
ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేస్తాడు అనే కక్కర్తి రాయుళ్ల గురించి చెప్పుకునే మాట. అలాగే టాయిలెట్ అయితే ఏంటి? బంగారం చేసిందేగా అనుకున్నట్టున్నారు మన చోరాగ్రేసర్లు. అదను చూసి మాయం చేశారు. బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన విలువైన గోల్డెన్ టాయ్‌లెట్‌ను చాకచక్యంగా ఎత్తుకు పోయారు. ప్రస్తుతం ఈస్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంగ్లండ్‌లోని బ్లెన్‌హైమ్ ప్యాలెస్‌లో కోట్ల రూపాయల విలువైన గోల్డెన్ టాయ్‌లెట్‌ను దొంగలు దోచుకెళ్లారు. ప్యాలెస్‌లో ప్రదర్శనకు ఉంచిన 18 క్యారెట్ల గోల్డెన్ టాయిలెట్‌ను మాయం చేశారు. దీనికి బరువు సుమారు 98 కేజీలు ఉంటుంది. అంటే దీని ధర సుమారు 60 కోట్లకుపై మాటే. ఎగ్జిబిషన్ చూసేందుకు వెళ్లిన ముఠా దీన్ని ఎత్తుకెళ్లింది. భారీ సుత్తెలతో ఆ టాయిలెట్‌ను పగులగొట్టి మరి అక్కడి నుంచి ఉడాయించారు. వాడిన సుత్తెలను అక్కడే విడిచివెళ్లారు. 2019 సెప్టెంబర్‌లో ఈ చోరీ జరిగింది. ఈ కేసు ఆక్స్‌ఫర్డ్ క్రౌన్ కోర్టులో సోమవారం విచారణకు రావడంతో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (హల్దీ ఫంక్షన్‌లో హనుమాన్ హల్‌చల్.. వైరల్ వీడియో)
ఐదుగురు వ్యక్తులతో కూడిన దొంగల ముఠా రెండు వాహనాల్లో వచ్చారు. ప్యాలెస్‌లోని కిటికీ గుండా లోపలికి చొరబడి సుత్తుల సాయంతో టాయ్‌లెట్‌ను పెకిలించారు. అనంతరం అక్కడి నుంచి 5 నిమిషాల్లో ఉడియించారు. అయితే ఈ కేసులో ముగ్గురు నిందితులపై విచారణ జరుగుతోంది. ఈ ముగ్గురిలో ఒకడు దాన్నిఎత్తుకురాగా, మిగిలిన ఇద్దరు దీన్ని విక్రయించడానికి సహాయం చేసినట్టు ఆరోపణలున్నాయి.

నిందితులు దానిని అమ్మడానికి చిన్నచిన్న ముక్కలుగా చేసి విక్రయించి ఉంటారని ప్రాసిక్యూటర్ జులియన్ క్రిస్టోఫర్ కోర్టుకు తెలిపారు. మైఖేల్ జోన్స్ (39), ఫ్రెడ్ డో (36), బోరా గుక్కుక్ (40).. అనే ముగ్గురు వ్యక్తులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే తాము నిర్దోషులమని ఈ ముగ్గురు చెప్పగా.. నాల్గవ వ్యక్తి జేమ్స్ షీన్ (39) గతంలో దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించాడు. దీనిపై గత నాలుగు వారాలుగా విచారణ జరుగుతోంది.
చదవండి: Mahashivratri 2025: శివరాత్రికి ఉపవాసం, ఇంట్రస్టింగ్ టిప్స్
Comments
Please login to add a commentAdd a comment