సంప్రదాయ టెర్రకోట కళనుప్రోత్సహించి కళాకారులను ఆదుకునేందుకు ఉత్తర్‌ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సిద్దమయ్యింది. గోరఖ్ పూర్ ప్రాంతానికి చెందిన ఈ అరుదైన కళను కాపాడటమే కాదు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో నాలుగు ప్రత్యేక స్టాల్స్‌లో కళాకారుల ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. సెప్టెంబర్ 25–29 వరకు జరగనున్న ఈ కార్యక్రమం ద్వారా టెర్రకోట కళను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది యూపీ సర్కార్.
టెర్రకోట కళను ప్రోత్సహించే దిశగా 2018లోనే సీఎం యోగి ఆదిత్యనాథ్ చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయమే టెర్రకోట పరిశ్రమను పూర్తిగా మార్చేసిందని జాతీయ అవార్డు గ్రహీత, టెర్రకోట కళాకారుడు రాజన్ ప్రజాపతి అన్నారు. 2017కి ముందు కష్టాల్లో ఉన్న ఈ కళ ఇప్పుడు కొత్త ఎత్తుకు చేరుకుందని, ఈ ఒక్క ఏడాదే వివిధ రాష్ట్రాల నుండి రూ.7 కోట్లకు పైగా ఆర్డర్లు వచ్చాయని తెలియజేశారు.
ప్రపంచ మార్కెట్‌లోకి...
త్వరలో జరగనున్న వాణిజ్య ప్రదర్శనలో విభిన్న రకాల టెర్రకోట ఉత్పత్తులను ప్రదర్శిస్తారు, ఇది ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి కళాకారులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. సిఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కళను బ్రతికించేందుకు, కళాకారులను ఆదుకునేందుకు నిరంతర బ్రాండింగ్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రభుత్వ ప్రయత్నాలూ కళకు చేదోడు
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ గోరఖ్‌పూర్ పర్యటన సందర్భంగా సిఎం యోగి టెర్రకోట గణేష్ విగ్రహాన్ని బహుమతిగా అందజేశారు. 2022లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు టెర్రకోట విగ్రహాలను అందజేసారు. ఇలా ఈ కళకు ప్రచారం కల్పంచేందకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నది అక్కడి ప్రభుత్వం. ప్రభుత్వ ప్రయత్నాలు కళను ప్రోత్సహించమే కాకుండా దాని నాణ్యత, ఆకర్షణను కూడా నిర్ధారించాయి. దీని ఫలితంగా ప్రముఖులు, వారి సిబ్బంది గణనీయమైన కొనుగోళ్లు చేశారు. ప్రపంచ మార్కెట్ ఇప్పుడు అందుబాటులోకి రావడంతో గోరఖ్‌పూర్ టెర్రకోట క్రాఫ్ట్ అపూర్వమైన ప్రఖ్యాతిని సొంతం చేసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment