ఉగాది పచ్చడితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా! | What Are The Health Benefits Of Ugadi Pachadi | Sakshi
Sakshi News home page

Ugadi Pachadi: ఉగాది పచ్చడితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!

Published Tue, Apr 9 2024 12:31 PM | Last Updated on Tue, Apr 9 2024 4:29 PM

What Are The Health Benefits Of Ugadi Pachadi - Sakshi

ఉగాది పండుగ అనగానే నోటిలో నీళ్లూరిపోతాయి. షడ్రసోపేతమైన ఈ పంచడిని ఇంటిల్లపాది ఆనందంగా ఆస్వాదిస్తారు. కొన్ని సంస్థలు, కార్యాలయాలు దీనిని తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తారు. ఉగాది పచ్చడిలో పులుపు, తీపి, కారం, ఉప్పు, వగరు,చేదు అనే ఆరు రుచులు కలుస్తాయి. ఆరు రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి తాగడం తినేందుకు రుచిగానే  కాదు, సేవించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా  ఉన్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దాం..

శీతాకాలం నుంచి వేసవి కాలం ప్రారంభంలో ఉగాది పండుగ వస్తుంది. ఈ సమయంలో అనేక ఆరోగ్య ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. వీటి నుంచి కాపాడుకునేందుక పూర్వ కాలంలో ఉగాది పచ్చడిని తయారు చేశారని కొందరు చెబుతుంటారు. ఇందులో ఉన్న ఆరు పదార్థాలు ఒక్కో ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. ఉగాది పచ్చడిలో బెల్లం, వేప పువ్వు వేస్తుంటారు. ఈ రెండు మిశ్రమాల వల్ల శరీరంలో ఉండే టాక్సిన్‌లు బయటికి వెళ్లిపోతాయి. వేప పువ్వులు ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి హానికరమైన టాక్సిన్స్ లను తొలగిస్తాయి.

ఈ వేప పువ్వు, బెల్లం కలిపిన మిశ్రమం తీసుకోవడం వల్ల బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంది. కొవ్వును సులభంగా కరిగిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వారు ఉగాది పచ్చడి మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చక్కెర నిల్వలను సమతుల్యం చేస్తాయి. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

ఉగాది సమయంలో వేసవి కాలం ప్రారంభమవుతుంది. దీంతో డీ హైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి బెల్లం నీరు తీసుకోవడం ఎంతో మంచింది. అందువల్ల ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల వడదెబ్బ సమస్య నుంచి తట్టుకోవచ్చు. ఉగాది పచ్చడిలో కొత్త మామిడి ముక్కలు వేస్తారు. వడదెబ్బను నివారించడంలో సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇవే కాకుండా అజీర్ణం, డీ హైడ్రేషన్‌ వంటి పలు అనారోగ్య సమస్యల బారినపడకుండా ఉగాది పచ్చడి కాపాడుతుంది.

(చదవండి: చైత్ర మాసం విశిష్టత? వసంత నవరాత్రులు ఎందుకు చేస్తారు?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement