ugadi pachadi
-
ఉగాది పచ్చడితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!
ఉగాది పండుగ అనగానే నోటిలో నీళ్లూరిపోతాయి. షడ్రసోపేతమైన ఈ పంచడిని ఇంటిల్లపాది ఆనందంగా ఆస్వాదిస్తారు. కొన్ని సంస్థలు, కార్యాలయాలు దీనిని తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తారు. ఉగాది పచ్చడిలో పులుపు, తీపి, కారం, ఉప్పు, వగరు,చేదు అనే ఆరు రుచులు కలుస్తాయి. ఆరు రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి తాగడం తినేందుకు రుచిగానే కాదు, సేవించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దాం.. శీతాకాలం నుంచి వేసవి కాలం ప్రారంభంలో ఉగాది పండుగ వస్తుంది. ఈ సమయంలో అనేక ఆరోగ్య ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. వీటి నుంచి కాపాడుకునేందుక పూర్వ కాలంలో ఉగాది పచ్చడిని తయారు చేశారని కొందరు చెబుతుంటారు. ఇందులో ఉన్న ఆరు పదార్థాలు ఒక్కో ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. ఉగాది పచ్చడిలో బెల్లం, వేప పువ్వు వేస్తుంటారు. ఈ రెండు మిశ్రమాల వల్ల శరీరంలో ఉండే టాక్సిన్లు బయటికి వెళ్లిపోతాయి. వేప పువ్వులు ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి హానికరమైన టాక్సిన్స్ లను తొలగిస్తాయి. ఈ వేప పువ్వు, బెల్లం కలిపిన మిశ్రమం తీసుకోవడం వల్ల బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంది. కొవ్వును సులభంగా కరిగిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వారు ఉగాది పచ్చడి మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చక్కెర నిల్వలను సమతుల్యం చేస్తాయి. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఉగాది సమయంలో వేసవి కాలం ప్రారంభమవుతుంది. దీంతో డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి బెల్లం నీరు తీసుకోవడం ఎంతో మంచింది. అందువల్ల ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల వడదెబ్బ సమస్య నుంచి తట్టుకోవచ్చు. ఉగాది పచ్చడిలో కొత్త మామిడి ముక్కలు వేస్తారు. వడదెబ్బను నివారించడంలో సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇవే కాకుండా అజీర్ణం, డీ హైడ్రేషన్ వంటి పలు అనారోగ్య సమస్యల బారినపడకుండా ఉగాది పచ్చడి కాపాడుతుంది. (చదవండి: చైత్ర మాసం విశిష్టత? వసంత నవరాత్రులు ఎందుకు చేస్తారు?) -
Ugadi 2024: ఉగాది పచ్చడి ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
#Ugadi 2024 తెలుగువారి తొలి పండుగ ఉగాది అంటేనే ఆనందం. ఉత్సాహం. కొత్తకు నాంది అనే సంబరం. ముఖ్యంగా ఉగాది అనగానే తీపి, చేదు, లాంటి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి అందరికీ గుర్తొస్తుంది. ప్రతి పదార్ధం జీవితంలోని విభిన్న అనుభవాలకు గుర్తుగా అమృతం లాంటి జీవితాన్ని ఆస్వాదించే కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఉగాది పచ్చడికి అంత ప్రాధాన్యత. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్తగా ఆరంభించ డానికి ఇది శుభతరుణమని భావిస్తారు. ఉగాదికి పులిహోర, బొబ్బట్లు, పూర్ణం బూరెలతోపాటు ఉగాది పచ్చడి చేయడం అనవాయితీ. అయితే ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పచ్చడి ఇలా.. పచ్చి మామిడికాయ – ఒకటి (మీడియం సైజు) వేప పువ్వు – టేబుల్ స్పూన్ (తొడిమలు ఒలిచినది) కొత్త చింతపండు – నిమ్మకాయంత (రసం చిక్కగా తీసుకోవాలి) బెల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు ఉప్పు – పావు టీ స్పూన్ మిరియాలు లేదా మిరియాల పొడి అర టీ స్పూన్ లేదా రెండు చిన్న పచ్చిమిర్చి తయారీ: పచ్చి మామిడి కాయను శుభ్రంగా కడిగి చెక్కు తీయకుండా సన్నగా ముక్కలు తరగాలి. ఇందులో వేప పువ్వు, చింతపండు రసం, బెల్లం తురుము, ఉప్పు, పచ్చిమిర్చి వేసి కలపాలి. షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ. రుచి కోసం టేబుల్ స్పూన్ కొబ్బరి కోరు, ఒక అరటి పండు గుజ్జు కూడా కలుపుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ ఉగాది పచ్చడి.స్పూన్‌తో అరచేతిలో వేసుకుని తినేటట్లు చిక్కగా ఉంటుంది. తెలంగాణలో తెలంగాణలో ఇదే మోతాదులో తీసుకున్న దినుసులను ఒక పెద్ద పాత్రలో వేసి ముప్పావు వంతు నీటిని పోసి కలపాలి. గ్లాసులో పోసి తాగేటట్లు జారుడుగా ఉంటుంది. పిల్లలు మెచ్చేలా..! ఉగాది పచ్చడి ప్రాశస్త్యాన్ని పిల్లలకు చెబుతూనే , వారికి నచ్చే విధంగా ఉగాది పచ్చడిని ఫ్రూట్ సలాడ్‌లా కూడా చేసుకోవచ్చు. ఉగాది పచ్చడిలో వేసే ఆరు రకాల పదార్థాలతో సంప్రదాయ బద్ధంగా ఉగాది పచ్చడిని చేసుకొని, అందులోనే అరటిపండు, యాపిల్, ద్రాక్ష చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కలుపుకోవచ్చు. దీనికి కొద్దిగా తేనెను కూడా యాడ్ చేసుకుంటే మరీ జారుగా కాకుండా, చక్కగా స్పూన్‌తో తినేలా ఫ్రూట్ సలాడ్‌లా భలేగా ఉంటుంది. పిల్లలు కూడా ఇంట్రస్టింగ్‌గా తింటారు. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది మన అందరి జీవితాల్లో శాంతిని, సుఖ సంతోషాలను కలగ చేయాలని, అందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుందాం.! -
Ugadi 2024 : ఈ ఏడాది ఉగాది పేరేంటి? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ఉగాది అనేది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం తొలి రోజు జరుపుకునే తొలి పండుగ. తెలుగువారికి తెలుగు కొత్త సంవత్సరం ఆరంభం. హిందూ క్యాలెండర్ నెల చైత్ర మొదటి రోజు సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. 2024లో ఉగాది ఏప్రిల్ 9వ తేదీన (మంగళవారం) వస్తుంది. "యుగాది" అనే పదం రెండు పదాల కలయిక - "యుగం" (వయస్సు) , "ఆది" (ప్రారంభం) ఒక శుభ సందర్భం అని అర్థం. పంచాంగం ప్రకారం ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఏప్రిల్ 9 నుంచి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఏప్రిల్ 9 న క్రోధి అర్థం కోపం కలిగించేదని. మహారాష్ట్రలో ఉగాది పండుగను గుడి పడ్వాగా జరుపుకుంటారు. బెంగాల్, కేరళ, అసోం, పంజాబ్ రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లోను ఈ పండుగ జరుపు కుంటారు. బెంగాలీలు “పోయిలా భైశాఖ్”, సిక్కులు “వైశాఖీ”, మలయాళీలు “విషు” అనే పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా పలు దేవాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతేకాదు, వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకొంటారు. ఇతర విశేషాలు ఈ రోజు కొత్తగా పనులు మొదలు పెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కృతయుగంలో కార్తీకశుద్ధ అష్టమి రోజున ఉగాది జరుపుకునేవారు. త్రేతా యుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజున ఉగాది జరుపుకునేవారు. ద్వాపరయుగంలో మాఘశుద్ధ అమావాస్య రోజున ఉగాది జరుపుకునే వారు. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులయినది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే. వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే. వారం రోజుల ముందు నుంచే సందడి ఉగాదికి వారం రోజుల ముందునుంచే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, అలంకరించుకునే పనులతో సందడి మొదలవుతంది. రంగురంగుల రంగువల్లులతో ఇంటి ముంగిళ్లు ముస్తాబవుతాయి. మామిడి ఆకుల తోరణాలతో గుమ్మాలను అలంకరించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, దానధర్మాలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. వంటలు, ఉగాది పచ్చడి, నైవేద్యాలు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టాలి. తలకు నువ్వుల నూనె పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేసి, కొత్త బట్టలు లేదా శుభ్రమైన దుస్తులు ధరిస్తారు. పాలు పొంగించి, పిండి వంటలు సిద్ధం చేసి. ఇష్టదైవాన్ని పూజిస్తారు. పులిహోర, పాయసం, బొబ్బట్లు ఇలా ఎవరికికి నచ్చినట్టు వారు తయారు చేసుకున్న వంటకాలను నైవేద్యంగా అందిస్తారు. ఏడాదంతా మంచి జరగాలని తొలి పండుగగా తెలుగువారు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఏడాది మొత్తం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని గుర్తు చేసే పండగ ఉగాది. కుటుంబమంతా ఆనందంగా గడుపుతారు. కొత్తమామిడి కాయలు, వేపపువ్వు, బెల్లం, పులుపు,కారం, ఇలా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడితో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజు ఏదైనా మంచి కార్యం తలపెడితే శుభం జరుగుతుందని నమ్ముతారు. బంగారం, కొత్త వస్తువులు,కొత్త వాహనాలు, కొత్త ఇళ్లు లాంటివి కొనుగోలు చేస్తారు.కొత్త వ్యాపారానికి కూడా శుభతరుణంగా భావిస్తారు. పంచాంగ శ్రవణం ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతారు. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. ఉగాది రోజున కవి సమ్మేళనాలు, కవి సన్మానాలు అంటూ కవులు, రచయితలు సందడి సందడిగా ఉంటారు. -
Ugadi 2024 అచ్చంగా ఆరు : జీవితానికి ఎన్నో లాభాలు
త్వరలో ఉగాది వస్తోంది. ఆరు రుచులున్న ఉగాది పచ్చడిని ఈ రోజు తప్పనిసరిగా సేవించడం ఈ పండగ ఆచారం. ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి సేవిస్తే ఆయా రుచుల్లాగే సంవత్సరమంతా మనకు ఆయా ఫలాలు అందుతాయని, అలా రకరకాల అనుభవాలూ, అనుభూతులను ఆస్వాదించడమే జీవితమని పెద్దలు చెబుతారు. అయితే అలా కేవలం ఉగాది నాడు మాత్రమే కాదు, వీలయితే ప్రతిరోజూ ఆరు రుచుల ఆహారాలను తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఏయే రుచులు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. 1. తీపి శరీరంలోని వాత, పిత్త దోషాలను ఈ రుచి సమం చేస్తుంది. తీపి పదార్థాలను తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, శరీరం దృఢంగా మారుతుంది. శక్తి అందుతుంది. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. అయితే వీటిని చాలా తక్కువగా తినాలి. లేదంటే శరీరంలో కఫ దోషం పెరుగుతుంది. ఫలితంగా అధిక బరువు, స్థూలకాయం, డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయి. కనుక ఈ రుచి ఉన్న ఆహారాలను నిత్యం తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగాఉండవచ్చు . 2. పులుపు వాత దోషాలను పులుపు తగ్గిస్తుంది. పులుపు రుచి ఉన్న ఆహారాలను తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. నిమ్మ, చింతకాయ వంటి పులుపు ఉన్న ఆహారాలను నిత్యం పరిమితంగా తీసుకోవచ్చు. అయితే ఎక్కువగా తీసుకుంటే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. కనక పులుపు ఆహారాలను కూడా తక్కువగా తీసుకోవాలి. 3. ఉప్పు ఉప్పు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల వాత దోషం తగ్గుతుంది. ఉప్పు అధికమైతే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. ఉప్పు ఉన్న ఆహారాల వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. కణాలు శుభ్రమవుతాయి. ఉప్పు ఉన్న పదార్థాలను కూడా తక్కువగా తీసుకోవాలి. ఎక్కువైతే బీపీ పెరుగుతుంది. గుండె జబ్బులు వస్తాయి. 4. కారం కారపు రుచి గల ఆహారాలను తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఆకలి వేస్తుంది. కణాలు శుభ్రమవుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. కఫ దోషం తగ్గుతుంది. కారం ఎక్కువైతే పిత్తదోషం పెరుగుతుంది. అందువల్ల కారాన్ని నిత్యం తక్కువగానే తీసుకోవాలి. 5. చేదు చేదుగా ఉన్న పదార్థాలను తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. పిత్త, కఫ దోషాలు తగ్గుతాయి. చేదుగా ఉన్న పదార్థాలను నిత్యం కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకున్నా పెద్దగా సమస్యలు ఉత్పన్నం కావు. 6. వగరు వగరు ఉన్న పదార్థాలను కూడా నిత్యం తినాలి. కానీ వీటిని తక్కువగా తీసుకోవాలి. లేదంటే జీర్ణాశయంలో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇక పిత్త దోషం ఉన్న వారికి ఈ రుచి ఉన్న పదార్థాలు ఎంతగానో మేలు చేస్తాయి. పచ్చి అరటి పండ్లు, క్రాన్ బెర్రీలు, గ్రీన్ బీన్స్ వంటివి ఈ రుచి ఉన్న పదార్థాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అయితే భోజనం చేసేటప్పుడు ఒకేసారి ఆరు రుచులు కలిసిన పదార్థాలను తినాల్సిన పనిలేదు. రోజులో మొత్తంగా చూసుకుంటే ఈ ఆరు రుచులు ఉన్న పదార్థాలను తిన్నామా లేదో అని చెక్ చేసుకుంటే చాలు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో ఈ ఆరు రుచుల నుంచి ఏవైనా రెండు రుచులు కలిగిన ఆహారాలను ఎంచుకుని తింటే చాలు. అంటే ఉదయం చేదు, కారం, మధ్యాహ్నం తీపి, వగరు, రాత్రి పులుపు, ఉప్పు.. ఇలా రెండేసి రుచులు ఉండేలా ఆహారాలను తీసుకుంటే చాలు. ఇవే తినాలని ఏమీ లేదు. ఎవరికి నచ్చినట్లు వారు ఆహారాలను ఎంచుకుని ఆరు రుచులు కవర్ అయ్యేలా చూసుకుంటే చాలు. -
Ugadi Festival 2024: పండుగ వస్తోంది.. ఈ స్పెషల్ ఫుడ్స్‌తో గడపండిలా..
ఉగాది వస్తోంది.. క్రోధి నామంతో కొత్త ఏడాదిని తెస్తోంది. కొత్తబెల్లంతో ఉగాది పచ్చడి ఎలాగూ కలుపుకుంటాం. పండుగ రోజు పచ్చడి తర్వాత ఇంకా ఏమేమి తిందాం. కొబ్బరి పాల గారెలు.. మజ్జిగ వడలు చేసుకుందాం. మరికొంత సులువుగా ఓట్స్ స్మూతీ కూడా చేసుకుందాం. ఓట్స్ స్వీట్ స్మూతీ.. కావలసినవి: ప్లెయిన్ సఫోలా ఓట్స్ – అరకప్పు; అరటిపండు – 1; బాదం పాలు – అరకప్పు; నీరు›– అర కప్పు; చక్కెర – పావు కప్పు. తయారీ.. ఓట్స్‌ని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో బాదం పాలు, నీరు, అరటి పండు గుజ్జు, చక్కెర, ఓట్స్ పొడి వేసి బీటర్‌తో కలిపితే స్మూతీ రెడీ. గ్లాసులో పోసుకుని తాగడానికి వీల్లేనంత చిక్కగా ఉంటే మరికొంత నీటిని చేర్చుకోవచ్చు. స్మూతీని చల్లగా తాగాలనుకుంటే అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి లేదా స్మూతీ కోసం వాడే నీటిని ముందుగా ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరుచుకోవాలి. బాదం పాలు రెడీమేడ్‌వి తీసుకోవచ్చు లేదా బాదం పప్పులు– నీటిని కలిపి మిక్సీ వేసి పాలను తయారు చేసుకోవాలి. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పాల గారెలు.. కావలసినవి: మినప్పప్పు – పావు కేజీ; నూనె – వడలు వేయించడానికి తగినంత; కొబ్బరిపాలు – లీటరు; యాలకుల పొడి– అర టీ స్పూన్; ఉప్పు– చిటికెడు; బాదం పప్పు – 10 (నానబెట్టి పొట్టు తీసి తరగాలి); జీడిపప్పు – 20; కిస్మిస్– టేబుల్ స్పూన్; పిస్తా– టేబుల్ స్పూన్; నెయ్యి– టేబుల్ స్పూన్; బెల్లం లేదా చక్కెర – అర కేజీ. తయారీ.. మినప్పప్పును శుభ్రంగా కడిగి నాలుగు గంటల సేపు మంచినీటిలో నానబెట్టిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పప్పును ఒక గిన్నెలోకి తీసుకుని బీటర్ లేదా స్పూన్‌తో రెండు నిమిషాల పాటు చిలకాలి. స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న పాత్రను పెట్టి కొబ్బరి పాలు పోసి మరిగించాలి. వేడెక్కుతున్నప్పుడు అందులో చక్కెర వేసి కలుపుతూ మరిగించాలి. చిక్కబడేటప్పుడు యాలకుల పొడి వేసి మరో నిమిషం పాటు మరిగించి దించేయాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న బాణలి పెట్టి నెయ్యి వేడి చేసి అందులో బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ వేయించి కొబ్బరి పాలు బెల్లం మిశ్రమంలో కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి అందులో మినపపిండిని పాలిథిన్ పేపర్ మీద వేసి వత్తి (నిమ్మకాయంత గోళీలుగా కూడా వేసుకోవచ్చు) నూనెలో వేయాలి. రెండువైపులా కాలనిచ్చి తీసి టిష్యూపేపర్ మీద వేయాలి. అదనంగా ఉన్న నూనెను పేపర్ పీల్చుకున్న వెంటనే (వేడిగా ఉండగానే) వడలను ఒక వెడల్పు పాత్రలో పరిచినట్లు అమర్చి కొబ్బరిపాల మిశ్రమాన్ని పోయాలి. వడలు ఐదు నిమిషాల్లో కొబ్బరి పాలను పీల్చుకుంటాయి. వడలు పీల్చుకున్న తర్వాత కూడా పాలు ఇంకా మిగులుగా ఉండాలి. సర్వ్ చేసేటప్పుడు కప్పులో ఒక వడ ఒక గరిటె కొబ్బరి పాలు వేసి ఇవ్వాలి. ఉగాది పచ్చడి.. కావలసినవి: మామిడి పిందె – ఒకటి; వేప పువ్వు – టేబుల్ స్పూన్; బెల్లం పొడి– టేబుల్ స్పూన్; చింతకాయ – ఒకటి (లేకపోతే కొత్త చింతపండు చిన్న గోళీ అంత); ఉప్పు – చిటికెడు; పచ్చిమిర్చి – ఒకటి (తరగాలి). తయారీ.. వేప పువ్వును తొడిమలు, ఈనెలూ తీసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. చింతపండును నీటిలో నానబెట్టి రసం తీసుకోవాలి. మామిడికాయను శుభ్రంగా కడిగి తొక్క తీయకుండా సన్నగా తరగాలి. ఒక పాత్రలో బెల్లం పొడి, చింతపండు రసం, మామిడికాయ ముక్కలు, వేపపువ్వు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కలిపితే ఉగాది పచ్చడి రెడీ. గమనిక: ఇష్టమైతే చెరుకు ముక్కలు, రుచి కోసం అరటిపండు గుజ్జు కలుపుకోవచ్చు. మజ్జిగ వడ.. కావలసినవి: అటుకులు – కప్పు; రవ్వ – పావు కప్పు; మజ్జిగ– అర కప్పు; పచ్చిమిర్చి – 2 (తరగాలి); అల్లం తరుగు – టేబుల్ స్పూన్; నువ్వులు – టీ స్పూన్; కరివేపాకు – రెండు రెమ్మలు (తరగాలి); కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; బియ్యప్పిండి లేదా ఓట్స్ – టేబుల్ స్పూన్; ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము – టేబుల్ స్పూన్; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; పచ్చి శనగపప్పు– టేబుల్ స్పూన్; నూనె– వేయించడానికి తగినంత. తయారీ.. అటుకులను వెడల్పు పాత్రలో వేసి నీటిని పోసి కడిగి వేరొక పాత్రలోకి తీసుకోవాలి. అటుకులను నీటి నుంచి వేరు చేయడానికి నీటిని వంపకూడదు. నీటిలో తేలుతున్న అటుకులను చేత్తో తీసి మరొక పాత్రలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అటుకుల్లో ఇసుక ఉంటే నీటి అడుగుకు వెళ్లిపోతుంది. అటుకులు శుభ్రంగా ఉంటాయి. పచ్చి శనగపప్పు కడిగి అటుకుల్లో వేయాలి. అందులో రవ్వ, ఉప్పు, మజ్జిగ వేసి కలిపి ఇరవై నిమిషాల సేపు నాననివ్వాలి. ఇప్పుడు నానిన అటుకుల్లో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి తురుము, నువ్వులు, బియ్యప్పిండి వేసి కలిపి పది నిమిషాల సేపు ఉంచాలి. ఇప్పుడు మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని వడకు సరిపోయేటట్లు ఉందా లేదా అని సరి చూసుకోవాలి. మరీ జారుడుగా ఉంటే మరికొంత బియ్యప్పిండి కలుపుకుని పిండి అంతటినీ పెద్ద నిమ్మకాయంత గోళీలు చేసి పక్కన పెట్టాలి. బాణలిలో నూనె వేడి చేసి అటుకుల గోళీని వత్తి మధ్యలో చిల్లు పెట్టి నూనెలో వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చి తీయాలి. ఇలాగే పిండినంతటినీ చేసుకోవాలి. వేడి వేడి వడల్లోకి పుదీనా చట్నీ రుచిగా ఉంటుంది. ఇవి చదవండి: వేసవి తాపాన్ని తగ్గించడంలో మేటి ఈ పప్పు! ఎన్ని ప్రయోజనాలంటే.. -
ఉగాది పచ్చడి సేవించిన సీఎం జగన్ దంపతులు
-
ఉగాది పచ్చడి తింటాం.. చేయడం రాదు: శివాని, శివాత్మిక
హైదరాబాద్‌లో ఉంటే అమ్మ, నాన్న, మేమిద్దరం కలిసి పండగ జరుపుకుంటాం. అమ్మ ఉగాది పచ్చడి, గారెలు, పులిహోర, పాయసం.. ఇలా అన్నీ చేస్తుంది. ఒకవేళ మేం చెన్నైలో ఉంటే... అక్కడి మా బంధువులతో పండగ జరుపుకుంటాం. మా ఇద్దరికీ పచ్చడి తినడం తప్ప చేయడం రాదు. మా చిన్నప్పుడు ఇద్దరం ముగ్గులు వేసేవాళ్లం. పండగ అంటే మాకు ముగ్గులే ఎగ్జయిటింగ్. ఇక పండగ రోజున కొత్త బట్టలంటే అది ఆ రోజు మూడ్‌ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి ఫుల్ ట్రెడిషనల్‌గా డ్రెస్ చేసుకుంటాం.. చక్కగా నగలు పెట్టుకుని గుడికి వెళతాం. చీర, లంగా, ఓణీ, చుడీదార్.. ఇలా ఏదో ఒకటి ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు చెన్నైలో ఉన్నాం. ఈసారి ఫుల్ ట్రెడిషనల్‌గా రెడీ అవుతాం. ఈ ఉగాది అందరి జీవితాల్లో ఆనందం నింపాలని కోరుకుంటూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇంకా మంచి ఆర్టిస్ట్‌గా గుర్తింపు సంపాదించుకోవాలనుకుంటున్నాను. ఇంకా మంచి నటిగా ఎదగాలని ఉంది. అలాగే మంచి డాక్టర్ అవ్వాలన్నది లక్ష్యం. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ మెడిసన్ చేస్తున్నాను. ఏం చేసినా నిబద్ధతతో చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. వర్కవుట్, షూటింగ్, చదువు, హార్స్ రైడింగ్.. ఏదైనా మరింత క్రమశిక్షణగా చేయాలనుకుంటున్నాను. – శివాని ఈ సంవత్సరం చేతినిండా పని ఉండాలని కోరుకుంటున్నాను. తెలుగు, తమిళంలో సినిమాలు చేయాలనుకుంటున్నాను. అలాగే ఇతర భాషల్లోనూ అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. కెరీర్‌పరంగా ఎదగాలన్నదే ప్రస్తుత లక్ష్యం. వీలైతే ఏదైనా స్పోర్ట్ నేర్చుకోవాలని ఉంది. ఏడాది మొత్తం చాలా ప్రశాంతంగా గడిచిపోవాలని ఉంది. ఆరోగ్యం బాగుండాలి. – శివాత్మిక -
శుభాది కావాల్సిన ఉగాది
వసంతమాసంలో వచ్చే ఉగాది మన తెలుగువాళ్ల కొత్త సంవత్సరం. ఆకులే కాదు, ఆశలూ చిగురించే కాలంలో వచ్చే పండుగ ఇది. వసంతానికీ కవిత్వానికీ అనాదిగా అవినాభావ బంధం ఉంది. ఉగాది అంటే ఆరు రుచుల ఉగాది పచ్చడిని ఆరగించడం; పంచాంగ శ్రవణం మాత్రమే కాదు, ఊరూరా కవిసమ్మేళనాల కోలాహలం కూడా! తెలుగు నేల మీదనే కాదు, తెలుగువాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ ఉగాది పండుగ రోజున కవిసమ్మేళనాలు తప్పనిసరిగా జరుగుతాయి. ప్రాచీన కావ్యాలలో రుతువర్ణన తప్పనిసరి అంశం. కవులు ఆరు రుతువులనూ వర్ణించినా, వాటిలో వసంత వర్ణనకే అమిత ప్రాధాన్యమిచ్చారు. ‘ఋతూనాం కుసుమాకరః’– అంటే, ‘రుతువు లలో వసంతాన్ని నేనే’ అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో చెప్పుకొన్నాడు మరి! అలాంటప్పుడు భాగవతోత్తములైన ప్రాచీన కవివరేణ్యులు వసంత వర్ణనకు రవంత అమిత ప్రాధాన్య మివ్వడంలో వింతేముంటుంది? ‘కమ్మని లతాంతముల కుమ్మొనసి వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ము లెసగం మా/ తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధి ముకుళమ్ములను నానుచును ముదమ్మొనర వాచా/లమ్ము లగు కోకిల కులమ్ముల రవమ్ము మధురమ్మగుచు విన్చెననిశమ్ము సుమనోభా/రమ్ముల నశోక నికర మ్ములను చంపక చయమ్ములును కింశుక వనమ్ములున్ నొప్పెన్’ అంటూ ‘ఆంధ్ర మహాభారతము’ ఆదిపర్వంలో నన్నయ పుష్పవిలసిత వసంత శోభను వర్ణించాడు. ‘కీర ముహ సచ్ఛేహిం/ రేహఇ వసుహా పలాస కుసుమేహిం/ బుద్ధస్స చలణ వందణ/ పడి విహిం వ భిక్ఖు సంఘేహిం’ – అంటే, ‘భూమి మీద తిరుగాడే రామచిలుకల ముక్కుల్లాంటి మోదుగ పూలు బుద్ధుని పాదాలను తాకి ప్రణ మిల్లే బౌద్ధభిక్షువుల సంఘమా?’ అని హాలుడు తన ‘గాథా సప్తశతి’లో అబ్బురపడ్డాడు. రుతువర్ణనలో అష్టదిగ్గజాలను తలదన్నే కవిదిగ్గజం ఆంధ్రభోజుడు కృష్ణదేవరాయలు. ఆయన తన ‘ఆముక్త మాల్యద’లో చేసిన వసంత వర్ణనలో మీన మేషాలను లెక్కించాడు. ‘కినిసి వలఱేడు దండెత్త గేతు వగుట/ మీన మిల దోచుటుచితంబ మేష మేమి/పని యనగ నేల? విరహాఖ్యపాంథ యువతి/ దాహమున కగ్గి రాగ దత్తడియు రాదె?’ అని చమత్కరించాడు. ఇందులోని చమ త్కారమేమిటంటే, కోపంతో మన్మథుడు దండెత్తగా చేప కనిపించడం సమంజసమే! ఎందుకంటే, మన్మథుడు మీనకేతనుడు. అలాంటప్పుడు అక్కడ మేకకు పనేమిటంటారా? విరహతాపంతో యువతులు దహించుకు పోతున్నప్పుడు అగ్ని వాహనమైన మేషం అక్కడ ఉండటమూ సమంజ సమే కదా! సౌరమానంలో మీన, మేష మాసాలు వసంత రుతువు. వసంతాగమనాన్ని ఇంత నర్మగర్భంగా వర్ణించడం రాయలవారికే చెల్లింది! ‘క్షితిపయి వట్టి మ్రాకులు జిగిర్ప వసంతుడు దారసోపగుం/భిత పద వాసనల్ నెఱప, మెచ్చక చంద్రుడు మిన్నునం బ్రస/న్నతయును సౌకుమార్యము గనంబడ ఱాల్ గరగంగజేసె; ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా’ అని చేమకూర వేంకటకవి వాపోయాడు. వసంతుడు వచ్చి, చెట్లను చిగురింపజేసి, వాటిని ఫలపుష్పభరితం చేసి, ప్రకృతిని పులకింపజేశాడట. అప్పుడు వసంతుడు చేసిన ఘనకార్యాన్ని పైనుంచి చూస్తున్న చంద్రుడు మెచ్చకపోగా, కినుక బూనాడు. వసంతుడిని మించి తన ఘనత చాటుకోవడానికి సుకుమారమైన వెన్నెల కురిపించి, రాళ్లను కరిగించేశాడట. అలాగే, ఎంత బాగా రాసినా సమకాలికులు మెచ్చరట! చేమకూర కవికే కాదు, ఈ బాధ ఇప్పటి కవులనూ పీడిస్తూనే ఉంది. ‘నాకుగాదులు లేవు, నాకుషస్సులు లేవు’ అని కృష్ణశాస్త్రి వగచినంత మాత్రాన తెలుగు కవులకు ఉగాదులు లేకుండా పోలేదు. ఉగాది కవి సమ్మేళనాలు నేటికీ అట్టహాసంగా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగని ఉగాది కవి సమ్మేళనాలు ప్రాచీనకాలం నుంచి కొనసాగుతున్నాయనడానికి ఆధారాలేవీ లేవు. మహా అయితే ఒకటి రెండు శతాబ్దాలుగా మొదలై ఉంటాయేమో! ప్రాచీన సాహిత్యంలో వసంత వర్ణన తప్ప ఉగాది వర్ణన ఎక్కడా కనిపించదు. ఒకప్పుడు కొన్ని పత్రికలు ఉగాది ప్రత్యేక సంచికలు విడుదల చేసేవి. ఆ కాలమంతా గత వసంత వైభవం. కాల చక్రభ్రమణంలో రుతువులు వస్తుంటాయి, పోతుంటాయి. ఉగాదుల రాకతో లోకమంతా పచ్చగా మారిపోతుందనుకుంటే, అది భ్రమ మాత్రమే! ‘నీతి పథమునందు, నిత్య జీవితమందు/ మాటనిరుకునందు మార్పులేక/ కొత్తబట్ట గట్టు కొన్నంత నూత్నవ/ర్షంబు మహము సార్థకంబుగాదు’ అని జాషువా ఏనాడో నిష్ఠుర సత్యాన్ని పలికారు. ‘ఉగాది పాటకు ఒకటే పల్లవి/ బాధ బాధ బాధ అది/ జగాన మెసలే జనాల జీవిత/ గాథ గాథ గాథ’ అని నిర్మొహమాటంగా తేల్చేశాడు శ్రీశ్రీ. అంతేనా? ‘ఉగాది వచ్చింది/ అయినా/ శుభాది వచ్చిందీ?’ అని నిలదీశాడు కూడా! ఏటా ఉగాది వస్తూనే ఉంటుంది. ఉగాది వేడుకలూ యథాప్రకారం జరుగుతూనే ఉంటాయి. సామాన్యుల జీవితాల్లో పెనుమార్పులేవీ రాకపోయినా; రాజకీయ పంచాంగ శ్రవణాలొక వైపు, బహిరంగ వేదికల మీద అధికారిక, అనధికారిక కండువాల కవి సమ్మేళనాలింకొక వైపు కోలాహలంగా కొనసాగుతూనే ఉంటాయి. ఒకే వేదిక మీదకు చేరిన కవుల్లో కొందరు ఉగాదిని రారమ్మని ఆహ్వానిస్తుంటారు. ఇంకొందరు రావద్దని బతిమాలుకుంటారు. ఉగాది పచ్చడిలోని చేదును మర పిస్తూ, ఈ తప్పనిసరి తతంగాలు జనాలకు ఉచిత వినోదాన్ని ఉదారంగా పంచిపెడుతూనే ఉంటాయి. పండగపూట ఆ మాత్రం వినోదమైనా లేకపోతే, బతుకులు మరీ చేదెక్కిపోవూ! -
ఉగాది పచ్చడి కలుపుతున్న ఎమ్మెల్సీ కవిత
-
Ugadi 2022: పరమాన్నం.. నోరూరించే పూర్ణాలు, భక్ష్యాల తయారీ ఇలా!
శ్రీ శుభకృత్‌నామ సంవత్సర ఉగాది.. నేటితో కొత్త సంవత్సరంలో ప్రవేశించాం. పండుగంటేనే పరమాన్నంతో పాటు భిన్న రుచులను కూడా ఆస్వాదించడం కదా! మరి నోరూరించే ఉగాది రుచుల తయారీ కూడా తెలుసుకుందామా! ఉగాది పచ్చడి : కావలసినవి: కొత్త బెల్లం – 100 గ్రామలు, పచ్చి మామిడి – ఒకటి (మీడియం సైజు), వేప పువ్వు – ఒక టేబుల్ స్పూన్, పచ్చి మిర్చి – రెండు (తురమాలి), ఉప్పు – చిటికెడు, చింతపండు – పెద్ద నిమ్మకాయంత (కొత్త చింతకాయల నుంచి సేకరించినది). తయారీ: ∙బెల్లాన్ని తురిమి, అందులో కొద్దిగా నీటిని చిలకరించి పక్కన ఉంచాలి. ∙వేప పువ్వు కాడలు లేకుండా వలిచి పువ్వు రెక్కలను సేకరించి పక్కన ఉంచాలి. ∙మామిడి కాయ మొదలు (సొన కారే భాగం) తీసేయాలి. కాయను నిలువుగా కోసి లోపలి గింజను కూడా తీసేయాలి. ఇప్పుడు మామిడి కాయను తొక్కతోపాటు సన్నగా ముక్కలు తరగాలి లేదా తురిమి బెల్లం నీటిలో వేయాలి. ∙చింతపండు గుజ్జును చిక్కగా రసం తీసి పై మిశ్రమంలో కలపాలి. అందులో పచ్చిమిర్చి తురుము, ఉప్పు, వేప పూత వేసి కలపాలి. ఈ మిశ్రమం చిక్కగా ఉంటుంది. మరింత రుచి కోసం చెరకు ముక్కలు, మిగుల మగ్గిన అరటి పండు గుజ్జు కలుపుకోవచ్చు. ఊరించే ఉగాది రుచులు మామిడికాయ పులిహోర పూర్ణాలు కావలసినవి: బియ్యం – కప్పు, పచ్చిమామిడి కాయ – మీడియం సైజుది ఒకటి, పచ్చికొబ్బరి తురుము – అర కప్పు, ఆవాలు – టీస్పూను, మినప పప్పు – టీస్పూను, పచ్చిశనగ పప్పు – టీ స్పూను, వేరుశనగ గుళ్ళు – రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు – మూడు రెమ్మలు, పచ్చిమిర్చి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి – నాలుగు, మెంతులు – పావు టీస్పూను, ఆయిల్ – నాలుగు టేబుల్ స్పూన్లు, పసుపు – పావు టీస్పూను, చింతపండు ఉసిరికాయంత, బెల్లం తురుము – రెండు టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ∙ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం పొడి పొడిగా వచ్చేలా వండి ఆరబెట్టుకోవాలి. ∙మామిడి కాయ తొక్క తీసి ముక్కలుగా తరగాలి. ∙ఎండు మిర్చి, మెంతులు, అరటీస్పూను ఆవాలను దోరగా వేయించుకుని పొడిచేయాలి. ఈ పొడిలో పచ్చికొబ్బరి, మామిడికాయ ముక్కలు, చింతపండు, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి. ∙స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు వేయాలి. చిటపటలాడాక మినప పప్పు, శనగ పప్పు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేయాలి. ∙ఇవన్ని వేగాక వేరుశనగ గుళ్ళు వేసి వేయించాలి. ఇవి వేగాక పసుపు, గ్రైండ్ చేసిన మామిడికాయ మిశ్రమం వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ∙తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి, ఆరబెట్టిన అన్నాన్ని వేసి కలిపితే మామిడికాయ పులిహోర రెడీ. పూర్ణాలు కావలసినవి: పచ్చిశనగ పప్పు – అర కేజీ, బెల్లం – అరకేజీ, యాలక్కాయలు – పది, బియ్యం – రెండు కప్పులు, పొట్టుతీసిన మినప గుళ్లు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ముందుగా మినప పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి. శనగ పప్పుని కూడా కడిగి గంట పాటు నానబెట్టాలి. ∙నానిన బియ్యం మినప పప్పులని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ∙నానిన శనగపప్పుని కుకర్‌లో వేసి రెండు గ్లాసులు నీళ్లుపోసి మూడు విజిల్స్ రానివ్వాలి. ఉడికిన శనగ పప్పులో బెల్లం వేసి మెత్తగా గరిటతో తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఉడికించి, యాలుక్కాయల పొడి వేసి తిప్పి దించేయాలి. శనగపప్పు మిశ్రమం చల్లారాక, ఉండలుగా చుట్టుకోవాలి. ∙బియ్యం, మినపగుళ్ల రుబ్బులో కొద్దిగా ఉప్పు వేసి తిప్పాలి. ఇప్పుడు శనగ పప్పు ఉండలను ఈ పిండిలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ∙మీడియం మంట మీద గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయిస్తే తియ్యని పూర్ణాలు రెడీ. భక్ష్యాలు కావలసినవి: పచ్చిశనగ పప్పు – రెండు కప్పులు, బెల్లం తురుము – రెండు కప్పులు, యాలకుల పొడి – రెండు టేబుల్ స్పూన్లు, మైదా – రెండు కప్పులు, గోధుమ పిండి – మూడు టేబుల్ స్పూన్లు, నెయ్యి – అరకప్పు, నీళ్లు – కప్పు, ఉప్పు – చిటికెడు. తయారీ: ∙ముందుగా శనగ పప్పుని శుభ్రంగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టాలి. నానిన పప్పుని కుకర్‌లో వేసి, రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. ఇంతకు మించి ఉడికించకూడదు. ∙ఉడికిన తరువాత నీళ్లు తీసేసి పప్పుని పక్కన పెట్టుకోవాలి. ∙మైదాలో గోధుమ పిండి, టేబుల్ స్పూను నెయ్యి, కప్పు నీళ్లుపోసి పిండిని ముద్దలా కలుపుకోని పక్కనపెట్టుకోవాలి. ∙శనగ పప్పుని కూడా మెత్తగా రుబ్బుకోవాలి. ∙మందపాటి పాత్రలో బెల్లం తురుము, అరకప్పు నీళ్లు పోసి సన్నని మంట మీద ఉడికించాలి. ∙మధ్య మధ్యలో కలియ తిప్పుతూ రుబ్బుకున్న శనగపప్పు, యాలకుల పొడి వేసి తిప్పి, పదినిమిషాల పాటు ఉడికించాలి. ఉడికిన మిశ్రమాన్ని నిమ్మకాయ సైజు పరిమాణంలో ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అల్యూమినియం ఫాయిల్‌పైన కొద్దిగా నెయ్యి రాసుకుని కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా చేత్తో వత్తుకోవాలి. ∙ఈ చపాతీలో శనగపప్పు ఉండని పెట్టి చపాతీ మొత్తం చుట్టే పూరీలా వత్తుకోవాలి. ∙పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా బంగారు రంగులోకి మారేంత వరకు కాల్చితే భక్ష్యాలు రెడీ. పరమాన్నం కావలసినవి: బియ్యం – అర కప్పు, పాలు – కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, నెయ్యి – ముప్పావు కప్పు, జీడి పప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూను, పచ్చకర్పూరం – చిటికెడు. తయారీ: ∙ముందుగా బియ్యాన్ని కడిగి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ∙ఒక గిన్నెలో పాలుపోసి కాయాలి. కాగిన పాలల్లో నానబెట్టిన బియ్యం వేసి తిప్పుతూ ఉడికించాలి. అన్నం మెత్తగా ఉడికాక దించి చల్లారనివ్వాలి. ∙స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత జీడి పప్పు పలుకులు వేసి గోల్డ్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. స్టవ్ మీద మరో పాత్ర పెట్టి బెల్లం తురుము వేయాలి. దీనిలో పావుకప్పు నీళ్లుపోసి సిరప్‌లా మారేవరకు ఉడికించి, చల్లారనివ్వాలి. ∙బెల్లం సిరప్‌లోనే యాలకుల డి, పచ్చ కర్పూరం వేసి తిప్పాలి. ∙బెల్లం సిరప్ చల్లారక అన్నంలో వేసి బాగా కలపాలి, దీనిలో మిగిలిన నెయ్యి, జీడిపప్పుతో గార్నిష్ చేస్తే పరమాన్నం రెడీ. -
షడ్రుచులు దేనికి సంకేతం అంటే..
తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ వచ్చిందంటే చాలు.. మనవాళ్ళు.. ముఖ్యంగా మన తెలుగు వారు.. మామిడాకులతో తోరణాలు, రకరకాల రంగవళ్లులు, పిల్లల అల్లరి చేష్టలు, పెద్దల హడావుడి, కొత్త బట్టలతో ఇంచుమించు అందరి ఇళ్లు కళకళలాడుతూ ఉంటాయి. పల్లెటూళ్లలో అయితే ఇక చెప్పనవసరం లేదు. ఉగాది పండుగ రోజు నుంచి, శ్రీరామనవమి వరకు ఏడు రోజుల పాటు చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుతుంటారు. ఉగాది పండుగకే ప్రత్యేకంగా నిలిచేది ఉగాది పచ్చడి. షడ్రుచుల మేళవింపుతో తయారు చేసే ఈ పచ్చడి మనిషి జీవితంలోని అనేక జ్ఞాపకాలకు ప్రతీక అని చెప్పవచ్చు. మానవ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, సంతోషం, బాధ, అవమానాలు అన్ని ఉంటాయి. వీటిన్నంటిని ఒక్కో రుచితో మేళవించారు పెద్దలు. షడ్రుచుల మిళితమైన శ్రేష్ట పదార్ధమే ఉగాది పచ్చడి. ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంత ప్రాముఖ్యత కలదో.. ఆహార, ఆరోగ్యం పరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఈ పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్యనిపుణుల మాట. మన పుర్వీకులు గ్రంధాల్లో ప్రస్తావించిన ఆ షడ్రుచులు.. పేరు వినటమే గాని, ఆ రుచులేమిటో చాలా మందికి నిజంగా తెలియదు. ఇక ప్రస్తుత కాలంలో ఉగాది పచ్చడి కూడా నూతన పోకడలు పోతుంది. అసలు ఉగాది పచ్చడిని తయారు చేసే పదర్థాలు ఏవి అంటే బెల్లం, చింతపండు, మిరియాలు, వేప పువ్వు, ఉప్పు, మామిడి. ఈ పదార్థాలన్నింటిని కొత్త కుండలో కలిపి.. అచ్చమైన ఉగాది పచ్చడి తయారు చేస్తారు. షడ్రుచులు దేనికి సంకేతం అంటే.. బెల్లం తీపి - ఆనందానికి సంకేతం ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం వేప పువ్వు - చేదు -బాధకలిగించే అనుభవాలు చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు మిరియాలు - కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు -
రుచికరమైన షడ్రుచుల ఉగాది
పులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఉప్పు... షడ్రుచుల మిశ్రమమే ఉగాది. వసంతుడు చెరకుగడతో తియ్యటి బాణాలు సంధిస్తాడు... వేప పూత చేదుతో క్రిమికీటకాలునశిస్తాయి.. పుల్లటి రుచితో శరీర తాపబాధ తగ్గుతుంది.. వగరు రుచి సన్నని పొగరు కలిగిస్తుంది.. అందరిలోనూ కలిసిపోతూ రుచిని పెంచుతుంది ఉప్పు కోయిలమ్మ తియ్యటి కంఠస్వరంతో ప్రకృతి పరవశిస్తుంది.. ఇదే ఉగాది పండుగ.. ఉగాది పచ్చడి కావలసినవి: నీళ్లు – తగినన్ని; చింత పండు – తగినంత; చెరకు ముక్కలు – ఒక కప్పుడు; అరటి పండు – 2 (ముక్కలు చేయాలి); బెల్లం తరుగు – నీళ్లకు తగినన్ని; వేప పువ్వు – 2 టేబుల్ స్పూన్లు; మామిడి కాయ – 1 (ముక్కలు చేయాలి);ఉప్పు – చిటికెడు; పచ్చి మిర్చి – 4 (ముక్కలు చేయాలి); మిరియాలు – 6 (పొడి చేయాలి) తయారీ: ►చింతపండును తగినన్ని నీళ్లలో నానబెట్టి, పల్చ గా రసం తీసుకోవాలి ►ఒక గిన్నెలో చింతపండు రసం, తగినన్ని నీళ్లు, బెల్లం తరు గు, ఉప్పు వేసి గరిటెతో కలియబెట్టాలి ►శుభ్రం చేసి నీళ్లలో కడిగిన వేప పువ్వు, అరటి పండు ముక్కలు వేసి మరోమారు కలియబెట్టాలి ►సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, చెరకు ముక్కలు, పచ్చి మిర్చి వేసి బాగా కలిపి, చివరగా మిరియాల పొడి వేసి కలిపి, నివేదన చేసి, చిన్నచిన్న గ్లాసులలో ప్రసాదంగా అందించాలి. బెల్లం బీట్రూట్ అరటిపండు కేసరి కావలసినవి: బాగా ముగ్గిన అరటిపండు – 1; బీట్రూట్ ముక్కలు – అర కప్పు బొంబాయి రవ్వ – అర కప్పు; బెల్లం తురుము – కప్పు; నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు; పాలు – అర కప్పు; జీడి పప్పులు – తగినన్ని; ఏలకుల పొడి – చిటికెడు తయారీ: ►ముందుగా బీట్ రూట్ ముక్కలకు అర కప్పు నీళ్లు జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీలా తయారు చేసి, బీట్ రూట్‌ను గట్టిగా పిండి నీళ్లు వేరు చేసి పక్కన ఉంచాలి. ►బాణలిలో నెయ్యి వేసి కరిగాక రవ్వ వేసి దోరగా వేయించాలి ►అరటి పండును చిన్న చిన్న ముక్కలుగా చేసి మెత్తగా గుజ్జులా అయ్యేలా చేతితో మెదిపి, బాణలిలో వేసి బాగా కలపాలి ►పాలు జత చేసి బాగా కలిశాక, బీట్ రూట్ నీళ్లు పోసి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి ∙బెల్లం తురుము వేసి కరిగే వరకు కలుపుతూ ఉండాలి (అవసరమనుకుంటే మధ్యలో ఒకసారి నెయ్యి వేసి కలపాలి) ►చివరగా ఏలకుల పొడి, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలిపి దించేయాలి. అయ్యంగారి పులిహోర కావలసినవి: చింత పండు – 200 గ్రా; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – 2 టేబుల్ స్పూన్లు; మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – 1 టీ స్పూను; నువ్వుల నూనె – కప్పు; ఉప్పు – తగినంత పొడి కోసం: ధనియాలు – 3 టేబుల్ స్పూన్లు; మెంతులు – టీ స్పూను; ఎండు మిర్చి – 10; ఇంగువ – కొద్దిగా; అన్నం కోసం: బియ్యం – 4 కప్పులు; పోపు కోసం; మినప్పప్పు – 3 టీ స్పూన్లు; పల్లీలు – అర కప్పు; జీడి పప్పు – అర కప్పు; కరివేపాకు – 3 రెమ్మలు; నువ్వుల నూనె – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 3; ఉప్పు – తగినంత తయారీ: ►రెండు కప్పుల వేడి నీళ్లలో చింతపండును సుమారు అరగంటసేపు నానబెట్టాలి ►మిక్సీ జార్లో వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు మిక్సీ పట్టి, జల్లెడ వంటి దానిలో వడకట్టాలి (చెత్త వంటివన్నీ పైన ఉండిపోతాయి. అవసరమనుకుంటే కొద్దిగా వేడి నీళ్లు జత చేసి జల్లెడ పట్టవచ్చు. మిశ్రమం చిక్కగా ఉండాలే కాని పల్చబడకూడదు) ►ధనియాలు, మెంతులను విడివిడిగా బాణలిలో నూనె లేకుండా వేయించి, చల్లారాక విడివిడిగానే మెత్తగా పొడి చేయాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ఆవాలు, మినప్పప్పు వరుసగా వేసి వేయించాలి ►చింత పండు గుజ్జు జత చే సి బాగా కలిపి నూనె పైకి తేలేవరకు బాగా ఉడికించాలి ►మెంతి పొడి జత చేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి ►మరొక బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, మినప్పప్పు, కరివేపాకు వరుసగా ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాక, పల్లీలు, జీడి పప్పులు వేసి బాగా కలిపి దించేయాలి ►ఒక ప్లేటులో అన్నం వేసి పొడిపొడిగా విడదీసి, టీ స్పూను నువ్వుల నూనె వేసి కలిపాక, ఉడికించి ఉంచుకున్న చింతపండు గుజ్జు, పోపు సామాను వేసి కలపాలి ►ఉప్పు, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు మెంతి పొడి వేసి కలిపి, గంట సేపు అలా ఉంచేసి, ఆ తరవాత తింటే పుల్లపుల్లగా రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చి పప్పు కావలసినవి: కంది పప్పు – కప్పు, పచ్చి మిర్చి – 10, టొమాటో – 1, చింత పండు రసం – టీ స్పూను, ఆవాలు – టీ స్పూను, ఎండు మిర్చి – 2, ఇంగువ – చిటికెడు, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – టేబుల్ స్పూను, ధనియాల పొడి – అర టీ స్పూను తయారీ ►ముందుగా కంది పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ►కరివేపాకు జత చేసి మరోమారు వేయించాక టొమాటో ముక్కలు వేసి మెత్తబడేవరకు కలపాలి ►మధ్యకు చీల్చి గింజలు తీసిన పచ్చిమిర్చి వేసి మరోమారు బాగా కలిపి, ఉప్పు, పసుపు జత చేసి ఉడికించాలి ►ఉడికించిన పప్పు వేసి బాగా మెదపాలి ►చింత పండు రసం, ధనియాల పొడి వేసి బాగా కలిపి, చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. మామిడికాయ నువ్వుపప్పు పచ్చడి కావలసినవి: పచ్చి మామిడి కాయలు – 2; నువ్వులు – కప్పు; పచ్చి మిర్చి తరుగు – అర కప్పు; వెల్లుల్లి రేకలు – అర కప్పు; అల్లం తురుము – 2 టీ స్పూన్లు; ఇంగువ – చిటికెడు; ఆవాలు – టీ స్పూను; కరివేపాకు – 4 రెమ్మలు; ఎండు మిర్చి – 4; నూనె – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – టీ స్పూను; ఉప్పు – తగినంత తయారీ: మామిడికాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మామిడికాయ ముక్కలు, పచ్చి మిర్చి, అల్లం తురుము, పసుపు వేసి బాగా కలిపి ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి ►వేరొక బాణలి లో నూనె లేకుండా, నువ్వులు వేసి వేయించి చల్లారాక మెత్తగా పొడి చేయాలి ►వేయించి ఉంచిన మామిడి కాయ ముక్కల మిశ్రమం, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు వేసి వేగాక, వెల్లుల్లి రేకలు, ఎండు మిర్చి, చివరగా కరివేపాకు వేసి వేయించి తీసి, తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నెయ్యితో తింటే రుచిగా ఉంటుంది. వేప పువ్వు చారు కావలసినవి: వేప పువ్వు – 3 టీ స్పూన్లు; చింత పండు – కొద్దిగా; ధనియాల పొడి – పావు టీ స్పూను; ఇంగువ – చిటికెడు; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; మినప్పప్పు – టీ స్పూను; ఎండు మిర్చి – 4; పచ్చి మిర్చి – 2; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; నూనె – టీ స్పూను తయారీ: ►వేప పువ్వును శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి ►చింత పండును నానబెట్టి రసం తీసి పక్కన ఉంచాలి ►బాణలి లో నూనె వేసి కాగాక ఇంగువ, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరసగా వేసి వేయించాలి ►వేప పువ్వు, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించాక, చింత పండు రసం వేసి బాగా కలపాలి ►రసం పొంగుతుండగా మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు పసుపు, కరివేపాకు, కొత్తి మీర వేసి వేసి ఒక పొంగు రానిచ్చి దించేయాలి. సేకరణ: పురాణపండ వైజయంతి -
అన్ని రుచుల అభయం
జీవితంలో తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు అన్నీ ఉంటాయి. ఒకసారి తీపి ఉంటే, మరోసారి పులుపు ఉంటుంది. ఈ శార్వరి నామ సంవత్సరంలో అనివార్య సంఘటనల కారణంగా పండుగను వేడుకగా జరుపుకునే అవకాశం లేదు. ఈ సమయంలో కోకిల కూడా తన గళాన్ని విప్పలేకపోయింది. అసలు కోకిల కూజితాలతోనే వసంతుడి ఆగమనం అర్థమవుతుంది. వేప పూతతో వసంత శోభ సంతరించుకుంటుంది. చెరకు గడలతో వసంతుడి మాధుర్యం అర్థమవుతుంది. మరి ఈ సారి ఇంకా కోయిల కూయట్లేదేంటి, వేప పూత కనిపించటం లేదేంటి, చెరకు గడల స్వాగతాలు లేవేంటి అనుకోవటం, అప్పుడే బయటకు వస్తున్న కోయిలమ్మ చెవిన పడింది. అందరూ తనను స్మరిస్తుంటే, మౌనంగా ఉండటం కోకిలమ్మకు నచ్చలేదు. తన గళంతో అందరిలోనూ ఉల్లాసం రేకెత్తించాలనుకుని, వేప చెట్టు మీద వాలింది. ఆ తాకిడికి వేప పువ్వు, ‘కోయిలమ్మా! ఏమిటి ఇలా వచ్చావు? నీ గొంతు సవరించలేకపోతున్నావు’ అంటుండగానే కోయిల కూ.. కూ.. కూ... అంటూ మూడు సార్లు కూసింది. ఒక్కసారిగా వేప పూత ఒళ్లు జలదరించింది. అంతలోనే దిగాలుగా, ‘కోకిలమ్మా! ఈ సారి ఉగాది పచ్చడిలో నన్ను ఉపయోగించుకోలేకపోతున్నారు. వారి ఆరోగ్యాలను కాపాడటం నా ధర్మం కదా! ఎలాగో అర్థం కావట్లేదు’ అంది. వేప పూవుకి ఆశ్వాసన కలిగించే లోపే, ఎక్కడ నుంచో ఎగురుకుంటూ చెరుకు గడ, మామిడిపిందెలు.. వేప చెట్టు మీద ఉన్న కోకిల దగ్గరకు వచ్చాయి. అవి కూడా ముఖాలు వేలాడేసుకుని, దిగాలుగా ఉన్నాయి. వాళ్లిద్దరినీ కూడా ఉత్తేజపరచాలనుకుంది కోయిలమ్మ. ‘ఈ సమయంలో మనమంతా ఇలా నీరసంగా ఉంటే, భయంతో ఇళ్ల నుంచి బయటకురాని మన ప్రజలను ఎవరు ఉత్సాహపరుస్తారు. వీరంతా మన బిడ్డలు.. అదే ప్రకృతి సంతానం. ప్రకృతే వాళ్ల మీద కన్నెర్ర చేస్తే, వాళ్లు ఏమైపోవాలి. ఇటువంటి సమయంలో మనం ఐకమత్యంగా ఉండాలి’ అంది. తన కంఠస్వరం విప్పి మృదుమధురంగా వసంత రాగంలో స్వనం చేసింది. ‘పంచమ స్వరంలో ప్రౌఢకోకిలలు పలికే మరందాల అమృతవర్షిణి’ అని రచించిన వేటూరిని స్మరిస్తూ, అందంగా ఆలాపన చేసింది. ఆ పాటకు వేప పూత కొద్దిగా తల ఊపింది, కానీ హుషారు లేదు అందులో. ‘కోయిలమ్మా! నువ్వు కులాసాగా పాటలు పాడుతుంటే ఎలాగ? మేం ఏం చేయాలో నువ్వు మంచి సలహా ఇస్తావనుకుంటే, ఇదేంటి జోరుగా పాటలు పాడుతున్నావు?’ అంది. అందుకు కోకిలమ్మ నవ్వుతూ, ‘మనమందరం మన ధర్మాన్ని విడిచిపెట్టకూడదనేగా మీ ఉద్దేశం. అందరం మన కర్తవ్యాన్ని విధ్యుక్తంగా నిర్వహిద్దాం సరేనా!’ అంది. వేప కుసుమాలు సుకుమారంగా తలలూపాయి. మామిడి పిందెలు కొద్దిగా బరువుగా ఒళ్లు ఆడించాయి. చెరకు గడ నిట్టనిలువుగా తన అంగీకారం తెలిపింది. ‘వేప తల్లీ! ఉగాదికి ప్రత్యేకంగా తయారుచేసే పచ్చడిలో నువ్వే ప్రధానం. ఇప్పుడు ఎవ్వరూ బయటకు వచ్చి నిన్ను తీసుకువెళ్లి పచ్చడి తయారుచేసుకునే అవకాశం లేదు. అందుకని నువ్వు వాయుదేవుడి సహాయంతో, ఈ సూక్ష్మజీవుల్ని కొంతైనా తగ్గించటానికి అనువుగా చిరు చేదు గాలులు వ్యాపింప చేయి’ అని సూచించింది కోయిలమ్మ. వేప పూతకి ఈ మాటలు ఆనందాన్నిచ్చాయి. అంతే ‘నమో వాయుదేవా!’ అని గాలి దేవుడిని మనసులో స్మరించి, మనో వేగంతో ప్రతి ఇంటిలోకి తొంగిచూసింది. మామిడి పిందె, చెరకు గడలతో... ‘మీ ఇద్దరూ ఇక్కడ నుంచే అందరినీ ఆశీర్వదించండి. ఇంటింటా మధుర ఆనందాలు, చిరు వగరులు కురిపించండి. అందరినీ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని, ఈ విపత్కర సమయంలో ఎవ్వరూ బలహీనపడొద్దని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి’ అంది. అంతే మరుక్షణం మామిడి పిందె, చెరకుగడలు కూడా సంతోషభరిత హృదయంతో అందరినీ ఆశీర్వదించాయి. ఇల్లిల్లూ షడ్రుచుల వంటి మనసులున్న మనుషుల మధ్య పండుగ సంబరంగా జరుపుకోవటం కళ్లారా చూసి పరవశించింది ప్రకృతి. ఈ సంవత్సరం పేరు శార్వరి. అంటే చీకటి రాత్రి అని అర్థం. అమ్మవారు అనే అర్థం కూడా ఉంది. ఇంతకాలం నా కంఠస్వరాన్ని ఆస్వాదించిన అందరికీ చీకట్లు తొలగి, ప్రకృతి ఆశీస్సులు ఉండుగాక! శుభమస్తు! .. అంటూ కోయిలమ్మ మరింత మాధుర్యంతో కుహూరవాలు చేస్తుంటే, ప్రకృతి ప్రతిధ్వనించింది. – వైజయంతి పురాణపండ -
నవయుగాది
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం ; న్యాయ్యేణ మార్గేణ మహీం మహీశాఃఅందరూ బాగుండాలి. కడుపు నిండా తినాలి. మంచి బట్టలు వేసుకోవాలి. చేతి నిండా పని ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. పాలకులు నిస్వార్థంగా ఉండాలి. న్యాయంగా పాలించాలి. కష్టంలో ఓదార్చాలి ప్రజాభీష్టాన్ని మన్నించాలి. ఇదే ఉగాది ఆకాంక్ష... మనం ఏ శుభకార్యానికైనా సరే, సంకల్పం చెప్పుకునేటప్పుడు స్వస్తిశ్రీ చాంద్రమానేన.... నామ సంవత్సరే అని చెప్పుకుంటాం. అంటే ఉగాది మనకు అత్యంత కీలకమైన పండుగ అన్నమాట. ఇది చాంద్రమానాన్ని బట్టి అంటే చంద్రుడి గమనానికి అనుగుణంగా గణించే సంవత్సరం అన్నమాట. ఉగాది నుంచి తెలుగు వారికి కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. నిన్నటి వరకు ఉన్న సంవత్సరం విలంబి నామ సంవత్సరం కాగా నేటి నుంచి ‘వికారి’ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఆరోగ్యాన్నిచ్చే అభ్యంగనం ఉగాది వంటి పర్వదినాలలో నువ్వులనూనెలో లక్ష్మి, జలంలో గంగాదేవి ఉంటారని శాస్త్రోక్తి. ఉగాదినాడు పొద్దున్నే అభ్యంగన స్నానం చేయాలి. అంటే ఒళ్లంతా నువ్వుల నూనె, సున్నిపిండి పట్టించి, కుంకుడురసం లేదా సీకాయపొడితో తలస్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులు శుభప్రదం ఈరోజున చిరిగిన, మాసిన లేదా విడిచిన బట్టలు ధరించిన వారికి, తలస్నానం చేయని వారికి సంవత్సరమంతా రకరకాల వ్యాధులు, దారిద్య్రబాధలు సోకుతాయని శాస్త్రోక్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉగాదినాడు వీలయితే నూతన వస్త్రాలు లేదా చిరుగులు పడని, శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించడం శ్రేయోదాయకం. తెల్లటి దుస్తులు ధరించడం శుభప్రదÆ . ఉగాది సంప్రదాయం ఈ పర్వదినాన ఉదయమే ఇల్లు అలికి, ముగ్గుపెట్టి లేదా అటకలతో సహా అన్నిగదులలోనూ బూజు దులిపి ఊడ్చి, శుభ్రంగా కడుక్కుని, మామిడి లేదా వివిధ రకాల పుష్పాలతో తోరణాలు కట్టాలి. గడపలకు పసుపు, కుంకుమలు అలంకరించాలి. ఇంటిలో మనం పూజించే ఇష్టదేవతల విగ్రహాలను షోడశోపచారాలతో పూజించి, శుచిగా చేసిన పిండివంటలను, ఉగాది పచ్చడిని నివేదించాలి. పంచాంగం అంటే ... తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు భాగాలను కలిపి పంచాంగం అంటారు. తిథి వలన సంపద, నక్షత్రం వల్ల పాపపరిహారం, సరైన యోగంతో వ్యాధి నివృత్తి, కరణం ద్వారా కార్యానుకూలతను పొందవచ్చు. కాబట్టి చేసే పనులలో అనుకూలతను, జయాన్ని కాంక్షించేవారందరూ, కాలాన్ని తెలిసి కర్మలు చేసేవారందరూ తప్పక పంచాంగం చూడాలి. ఆరు రుచులు... అనంతమైన అర్థాలు ఉగాదికి సంకేతంగా చెప్పుకునే ఆరురుచుల కలయికలో అనంతమైన అర్థముంది. ప్రకృతి లేనిదే జీవి లేదు. జీవి లేని ప్రకృతి అసంపూర్ణం. కాబట్టి జీవునికి అంటే... మానవునికి, ప్రకృతికి గల అవినాభావ సంబంధాన్ని గుర్తుచేస్తుంది ఈ పండుగ. సరికొత్త ప్రకృతి అందించే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచుల సమ్మేళనంతో తయారయ్చే ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం. జీవితమంటే కేవలం కష్టాలు లేదా సుఖాలే కాదు, అన్ని విధాలైన అనుభవాలూ, అనుభూతులూ ఉంటాయి, ఉండాలి! అలా ఉన్నప్పుడే జీవితానికి అర్థం పరమార్థం. ఈసత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఉగాది పచ్చడి. శుభారంభానికి ఉగాది బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ, ప్రజానురంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శకకారుడైన శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్నధిష్ఠించిందీ ఉగాదినా డేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి నూతనకార్యాలు ప్రారంభించడానికి ఉగాదిని మించిన శుభతరుణం మరొకటి లేదనే కదా అర్థం. వైవిధ్యభరితం ఉగాది పచ్చడిలో కొత్త చింతపండు బదులు నిమ్మరసం, మిరియాలకు మారుగా ఎండుకారం లేదా పచ్చిమిరప వాడుతున్నారు. కొందరు చెరకు ముక్కలు, అరటిపండు ముక్కలు, గసగసాలు, సోంపు... ఇలా ఎవరి అభిరుచి, అలవాటు లేదా ఆచారాన్ని బట్టి ఉగాది పచ్చడి తయారుచేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో దీనిని పచ్చడిలా గట్టిగా చేస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాలలో కొత్తకుండలో పోసి, ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు, అతిథులకు ఇవ్వడం ఆనవాయితీ. ఈ రోజున ఉపవాసం ఉండి బ్రహ్మదేవుని పూజించిన వారికి సంవత్సరమంతా సుఖసంతోషాలు లభిస్తాయని శాస్త్రోక్తి. వర్షాలు బాగా కురవాలని కోరుతూ వ్యవయసాయదారులు ఈ వేళ ఇంద్రుణ్ణి పూజించడం కొన్ని ప్రాంతాలలో కనిపించే ఆచారం. పంచాంగ శ్రవణ ఫలమేమిటి? ఉగాదినాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలంతో సమానమట. అదొక్కటే కాదు, పంచాంగ శ్రవణం చేయడం వలన భూమి, బంగారం, ఏనుగులు, గోవులతో కూడిన సర్వలక్షణ లక్షితమైన కన్యను వేదవిదుడైన బ్రాహ్మణునకు లేదా యోగ్యుడైన వరునకు దానం చేస్తే కలిగే ఫలంతో సమానమైన ఫలాన్నిస్తుందని శాస్త్రోక్తి. అంతేకాదు, సంవత్సరానికి అధిపతులైన రాజాది నవనాయకుల గ్రహఫలితాలను శాస్త్రోక్తంగా వినడం గ్రహదోషాలు తొలగి, వినేవారికి ఆరోగ్యాన్ని, యశస్సును, ఆయుష్షునూ వృద్ధి చేసి, సంపదతో కూడిన సకల శుభఫలాలనూ ఇస్తుందట. కాబట్టి ఉగాదినాడు పంచాంగ ఫలాలను తెలుసుకోవడం వల్ల భవిష్యత్ కార్యాచరణను చేపట్టడం సులభం అవుతుందని పెద్దల అనుభవం. – డి.వి.ఆర్. -
తెలుగుదనం ‘జయ’హో...!
