ప్రధాన వార్తలు

రష్యా, జపాన్‌పై విరుచుకుపడిన సునామీ.. భారతీయులకు హెచ్చరిక
మాస్కో: రష్యా తీరంలో భారీ భూకంపం అనంతరం.. రష్యా, జపాన్ను సునామీ తాకింది. పెద్ద ఎత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. ఉత్తర పసిఫిక్‌లోని పలు తీర ప్రాంతాలను సునామీ (Tsunami) తాకింది. ఇక, అంతకుముందు.. రష్యాలో రిక్టర్ స్కేల్‌పై 8.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. 2011 తర్వాత పసిఫిక్ ప్రాంతంలో ఇంతటి స్థాయిలో భూకంపం తాజాగా వచ్చినట్టు పేర్కొంది. ఈ క్రమంలోనే రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్‌కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారతీయులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.రష్యాలో 8.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. అనంతరం, ట్విట్టర్ వేదికగా.. అమెరికాలోని కాలిఫోర్నియా సహా పశ్చిమ రాష్ట్రాల్లో నివసిస్తున్న భారతీయులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సునామీ ముప్పును శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పాటించాలి. సునామీ హెచ్చరికలు జారీ అయితే.. వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లండి. తీర ప్రాంతాలకు దూరంగా ఉండండి. అత్యవసర పరిస్థితికి సిద్ధమవ్వండి. మీ ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి. సాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించండి. అమెరికా అధికారులు ఇచ్చే సూచనలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. వాటిని పాటించాలని హెచ్చరికలు జారీ చేసింది.🚨🚨🚨The Consulate General of India in San Francisco is monitoring the potential tsunami threat following the recent 8.7 magnitude earthquake off Russia's Kamchatka Peninsula. Indian nationals in California, other US West Coast states, and Hawaii are advised to take the…— India in SF (@CGISFO) July 30, 2025ఇదిలా ఉండగా.. జపాన్ వాతావరణ సంస్థ హక్కైడో తూర్పు తీరంలోని నెమురోకు దాదాపు 30 సెంటీమీటర్ల (సుమారు 1 అడుగు) ఎత్తులో మొదటి సునామీ అల చేరిందని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. జపాన్‌లోని నాలుగు పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హక్వైడో నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రానున్న మూడు గంటల్లో రష్యా, జపాన్ తీర ప్రాంతాల్లో పెద్దఎత్తున సునామీ అలలు రావొచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) పేర్కొంది. అలస్కా అలూటియన్ దీవులలోని కొన్ని ప్రాంతాల్లో సునామీ ప్రభావం ఉంటుందని అలస్కా జాతీయ సునామీ కేంద్రం హెచ్చరించింది. కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్, హవాయితో సహా పలు ప్రాంతాలను అప్రమత్తం చేసింది.pic.twitter.com/iD520Gt6kS A Massive Earthquake triggers a Tsunami, taking thousands of lives in seconds with little to no warning. #Russia #Tsunami #japan #earthquake— Made on Earth by Humans (@1singdollar) July 30, 2025ధైర్యంగా ఉండండి: ట్రంప్మరోవైపు, తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం కారణంగా హవాయి ప్రాంతానికి సునామీ అలర్ట్ జారీ అయ్యింది. అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకూ ముప్పు పొంచి ఉంది. ప్రజలంతా ధైర్యంగా ఉండండి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లండి. అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటించండి’ అని అధ్యక్షుడు సూచించారు.#ÚltimaHora - #Tsunami golpeando las costas de #Kamchatka, Rusia🇷🇺Los tsunamis son una secuencia de olas y no siempre las primeras olas son las más grandes. pic.twitter.com/aBgpkukOUX— SkyAlert (@SkyAlertMx) July 30, 2025ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియలేదు. భూప్రకంపనల నేపథ్యంలో పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్కా నగరంలోని భవనాలు కంపించాయని రష్యా మీడియా తెలిపింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు తెలిపింది. కమ్చాట్కా ప్రాంతంలో విద్యుత్, సెల్‌ఫోన్ సేవల్లో అంతరాయాలు ఏర్పడినట్లు తెలిపింది. భవనాలు అత్యవసర సేవల కోసం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసినట్లు జపాన్ ప్రభుత్వం పేర్కొంది.🚨 BREAKING - Shocking footage of the moment M8.8 earthquake shit the the coast of the Kamchatka Peninsula, East of Russia#Earthquake #Tsunami #Russia #Hawaii #Alert pic.twitter.com/FKnqm6nRdL— T R U T H P O L E (@Truthpolex) July 30, 2025హవాయి, చిలీ, జపాన్, సోలమన్ దీవుల తీరప్రాంతాలలో అలల స్థాయి కంటే 1 నుండి 3 మీటర్ల ఎత్తులో ఎగసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. రష్యా, ఈక్వెడార్‌లోని కొన్ని తీరప్రాంతాలలో 3 మీటర్ల కంటే ఎక్కువ అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది.

చంద్రబాబుకు సింగపూర్ ‘నో’ చెప్పింది.. తట్టుకోలేకపోతున్న చిట్టిబాబు..
సాక్షి, అమరావతి: రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సింగపూర్ కన్సార్షియం పేరుతో చంద్రబాబు, ఆయన బినామీల దోపిడీ బాగోతాన్ని సాక్ష్యాధారాలతో రట్టు చేస్తూ ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ మంగళవారం పోస్టు చేసింది. ‘గతంలో 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి తక్కువ ధరలకే రైతుల నుంచి భూములు కాజేసింది.రాజధానిలో రూ.లక్ష కోట్లు దోచుకున్న చంద్రబాబు అండ్ గ్యాంగ్ రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పేరుతో అదేస్థాయి దోపిడీకీ బరితెగిస్తూ సింగపూర్ కన్సార్షియంతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.18,221.9 కోట్ల పెట్టుబడి పెట్టే ప్రభుత్వానికి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో వచ్చే ఆదాయం 8.7 శాతం, అదే పెట్టుబడి పెట్టే చంద్రబాబు బినామీలతో కూడిన సింగపూర్ కన్సార్షియంకు వచ్చే ఆదాయం 91.3 శాతం. ఇది కుంభకోణం కాదా!’ అని వైఎస్సార్సీపీ నిలదీసింది. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో ఈ కుంభకోణం గుట్టురట్టవుతుందని, అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలవుతామన్న భయంతో సింగపూర్ సంస్థల కన్సార్షియం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని 2019 అక్టోబర్ 30న ప్రభుత్వాన్ని కోరింది.సింగపూర్ సంస్థల కన్సార్షియం అభ్యర్థన మేరకు ఆ ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని వైఎస్సార్సీపీ గుర్తు చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పునరుద్ధరణకు సింగపూర్ సంస్థ కన్సార్షియం ముందుకు రాకపోవడంతో తన దోపిడీకి అడ్డుకట్ట పడిందన్న అక్కసుతో చంద్రబాబు గ్యాంగ్ యథావిధిగా దుష్ప్రచారం చేస్తోందని పేర్కొంది. అవినీతి చక్రవర్తి సీబీఎన్తో కలవలేమని సింగపూర్ చెప్పడంతో తట్టుకోలేక చిట్టిబాబు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పిచ్చెక్కి ఊగిపోతున్నాయని, బాబుతో ‘నో’ అంటూ సింగపూర్ మంత్రి ప్రకటన తర్వాత తెలుగు దొంగల పార్టీ సోషల్ సైకోల వికృత, విచిత్ర, ఉన్మాద విన్యాసాలు, కట్టుకథలు, తప్పుడు ప్రచారాలతో మొదలెట్టేశాయంది. అమరావతి స్టార్టప్ ప్రాజెక్టుం సింగపూర్ పేరుతో బాబు అవినీతి కథలో పాత్రలు, పాత్రధారులతో సహా వాస్తవాలను 14 పాయింట్లతో వైఎస్సార్సీపీ ‘ఎక్స్’లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా.. అమరావతి స్టార్టప్ ప్రాజెక్టు… సింగపూర్ పేరుతో బాబు అవినీతి కథలో పాత్రలు, పాత్రధారులు.. వాస్తవాలు ఇవీ:తెలుగు దొంగల పార్టీ అధినేత, స్కాముల రారాజు చంద్రబాబును చూసి ఏకంగా దేశాలే బెంబేలెత్తిపోతున్నాయి. అమరావతి పేరిట చంద్రబాబు దోపిడీని చూసి ఇప్పుడు సింగపూర్ కూడా ఆ మరక మాకొద్దని ససేమిరా అంది. అమరావతి పునాదులను కుంభకోణాలు, స్కాంలతో మొదలుపెట్టిన చంద్రబాబు, ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తుండడంతో చంద్రబాబు ప్రతిపాదనలకు నో అంటూ ఆయన ముఖంమీదే సింగపూర్ చెప్పేసింది. దయచేసి తమను ఆ గబ్బులోకి లాగొద్దని చెంప చెళ్లుమనిపించేలా తన వైఖరిని స్పష్టంచేసింది. నీకో నమస్కారం అంటూ దండం పెట్టేసింది. 2018లో అమరావతి పేరిట చంద్రబాబు మొదలుపెట్టిన అవినీతి ఇప్పుడు కూడా జోరుగా సాగుతుండడం సింగపూర్ సర్కార్ దృష్టిలోనే ఉంది. దీనికి సాక్ష్యంగా తమదేశానికి చెందిన మాజీ మంత్రి, చంద్రబాబుకు సన్నిహితుడు ఈశ్వరన్ జైలుపాలైన సంగతిని వాళ్లింకా మరిచిపోలేదు.మరోవైపు 2018 నాటి అంచనాలను విపరీతంగా పెంచి, అమరావతిలో రెండో దఫా దోపిడీకి చంద్రబాబు చేస్తున్న స్కాంలు కూడా సింగపూర్ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. అమరావతిలో భూమి ప్రభుత్వానిది అయినా, ఇసుక ఉచితం అయినా, నిర్మాణ ఖర్చులు 2018తో పోలిస్తే పెరుగుదల లేకపోయినా భారీగా అంచనాలు పెంచి దోచేస్తున్న తీరుతో ఈ అవినీతి వ్యవహారంలోకి అడుగుపెట్టలేమని చెప్పేసింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు సుమారు రూ.9 -10వేలు ఖర్చు చేస్తున్న తీరుపై, ఆరేట్లు చూసి వాళ్లే దిగ్భ్రాంతి చెందారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. అందుకనే బాబు అంటేనే భయపడుతున్నాయి. 💣Truth Bomb 💣Must Read ❗అవినీతి చక్రవర్తి @ncbn తో కలవలేమన్న సింగపూర్తట్టుకోలేక పిచ్చెక్కి ఊగిపోతున్న చిట్టిబాబు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు బాబుతో నో అంటూ సింగపూర్ మంత్రి ప్రకటన తర్వాత కట్టు కథలు, తప్పుడు ప్రచారాలుతెలుగు దొంగలపార్టీ సోషల్ సైకోల వికృత, విచిత్ర, ఉన్మాద… pic.twitter.com/MrzRYFxB8S— YSR Congress Party (@YSRCParty) July 29, 2025వాస్తవం ఏంటేంటే.. సింగపూర్ పేరు చెప్పి చంద్రబాబు చెప్పిన అవినీతి కథ ఏంటంటే?1.అమరావతిలో కోర్ క్యాపిటల్ ఏరియా 1691 ఎకరాలు. దీని అభివృద్ధి పేరిట చంద్రబాబు వేలకోట్ల అవినీతికి తెరలేపాడు. 2. ఈ 1691 ఎకరాల్లో ల్యాండ్ డెవలప్ మెంట్ కోసం 2018లో ఏపీ ప్రభుత్వం నుంచి CRDA మరియు అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్ లిమిటెడ్‌కు ఒప్పందం కుదిరింది. 3.అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్లో సింగపూర్ కంపెనీలు అసెండాస్ సింగ్ బ్రిడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్, సెమ్‌కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్‌లు ఉన్నాయి. ఇవి కన్సార్షియంఏర్పడ్డాయి. ఈ కన్సార్షియం చంద్రబాబు బినామీలతో కూడిన క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ CCMDC ని చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా చొరబడేలా చేశాడు. ( అఫీషియల్ డాక్యుమెంట్ చూడొచ్చు)4.ఉద్దేశ పూర్వకంగా ఈ కంపెనీలకు అప్పగించడానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ఎంపిక చేశారు. అంటే ఒక ప్రాజెక్టు ఆలోచన వాళ్లు చేస్తారు, ఎంత ఆదాయం ఇస్తామో వాళ్లే ప్రభుత్వానికి చెప్తారు, అంతకంటే ఎక్కువ ఇస్తామని ఏదైనా ఇతర కంపెనీ ఇస్తే ఆ కంపెనీకి ఆప్రాజెక్టు ఇస్తారు, లేదా, ఆ ధర తామే ఇస్తామంటే, ప్రాజెక్టు ఆలోచన చేసిన కంపెనీకి ఇస్తారు. కాని ఇక్కడ ఆదాయం ఎంత అనే విషయాన్ని ఈ కంపెనీలు చెప్పలేదు. దీన్ని హైకోర్టుకూడా తప్పుబట్టింది. అయినా వీటికే కోర్ క్యాపిటల్ ల్యాండ్ డెవలప్ మెంట్‌ను చంద్రబాబు అప్పగిస్తారు. అమరావతిలో అవినీతికి ఈ రకంగా పునాదులు పడ్డాయి. 5.కోర్ క్యాపిటల్ లోని 1691 ఎకరాల్లో రోడ్లకోసం 371 ఎకరాలు పోనూ, మిగిలిన 1321 ఎకరాల్లో 250 ఎకరాలు సింగపూర్ కన్సార్షియంకు ఫ్రీగా ఇస్తారు. అవి ఆ కన్సార్షియం అమ్ముకోవచ్చు. ప్రభుత్వానికి ఒక్కపైసా రాదు. మిగిలిన 1070 ఎకరాలను ప్లాట్లుగా వేస్తారు. 6. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ఖర్చులన్నీకూడా మొత్తం ప్రభుత్వమే పెడుతుంది. దీనికోసం రూ.5,500 కోట్లు ప్రభుత్వమే పెడుతోంది. సింగపూర్ కన్సార్షియంలో చంద్రబాబు బినామీల CCDMCల వాటాగా కేవలం రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది.7.విచిత్రంగా ఈ 1070 ఎకరాల్లో తన బినామీలు ఉన్న CCDNCతో కూడిన సింగపూర్ కంపెనీల కన్సార్షియంకు, ఉచితంగా 250 ఎకరాలు ఇస్తానని చంద్రబాబు ఒప్పందం చేసుకున్నాడు. ఇవాళ చంద్రబాబు చెప్తున్న ధర ప్రకారం ఎకరా రూ.50 కోట్లు లెక్కవేసుకుంటే ఈ 250 ఎకరాల విలువ అక్షరాల రూ.12,500 కోట్లు. ఇది ప్రజల ఆస్తులను కొట్టేయడం కాదా?8.ఈ అవినీతి బాగోతం ఇక్కడితో ఆగిపోలేదు. 1071 ఎకరాల అభివృద్ధికోసం రూ.18,229 కోట్లు ఖర్చుచేసినా రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి డెవలప్మెంట్ పార్టనర్ కంపెనీలో దక్కే వాటా 42 శాతం మాత్రమే. చంద్రబాబు బినామీలతోకూడిన సింగపూర్ కన్సార్షియంకు దక్కే వాటా 58 శాతం. 9. కాని 250 ఎకరాలు ఉచితంగా ఇవ్వడం ద్వారా రూ.12,500 కోట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికోసం ప్రభుత్వం ఇచ్చే రూ.5,500 కోట్లు, CCDMC వాటా కింద ఇచ్చే రూ.221.9కోట్లు వెరసి రూ.18,221.9 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రభుత్వ సంస్థ సీఆర్డీయేకు దక్కే వాటా కేవలం 42శాతమే. ఇది స్కాం కాదా?10.చివరకు స్టార్టప్ ఏరియా టర్నోవర్‌లో ప్రభుత్వానికి సగటున దక్కే వాటా కేవలం 8.7 శాతం దక్కనుండగా కన్సార్షియానికి 91.3 శాతం వాటా లభిస్తుంది. మరి అవినీతి కాదా? 11.వాస్తవానికి కన్సార్షియం ముసుగులో చంద్రబాబు బినామీలు పెట్టుబడులు పెట్టారు. సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ సహకరించారు. బాబు దెబ్బకు సింగపూర్ ప్రతిష్ఠ కూడా దెబ్బతిన్న మాట వాస్తవం కాదా?12.ఇక ప్లాట్ల విక్రయం వ్యవహారాలు చూసేందుకు తీసుకొచ్చిన CCDMC కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రాతినిధ్యం ఉండదు. మరి ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి పోతోంది?13.సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్ ప్లాన్ పనులను ఇచ్చారన్నది అబద్ధం. ‘సుర్బానా–జురాంగ్’కు రూ.28.96 కోట్లకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. దీన్ని తప్పు బడుతూ 2023లో కాగ్ నివేదిక ఇచ్చింది. 14.అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో దోపిడీకి చంద్రబాబు వేసిన స్కెచ్‌కు... 2019 ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం రావడంతో తెరపడింది. కుంభకోణం బహిర్గతమైతే అంతర్జాతీయంగా ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతింటుందని సింగపూర్ సంస్థల కన్సార్షియం ఆందోళన చెందింది. దాంతో 2019 అక్టోబర్ 30న ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. వారి అభ్యర్థనల మేరకు ఆ ఒప్పందాన్ని అప్పట్లో ప్రభుత్వం రద్దు చేసింది. ఇది వాస్తవం కాదా?

