No Smoking
-
నో స్మోకింగ్ డే! ఆ వ్యసనానికి చెక్‌పెట్టే ఆహారపదార్థాలివే!
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే ట్యాగ్ లైన్లు, టీవీలోనూ, సినిమాల్లోనూ తప్పనిసరిగా కింద్ర స్రోల్ అవ్వుతుంటాయి. చూస్తారే తప్ప మారరు. పొగతాగటాన్ని అదో స్టయిల్‌గా, ప్రెస్టేజ్ ఇష్యూగా భావిస్తారు చాలామంది. చివరికి అనారోగ్యం బారిన పడి తనపై ఆధారపడిన కుటుంబాన్ని నట్టేట వదిలేస్తారు. ఈ వ్యసనం కారణంగా ఎన్నో కుటుంబాలో రోడ్డున పడ్డాయి. అందువల్లే దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది మార్చి రెండో బుధవారం 'నో స్మోకింగ్ డే'ని జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆ వ్యసనం నుంచి ఎలా బయటపడాలి? అందుకు ఎలాంటి ఆహార పదార్థాలు ఉపకరిస్తాయో తెలుసుకుందామా!. ప్రతి ఏడాది మార్చి రెండో బుధవారం రోజున ఈ 'నో స్మోకింగ్ డే' పేరుతో మిలియన్ల మంది ప్రజల్లోకి పొగ సేవించకూడదనే నినాదాన్ని బలంగా తీసుకువెళ్లిన చైతన్యవంతులను చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు ధూమాపానం మానేయడమే ఒక ప్రధాన ఆరోగ్య విషయమని నొక్కి చెబుతున్నారు. ఈవ్యసనాన్ని సమతుల్య ఆహారంతోనే చెక్పెట్టగలమని, అదే శక్తిమంతమైన ఆయుధం అని తెలియజేస్తున్నారు. పోగ సేవించడం మానేయడంతోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందగలరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణుల. స్మోకింగ్ మానేసే ప్రతీక్షణం మీ శరీరం మెరుగుపడుతుందని అర్థం అంటున్నారు. ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం..ప్రపంచవ్యాపంగా ధూమపానం చేసేవారిలో దాదాపు 12% మంది భారతీయులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ నివేదిక భవిష్యతులలో ధూమపాన రహిత భారత్‌గా మారుతుందనే కొత్త ఆశను రేకెత్తించింది. ఇక ఈ ధూమపాన వ్యసనం నుంచి బయటపడేందుకు ఈ ఆహారపదార్థాలు కీలక పాత్ర వహిస్తాయనిన నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. యాంటీఆక్సిడెంట్ పవర్‌హౌస్: బెర్రీలు, ఆకు కూరలు, సిట్రస్ పండ్లు, క్యారెట్లు వంటి కూరగాయలు ధూమపానం వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కొనడానికి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. పైగా సెల్ రిపేర్‌ను ప్రోత్సహిస్తాయి. ఇన్ఫ్లమేషన్ ఫైటర్స్: ఫ్లాక్స్ సీడ్స్(అవిసె గింజలు), ఫ్యాటీ ఫిష్ (సాల్మన్, మాకేరెల్), వాల్నట్లలో లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ధూమపానంతో సంబంధం ఉన్న వాపును తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం: బాదం, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు తీసుకుంటే పొగతాగటం వల్ల పాడైన చర్మం ఆరోగ్యవంతంగా అవుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ 'ఈ' సమృద్ధిగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. స్థిరమైన శక్తి మూలం: నిరంతర శక్తి కోసం క్వినోవా, బ్రౌన్ రైస్ ,ఓట్స్ వంటి తృణధాన్యాలను తీసుకోండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. పైగా పొగతాగటం మానేయాలనే ఫీల్‌ని తీసుకువస్తుంది. కండరాల నిర్వహణకు: టోఫు, పౌల్ట్రీ, చేపలు, చిక్కుళ్ళు వంటి ప్రోటీన్ మూలాలు కండరాల మరమ్మత్తు, నిర్వహణకు మద్దతు ఇస్తుంది. పొగతాగటం వదిలేసిన తర్వాత శరీరంలో సంభవించే మార్పులను సరిచేస్తుంది. హైడ్రేషన్ కీలకం: హైడ్రేటెడ్‌గా ఉండటానికి నీరు, సహజ టీలు పుష్కలంగా తాగుతూ ఉండాలి. ఇలా చేస్తే పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపించే ధూమపానం జోలికి వెళ్లాలన్న ఆలోచనను నియంత్రిస్తుంది. (చదవండి: దాల్చిన చెక్కతో సమస్యకు చెక్‌పెట్టండిలా!) -
World No Tobacco Day 2021: ధూమపానం.. పోవును ప్రాణం
సంవత్సర కాలం పైగా మృత్యు ఘంటికలు మోగిస్తూ అందరినీ కలిచి వేస్తూ, ప్రపంచాన్ని కలవరపెడుతోంది కరోనా. కరోనాకు బలై ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిలో ముఖ్యంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆక్సిజన్ అందక మరణించేవారే ఎక్కువ. ఊపిరితిత్తుల ఊపిరి తీస్తున్న అనేక కారకాలలో పొగాకు ముఖ్యమైనది. పొగాకు హుక్కా, చుట్ట,బీడీ, సిగరెట్, ఖైనీ తదితర రూపాలలో మార్కెట్లో అందరికీ చేరువలో లభ్యమయ్యే గొప్ప మత్తు పదార్థం. పొగ తాగడం వల్ల నోటి దుర్వాసన, గొంతు వ్యాధులు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, కఫం, దగ్గు, దమ్ము, ఆయాసం, గుండె కవాటాలు మూసుకుపోయి గుండెపోటు, రక్తపోటు, క్యాన్సర్ లాంటివెన్నో రోగాలు వస్తాయి. సరదాగా ఒకసారి మొదలైన ధూమపానం వ్యసనంగా మారి ఎందరో బలి అవుతూనే ఉన్నారు. ప్రాణాంతకమైన పొగాకును నియంత్రించాలని 1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సమావేశంలో 1988, ఏప్రిల్ 7ను ధూమపాన రహిత దినోత్సవంగా పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగదారులను ఏప్రిల్ 7వ తేదీన 24 గంటలపాటు పొగాకు ఉత్పత్తులను వాడకుండా ఉండమని కోరింది. దానిని అనుసరించి విజృంభిస్తున్న పొగాకు మహమ్మారి నుండి ప్రజలను చైతన్య పరచడంకోసం 1988లో జరిగిన సమావేశంలో ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది. పొగాకు వాడకంలో భారతదేశం రెండో స్థానంలో ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సంగతి మరిచి సిగరెట్ ఈజ్ మై సీక్రెట్ అంటూ బాధలో, సంతోషంలో, విందులో, వినోదాల్లో, టీ తాగాక ఒకటి, భోంచేశాక ఒకటి ,ఏం తోచట్లేదని ఒకటి అంటూ టైంపాస్‌కి గుటగుట నాలుగు గుటకలు మింగి ఊపిరితిత్తుల్లో పొగను నింపి ఆరోగ్యం క్షీణించాక ఆసుపత్రుల చుట్టూ తిరుగు తున్నారు. మత్తును,ఉద్రేకాన్ని కలిగించే స్వభావం కల నికోటిన్, ఏడువేల రకాల విషతుల్యమైన క్యాన్సర్ కారకాలు గల పొగాకును ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే అధికం. కాబట్టి ఇప్పటికైనా యువత పొగాకు సేవనం వల్ల కలిగే నష్టాలపై జాగరూకులై, దీని బారిన పడకుండా సరైన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. - కమలేకర్ నాగేశ్వర్ రావు అచ్చంపేట, 98484 93223 పొగాకుపై సమగ్ర వ్యూహమేది? మారుతున్న కాలానుగుణంగా నేటి యువతకు ధూమపానం అలవాటుగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలు, అనారోగ్య కారకాల్లో ధూమపానం మూడు నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ధూమపానం చేస్తున్న వారిలో 22.6 కోట్ల మంది పేదవారేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ సర్వేలో తెలిపింది. భారత్‌లో 5,500 మంది ఏటా ఈ వ్యసనానికి దాసోహం అవుతున్నట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. ఈ ఏడాది ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం‘ను ’పొగాకు త్యజించు – జీవితాన్ని జయించు’ అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నాం. ప్రభుత్వం 2003లో పొగాకు ఉత్పత్తుల నిషేధంపై చట్టం చేయగా, బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడాన్ని 2008లో నిషేధించింది. ఐనప్పటికీ పొగాకు వినియోగం, ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే రెండవ స్థానం ఆక్రమించింది. పొగాకు వ్యసనం ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటోంది. 