాక్స్ సీడ్స్(అవిసె గింజలు), ఫ్యాటీ ఫిష్ (సాల్మన్, మాకేరెల్), వాల్‌నట్‌లలో లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, ధూమపానంతో సంబంధం ఉన్న వాపును తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం: బాదం, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు తీసుకుంటే పొగతాగటం వల్ల పాడైన చర్మం ఆరోగ్యవంతంగా అవుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ 'ఈ' సమృద్ధిగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
స్థిరమైన శక్తి మూలం: నిరంతర శక్తి కోసం క్వినోవా, బ్రౌన్ రైస్ ,ఓట్స్ వంటి తృణధాన్యాలను తీసుకోండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. పైగా పొగతాగటం మానేయాలనే ఫీల్‌ని తీసుకువస్తుంది.
కండరాల నిర్వహణకు: టోఫు, పౌల్ట్రీ, చేపలు, చిక్కుళ్ళు వంటి ప్రోటీన్ మూలాలు కండరాల మరమ్మత్తు, నిర్వహణకు మద్దతు ఇస్తుంది. పొగతాగటం వదిలేసిన తర్వాత శరీరంలో సంభవించే మార్పులను సరిచేస్తుంది.
హైడ్రేషన్ కీలకం: హైడ్రేటెడ్గా ఉండటానికి నీరు, సహజ టీలు పుష్కలంగా తాగుతూ ఉండాలి. ఇలా చేస్తే పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపించే ధూమపానం జోలికి వెళ్లాలన్న ఆలోచనను నియంత్రిస్తుంది.
(చదవండి: దాల్చిన చెక్కతో సమస్యకు చెక్‌పెట్టండిలా!)
Comments
Please login to add a commentAdd a comment