భారత్‌పై 25 శాతం సుంకాలు.. గడువుకు ముందే ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ సుంకాలపై ఆగస్టు ఒకటి వరకూ ఇచ్చిన గడువుకు ముందే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ తమకు మంచి మిత్రదేశమని, అయితే ఇదే భారత్ ఇతర దేశాల కంటే ఎక్కువ సుంకాలను వసూలు చేసిందని, కానీ తాము అలా చేయబోమని ట్రంప్ పేర్కొన్నారు. తన ఐదు రోజుల స్కాట్లాండ్ పర్యటన ముగించుకుని, వాషింగ్టన్కు తిరిగి వస్తూ, ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై తాము 20 శాతం నుండి 25 శాతం వరకూ సుంకం రేటు విధించే అవకాశాలున్నాయన్నారు. అయితే ఇందుకు ఆగస్టు ఒకటి వరకూ గడువు ఉందని, దీనికి ముందుగా ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నందున తుది సుంకం ఇంకా ఖరారు కాలేదని ట్రంప్ పేర్కొన్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దిగుమతులపై చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమయ్యింది. భారత్‌పై 20 నుంచి 25శాతం వరకు సుంకాలు విధించే యోచనలో ఉన్నట్టు ట్రంప్ సూచన ప్రాయంగా ప్రకటించారు. అమెరికా- భారత్ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. భారత్ దిగుమతులపై 25శాతం వరకు సుంకాలు విధిస్తారా? అని మీడియా అడిగినప్పుడు ఆయన ‘అలా అనుకుంటున్నాను’ అని సమాధానమిచ్చారు.రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ అమెరికా ప్రయోజనాల కోసమంటూ ప్రపంచ దేశాలపై భారీ మొత్తంలో సుంకాలు విధించేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలుత సుంకాల విధింపునకు 2025 ఏప్రిల్ 2 తుది గడువు పెట్టారు. ఆ సమయంలోపు తమతో ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. ఆ తరువాత ఈ గడువును జూలై 9కి మార్చారు. అనంతరం దానిని ఆగస్ట్ ఒకటి వరకూ పొడిగించారు. కాగా అమెరికా.. యూకే, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, యూరోపియన్ యూనియన్, జపాన్‌లతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్‌తో ఇంకా ఎలాంటి ఒప్పందం నిర్ణయం కాలేదు.

ప్రజల తరఫున ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. వేధింపులు
మన ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో నేరుగా కానీ, కార్పొరేషన్లకు గ్యారెంటీతో కానీ చేసిన మొత్తం అప్పు రూ.3.32 లక్షల కోట్లు. అయితే అందులో 52 శాతం అప్పును చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఈ 14 నెలల్లోనే చేసింది. ఏ స్కీమ్ లేదు. అయినా రూ.1.75 లక్షల కోట్లు అప్పు చేశారు. మన హయాంలో రెండేళ్లు కోవిడ్. అయినా అన్ని పథకాలు అమలు చేశాం. గ్రామ, వార్డు సచివాలయాలు కట్టాం. ఆర్బీకేలు కట్టాం. పోర్టుల నిర్మాణం చేపట్టాం. స్కూళ్లు బాగు చేశాం. కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చాం. విలేజ్ క్లినిక్స్ కట్టాం. పాలనలో విప్లవాత్మక మార్పులు చూపాం. ఇవన్నీ నిర్వీర్యం అయ్యాయి. – వైఎస్ జగన్ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు. అవన్నీ వీరి జేబుల్లోకి పోతున్నాయి. అందుకే దేశ ఆదాయం సగటున 12 శాతం పెరిగితే, ఇక్కడ అది కేవలం 3 శాతమే. అంటే ఇక్కడ ప్రభుత్వ ఆదాయం ప్రభుత్వానికి కాకుండా, వీరి జేబుల్లోకి పోతోంది. అందుకే ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదు. ఇప్పుడు మళ్లీ సింగపూర్ పర్యటన. ఈ డబ్బులన్నీ అక్కడ దాచి పెట్టుకోవడానికే ఈ పర్యటన. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీల అమలులో.. పరిపాలనలో అన్నింటా టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విశృంఖలంగా అవినీతి.. యథేచ్ఛగా దోపిడీ సాగుతోందని మండిపడ్డారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తే విపక్షం గొంతు నొక్కేందుకు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని ఎత్తిచూపారు. రాష్ట్రంలో ఎక్కడా పరిపాలన అనేది లేదని, ప్రజలకు ఏ మేలూ జరగడం లేదన్నారు. చంద్రబాబు ష్యూరిటీలో పక్కాగా మోసం గ్యారంటీ అన్నది స్పష్టమైందన్నారు. చంద్రబాబు మోసాలు మరింతగా ఎండగట్టాలని.. ఆ దిశలో ఇప్పటికే వైఎస్సార్సీపీ కార్యక్రమం చేపట్టిందని– అదే రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో (చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుచేసుకుంటూ..) అని గుర్తు చేశారు. ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని, రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మన కార్యక్రమం చేరాలని.. అందుకు పార్టీలో సీనియర్ నేతలు మరింతగా చొరవ చూపాలని వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పీఏసీ సభ్యులు హాజరయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు.. అక్రమ కేసులు, అరెస్టులు.. ప్రజల తరపున ప్రశ్నించే గొంతులు నొక్కే ప్రయత్నం.. వైఎస్సార్సీపీలో చురుకుగా వ్యవహరిస్తున్న నాయకులే లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగిస్తున్న వేధింపులు.. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడం.. చంద్రబాబు చేసిన, చేస్తున్న మోసాలను ప్రజల్లో ఇంకా బలంగా ఎండగట్టడం.. బాబూ ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తీసుకెళ్లడంపై సమావేశంలో వైఎస్ జగన్ చర్చించారు. కూటమి ప్రభుత్వ మోసాలు, అక్రమాలు, అవినీతిపై ప్రజల తరఫున ప్రశ్నిస్తూ.. పోరాటం చేస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. సూచనలు, సలహాల కోసం పార్టీలో సీనియర్లను పీఏసీలోకి తీసుకొచ్చామని.. నెలకోసారి పీఏసీ సమావేశం జరిగేలా చూస్తామని చెప్పారు. ‘ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు అందరికీ తెలుసు. మనం ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. చూస్తుండగానే దాదాపు ఏడాదిన్నర గడిచింది. ఇంకా మనకు మిగిలింది మూడేళ్లు మాత్రమే. మనం ఇప్పుడు రాక్షస పాలన చూస్తున్నాం. దాన్ని ఇంకా ఎదుర్కోవాల్సి ఉంది’ అని అన్నారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. మనం ఇదే సంప్రదాయం కొనసాగిస్తే టీడీపీ సీనియర్ నేతలంతా జైళ్లలోనే.. » రాష్ట్రంలో ఎక్కడా పరిపాలన అనేది లేదు. ప్రజలకు ఏ మేలూ జరగడం లేదు. రాష్ట్రంలో విశృంఖలంగా అవినీతి.. యథేచ్ఛగా దోపిడీ సాగుతోంది. ప్రజల తరఫున ప్రశ్నిస్తే విపక్షం గొంతు నొక్కేందుకు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారు. మన పార్టీ సీనియర్ నాయకులను జైళ్లలో పెడుతున్నారు. భవిష్యత్తులో మనం ఇదే సంప్రదాయం కొనసాగిస్తే టీడీపీ సీనియర్ నాయకులంతా జైళ్లలోనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మన లీడర్లను అన్యాయంగా జైళ్లలో పెట్టారు. మిథున్ రెడ్డిని చూస్తే బాధనిపిస్తోంది. ఆయన్ను నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. మేకపాటి గౌతమ్‌రెడ్డిని కూడా నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. వారి తండ్రులు మా నాన్న బ్యాచ్. వారిద్దరూ నా బ్యాచ్. నా ఫ్రెండ్స్. కేవలం వేధించడం కోసమే మిథున్‌రెడ్డిని అరెస్టు చేసి, జైల్లో పెట్టారు. ఆయన కనీసం ఇక్కడ మంత్రి కూడా కాదు. ఆయన తండ్రి రామచంద్రన్న ఎక్సైజ్ మంత్రి కూడా కాదు. » అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. ఆయన ఖర్మ ఏమిటంటే, అది చంద్రబాబు నియోజకవర్గం. అక్కడ మంత్రిగా ఉండి కూడా చంద్రబాబు ఓడిపోయాడు. 1978లో ఎమ్మెల్యేగా చంద్రగిరి నుంచి గెల్చి, మంత్రిగా ఉంటూ పోటీ చేసి 1983లో ఓడిపోయాడు. ఆ తర్వాత తన మామ కాళ్లూ వేళ్లూ పట్టుకుని టీడీపీలో చేరి, పోటీ చేశాడు. ఆ తర్వాత చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు. చంద్రగిరిలో తన ప్రత్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కాబట్టి, టార్గెట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆయన కొడుకును కూడా వేధించి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. » నందిగం సురేష్ దళితుడు. ఎంపీగా ఎదిగాడు. 6 నెలల 10 రోజులు.. మొత్తం 191 రోజులు జైల్లో పెట్టారు. ఒక కేసు కాగానే మరో కేసు పెట్టి జైల్లో ఉంచారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డిని కూడా అక్రమంగా అరెస్టు చేశారు. క్వార్ట్జ్ గనుల కేసు.. టోల్ గేట్ కేసు.. ఇలా వరసగా కేసులు పెట్టి, వేధిస్తున్నారు. ఇప్పటికే జైల్లో పెట్టారు. ఇప్పుడు అనిల్‌కుమార్ యాదవ్ టార్గెట్. ఆయన్నూ అరెస్టు చేయాలని చూశారు. కానీ, ఆ కుట్రలో భాగంగా అరెస్టు అ వ్యక్తి (శ్రీకాంత్‌రెడ్డి) జడ్జి ముందు నోరు విప్పి పోలీసుల వేధింపుల గురించి చెప్పడంతో అనిల్ కుమార్ అరెస్టు కాలేదు. ప్రజల తరఫున ప్రశ్నించే వారందరి గొంతు నొక్కే ప్రయత్నం » ప్రజల తరపున మాట్లాడే వారిని, ప్రజా సమస్యలు ప్రస్తావించే వారిని ఇలా వేధించడం ఇదే మొదటిసారి. నిజానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి, సుపరిపాలన అందిస్తే, ఇలాంటి చర్యలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏ హామీ అమలు చేయకపోవడంతో, ప్రజల వద్ద ముఖం చెల్లక ఇలా ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశలోనే జోగి రమేష్ కొడుకును అరెస్టు చేయడం.. రోజాను వేధించి ఆనందం పొందడం.. విడదల రజని మీదా కేసు పెట్టారు. వేధించే ప్రయత్నం చేస్తున్నారు. » నెల్లూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి దారుణం. పోలీసుల సమక్షంలోనే ఇంట్లో విధ్వంసం సృష్టించారు. అదృష్టవశాత్తు అప్పుడు ఆయన ఇంట్లో లేరు. ఒకవేళ ఆయన ఇంట్లో ఉండి ఉంటే చంపేసే వారు. ఇంట్లో మొత్తం ధ్వంసం చేశారు. కారును కూడా పడదోశారు. దాడిపై ఆయన ఫిర్యాదు చేస్తే, పట్టించుకోని పోలీసులు.. ఎమ్మెల్యే ఫిర్యాదు చేయగానే తిరిగి ప్రసన్నకుమార్‌రెడ్డిపైనే చర్య తీసుకున్నారు. తాడిçపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని సొంత ఇంటికి పోనివ్వడం లేదు. పైగా సీఐ గన్ చూపి బెదిరిస్తున్నారు. కొందరు పోలీసుల అవినీతిపర్వం కొందరు పోలీసులు అవినీతిలో మునిగిపోయారు. ఒక జోన్‌కు డీఐజీ. ఆయన ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలు.. వసూళ్లు చేసి, ఎమ్మెల్యేలకు, అక్కణ్నుంచి సీఎంకు, ఆయన కుమారుడికి నిధులు ఇస్తున్నారు. అలా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు. గ్రామాల్లో బెల్టు షాపులకు వేలం నిర్వహించి, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారు. వారికి పోలీసులు రక్షణగా నిలుస్తున్నారు. ఇసుక దగ్గరుండి అమ్మిస్తున్నారు. ఏ ఒక్క గని కూడా వదలడం లేదు. నేరుగా డీఐజీ డీల్ చేస్తున్నాడు. ఎమ్మెల్యేకు ఇంత.. సీఎంకు ఇంత.. ఆయన కొడుక్కి ఇంత.. అని ఇస్తున్నారు. ఇందులో డీఎస్పీ, సీఐలకూ వాటా వెళ్తోంది. ఇంత అవినీతి గతంలో ఎక్కడా చూడలేదు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ సక్సెస్ ‘రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’.. బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ కార్యక్రమం బాగా కొనసాగుతోంది. ఇప్పటికే 175 నియోజకవర్గాలకు గాను 169 చోట్ల జరిగింది. ఆరు నియోజకవర్గాల్లో వేర్వేరు కారణాల వల్ల ఆలస్యమైంది. 640 మండలాల్లో దాదాపు 538 మండలాల్లో పూర్తి కాగా, మిగిలిన 102 మండలాల్లో వేగంగా పూర్తి చేస్తాం. దాదాపు 90 నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమం సాగుతోంది. మన క్యూ ఆర్ కోడ్ ద్వారా ప్రతి ఇంటికీ ఈ కార్యక్రమం చేరుతోంది. ఆ ఇంటికి చంద్రబాబు ఎంత బాకీ ఉన్నాడు.. గత ఏడాది ఎంత ఎగ్గొట్టాడు.. ఈ ఏడాది ఎంత బాకీ పడుతున్నాడు.. అనేది చెబుతున్నాం. కార్యకర్తల కోసం ప్రత్యేక యాప్.. డిజిటల్ లైబ్రరీవచ్చే వారంలో మనం ఒక యాప్ విడుదల చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా, ఎవరైనా, ఏ కార్యకర్త అయినా అధికారులతో వేధింపులకు గురైతే, లేదా ఏదైనా అన్యాయానికి గురైతే ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఫిర్యాదు చేయొచ్చు. మీకు ఏ రకంగా అన్యాయం జరిగింది..? అని ఆ యాప్‌లో స్పష్టంగా ఉంటుంది. ఫలానా అధికారి.. ఫలానా నాయకుడి ఆదేశాలతో నాపై అన్యాయంగా, అక్రమంగా కేసు పెట్టి.. చిత్రహింసలకు గురి చేశారని బాధితులంతా ఫిర్యాదు చేయొచ్చు. ఏ అధికారి ఎలా ఇబ్బంది పెట్టారో.. ఏ విధంగా బాధ పెట్టారో.. తద్వారా ఎలా ఇక్కట్లకు గురయ్యారో.. ఇబ్బంది పెట్టిన వారి పేర్లతో సహా వివరించవచ్చు. ఎవరి ప్రోద్బలంతో ఇబ్బందులకు గురి చేశారో స్పష్టంగా చెప్పొచ్చు. దానికి సంబంధించిన ఆధారాలు ఉంటే, వాటినీ అప్లోడ్ చేయొచ్చు. అవన్నీ మన డిజిటల్ లైబ్రరీలోని సర్వర్‌కు చేరుతాయి. రేపు మన ప్రభుత్వం రాగానే, డిజిటల్ లైబ్రరీలో (సర్వర్) దాన్ని ఓపెన్ చేస్తాం. ఎవరెవరైతే మన కార్యకర్తలకు అన్యాయం చేశారో వారెవ్వరినీ వదలకుండా చట్టం ముందు నిలబెడతాం. వారందరికీ సినిమా చూపిస్తాం. వారు చేసినవన్నీ వడ్డీతో సహా చెల్లిస్తాం. ఇక్కడ మనం ఎలాంటి అన్యాయం చేస్తామనడం లేదు. ఈ రోజు వారు ఏ విత్తనం విత్తుతున్నారో రేపు అదే పండుతుంది. అందుకే చక్రవడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది.ఆడబిడ్డ నిధి అడిగితే రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారు » ఎన్నికలప్పుడు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. 18 ఏళ్లకు మించిన మహిళలు రాష్ట్రంలో 2.10 కోట్లు ఉన్నారు. వారికి నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామన్న హామీ నెరవేర్చలేదు. ఈ పథకాన్ని అమలు చేయాలంటే, రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారు. మరి ఎందుకు హామీ ఇచ్చినట్లు? » అమ్మ ఒడి తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఇచ్చినా 30 లక్షల మందికి తగ్గించాడు. రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. ఆ తర్వాత మాటమార్చి రూ.13 వేలు అని చెప్పారు. అదీ ఇచ్చారా అంటే లేదు. రూ.8,500 చొప్పున ఇచ్చారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీలో మనం ఇవన్నీ ప్రజలకు వివరిస్తున్నాం. » రాష్ట్రంలో తొలిసారి పిల్లలు చదువు మానేస్తున్నారు. పిల్లలకు విద్యా దీవెన లేదు. 2024లో జనవరి–మార్చి త్రైమాసికం మొదలు, ఇప్పటి వరకు మొత్తం ఆరు క్వార్టర్లు పెండింగ్. రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.4,200 కోట్లు కావాలి. ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. వసతి దీవెన ఏటా ఏప్రిల్‌లో రూ.1,100 కోట్ల చొప్పున ఇవ్వాలి. అది కూడా ఇవ్వకపోవడంతో రెండేళ్లకు రూ.2,200 కోట్లు పెండింగ్. రెండూ కలిపి మొత్తం రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. దీంతో పిల్లలు బడి మానేస్తున్నారు. » ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు. 14 నెలల నుంచి పెండింగ్. అలా రూ.4,200 కోట్లు బకాయి. ఇచ్చింది రూ.400 కోట్లు కూడా లేదు. ఆరోగ్య ఆసరాకు ఏటా అయ్యే ఖర్చు రూ.450 కోట్లు. అదీ ఇవ్వడం లేదు. ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం నిరాకరిస్తున్నాయి. » ఏ రైతుకూ, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఏ రైతు పరామర్శకు వెళ్లినా కేసు పెడుతున్నారు. ఉచిత పంటల బీమా ఎత్తేశారు. ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్ లేదు. నిరుద్యోగ భృతి దేవుడెరుగు. పిల్లలకు ఏమీ చేయడం లేదు. నాడు–నేడు మనబడి లేదు. అసలు రాష్ట్రంలో పరిపాలన అనేది ఉందా?గ్రామ స్థాయిలోనూ అనుబంధ కమిటీలు » రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. విన్ వన్‌సైడ్ ఉంటుంది. మొత్తం సీట్లు ఎప్పుడు గెలుస్తామంటే.. గ్రామ స్థాయిలో కూడా పార్టీ నిర్మాణం బాగా జరిగినపుడే. ప్రతి ఊళ్లో కనీసం 10 మందిని (గ్రామ కమిటీ సభ్యులు) ఆ ప్రాంత ఎమ్మెల్యే గుర్తు పట్టాలి. పేరు పెట్టి పిలిచేలా ఉండాలి. »గ్రామ కమిటీల తర్వాత, బూత్ కమిటీల నిర్మాణం జరగాలి. అలా ఒక వైపు పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేస్తూనే మరో వైపు ప్రజల్లో మరింత మమేకమై పని చేయాలి. ప్రతి గ్రామంలో మనకు యువజన, మహిళ, విద్యార్థి, సోషల్ మీడియా, రైతు, కార్మిక విభాగాల కమిటీలు ఉండాలి. అప్పుడే మరింత బలపడతాం. నేను ఫలానా గ్రామంలో మహిళా అధ్యక్షురాలిని. నేను విద్యార్థి విభాగం నాయకుడిని.. అని చెప్పుకునేలా గ్రామ స్థాయిలో పక్కాగా అన్ని కమిటీల నిర్మాణం జరగాలి. వారికి ఐడీ కార్డు కూడా ఇవ్వాలి. దాని వల్ల వారిని ప్రోత్సహించినట్లు అవుతుంది. దీని వల్ల పార్టీ ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ అవుతుంది. ఇలా ప్రతి గ్రామంలో ఆరు నుంచి ఏడు కమిటీలు ఏర్పాటు చేస్తే, 13 వేల గ్రామాల్లో ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులే దాదాపు 80 వేల మంది ఉంటారు. ఇక సభ్యుల సంఖ్య సరేసరి. రెండు మూడు నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి కావాలి. ప్రతి ఒక్కరూ తమ ఫోన్లో బాబు ష్యూరిటీకి సంబంధించి క్యూ ఆర్ కోడ్ ఓపెన్ చేసుకునేలా పార్టీ సీనియర్ నేతలంతా చొరవ చూపాలి. – వైఎస్ జగన్మానిటరింగ్ ముఖ్యం» మీరంతా సీనియర్ లీడర్లు కాబట్టి కాస్త చొరవ చూపాలి. జిల్లా స్థాయిలో అందరితో, నాయకులతో మమేకం కావాలి. పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలి. యువ నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తూ పని చేయాలి. »మన వ్యవస్థ.. జిల్లా అధ్యక్షులు.. రీజినల్ కో ఆర్డినేటర్లు.. పార్లమెంటు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు.. అందరూ వారి వారి స్థాయిలో క్రియాశీలకంగా మారాలి. మరింత చొరవతో పని చేయాలి. మీరు ఎప్పుడైతే యాక్టివేట్ అవుతారో.. జూనియర్ నాయకులూ చొరవ చూపుతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీని మరింత బలోపేతం చేసే అవకాశం వస్తుంది. ఆ సమయంలోనే మనకు గ్రామాలపై, పార్టీ కార్యకర్తలపై స్పష్టమైన అవగాహన వస్తుంది. ఎవరు, ఎలా కష్టపడుతున్నారనేది తెలుస్తుంది. వారందరినీ వ్యవస్థీకృత విధానంలోకి తీసుకొస్తే, అన్నీ సక్రమంగా జరుగుతాయి.» రచ్చబండ కార్యక్రమం తర్వాత, గ్రామ కమిటీల ఏర్పాటు జరుగుతోంది. గతంలో మొక్కుబడిగా అవి ఏర్పాటయ్యేవి. ఇప్పుడు వాటి ఏర్పాటులో మన నాయకుల మానిటరింగ్ ఉండాలి. గ్రామ స్థాయిలో మన కార్యకర్త ఒక వ్యవస్థీకృత విధానంలోకి రావాలి. వారికి మీరు దిశా నిర్దే«శం చేయాలి. » ఇప్పుడు చంద్రబాబునాయుడు చేసిన మోసం స్పష్టంగా కనిపిస్తోంది. అదే మనం ఉంటే, అన్నీ దక్కేవని ప్రజలు గుర్తించారు. చంద్రబాబు రావడంతో బిర్యానీ మాట దేవుడెరుగు.. పలావ్ కూడా పోయిందని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మీరు మూవ్ కావాలి. మరింత అగ్రెసివ్‌గా పని చేయాలి. కార్యకలాపాల్లో అందరూ పాల్గొనాలి. అవన్నీ సక్రమంగా జరగాలంటే గ్రామ కమిటీల ఏర్పాటు కూడా పూర్తి కావాలి. » కార్యకర్తలకు మంచి ఇన్సూరెన్స్ కల్పిస్తాం. మన పార్టీకి 15 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రజల్లో మనం బలంగా ఉన్నాం. ఇంకా బలోపేతం కావాలంటే, కార్యకర్తలు చాలా ముఖ్యం. మనం వారికి తోడుగా, అండగా ఉన్నామన్న విశ్వాసం కల్పించాలి. గతంలో మన ప్రభుత్వ హయాంలో కోవిడ్ వల్ల కార్యకర్తలను అంతగా పట్టించుకోలేకపోయాం. ఈసారి అలా కాదు. వారికి చాలా ప్రాధాన్యం ఇస్తాం.వైఎస్ జగన్ భద్రతపై పీఏసీ సభ్యుల ఆందోళన ఇటీవలి పర్యటనల్లో జగన్‌కు ప్రభుత్వం తగిన భద్రత కల్పించక పోవడంపై సమావేశంలో పీఏసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవల చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటన సందర్భంగా పోలీసులు చూపిన నిర్లక్ష్యాన్ని సమావేశంలో సభ్యులు ప్రస్తావించారు. ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వం ఆయనకు తగిన భద్రత కల్పించడం లేదని తేల్చి చెప్పారు. జగన్ భద్రతపై వినిపిస్తున్న కథనాలు తమను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో జగన్ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ పీఏసీ సభ్యులు స్పష్టం చేశారు.