‘జయం’ వచ్చింది. తెలుగు లోగిళ్లలోకి ఆశల పల్లకిని మోసుకొచ్చింది. మామి చిగుళ్లరుచి చూసిన కోయిల కూస్తుండగా కొత్త సందడిని తెచ్చింది. పంచాంగాలు శుభాలు పలికాయి. రాశుల గతి, గ్రహాల స్థితి అనకూలమనీ..అక్కడక్కడా..దారితప్పినా అధిగమించే శక్తి లభిస్తుందని చెప్పాయి. పిల్లాది మొదలు ఉగాది పచ్చడి రుచిని ఆత్మీయంగా ఒకరికొకరు తినిపించుకొని జీవన సారాన్ని తెలుసుకున్నారు. ఆలయాలు దేవుళ్ల దీవెనలకోసం కిటకిట లాడాయి. ఇదీ పాలమూరు వాకిట జిల్లా వ్యాప్తంగా సాగిన నవ వసంత ఆగమన వేడుక. వెల్లివిరిసిన తెలుగుదనం. కొత్త సంవత్సరానికి జనం పలికిన స్వాగతం. తెలుగు సంవత్సరం కొంగొత్త ఆశలను చిగురింపజేస్తోంది. కొత్త సంవత్సరం పాలమూరు జిల్లా పురోగతిలో దశలో నడుస్తోందని జ్యోతిష్య పండితులు పేర్కొన్నారు. శ్రీ జయ నామ సంవత్సరం పంచాంగం ఆధారంగా చంద్రుడు రాజు స్థానంలో నిలవడం వల్ల జిల్లా ప్రజలు ప్రశాంత జీవనం కొనసాగిస్తారని, జిల్లాలో సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లోనూ అభివృద్ధి ఉంటుందని, ఈ ఏడాది వర్షాలు అధికంగా ఉండటం వల్ల వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని స్థానిక జ్యోతిష్య పండితుడు రామ్మోహనాచార్య వెల్లడించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట తిరుమలనాథస్వామి ఆలయంలో ఆయన పంచాంగ పఠనం చేశారు. కొత్త పంచాంగం ఆధారంగా ఈ ఏడాది ఆయా రంగాల్లో చోటుచేసుకునే పరిస్థితులను వివరించారు. జిల్లా స్థితి.. రాశి ఫలాలు, గ్రహ స్థితుల ఆధారంగా చూస్తే ఈ ఏడాది పాలమూరు జిల్లా అభివృద్ధి దశలో ఉంటుంది. ముఖ్యంగా జిల్లా కేంద్రంగా ప్రశాంతంగా ఉంటుంది. జిల్లా ఫలితాన్ని బట్టి చూస్తే అన్ని వర్గాల వారు ఆనందోత్సాహాలతో ఉంటారు. కళలను ఆదరిస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించి వర్షాలు సమృద్ధిగా పడటంతో జిల్లా సస్యశ్యామలం అవుతుంది. పాలకులు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. పారదర్శక పరిపాలన కొనసాగుతుంది. -
సెలబస్ : ఇంగ్లిష్ మీడియమ్ ఇల్లు
ఆవకాయా, గోంగూర, ముద్దపప్పూ, పూతరేకూ... గొబ్బిళ్లూ, ఉగాది పచ్చడీ... అట్లతద్దీ, అచ్చతెనుగూ... ఇవన్నీ మన ఆస్తులు. కేవలం మన తెలుగువారి ఆస్తిపాస్తులు. ఇవి మన సంస్కృతి, సంప్రదాయం. ఇంకా మన ఆచార వ్యవహారాలతో పాటూ పెనవేసుకుపోయిన సంపదలు. ఇవి క్రమంగా మన కంటికీ, ఇంటికీ... తెలుగు మనిషికీ, మనసుకీ దూరమైపోతుంటే పెల్లుబికిన వేదనలోంచీ, ఆత్మ సంవేదనలోంచీ పుట్టుకొచ్చిన కవిత ఇది. ఖండాంతరాలు దాటిపోయినా ఖండచాపుతాళం గతి మారనట్లే... తెలుగునాట, తమిళనాట... ఏ నాటనున్నా నాటరాగం ఆరోహణావరోహణలు మారనట్లే... మన తెలుగుతనమూ మారదు. మారకూడదు సుమ్మీ! ఏమంటారు? తెలుగు సినీ గీత రచయితల్లో వనమాలిది ఓ ప్రత్యేకస్థానం. అయితే ఆయనలో గీత రచయితే కాదు... ఓ కవి కూడా ఉన్నారన్న విషయం చాలామందికి తెలియదు. వనమాలి కలం కొమ్మకి పూసిన కవితాసుమాల్లో ఇది ఒకటి... అక్షరాభ్యాసం రోజే ఓం నమః శివాయః ఓ మూలకి ఒదిగిపోతాయి! ఉదయాన్నే పాకెట్ పాల పొదుగుల్ని పిండుకునే ముంగిట్లో సుప్రభాత గీతమేదీ వినిపించదు ముత్యమంత ముగ్గయినా కనిపించదు హుందాగా ఇంగ్లిష్ పేపర్ని తిరగేసే చేతులు తెలుగు నాలికతో వార్తలు వల్లెవేస్తుంటాయి గుక్కపట్టి ఏడ్చే పాపాయిని జోకొట్టడానికి ఆ ఇంట్లో జో అచ్చుతానందలుండవు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్లే అక్కడ జోలపాటలవుతాయి! పురిటిలోనే కేర్‌మనే పాపాయికి డబ్బాపాలే ‘కేర్’ఆఫ్ అడ్రసవుతాయి నాజూకు తల్లి హయాంలో సిరులొలికే పసికందుకు సెరిలాకులే గోరుముద్దలౌతాయి! బువ్వ తినే బుజ్జాయికి నిత్యం టీవీతెరలే అమ్మ చూపే నిండుచందమామలు! అక్కడ పిల్లలకీ, కుక్కపిల్లలకీ ఒకే రకం ముద్దుపేర్లు! ఇంటిపేరు అవధానులయినా ఇప్పుడు మాత్రం అవసానదశే! తలకట్టు విరిగిన అక్షరాలు తలకిందులైన ‘తెల్గూ’ వాక్యాలు అక్కడ ఫ్యాషన్! జీన్సూ, టీ షర్టుల్లో ఎదిగిన కూతుర్ని చూసుకుని మిడిసిపడే ‘మిడిమిడి’ల్ క్లాసులు ఓణీల్నీ పరికీణీల్నీ ఓరకంటయినా చూడవు! అక్కడ వాలుజడ ఒయ్యారాలు పోదు నలనల్లని కాటుక కనుదోయి చేదు! ‘నిధి చాల సుఖమ’నే ఆ లోగిలి త్యాగయ్య సన్నిధిని కోరదు అదివో... అల్లదివో... అక్కడెక్కడో తిరిగే అన్నమయ్యని ఆ గడపలోకి రానివ్వదు అది అక్షరాలా తెలుగువారిల్లు స్వాతంత్య్రం వచ్చినా అదింకా ‘తెల్ల’వారిల్లు!