ఆమె కతర్ దేశంలో చెఫ్‌గా చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడిపేది. తాను సంపాదించిన డబ్బుతో తమ్ముడికి పెళ్లి చేసింది. సాఫిగా సాగుతున్న వారి జీవితంలో అనుకోని సంఘటన ఎదురైంది. విశాఖలో ఉంటున్న ఆమె తల్లి అనారోగ్యానికి గురైంది. దీంతో పదేళ్ల క్రితం కిందట కతర్ నుంచి విశాఖ వచ్చేసింది సరస్వతి.
అప్పటి నుంచి అమ్మను బతికించుకోవడం కోసం కష్టపడుతోంది. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో ఇంటి బాధ్యత సరస్వతి స్వీకరించింది. పదేళ్లుగా తన జీవితంలో అనేక కష్టాలను చూసింది. తెలుగు, హిందీ, ఇంగ్లిషు, కతర్, తమిళం, మలయాళం భాషలు వచ్చినా తల్లి కోసం ఫుట్‌పాత్‌పై సొంతగా చిన్న వ్యాపారాలు చేస్తూ చేసిన అప్పులు తీరుస్తోంది.
ఉదయం 6 గంటల నుంచి ఆమె తన వ్యాపారాన్ని ప్రారంభిస్తుంది. ఉదయం పువ్వులు, బొకేలు అమ్ముతుంది. మధ్యాహ్నం నుంచి బీచ్‌రోడ్డులో చిన్న షాపుల్లో కతర్‌లో నేర్చుకున్న ఫాస్ట్‌ఫుడ్‌ను విక్రయిస్తోంది. ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ గౌరవంగా జీవిస్తోంది. -బీచ్‌రోడు (విశాఖ తూర్పు)
చదవండి: Balloon Seller Kisbu: సిగ్నల్స్ దగ్గర బెలూన్లు అమ్ముకునే కిస్బూ జీవితం, ఒక్కరాత్రిలో ఎలా మారిందంటే.
Comments
Please login to add a commentAdd a comment