భారీ భూకంపంతో వణికిన రష్యా.. 8.7 తీవ్రత నమోదు
మాస్కో: రష్యాలోని తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం 8.7 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. రాబోయే మూడు గంటల్లో రష్యా, జపాన్ తీరప్రాంతాలకు విధ్వంసక సునామీ అలలు చేరుకోవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే హెచ్చరించింది. భూకంప ప్రభావిత ఈ ప్రాంతానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. 🚨 BREAKING: Tsunami waves from the 8.7 magnitude earthquake have begun slamming RussiaBuildings are already being swept awayTsunami waves are also heading to Hawaii, expected to arrives within hours pic.twitter.com/dPg72zln9N— Nick Sortor (@nicksortor) July 30, 2025భూకంప తీవ్రతకు భవనాల లోపల జరిగిన కంపనలు ఆ వీడియోలలో కనిపిస్తున్నాయి. ఒక వీడియోలో భూకంపం సంభవించిన సమయంలో అపార్ట్మెంట్లోని ఫర్నిచర్ తీవ్రంగా ఊగిపోవడాన్ని గమనించవచ్చు. Videos are pouring in showing VIOLENT SHAKING from the MASSIVE M8.8 Earthquake off Kamchatka, RUSSIA! pic.twitter.com/zwx1jbhx0y— RT (@RT_com) July 30, 2025రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పానికి అతి సమీపంలో ఈ భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తు నేపధ్యంలో జపాన్ వాతావరణ విభాగం రష్యా తీరం వెంబడి సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్ కాలమానం ప్రకారం ఈ భూకంపం బుధవారం ఉదయం 8:25 గంటలకు సంభవించింది.#BREAKING Yuzhno-Sakhalinsk, Russia 8.7 Earthquake - 46 Miles deep in the Ocean ALL OF THE WEST COAST IS UNDER TSUNAMI WARNING - We will know soon if the bouys pick up the TSUNAMI level soon hereMillions of people could end up evacuating depending how this goes.Hard to… pic.twitter.com/w54KXkE3If— MəanL¡LMə♡₩ (@MeanLILMeoW) July 30, 2025Breaking right now..Earthquake near Russia 8.7 magnitude and a tsunami alert has been spread to Alaska, Japan, and Russia..Developing story here as information is just coming out now..Prayers for all in its wake..🙏🙏🙏pic.twitter.com/aaTokSE7OQ— Chris from Massachusetts AKA TommyboyTrader (@autumnsdad1) July 30, 2025ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. జపాన్‌లోని నాలుగు దీవులకు ఉత్తరాన ఉన్న హక్కైడోకు ఈ భూకంప కేంద్రం 250 కిలోమీటర్లు (160 మైళ్ళు) దూరంలో ఉందని సమాచారం. జపాన్‌కు చెందిన ఎన్‌హెచ్‌కే టెలివిజన్ తెలిపిన వివరాల ప్రకారం, ఇది స్వల్ప ప్రభావమే చూపిందని తెలుస్తోంది. ఈ భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 12 మైళ్ల లోతులో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే కమ్చట్కాలో ఏ మేరకు ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందనే సంగతిని రష్యా ఇంకా వెల్లడించలేదు. కాగా హవాయికి దీపానికి రష్యా సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఇది తక్కువ ముప్పు కలిగిన అలర్ట్ అని తెలుస్తోంది. టోక్యో భూకంప శాస్త్రవేత్త షినిచి సకాయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ భూకంపం జపాన్ను తీవ్రంగా ప్రభావితం చేసే సునామీకి కారణంగా నిలవనున్నదని అంచనా వేశారు. ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాలలో జపాన్ ఒకటి. ఈ ప్రాంతంలో ఈ నెల ప్రారంభంలోనే ఐదు భారీ భూకంపాలు- 7.4 తీవ్రతతో సంభవించాయి. అతిపెద్ద భూకంపం 20 కిలోమీటర్ల లోతులో సంభవించింది. పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి తూర్పున 144 కిలోమీటర్ల దూరంలో ఇది తన ప్రభావాన్ని చూపింది. 1952,నవంబర్ 4న కమ్చట్కాలో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆందోళన కలిగించింది. నాడు హవాయిలో 9.1 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

‘నువ్వు గ్రౌండ్స్‌మన్‌వి మాత్రమే’
లండన్: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు రెండు రోజుల ముందు భారత జట్టును మానసికంగా దెబ్బ తీసే ప్రయత్నం మొదలైంది. అయితే ఇది ఆటగాళ్ల నుంచి రాలేదు. చివరి టెస్టు జరిగే ఓవల్ పిచ్ క్యురేటర్ చేసిన ‘అతి’ మైదానంలో చర్చకు దారి తీసింది. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహానికి ఇది కారణమైంది. మంగళవారం ఆప్షనల్ ప్రాక్టీస్ కావడంతో కొందరు భారత ఆటగాళ్లతో పాటు కోచింగ్ బృందం ఓవల్ మైదానానికి వెళ్లింది. టెస్టుకు ఒకటి లేదా రెండు రోజుల ముందు ఇరు జట్ల కెప్టెన్ లేదా కోచ్‌లు పిచ్‌ను పరిశీలించడం, దానిపై ఒక అంచనాకు రావడం సాధారణ ఆనవాయితీ. గంభీర్ కూడా తన సహచర కోచింగ్ సిబ్బందితో పిచ్ వద్దకు వెళ్లాడు. అయితే క్యురేటర్ లీ ఫోర్టస్ బృందంలోని ఒక సభ్యుడు అక్కడికి వచ్చి పిచ్‌కు బాగా దగ్గరగా వెళ్లవద్దని, అక్కడి నుంచి 2.5 మీటర్ల దూరం ఉండాల్సిందిగా కోరాడు. ఇది గంభీర్‌కు కాస్త అసహనం తెప్పించింది. పిచ్ పాడు కాకుండా క్యురేటర్లు జాగ్రత్తలు చెప్పడం సహజమే అయినా ఒక జట్టు కోచ్‌ను నిలువరించడం ఎప్పుడూ జరగదు. మ్యాచ్ జరిగే ప్రధాన పిచ్‌కు బాగా దగ్గరగా భారత ఆటగాళ్లు పదే పదే రావడం క్యురేటర్‌కు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. అయితే ప్రాక్టీస్‌కు కేటాయించిన మూడు పిచ్‌లకు ఇది బాగా దగ్గరగా ఉందని, పూర్తిగా అటు వెళ్లకుండా ఉండటం సాధ్యం కాదని మన కోచింగ్ బృందం జవాబి చ్చినట్లు తెలిసింది. అయితే వివాదం అక్కడితో ముగిసిపోలేదు. భారత్‌కు చెందిన సహాయకుడు ఒకరు కూలింగ్ బాక్స్‌ను ఆటగాళ్ల ప్రాక్టీస్ నెట్స్ వద్దకు తీసుకెచ్చే ప్రయత్నం చేయగా, దీనిని కూడా క్యురేటర్ వారించాడు. దాంతో కోపం వచ్చిన గంభీర్ ఏదో మాట అనడం... ఇలా మాట్లాడవద్దని, మళ్లీ ఇలా చేస్తే ఐసీసీకి ఫిర్యాదు చేస్తానని క్యురేటర్ అన్నాడు. అంతే...ఏం చేసుకుంటావో చేసుకోమంటూ తనదైన శైలిలో తీవ్రంగా బదులిచ్చాడు. ‘మేం ఏం చేయాలో నువ్వు చెప్పనవసరం లేదు. మా బృందం ఏం చేయాలో కూడా నువ్వు చెప్పవద్దు. నీకు ఎలాంటి అధికారం లేదు. నువ్వు కేవలం గ్రౌండ్స్‌మన్‌వి మాత్రమే. అంతకు మించి ఏమీ కాదు. నీ పరిధిలో ఉండు. నువ్వు గ్రౌండ్స్‌మన్‌వి మాత్రమే’ అని గంభీర్ తీవ్రంగా జవాబిచ్చాడు. చివరకు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ కలగజేసుకొని ఫోర్టిస్‌ను దూరంగా తీసుకెళ్లి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చి oది. ‘పిచ్ ఏమీ పురాతన వస్తువు కాదు’ గంభీర్, క్యురేటర్ ఫోరి్టస్ మధ్య చోటు చేసుకున్న ఘటనపై సితాన్షు కొటక్ వివరణ ఇచ్చాడు. ఓవల్ గ్రౌండ్ క్యురేటర్ కాస్త దూకుడైన వ్యక్తి అని తమకు ముందే తెలుసని అన్నాడు. ఈ సిరీస్‌లో ఆడిన నాలుగు టెస్టుల్లోనూ పిచ్ క్యురేటర్లు తమకు బాగా సహకరించారని, ఇక్కడే ఇలాంటి అనుభవం ఎదురైందని చెప్పాడు.‘ఒక జట్టు కోచ్‌ను 2.5 మీటర్ల దూరం నిలబడమని చెప్పడం చాలా ఇబ్బందిగా అనిపించింది. మేమేమీ స్పైక్స్‌తో రాలేదు. రబ్బరు చెప్పులతో అక్కడ నిలబడ్డాం కాబట్టి పిచ్ పాడవుతుందనే సమస్యే లేదు. అలా ఎవరైనా ఎందుకు చేస్తారు. పిచ్‌ను జాగ్రత్తగా చూసుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు గానీ ఇది కాస్త అతిగా అనిపించింది. మా జట్టు సభ్యులు అక్కడ ఆడబోతున్నారు. ఎన్ని మాటలు చెప్పినా అది క్రికెట్ పిచ్ మాత్రమే. కాలు పెట్టగానే విరిగిపోయేందుకు అదేమీ 200 ఏళ్లనాటి పురాతన వస్తువు కాదు’ అని కొటక్ వివరించాడు. బుమ్రా స్థానంలో ఆకాశ్దీప్భారత టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓవల్ టెస్టులో ఆడే విషయంలో స్పష్టత వచ్చింది. అతను ఈ టెస్టు నుంచి తప్పుకోవడం ఖాయమైంది. అతని పని భారం తగ్గించేందుకే టీమిండియా మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. సిరీస్‌ను కాపాడుకునే కీలక టెస్టులో బుమ్రాను ఆడించాలని భావించినా... అతని ఫిట్నెస్ను దృష్టిలో పెట్టుకొని, మున్ముందు ఇబ్బంది రాకుండా కాపాడుకునేందుకు ఐదో టెస్టులో ఆడించరాదని బీసీసీఐ వైద్య బృందం సిఫారసు చేసింది. ఈ సిరీస్‌తో బుమ్రా మూడు టెస్టుల ఆడతాడని ముందే ప్రకటించారు. ఈ మూడు టెస్టుల్లో కలిపి అతను 14 వికెట్లు తీశాడు. బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్ బరిలోకి దిగుతాడు. స్వల్ప గాయంతో ఆకాశ్‌దీప్ గత మ్యాచ్‌లో ఆడలేదు.