15 నుండి 24 ఏళ్ల మధ్య వారిలో మొత్తం 81 లక్షల మంది పొగరాయుళ్ళు తగ్గారని సర్కారీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా 30 కోట్ల మంది బాధితులుగా మారుతున్నారు. ఏటా 13.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం పొగాకుతో మధుమేహం, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులతో పాటు అనేక రకాల కేన్సర్లు వస్తాయని వివిధ అధ్యయనాల ద్వారా తేలింది. ధూమపానాన్ని వదిలేసినా దాని దుష్ప్రభావం మూడు దశాబ్దాల పాటు ఉంటుందన్న శాస్త్రవేత్తల హెచ్చరికలు.. మూడు శాతం మంది పొగరాయుళ్ళు మాత్రమే ఆ అలవాటును మానుకోగలరన్న పార్లమెంటరీ స్థాయీసంఘం అధ్యయనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కిరాణా షాపులలో, విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. వాటి ప్రకటనలు, బహిరంగ ధూమపాన నిషేధం వంటివి పటిష్టంగా అమలు చేయాలి. ప్రభుత్వం, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ధూమపానం అరికట్ట కలిగితే ఆరోగ్య భారతాన్ని నిర్మించగలుగుతాం. పొగాకును పూర్తిగా నిషేధించేలా పటిష్ట వ్యూహం పట్టాలకెక్కితేనే ప్రజారోగ్యానికి భరోసా! - గుమ్మడి లక్ష్మీనారాయణ కొత్తగూడెం, మహబూబాబాద్, మొబైల్: 94913 18409 -
పొగరాయుళ్లకు సెగ
సాక్షి, సిటీబ్యూరో: ‘స్మోక్ ఫ్రీ హైదరాబాద్’ సాకారమే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన నగర పోలీసులు పొగరాయుళ్లపై కొరడా ఝుళిపిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగే వారిని గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ స్పెషల్ డ్రైవ్‌ను నగర కొత్వాల్ అంజనీకుమార్ సోమవారం అధికారికంగా ప్రారంభించిన విషయం విదితమే. సోమ–మంగళవారాల్లో క్షేత్రస్థాయి అధికారులు మొత్తం 60 మంది బహిరంగ పొగరాయుళ్లను గుర్తించి రూ.200 చొప్పున జరిమానా విధించారు. అత్యధికంగా పశ్చిమ మండల పరిధిలోని పంజగుట్ట, ఎస్సార్‌నగర్‌ల్లో ఆపై గాంధీనగర్, అబిడ్స్, మార్కెట్ ఠాణాల పరిధిలో కేసులు నమోదయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగకుండా నియంత్రించడం ద్వారా గాంధీ జయంతి (అక్టోబర్–2) నాటికి ‘స్మోక్ ఫ్రీ హైదరాబాద్’ లక్ష్యాన్ని సాధించాలని నగర పోలీసులు లక్ష్యంగా నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 30 నుంచి నగరం వేదికగా జరిగే ‘50వ ప్రపంచ ఊపిరితిత్తుల ఆరోగ్య సదస్సు’ నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ‘ప్రపంచ నో టుబాకో’ డే కావడంతో ఆ రోజు నుంచి ఈ స్పెషల్‌డ్రైవ్ మరింత వేగం పుంజుకోనుంది. అనునిత్యం రహదారులపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులు, గస్తీ తదితర విధుల్లో ఉండే శాంతిభద్రతల విభాగం అధికారులు సైతం బహిరంగ ప్రదేశాల్లోని పొగరాయుళ్లపై కేసులు నమోదు చేస్తున్నారు. తమ వద్ద ఉండే ట్యాబ్స్‌ను వినియోగించి వారికి జరిమానా విధిస్తున్నారు. దీంతో పాటు సిగరెట్–పొగాకు ఉత్పత్తుల నియంత్రణకు సంబంధించిన ‘కోట్పా’ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా పొగతాగే వారితో పాటు నిబంధనలకు విరుద్ధంగా అమ్మే వారు, ప్రచారం చేసే వారి పై కూడా చర్యలు తీసుకోనున్నారు. -
ఊదితే ఊర్కోరు!
సాక్షి, సిటీబ్యూరో: ఒకరు వాహనంపై దూసుకుపోతూ సిగరెట్ కాలిస్తే... మరొకరు రోడ్డు పక్కనే ధూమపానం చేస్తారు... కేఫ్‌లో తాపీగా కూర్చొని పొగ తాగుతారు ఇంకొకరు... ఇకపై ఇలా చేస్తూ పోలీసుల కంటపడితే జరిమానా తప్పదు. ‘స్మోక్ ఫ్రీ హైదరాబాద్’ దిశగా అడుగులు వేస్తున్న నగర పోలీసులు సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. ఈ దిశగా మరిన్ని చర్యలు తీసుకునేందుకు శాంతి భద్రతలు, ట్రాఫిక్ విభాగాల్లోని కానిస్టేబుల్ నుంచి ఎస్సై స్థాయి అధికారుల వరకు అవగాహన కల్పిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని నగర కొత్వాల్ అంజనీకుమార్ సోమవారం బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ప్రారంభించారు. ఇప్పుడు విరివిగా వినియోగిస్తున్న సిగరెట్, బీడీ, చుట్ట, ఖైనీ తదితరాల్లోని పొగాకు అంటే ఒకప్పుడు భారతీయులకు తెలియదు. అయితే 400 ఏళ్ల క్రితం మొఘలుల పరిపాలనలో దీన్ని పోర్చుగల్ నుంచి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలో పొగాకు వినియోగం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ది రెండో స్థానం. గ్రామీణ ప్రాంతాల్లో 38శాతం, పట్టణాల్లో 25శాతం దీనికి బానిసయ్యారు. ఈ ప్రభావంతో ఏటా 8–9లక్షల మంది మరణిస్తున్నారు. 30శాతం కేన్సర్ కేసులు, 40శాతం టీబీ కేసులకు ఇదే కారణమవుతుండగా... నోటి కేన్సర్ బారినపడిన వాళ్లల్లో 80శాతం మంది పొగాకు వాడుతున్న వాళ్లేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న చండీగఢ్ నగరం 2007లో, సిక్కిం రాష్ట్రం 2010లో స్మోక్ ఫ్రీగా మారాయి. హైదరాబాద్‌ను కూడా స్మోక్ ఫ్రీగా మార్చాలని నిర్ణయించుకున్న నగర పోలీసులు స్వచ్ఛంద సంస్థ ‘ది యూనియన్’తో కలిసి ముందుకెళ్తున్నారు. లక్ష్యం.. అక్టోబర్ 2 ‘స్మోక్ ఫ్రీ హైదరాబాద్’ లక్ష్యాన్ని గాం«ధీ జయంతి (అక్టోబర్ 2) నాటికి సాధించాలని నగర పోలీసులు నిర్ణయించారు. ఆ నెల 30 నుంచి నగరంలో ‘50వ ప్రపంచ ఊపిరితిత్తుల ఆరోగ్య సదస్సు’ జరగనుంది. అది ప్రారంభమయ్యే లోపే లక్ష్యాన్ని చేరుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా మొదలైన స్పెషల్ డ్రైవ్స్ ఈ నెల 31న జరగనున్న ‘ప్రపంచ నో టొబాకో డే’తో వేగం పుంజుకోనున్నాయి. ఈ క్రతువులో శాంతిభద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు పాలుపంచుకుంటారు. అనునిత్యం రహదారులపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులు, గస్తీ తదితర విధుల్లో ఉండే శాంతి భద్రతల విభాగం అధికారులు సైతం బహిరంగ ప్రదేశాల్లోని పొగరాయుళ్లపై కొరడాఝుళిపిస్తారు. తమ వద్ద ఉండే ట్యాబ్స్‌ను వినియోగించి వారికి జరిమానా విధిస్తారు. దీంతో పాటు సిగిరెట్–పొగాకు ఉత్పత్తుల నియంత్రణకు సంబంధించిన ‘కోట్పా’ చట్టాన్ని పక్కాగా అమలు చేయనున్నారు. దీనిపైనే సిబ్బందికి రెండు రోజుల పాటు శిక్షణనిస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పొగతాగే వారితో పాటు నిబంధనలకు విరుద్ధంగా అమ్మేవాళ్లు, ప్రచారం చేసే వారిపైనా చర్యలు తీసుకోనున్నారు. జరిమానాలు ఇలా... ♦ బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగితే రూ.200. ♦ హోటల్, కేఫ్ లాంటి ప్రదేశాల్లో ధూమపానం చేస్తే అక్కడ ఎంతమంది పొగరాయుళ్లు చిక్కుతారో అంత మొత్తం జరిమానా సంబంధిత యజమాని/నిర్వాహకుడికి విధిస్తారు. ♦ పొగాకు ఉత్పత్తులపై ప్రచారం చేస్తే తొలిసారి రూ.1,000 జరిమానా లేదా రెండేళ్ల జైలు. రెండోసారైతే రూ.5,000 జరిమానా లేదా ఐదేళ్ల జైలు. ♦ మైనర్లకు లేదా విద్యాసంస్థల వద్ద పొగాకు ఉత్పత్తులు అమ్మితే రూ.200. ♦ సర్టిఫైడ్ హెల్త్ వార్నింగ్ లేని ఉత్పత్తులు తయారు చేస్తే తొలిసారి రూ.5,000 జరిమానా లేదా ఏడాది జైలు. రెండోసారి రూ.10,000 జరిమానా లేదా ఐదేళ్ల జైలు. ♦ ఇలాంటి ఉత్పత్తులు విక్రయిస్తే తొలిసారి రూ.1,000 జరిమానా లేదా ఏడాది జైలు. రెండోసారి రూ.3,000 జరిమానా లేదా రెండేళ్ల జైలు. ముందు మనం మారాలి.. స్పెషల్ డ్రైవ్స్ చేపట్టడంతో పాటు పోలీస్ విభాగాన్ని స్మోక్ ఫ్రీగా మార్చాలని నిర్ణయించాం. ఏళ్లుగా నేను, నా కుటుంబీకులు ఈ దురలవాట్లకు దూరంగా ఉన్నామని గర్వంగా చెబుతున్నాను. ప్రతి ఒక్క పోలీస్ అధికారి ఇలానే మారాలి. సమాజ, నగర అభివృద్ధి సూచికల్లో ఆరోగ్యం కూడా ఒకటి. ఒకప్పుడు పంజాబ్‌లో అత్యధికంగా ఉన్న డ్రగ్ కల్చర్‌ను సామాన్యుల్లో అవగాహన పెంచడం ద్వారానే తగ్గించగలుగుతున్నారు. నగర పోలీస్ విభాగంలో ఉన్న ప్రతి అధికారి ప్రాథమికంగా తన చుట్టూ ఉన్న 100 మీటర్లతో ప్రారంభించి 500 మీటర్ల వరకు స్మోక్ ఫ్రీగా మార్చాలి. ప్రతి అంశంలోనూ పోలీసుల పాత్ర ఉన్నట్లే వారు ఆదర్శంగానూ మారాలి. – అంజనీకుమార్, కొత్వాల్ అదో సోషల్ స్టేటస్.. సిగరెట్ కాల్చడమనేది ఒకప్పుడు దుర్వ్యసనంగా ఉండేది. ఇప్పుడది ఓ సోషల్ స్టేటస్‌గా మారింది. ఈ కారణంగానే పాఠశాల, కళాశాల విద్యార్థులూ దీనికి అలవాటు పడుతున్నారు. ముందు సదరాగా మొదలెట్టి ఆపై బానిసలుగా మారుతున్నారు. సెలబ్రిటీలు ఎవరైనా సిగరెట్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తే వారిని అరెస్టు చేసే ఆస్కారం ఉంది. నగరంలో ఎవరైన అలా పట్టుబడాలన్నది నా కోరిక. – ఎం.శివప్రసాద్, అనదపు సీపీ -
బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో ధూమపాన నిషేధం
కర్ణాటక, బనశంకరి : ఉద్యాననగరిలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లు, హోటల్స్, పబ్స్, క్లబ్‌లు సార్వజనిక ప్రాంతాలను ధూమపాన రహిత ప్రదేశాలుగా ప్రకటించింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు కూడా రద్దు చేస్తామని బీబీఎంపీ హెచ్చరించింది. హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు చట్టపరంగా నో స్మోకింగ్జోన్ను ఏర్పాటు చేయడానికి పొగాకు నియంత్రణ శాఖ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలి. నో స్మోకింగ్జోన్లో అల్పాహారం, భోజనం, మద్యం, సిగరెట్, నీరు, కాఫీ, టీ తదితర వాటిని సరఫరా చేయరాదు. కోప్టా చట్టం అనుగుణంగా 30కి పైగా ఆసనాలు ఉన్న బార్ అండ్ రెస్టారెంట్, హోటల్స్, పబ్స్, క్లబుల్లో నో స్మోకింగ్జోన్ ఏర్పాటు చేయాలని బీబీఎంపీ ఆదేశాలు జారీ చేసింది. మైనర్లు, స్మోకింగ్ చేసేవారిని నో స్మోకింగ్ జోన్లోకి అనుమతించరాదు. ఈ నిబంధనలు ఉల్లంఘించే హోటల్స్, పబ్ అండ్ బార్ రెస్టారెంట్లు, క్లబ్స్ లైసెన్సు రద్దు చేస్తామని సూచించింది, నగరంలోని చాలా బార్ అండ్ రెస్టారెంట్, క్లబుల్లో ధూమపానం చేయడం సాధారణం. టీ దుకాణాల ముందు పొగరాయుళ్లు సిగరెట్ తాగుతుండటంతో ఇతరులకు ఇబ్బంది కలుగుతున్నప్పటికీ షరా మామూలుగా కొనసాగుతోంది. ఇకపై కేటాయించిన స్మోకింగ్ జోన్లలో మాత్రమే సిగరెట్లు తాగాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు చేస్తామని బీబీఎంపీ హెచ్చరించింది. -
స్మోక్ చేయకున్నా మహిళలకే అధిక ముప్పు!
వాషింగ్టన్: సాధారణంగా పొగతాగేవారు(స్మోకర్స్) ఊపిరితిత్తుల కేన్సర్ భారిన పడతారని వింటూనే ఉంటాం. తాజాగా స్మోకింగ్ సంబంధిత అంశాలపై జరిపిన ఓ సర్వేలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ పై యూనివర్సిటీ ఆఫ్ టొరంటో చేపట్టిన సర్వేలో మహిళలకే అధికంగా ముప్పు పొంచి ఉంటుందని వెల్లడైంది. స్మోకింగ్ చేయని 50-60 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషుల 129535 శాంపిల్స్ పై రీసెర్చ్ చేశారు. ఇందులో 8674 ఆఫ్రికన్ మహిళలు, 2708 ఆఫ్రికన్ పురుషుల శాంపిల్స్, 80 వేల మంది అమెరికా మహిళలు, 37 వేల మంది పరుషుల శాంపిల్స్ పై టొరంటో వర్సిటీకి చెందిన రేచల్ చిషోల్మ్ అనే వ్యక్తి పరిశోధన చేశాడు. స్మోకింగ్ చేయని ఆఫ్రికన్, అమెరికన్ మహిళల్లో 5.2 శాతం మందికి క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీస్(సీఓపీడీ) వస్తుండగా, స్మోక్ చేయని మగవారిలో మాత్రం 2.9 శాతం మందికి ఈ వ్యాధి వస్తుందని రీసెర్చ్ లో తేలింది. ఇంకా చెప్పాలంటే స్మోకింగ్ చేయని పురుషులు తమ పక్కన ఉన్న స్మోకర్స్ వల్ల సెకండ్ హ్యాండ్ స్మోకర్లుగా ఉన్నా.. వారిలో మాత్రం ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం మహిళల కంటే చాలా తక్కువగా ఉందని రీసెర్చర్ చిషోల్మర్ వివరించారు. -
పొగమానేయండి నాయనా
-
దర్శకత్వానికే ప్రాధాన్యత
స్వయంగా దర్శకత్వం వహించాలనుకునే సినిమాలను మాత్రమే నిర్మించాలనుకుంటానని, ఇతరులు తీసే వాటికి నిర్మాతగా వ్యవహరించడం ఇష్టముండబోదని విశాల్ భరద్వాజ్ అంటున్నాడు. ఇక నుంచి సినిమాలు తీయడం మానేసి, ఆ శక్తిని దర్శకత్వ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగించుకుంటానని చెప్పాడు. అభిషేక్ చౌబే తనకు సోదరుడు వంటివాడు కాబట్టే దేడ్ ఇష్కియా దర్శకత్వ బాధ్యతను అతడికి అప్పగించానని చెప్పాడు. విశాల్ 2002లో తొలిసారిగా తీసిన బాలల సినిమా మక్డీకి విమర్శల ప్రశంసలు దక్కాయి. తరువాత మక్బూల్, ఓంకార వంటి చిత్రాలు రూపొందించాడు. నో స్మోకింగ్, ఇష్కియా, ఏక్ థి దయాన్ సినిమాలను నిర్మించాడు కానీ వాటికి దర్శకత్వం మాత్రం వహించలేదు. ‘నా సోదరి వంటిదైన మేఘనా గుల్జార్ తీసే సినిమాను కూడా నేనే నిర్మిస్తున్నాను. నా మనసుకు అత్యంత ఇష్టమైన కథ అది’ అని వివరించాడు. భావోద్వేగాలు, నాటకీయత ఎక్కువగా ఉండే సినిమాలను రూపొందిస్తూ సంజయ్ లీలాభన్సాలీ విజయాలు సాధించడంపై స్పందిస్తూ అలాంటి కథలపై అతనికి నమ్మకం ఉంటుంది కాబట్టే వాటిని ఎంచుకుంటాడని చెప్పాడు. ‘నాకు నమ్మకం లేని కథలకు దర్శకత్వం వహించడం గానీ నిర్మించడం గానీ నాకు ఇష్టముండదు. సంజయ్‌కు రౌడీ రాథోడ్ కథ బాగా నచ్చింది కాబట్టే దానిని నిర్మించి దర్శకత్వం వహించాడు’ అని విశాల్ వివరించాడు. దర్శకుడిగా మారడానికి ముందు ఇతడు చాలా సినిమాలకు సంగీతం అందించాడు. మాచిస్, సత్య, చాచీ 420, గాడ్‌మదర్, మక్బూల్, ఓంకార, కమీనే, ఇష్కియా, 7 ఖూన్మాఫ్ వంటి సినిమాలకు విశాల్ సంగీత దర్శకుడిగా పనిచేశాడు. సంజయ్ కూడా తన సినిమాకు సంగీతం అందించాలని ఓసారి కోరినా అప్పట్లో తీరిక లేకపోవడంతో ఒప్పుకోలేకపోయానని విశాల్ భరద్వాజ్ వివరించాడు.