కోలీవుడ్‌లో ఫుల్ బిజీగా మన తెలుగమ్మాయి
నటి బిందు మాధవి. ఈ పేరు పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఇంతకు ముందు పలు భాషల్లో, చిత్రాల్లో కథానాయికిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పదహారు అణాల తెలుగు అమ్మాయి. తెలుగు బిగ్‌బాస్ విన్నర్ అయిన బిందు మాధవి.. తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేశారు. కళగు, కేడీ బిల్లా కిలాడి రంగా, తమిళుక్కు ఎన్ ఒండ్రు అళిక్కవుమ్ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు. అలా 2019 వరకు వరుసగా చిత్రాలు చేసిన బిందు మాధవి ఆ తరువాత కారణాలు ఏమైనా వెండి తెరపై కనిపించలేదు. అలాంటిది మళ్లీ 2024లో మాయన్ చిత్రంతో ఒక రకంగా రీ ఎంట్రీ అయ్యారనే చెప్పవచ్చు. ప్రస్తుతం బ్లాక్ మెయిల్, యారుక్కుమ్ అంజాల్ పగైవనుక్కు అరుళ్వై మొదలగు మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. అందులో ఒకటి బ్లాక్ మెయిల్. జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ఎం.మారన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు ఒకటవ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బ్లాక్ మెయిల్ చిత్రంలో నటించిన అనుభవం గురించి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ప్రతి కళాకారుడు కళాకారుని తమ జీవితాల్లో ఒక మార్పు తీసుకువచ్చే తరుణం కోసం ఎదురుచూస్తూనే ఉంటారన్నారు అదేవిధంగా మహిళలు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందడం కోసం సవాళతలను ఎదుర్కొంటారన్నారు. అలా దర్శకుడు ఎం మారన్ బ్లాక్మెయిల్ కథను చెప్పగానే అది తనకు బాగా కనెక్ట్ అయిన భావన కలిగిందన్నారు. అది తన కోసమే ఎదురుచూస్తున్న పాత్రగా భావించానన్నారు. దర్శకుడు రాసిన బలమైన , భావోద్వేగాలతో కూడిన ఆ పాత్ర తనలో బాధ్యతను పెంచిందన్నారు. ముఖ్యంగా పలు కథాపాత్రలతో కలిసి తన పాత్ర ఉంటుందన్నారు. జీవీ ప్రకాష్ లాంటి అద్భుతమైన నటనను ప్రదర్శించే నటుడుతో కలిసి పనిచేయటం మంచి అనుభవంగా పేర్కొన్నారు. నటి తేజు అశ్విని ,శ్రీకాంత్ తదితర నటీనటులందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారన్నారు భావోద్రేకాలతో కూడిన ఉత్సాహబహితమైన థ్రిల్లర్ కథాచిత్రంగా ఉంటుందని నటి బిందు మాధవి పేర్కొన్నారు.

మనింట్లో ఇలాంటి అభిమానులున్నారా?
సినీ అభిమానం వెర్రితలలు వేసి భవిష్యత్తు నాశనం చేసుకునే విధంగాటీనేజ్ పిల్లలు తయారవుతున్నారా? కర్నాటకలో ఇలాగే జరుగుతోంది.అక్కడ హీరో దర్శన్ అభిమానులు తనపై అత్యాచారం చేస్తామని, చంపుతామని బెదిరిస్తున్నారని నటి రమ్య కేసు పెట్టారు. గతంలో దర్శన్ అభిమాని రేణుకా స్వామి ఇలాంటి మెసేజ్‌లే పెట్టి హత్యకు గురయ్యాడు. ఆ కేసులో దర్శన్ నిందితుడు. ఈ నేపథ్యంలో అతడికి బెయిలు మంజూరు అవడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. రమ్య సుప్రీంకోర్టును మెచ్చుకుంటూ ట్వీట్ చేసింది.దాంతో ఆమెను చంపుతామని అభిమానులు బయలుదేరారు. చదువు, ఉద్యోగాల్లో ఉండాల్సిన యువత ఇలాంటి పనుల్లో ఉంటే సరిదిద్దుతున్నామా?ఇంట్లో ఉన్న పిల్లలు బయట ఏ అస్తిత్వంతో ఉన్నారో తల్లిదండ్రులు చెక్ చేసుకుంటున్నారా? వారు ఫలానా తల్లిదండ్రుల పిల్లలు అనో, కాలేజీ పిల్లలు అనో, ఏరియా పిల్లలు అనో గుర్తింపు పొందుతున్నారా? లేదా ఫలానా హీరో ఫ్యాన్స్ అనో, రాజకీయ పార్టీ అభిమానులనో, వాట్సాప్ గ్రూప్‌కు సంబంధించిన యాక్టివ్ మెంబర్లనో అందరికీ తెలుస్తున్నారా?హైస్కూల్, కాలేజీ వయసు దాటాక ఇటీవల ఉద్యోగాల్లో చేరాక కూడా మెచ్యూరిటీ లేని విధంగా కేవలం ‘ఫ్యాన్స్’గా ఉంటూ సొంత/దొంగ ఐడీలతో దాడి చేసే కుసంస్కారంతో ఉంటే గనక వీరి భవిష్యత్తు ఏమవుతుందో... అనే బాధ తల్లిదండ్రులకు ఉండటం చాలా సహజం. పత్రికల్లో కనిపిస్తున్న రోజువారీ ఘటనలు ‘వెర్రి అభిమానం’ వల్ల ప్రమాదం తెచ్చుకుంటున్న యువతను చూపెడుతున్నాయి. ఇంకానా ఇకపైనైనా మారండి అని హెచ్చరిస్తున్నాయి.దర్శన్ అభిమానులు ఏం చేశారు?గత రెండు రోజులుగా కన్నడ హీరో దర్శన్ అభిమానులు అక్కడి నటి, మాజీ ఎం.పి. అయిన రమ్యను సోషల్ మీడియాలో తీవ్ర పదజాలంతో హింసిస్తున్నారు. ఆమెను చంపుతామని, రేప్ చేస్తామని ఇంకా రాయడానికి వీలుకాని భాషలో ఆమెకు క్షోభ కలిగిస్తున్నారు. దానికి కారణం ఇటీవల ఆమె సోషల్ మీడియాలో చేసిన కామెంట్. దర్శన్‌కు గతంలో కర్నాటక హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. దానిని కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేస్తే సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేస్తూనే కర్నాటక హైకోర్టు బెయిల్ ఎలా మంజూరు చేసిందనే విషయమై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా అసమంజసం అని చెప్పింది. ఈ విషయాన్నే ఉటంకిస్తూ రమ్య సోషల్ మీడియాలో ‘సుప్రీంకోర్టు ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది’ అని రాసింది. అంటే దర్శన్ బెయిల్ మీద బయట తిరగడం సరి కాదు అని ఆమె ఉద్దేశం. దీంతో ఫ్యాన్స్ రెచ్చిపోయారు.దర్శన్ కేసుదర్శన్ 2024 జూన్‌లో అరెస్ట్ అయ్యాడు. దీనికి కారణం చిత్రదుర్గకు చెందిన తన అభిమాని రేణుకా స్వామి హత్యలో అతని ప్రమేయం ఉందనే అభియోగం. రేణుకా స్వామి కూడా ‘వెర్రి అభిమాని’గా ఉండి ప్రాణం మీద తెచ్చుకున్నాడు. జరిగింది ఏమంటే దర్శన్‌కు, అతని భార్య విజయలక్ష్మికి కొంత కాలంగా సయోధ్య లేదు. అందుకు కారణం దర్శన్ గర్ల్‌ఫ్రెండ్ పవిత్ర గౌడ అని కొందరు అభిమానులు భావించారు. దర్శన్ అభిమాని అయిన రేణుకా స్వామి దర్శన్ జీవితంలో కలత రేపిన పవిత్ర గౌడను సోషల్ మీడియాలో అబ్యూజ్ చేయసాగాడు. అతని కామెంట్లు భరించలేని పవిత్ర ఈ సంగతిని దర్శన్ దృష్టికి తీసుకు రాగా అతను తన అభిమానులతో కలిసి రేణుకా స్వామిని హత్య చేయించాడని అభియోగం. ఈ కేసు విచారణలో ఉండగానే డిసెంబర్, 2024లో కర్నాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ ఇచ్చింది. దానిని తాజాగా సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అలా తప్పు పట్టడం సరైన విషయంగా రమ్య భావిస్తూ కామెంట్ చేసింది.కేసుల్లో అభిమానులురమ్యను అశ్లీల మాటలు అంటూ నానా హంగామా చేసిన దర్శన్ అభిమానులపై రమ్య పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. 47 ఇన్‌స్టా హ్యాండిల్స్‌ను పోలీసుల దృష్టికి తెచ్చింది. ఇప్పుడా ఇన్‌స్టా హ్యాండిల్స్ ఏ అభిమానులైతే నడుపుతున్నారో వారంతా ప్రమాదంలో పడినట్టు. నేరం రుజువైతే 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అభిమానం సినిమా చూసేంత వరకూ ఉండాలి కాని ఇలా నటుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి వారికి వత్తాసు పలుకుతూ తీవ్ర చర్యలు చేపట్టేంతగా మాత్రం ఉండకూడదు. ఈ బూతులు తిట్టిన అభిమాని ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండొచ్చు. తల్లిదండ్రులకు ఈ సంగతే తెలియకవచ్చు. రేపు అరెస్ట్ అయితే వారి పరిస్థితి ఏమిటి? రమ్యకు మద్దతుగా కన్నడ ఇండస్ట్రీ నిలబడింది. అంతే కాదు కర్నాటక మహిళా కమిషన్ సూమోటోగా కేసును తీసుకుని నిందితులను పట్టుకోమని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.ఒక నటుడి వ్యక్తిగత జీవితంలో అనవసరంగా తల దూర్చడం వల్ల ఇప్పటికే ఒక అభిమాని హత్యకు గురయ్యాడు. ఇప్పుడీ కేసు వల్ల ఎందరు అభిమానులు నష్టపోతారో?! తల్లిదండ్రులూ బహుపరాక్. తెలుగు నాట కూడా ఇలాగే అభిమానాలు వెర్రితలలు వేస్తున్నాయి. ఫోన్ చేతిలో ఉంది కదా అని హద్దు మీరిన వ్యాఖ్యలు చేస్తే అవి నేరాభియోగానికి ఆధారాలవుతాయి. శిక్షకు సాక్ష్యాలవుతాయి. పిల్లల్ని హెచ్చరించండి. వారు ఏ వయసు వారైనా సరే. (చదవండి: ఆలోచనలతో కంప్యూటర్ని కంట్రోల్ చేస్తున్న తొలి మహిళ! ఏకంగా 20 ఏళ్లకు పైగా పక్షవాతం..)

సిందూర్ ఆపాలని ఏ దేశాధినేతా చెప్పలేదు
న్యూఢిల్లీ: నిఘా వైఫల్యం కారణంగా పహల్గాంలో అత్యంత పాశవిక దాడి జరిగిందని, ఆపరేషన్ సిందూర్‌తో భారత్ సాధించిన కీలక విజయాలేంటో చెప్పాలంటూ విపక్షాల డిమాండ్ల మధ్య లోక్‌సభలో ప్రధాని మోదీ సూటిగా సమాధానమిచ్చారు. ఆపరేషన్ సిందూర్‌పై 16 గంటల ప్రత్యేక చర్చకు సమాధానంగా ప్రధాని మోదీ వివరణ ఇస్తూనే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు, విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలు పరిసమాప్తం కావడానికి తానే ముఖ్యకారణమని ఇప్పటికే పాతికసార్లు ఢంకా భజాయించిన ట్రంప్ మాటల్లో రవ్వంతైనా నిజంలేదని స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని కాళ్లకింద నలిపేసేటప్పుడు ప్రపంచంలో ఏ దేశం వారించినా ఊరుకునేది లేదని వ్యాఖ్యానించారు. సిందూర్ తక్షణం ఆపేయాలని ప్రపంచంలో ఏ దేశ నేతా తమకు చెప్పలేదని మోదీ స్పష్టం చేశారు. 102 నిమిషాల ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..విజయోత్సవంలో ప్రసంగిస్తున్నా..‘‘ఉగ్రవాదానికి కుంభస్థలం వంటి పాక్‌లోని ఉగ్రస్థావరాలను మనం నేలమట్టంచేసినందుకు ఈరోజు పార్లమెంట్లో విజయోత్సవం జరుపుకుంటున్నట్లు అనిపిస్తోంది. భారత వాణిని ప్రపంచానికి వినిపించేందుకు, భారత్ అంటే ఎంటో అందరికీ మరోసారి చాటిచెప్పేందుకే మాట్లాడుతున్నా. సిందూర్ వేళ నాపై నమ్మకం ఉంచిన ప్రజలందరికీ రుణపడిపోయా. ఉగ్రవాదానికి తల్లివేరు వంటి పాక్‌కు ఆపరేషన్ సిందూర్‌తో అసాధారణరీతిలో గుణపాఠం చెప్పాం. ఆ భీకర దాడుల నుంచి పాక్ ఇంకా కోలుకోలేదు. దాడులు మళ్లీ జరగొచ్చని వాళ్లు ఇప్పటికీ భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆపరేష్ సిందూర్ అమలుకోసం మేం సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. పహల్గాం దుశ్చర్యకు దీటుగా బదులిస్తూ పాక్ నడిబొడ్డున క్షిపణుల వర్షం కురిపించాం. కేవలం 22 నిమిషాల్లో భిన్న ప్రాంతాల్లోని కీలక ఉగ్రస్థావరాలను నేలమట్టంచేశాం. అణు బెదిరింపులు మన దగ్గర పనిచేయవని పాక్‌ను గట్టిగానే హెచ్చరించాం. మన దాడుల ధాటికి పాక్ వైమానిక స్థావరాలు సర్వనా శనమై ఇప్పటికీ అలాగే ఐసీయూలో ఉన్నాయి’’.ఆత్మనిర్భరతను ప్రపంచం కళ్లారా చూసింది‘‘ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ వంటి స్వదేశీ క్షిపణులుసహా సొంత డ్రోన్ల వినియోగంతో భారత్ సాధించిన స్వావలంభన, ఆత్మనిర్భరతను ప్రపంచం కళ్లారా చూసింది. అమాయకులను ఉగ్రదా డులతో బలితీసుకుంటే ఎలాంటి స్పందనా ఉండదని ఇన్నాళ్లూ ఉగ్రదాడుల సూత్రధారులు భావించారు. ఇకపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే భారత్ దండయాత్ర చేయగలదని ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులక బాగా తెలిసొచ్చింది. ఆపరేషన్ సిందూర్ నుంచి సింధు దాకా భారత్ భిన్నకోణాల్లో ప్రతీకార చర్యలు చేపట్టింది. భవిష్య త్తులో తోకజాడిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పాక్‌కు బోధపడింది. ఉగ్రపోషకులు, పాక్ పాలకులు ఒక్కరే అనే భావనతోనే భారత్ ముందుకెళ్తోంది. ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఆపరేషన్ సిందూర్ మొదలెడితే ప్రపంచంలో మూడు దేశాలు తప్ప ఏ దేశమూ భారత్‌కు అడ్డుచెప్పలేదు. పాక్‌కు ఆ మూడుదేశాలే మద్దతు పలికాయి. ఇలా ప్రపంచదేశాలన్నీ భార త్‌కు అండగా నిలిస్తే కాంగ్రెస్ మాత్రం మన సైనికుల వీరత్వానికి సలామ్ చేయలేదు. పాకిస్థా న్ను కాంగ్రెస్ వెనకేసుకురావడం దౌర్భా గ్యం. గతంలో సర్జికల్ దాడులు చేసినప్పుడూ కాంగ్రెస్ ఇదే పాట పాడింది’’.నిమిషాల్లో నాశనం చేశాం‘‘పాక్ నడిబొడ్డున, ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థా వరాలపై మన బలగాలు మేలో మెరుపుదాడులు చేశాయి. నిమిషాల్లోనే మీ స్థావరాలను సమాధులుగా మార్చగలమని పాక్‌కు నిరూపించాం. తొలుత ఉగ్రస్థావరాలను మన బలగాలు ధ్వసంచేశాయి. ఉగ్రవాదులకు సాయంగా పాక్ బలగాలు ప్రతిదాడులకు సిద్ధపడడంతోనే వాళ్ల వైమానిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి కోలుకోలేని దెబ్బతీశాం. దీంతో పాక్ కాళ్లబేరానికి వచ్చింది. పాక్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) నుంచి ఫోన్ వచ్చింది. ఇంతకుమించి దాడులు చేస్తే ఇప్పట్లో కోలుకోలేమని ప్రాధేయపడ్డారు. అందుకే సిందూర్‌కు ముగింపు పలికాం. ఆపరేషన్‌ను ఆపడానికి ఇదే ఏకైక కారణం. అంతేగానీ ప్రపంచంలో మరే దేశాధినేత కారణంగానో సిందూర్ ఆగలేదు. ఆపాలని ఎవరూ మాకు చెప్పలేదు. మే 9వ తేదీ రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పదేపదే నాకు ఫోన్ చేశారు. అప్పటికే త్రివిధ దళాధిపతులతో భేటీలో బిజీగా ఉన్నాను. భేటీ తర్వాత నేనే ఫోన్‌కాల్ చేసి మాట్లాడా. పాక్ దాడి చేయబోతోందని ఉప్పందించారు. ఎలాంటి దాడినైనా అడ్డుకోగలమని ఆయనకు స్పష్టంచేశా. దాడికి ప్రతిదాడి దారుణంగా ఉంటుందని చెప్పా. బుల్లెట్లకు బాంబులతో సమాధానం చెప్తామన్నా. ఎన్నో విషయల్లో భారత్ స్వావలంభన సాధిస్తోంది. కాంగ్రెస్ మాత్రం చాలా అంశాలను ఎత్తిచూపేందుకు పాక్ పేరును మధ్యలోకి లాక్కొస్తోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పరోక్షంగా పాక్ అజెండాను ప్రకటించే అధికారిక ప్రతినిధులుగా తయార య్యా రు. గతంలో మేం సర్జికల్ దాడులుచేస్తే కాంగ్రెస్ వాళ్లు ఆధారాలు కావాలన్నారు. ఆనాడు పైలట్ అభి నందన్ పాక్ బలగాలకు దొరికిపోతే ఎలా విడిపించుకొస్తారో చూస్తామని మాట్లాడారు. తీరా మేం తీసుకొచ్చాక ఇదే కాంగ్రెస్ నేతలు నోరుమూశారు. ఉగ్రవాదులకు జరిగిన భారీ నష్టాన్ని చూసి అక్కడ పాక్ మాత్రమే కాదు ఇక్కడ భారత్‌లోనూ కొందరు ఏడుస్తున్నారు’’ అని మోదీ ఎద్దేవా చేశారు.విశ్వశాంతికి ఇది అవసరం‘‘విశ్వశాంతి సాధనలో ఆయుధ సంపత్తితో తులతూగడం కూడా ముఖ్యమే. అందుకే రక్షణరంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ద్వారాలు తెరిచాం. ఇప్పడు వందకు పైగా అంకురసంస్థలు రక్షణరంగంలో కృషిచేస్తున్నాయి. కొన్ని సంస్తలను మహిళలు ముందుండి నడిపిస్తున్నారు. ఇలాంటి జాతీయ భద్రతా ముందుచూపు కాంగ్రెస్‌కు గతంలోలేదు. ఇకమీదట కూడా రాదు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఇప్పటికీ భారత్ ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయిందన్న ప్రశ్నకంటే ముందు అసలు అదెలా మన చేయిజారిందనే ప్రశ్న వేసుకోవాలి. విశాల కశ్మీరం చేజారడానికి కారకులెవరు? నెహ్రూ హయాం నుంచి మొదలుపెడితే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన ఘోర పరిపాలనా తప్పిదాల కారణంగానే భారత్ ఇప్పటికీ ఉగ్రదాడులు, ఇతర గాయాలతో బాధపడుతోంది’’ అని అన్నారు.వేయి క్షిపణులు ప్రయోగిస్తే అన్నింటినీ గాల్లోనే కూల్చేశాం‘‘భారత గగనతల రక్షణ వ్యవస్థల సత్తాను చూసి ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి. సిందూర్‌కు ప్రతిగా పాక్ 1,000కిపైగా క్షిపణులను ప్రయోగిస్తే మన గగనతల రక్షణవ్యవస్థలు వాటన్నింటినీ గాల్లోనే పేల్చేశాయి. అదంపూర్ వైమానికస్థావరం నాశనమైందని పాక్ కారుకూతలు కూస్తే తెల్లారే అక్కడికెళ్లి అది నిక్షేపంగా ఉందని ప్రపంచానికి చాటిచెప్పా. భారత సైనిక సత్తాను దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ నమ్మకపోవడం దారుణం. మన రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, హోం మంత్రులు చెప్పిన మాటలకూ కాంగ్రెస్ విలువ ఇవ్వట్లేదు. పాక్ రిమోట్ కంట్రోల్‌తో కాంగ్రెస్ పనిచేస్తుందేమో. కొందరు కాంగ్రెస్ యువనేత (రాహుల్)లు ఆపరేషన్ సిందూర్‌ను తమాషాగా కొట్టిపారేశారు. మన సైనికుల అద్భుత విజయాన్ని చూసి కాంగ్రెస్ నేతలు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. లోక్‌సభలో ప్రత్యేక చర్చ మొదలైన నాడే ఆపరేషన్ మహదేవ్లో పహల్గాం ముష్కరులు ఎలా చనిపోయారని ప్రశ్నిస్తున్నారు. జాడ కనిపెట్టి ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి వారాలు, తేదీలు చూడాలా?’’ అని మోదీ ఆగ్రహంవ్యక్తం చేశారు.సిందూ నదీజలాల ఒప్పందం నెహ్రూ పాపమే‘‘మన నదీజలాలపై ప్రపంచబ్యాంక్ అజమాÆ ‡ుుషీ చేసేలా నెహ్రూ ప్రభుత్వం ఘోర తప్పుడు నిర్ణయం తీసుకుంది. భారతనేలపై పారే సిందూ నదీజలాల్లో 80 శాతం వాటా పాక్‌కు ఆయనే ధారాదత్తంచేశారు. ఇంతటి జనాభా ఉన్నప్పటికీ మనకు 20 శాతం మాత్రమే హక్కులు దఖలుపడ్డాయి. మన భారతీయ రైతుల నీటికష్టాలు నెహ్రూకు పట్టలేదు. నీళ్లివ్వడంతోపాటు నెహ్రూ పాక్‌కు నిధులు కూడా ఇచ్చారు. సిందూ నదీజలాలపై డ్యామ్‌లు కట్టుకునేందుకు నెహ్రూ ప్రభుత్వం పాక్‌కు ఆర్థికసాయం చేసింది. సిందూ నదీజలాల ఒప్పందంలో నెహ్రూ చేసిన భారీ తప్పిదాలను తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలూ సరిచేయలేదు. మేం వచ్చాకే ఆ తప్పులను సవరించాం. ఉగ్రదాడులతో భారతీయుల రక్తం పారేలా చేస్తున్నారు. అందుకే సిందూ నదీజలాల ఒప్పందం నుంచి వైదొలిగాం. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించబోవని స్పష్టంచేశాం. ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదు. పాక్ మళ్లీ కుయుక్తులతో పేట్రేగిపోతే సిందూర్ మళ్లీ మొదలవుతుంది’’ అని మోదీ స్పష్టం చేశారు.

ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.షష్ఠి రా.2.06 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: హస్త రా.10.31 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.11.39 నుండి 12.31 వరకు, అమృతఘడియలు: సా.4.02 నుండి 5.46 వరకుసూర్యోదయం : 5.41సూర్యాస్తమయం : 6.31రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. దూరపు బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.వృషభం: ఇంటాబయటా సమస్యలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. బంధువులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.మిథునం: కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు పనిఒత్తిడులు.కర్కాటకం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.సింహం: కొన్ని సమస్యలు వేధిస్తాయి. పనుల్లో అవాంతరాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యం మందిస్తుంది. వ్యాపార , ఉద్యోగాలలో చిక్కులు.కన్య: రుణవిముక్తి. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. పాత బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.తుల: పనులలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆత్మీయులు, బంధువులతో అకారణ వైరం. శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.వృశ్చికం: ముఖ్య సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. పనులలో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం.ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.మకరం: బంధువులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.కుంభం: ముఖ్య నిర్ణయాలు వాయిదా. పనుల్లో చికాకులు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పనులలో అనుకూలత. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
బడి పాఠాలే కాదు ‘బతుకు బడి’ పాఠాలు కూడా..
లెన్స్‌కార్ట్.. ఐపీఓ రూట్
నాగార్జున నన్ను 14 సార్లు కొట్టారు: స్టార్ హీరోయిన్
నాలుగు నెలల కనిష్టానికి రూపాయి
రష్యా, జపాన్‌పై విరుచుకుపడిన సునామీ.. భారతీయులకు హెచ్చరిక
కుక్క కావాలా..
మనింట్లో ఇలాంటి అభిమానులున్నారా?
భారత్‌పై 25 శాతం సుంకాలు.. గడువుకు ముందే ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం
పాస్‌పోర్ట్ సమస్య జటిలమే కానీ..పరిష్కారం ఉంది
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
డిప్యూటీ సీఎం డ్యూటీ.. వెంటనే సీఎం డ్యూటీ
నాన్నా.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చేయకు
అల్లు అరవింద్‌కు 'మహావతార్ నరసింహా' వరం
రేవ్ పార్టీకి పిలుస్తాడు.. రేప్ చేస్తాడు
చాలా సంతోషంగా ఉంది.. అందుకే వారు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు: గిల్
90ల్లో స్టార్స్.. ఇప్పుడు మళ్లీ కలిశారు (ఫొటోలు)
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
TCS layoffs: రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!
ఈ అప్పులు, హమీల అమలు ఎందుకు సార్! రాష్ట్రాన్నే దత్తత ఇచ్చేస్తే పోలా!!
ఈ గింజలతో మెకాళ్ల నొప్పి, అధిక బరువుకు చెక్ !
.. రాష్ట్రాన్ని నెంబర్‌వన్ చేస్తారంటే.. అప్పుల్లోనా సార్!
10 ఏళ్లుగా డిప్రెషన్.. చనిపోతానని నాన్న ఎప్పుడో చెప్పాడు: జయసుధ కుమారుడు
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
వాళ్లేమో కుర్చీ కోసం కోట్లాడుకుంటున్నారు. వీళ్లేమో అధికారాల కోసం కొట్టుకుంటున్నారు!
ఖలీల్ అహ్మద్ కీలక నిర్ణయం
IND vs ENG: ‘రెండు కుక్కలు తెచ్చి.. ఆ పేర్లు పెడతాడు’
పిల్లలకు 'లింగ, యాత్ర' పేర్లు ఎందుకు పెట్టానంటే: ధనుష్
‘స్టోక్స్ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదు’
భూకంపం వస్తోంది.. జాగ్రత్త..!
బడి పాఠాలే కాదు ‘బతుకు బడి’ పాఠాలు కూడా..
లెన్స్‌కార్ట్.. ఐపీఓ రూట్
నాగార్జున నన్ను 14 సార్లు కొట్టారు: స్టార్ హీరోయిన్
నాలుగు నెలల కనిష్టానికి రూపాయి
రష్యా, జపాన్‌పై విరుచుకుపడిన సునామీ.. భారతీయులకు హెచ్చరిక
కుక్క కావాలా..
మనింట్లో ఇలాంటి అభిమానులున్నారా?
భారత్‌పై 25 శాతం సుంకాలు.. గడువుకు ముందే ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం
పాస్‌పోర్ట్ సమస్య జటిలమే కానీ..పరిష్కారం ఉంది
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
డిప్యూటీ సీఎం డ్యూటీ.. వెంటనే సీఎం డ్యూటీ
నాన్నా.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చేయకు
అల్లు అరవింద్‌కు 'మహావతార్ నరసింహా' వరం
రేవ్ పార్టీకి పిలుస్తాడు.. రేప్ చేస్తాడు
చాలా సంతోషంగా ఉంది.. అందుకే వారు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు: గిల్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
TCS layoffs: రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!
ఈ అప్పులు, హమీల అమలు ఎందుకు సార్! రాష్ట్రాన్నే దత్తత ఇచ్చేస్తే పోలా!!
ఈ గింజలతో మెకాళ్ల నొప్పి, అధిక బరువుకు చెక్ !
.. రాష్ట్రాన్ని నెంబర్‌వన్ చేస్తారంటే.. అప్పుల్లోనా సార్!
10 ఏళ్లుగా డిప్రెషన్.. చనిపోతానని నాన్న ఎప్పుడో చెప్పాడు: జయసుధ కుమారుడు
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
వాళ్లేమో కుర్చీ కోసం కోట్లాడుకుంటున్నారు. వీళ్లేమో అధికారాల కోసం కొట్టుకుంటున్నారు!
ఖలీల్ అహ్మద్ కీలక నిర్ణయం
IND vs ENG: ‘రెండు కుక్కలు తెచ్చి.. ఆ పేర్లు పెడతాడు’
పిల్లలకు 'లింగ, యాత్ర' పేర్లు ఎందుకు పెట్టానంటే: ధనుష్
‘స్టోక్స్ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదు’
భూకంపం వస్తోంది.. జాగ్రత్త..!
TCS Layoffs: ‘రాజీనామాలు మాత్రం చేయొద్దు’
సినిమా

కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. విజయ్ దేవరకొండ మదర్ ఎమోషనల్!
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం కింగ్డమ్. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో అనిరుధ్ రవిచందర్ కింగ్డమ్ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం విజయ్ కెరీర్లో కచ్చితంగా మైల్ స్టోన్‌గా నిలుస్తుందని అన్నారు. మీరందరూ సినిమాను ఇష్టపడతారని ఆశిస్తున్నానని అనిరుధ్ మాట్లాడారు. అదే సమయంలో అక్కడే విజయ్ మదర్ మాధవి భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడి చిత్రం సూపర్ హిట్ కావాలని దేవుడిని ప్రార్థించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

మహేష్,విజయ్ దేవరకొండ,అల్లు అర్జున్,రవితేజ.. ‘మల్టీ’స్టారర్
అభిమాన హీరో సినిమాను ఫలానా థియేటర్లో చూశాం అని చెప్పుకోవడం ఎప్పుడూ ఉండేదే. అయితే అభిమాన హీరో ధియేటర్లో ఫలానా హీరో సినిమా చూశాం అని చెప్పుకునే రోజులు శర వేగంగా వచ్చేస్తున్నాయి. సినిమా హీరోలు వరుసపెట్టి మల్టీఫ్లెక్స్ సహ యజమానులుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.తొలి క్లాప్ మోహన్‌లాల్‌దే...నిజానికి ఈ తరహా ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అని చెప్పొచ్చు. గత పాతికేళ్లకు పైగా ఆశీర్వాద్ సినిమాస్ పేరిట నిర్మాణ సంస్థ ను నిర్వహిస్తున్న ఆయన తాను సహ యజమానిగా కేరళలో ఆశీర్వాద్ సినీప్లెక్స్ పేరిట మల్టీప్లెక్స్ థియేటర్ కాంప్లెక్స్ నెలకొల్పారు.కాన్సెప్ట్ ఆధారిత సినీ అనుభవం..కాన్సెప్ట్–ఆధారిత సినిమా చూసే అనుభవం. అనే సరికొత్త శైలితో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఈ రంగంలోకి దూసుకొచ్చారు. ఆయన 2018లో తన పిల్లలు నైసా, యుగ్ పేరు మీద తన సొంత లేబుల్ ఎన్వై సినిమాస్ ను ప్రారంభించడం ద్వారా చిన్న పట్టణాలు నగరాల్లో సినిమా వ్యాప్తిని మెరుగుపరచాలని నిర్ణయించుకున్నాడు. రూ. 600 కోట్ల నుంచి రూ. 750 కోట్ల పెట్టుబడితో మల్టీఫ్లెక్స్‌లు ఏర్పాటు చేస్తున్నారు ఆయన గ్రూప్ తమ మొదటి మల్టీప్లెక్స్‌ను మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో రైల్వే నేపథ్య ఇంటీరియర్‌తో ప్రారంభించింది. అలాగే గురుగ్రామ్‌లోని ఎలాన్ ఎపిక్ మాల్లో ఒక విలాసవంతమైన మల్టీప్లెక్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో మాక్‌టెయిల్ బార్, ఎన్వై కేఫ్ అమోర్ లాంజ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి‘మల్టీ’ బాటలో ముందున్న టాలీవుడ్కోవిడ్ సమయంలో ఈ ట్రెండ్‌లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ ఒకరి తర్వాత ఒకరుగా హీరోలను జత చేసుకుంటూ శరవేగంగా ముందంజలో దూసుకుపోతోంది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 2021లో మల్టీఫ్లెక్స్ థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆయన ఆసియన్ సినిమాస్ తో కలిసి హైదరాబాద్ లో ఎఎంబి సినిమాస్ (ఆసియన్ గ్రూప్ – మహేష్ బాబు జాయింట్ వెంచర్) ను స్థాపించాడు. ఆయనతో పాటే నేను సైతం అంటూ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కూడా అదే ఏడాది థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆసియన్ విజయ్ దేవరకొండ (ఎవిడి) సినిమాస్ కు యజమానినని ఆయన సగర్వంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. మొదటి ఎవిడి సినిమా అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్, లో ప్రారంభమైంది.మహేష్ బాబు విజయ్ దేవరకొండ తర్వాత ఆసియన్ సినిమాస్‌తో చేతులు కలిపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆయన కూడా అదే సంవత్సరంలో ఆసియన్ సినిమాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ’ఎఎఎ’ పేరుతో కొత్త మల్టీప్లెక్స్ నెలకొల్పాడు. ఆసియన్ సినిమాస్ ఈ సారి మాస్ మహారాజ్‌ను ఎంచుకుంది. మాస్ జాతరకు చిరునామాగా పేరున్న హీరో రవితేజతో కలిసి హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో జాయింట్ వెంచర్ ఆర్ట్ సినిమాస్ పేరుతో నెలకొల్పింది. ఇది జులై 31న విజయ్ దేవరకొండ కింగ్డమ్తో ప్రారంభం కానుంది.విస్తరణ బాటలోనూ సై..మరోవైపు మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్ యాజమాన్యంలోని కొండాపూర్‌లోని ఎఎంబి సినిమాస్ మరింతగా విస్తరిస్తోంది. ఈ మల్టీఫ్లెక్స్‌లో బార్కోహెచ్డిఆర్ ప్రొజెక్షన్ తో కూడిన కొత్త స్క్రీన్ వచ్చే ఆగస్టులో వార్ 2తో ప్రారంభం అవుతుంది, తద్వారా ఇది హైదరాబాద్ టెక్ కారిడార్‌లో సినీ అభిమానులకు ప్రధాన ఆకర్షణగా మారనుంది. మరోవైపు జనవరి 2026లో, కోకాపేటలోని అల్లు సినిమాస్ హైదరాబాద్‌లో మొట్టమొదటి డాల్బీ సినిమాను పరిచయం చేయనుంది.

తెలుగు ట్రాన్స్ లేటర్‌గా నిత్యామీనన్.. స్టేజీపై నవ్వులే నవ్వులు!
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'సార్ మేడమ్'. రూరల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నిత్యామీనన్, విజయ్ సేతుపతి భార్య, భర్తలుగా నటించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ సేతుపతితో పాటు నిత్యామీనన్, డైరెక్టర్ పాండిరాజ్ కూడా హాజరయ్యారు.(ఇది చదవండి: 'మా ఇద్దరినీ విడదీసేయండి'.. ఆసక్తిగా సార్ మేడమ్ ట్రైలర్!)ఈ సందర్భంగా నిత్యామీనన్ తెలుగు ట్రాన్స్‌లేట్ చేసి అభిమానులను ఆకట్టుకుంది. డైరెక్టర్ పాండిరాజ్ తమిళంలో మాట్లాడగా.. ఆ వ్యాఖ్యలను తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేసింది. 'సార్ మేడమ్ సినిమా చాలా మంచి లవ్ స్టోరీ.. భార్య, భర్తల మధ్య జరిగే గొడవ.. కానీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది.. విజయ్ సేతుపతి, నిత్యామీనన్ చాలా బాగా నటించారు.. వీళ్ల కన్నా బెటర్‌గా ఎవరూ చేయలేరు.. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్' అంటూ డైరెక్టర్ పాండిరాజ్ మాటలకు ట్రాన్స్‌లేటర్‌గా నిత్యామీనన్ అందరికీ నవ్వులు తెప్పించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ సినిమాలో యోగి బాబు కీలక పాత్ర పోషించారు.

షూటింగ్ కోసం వెళ్తే.. ముద్దు పెట్టుకోవాలని ఉందన్నాడు: నటి
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ హీరోయిన్ల నుంచి క్యారెక్టర్ ఆరిస్టుల వరకు ఎంతోమంది అమ్మాయిలు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్నారు. అవకాశాల పేరుతో వారిని లొంగదీసుకోవడమే కాకుండా లైంగిక వేధింపులకూ గురి చేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే చాలా మంది ఈ వేధింపులపై తిరగబడుతున్నారు. తమను వేధించిన వారిపై కేసులు పెట్టడమే కాకుండా మీడియా ముఖంగా వారి బాగోతాలను బటయపెడుతున్నారు. తాజాగా మరో నటి, ‘తారక్ మెహతా కా ఊల్టా చష్మా’ఫేంజెన్నిఫర్ మిస్త్రీ(Jennifer Mistry ) కూడా ఓ నిర్మాతతో తనకు ఎదురైన ఛేదు అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తే..గదిలోకి రమ్మని వేధించాడని, అంతేకాకుండా తన గురించి పచ్చిగా మాట్లాడని చెప్పింది.తారక్ మెహతా కా ఊల్టా చష్మా’లో మిసెస్ రోషన్ సోధీ పాత్ర పోషించి అందరిని ఆకట్టుకున్న జెన్నిఫర్ మిస్త్రీ. ఆ షో నిర్మాత అసిత్ కుమార్ మోదీ( Asit Kumarr Modi ) వల్ల ఎంతో మానసిక క్షోభను అనుభవించిందట. 2018లో షో ఆపరేషన్స్ హెడ్ సోహైల్ రమణితో గొడవ జరిగింది. అతనిపై ఫిర్యాదు చేద్దామని నిర్మాత అసిత్ కుమార్ మోదీ దగ్గరకు వెళ్లాను. కానీ అక్కడ ఆయన స్పదన చూసి షాకయ్యాను. నా ఫిర్యాదు పట్టించుకోకుండా ‘నువ్వు చాలా సెక్సీగా ఉన్నావ్’ అన్నారు. అలాగే 2019లో షూటింగ్ కోసం సింగపూర్ వెళ్తే.. అసిత్ నన్ను గదిలోకి రమ్మన్నాడు. తనతో గదిలోకి వచ్చి విస్కీ తాగాలని బలవంతం చేశాడు. కానీ నేను పట్టించుకోలేదు. దీంతో అతను మోనికా భడోరియా (బావ్రీ) దగ్గరకు వెళ్లి ఇలాగే మాట్లాడారు. ఆ మరుసటి రోజు మేమంతా కాఫీ తాగుతుంటే..అతను నా దగ్గరకు వచ్చి నీ పెదాలు చాలా సెక్సీగా ఉన్నాయి. నాకు ముద్దు పెట్టుకోవాలని ఉంది’ అని అన్నాడు. ఆయన మాటలను పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించినప్పటికీ అవి నాపై తీవ్ర ప్రభావం చూపాయి’ అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెన్నిఫర్ మిస్త్రీ చెప్పుకొచ్చింది.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

భారత్‌కు క్లిష్టమైన ‘డ్రా’
సిడ్నీ: ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) మహిళల ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో మార్చి 1 నుంచి 21 వరకు జరిగే ఈ టోర్నీలో ఆసియా ఘనాపాటి జపాన్ సహా మాజీ చాంపియన్లు చైనీస్ తైపీ, వియత్నాం జట్లున్న గ్రూప్ ‘సి’లో భారత అమ్మాయిల జట్టుకు చోటు దక్కింది. దీనికి సంబంధించిన ‘డ్రా’ వేడుక సిడ్నీ టౌన్ హాల్లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. భారత స్టార్ మిడ్‌ఫీల్డర్ సంగీత బస్ఫొరె ప్రత్యేక ఆహ్వానితులుగా ‘డ్రా’ ఈవెంట్లో పాల్గొంది. మొత్తం 12 ఆసియా జట్లను మూడు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో జట్టులో నాలుగేసి టీమ్‌లు తలపడతాయి. గ్రూప్ ‘సి’లో భారత అమ్మాయిల జట్టు తమ తొలి మ్యాచ్‌లో మార్చి 4న వియత్నాంతో... రెండో మ్యాచ్‌లో మార్చి 7న ప్రపంచ మాజీ చాంపియన్ జపాన్‌తో... మూడో మ్యాచ్‌లో మార్చి 10న చైనీస్ తైపీతో ఆడుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జపాన్ 7వ స్థానంలో, వియత్నాం 37వ స్థానంలో, చైనీస్ తైపీ 42వ స్థానంలో, భారత్ 70వ స్థానంలో ఉన్నాయి. సెమీస్ చేరితే ప్రపంచకప్ టోర్నీకి... ఆసియా కప్ గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య ఆ్రస్టేలియా, దక్షిణ కొరియా, ఇరాన్, ఫిలిప్పీన్స్... గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, ఉత్తర కొరియా, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్ జట్లున్నాయి. ఒక్కో గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అలాగే ఈ మూడు గ్రూప్‌ల్లో మెరుగైన మూడో స్థానం పొందిన రెండు జట్లు కూడా నాకౌట్‌కు క్వాలిఫై అవుతాయి. ఈ 8 జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్స్ విజేతలు అంటే సెమీఫైనల్ చేరిన నాలుగు జట్లు 2027లో బ్రెజిల్లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత పొందుతాయి. క్వార్టర్స్‌లో ఓడిన జట్లు ప్లే ఆఫ్స్ ఆడాల్సి ఉంటుంది. ఆసియా నుంచి మరో రెండు జట్లకు ప్రపంచకప్ బెర్త్‌లు లభిస్తాయి.

ఆసీస్ బౌలర్ చెత్త ప్రదర్శన.. ఓవర్లో ఏకంగా 18 బంతులు..!
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జాన్ హేస్టింగ్స్ చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో ఇవాళ (జులై 29) జరిగిన మ్యాచ్‌లో ఓ ఓవర్లో ఏకంగా 18 బంతులు వేశాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఏ బౌలర్ ఓ ఓవర్లో ఇన్ని బంతులు వేయలేదు. గతంలో ఈ రికార్డు విండీస్ లోకల్ ప్లేయర్ రోషన్ ప్రైమస్ పేరిట ఉండేది. ప్రైమస్ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఓ మ్యాచ్‌లో ఓవర్లో 13 బంతులు వేశాడు. తాజాగా ప్రైమస్ రికార్డును హేస్టింగ్స్ బద్దలు కొట్టాడు.పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన హేస్టింగ్స్ 12 వైడ్లు, ఓ నో బాల్ వేశాడు. ఈ ఓవర్లో కేవలం ఐదు బంతులు మాత్రమే వేసిన అతను మొత్తంగా 20 పరుగులు సమర్పించుకున్నాడు. ఆసీస్ 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఇది జరిగింది. హేస్టింగ్స్ గల్లీ బౌలర్ల కంటే అధ్వానంగా బౌలింగ్ చేసి అందరికీ విసుగు తెప్పించాడు. 39 ఏళ్ల హేస్టింగ్స్ ఆసీస్ తరఫున ఓ టెస్ట్, 29 వన్డేలు, 9 టీ20లు ఆడి ఉండటం కొసమెరుపు. ఇతగాడు ఐపీఎల్‌లోనూ 3 మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన ఆటగాడిని నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించింది కాదు.మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్.. ఆస్ట్రేలియాను 11.5 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ చేసింది. సయీద్ అజ్మల్ 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూల్చాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో బెన్ డంక్ (26), కల్లమ్ ఫెర్గూసన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 75 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆడుతూపాడుతూ 7.5 ఓవర్లో వికెట్ కూడా కోల్పోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు షర్జీల్ ఖాన్ 23 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 32, సోహైబ్ మక్సూద్ 26 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి పాక్‌ను గెలుపు తీరాలు దాటించారు.కాగా, ఈ టోర్నీలో పాక్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింట ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇవాళ రాత్రి భారత్ తమ చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ దక్కవచ్చు. భారత్ ఈ టోర్నీలో పాక్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

ఆరేసిన అజ్మల్.. ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన పాకిస్తాన్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాకిస్తాన్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న ఆ జట్టు.. ఇవాళ (జులై 29) ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్.. ఆస్ట్రేలియాను 11.5 ఓవర్లలోనే ఆలౌట్ చేసింది.స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ 6 వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 74 పరుగులకే కుప్పకూలింది. అజ్మల్ ధాటికి ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టులో బెన్ డంక్ (26), కల్లమ్ ఫెర్గూసన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. షాన్ మార్ష్ 7, క్రిస్ లిన్ 6, డి ఆర్చీ షార్ట్ 2, డేనియల్ క్రిస్టియన్ 0, బెన్ కటింగ్ 5, నాథన్ కౌల్టర్ నైల్ 0, పీటర్ సిడిల్ 5, స్టీవ్ ఓకీఫ్ 1, బ్రెట్ లీ 1 (నాటౌట్) పరుగులు చేశారు.పాక్ బౌలర్లలో అజ్మల్‌తో పాటు ఇమాద్ వసీం (3-0-11-2), సోహైల్ తన్వీర్ (2-0-8-1), సోహైల్ ఖాన్ (2-0-23-1) కూడా వికెట్లు తీశారు.అనంతరం 75 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆడుతూపాడుతూ 7.5 ఓవర్లో వికెట్ కూడా కోల్పోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు షర్జీల్ ఖాన్ 23 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 32, సోహైబ్ మక్సూద్ 26 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి పాక్‌ను గెలుపు తీరాలు దాటించారు. ఆసీస్ కెప్టెన్ ఐదుగురు బౌలర్లను ప్రయోగించినా ఒక్క పాక్ వికెట్‌ను కూడా తీయలేకపోయారు.కాగా, ఈ టోర్నీలో పాక్‌తో పాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా కూడా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింట ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇవాళ రాత్రి భారత్ తమ చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ దక్కవచ్చు. భారత్ ఈ టోర్నీలో పాక్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

IPL: కేకేఆర్‌కు సంబంధించి బిగ్ న్యూస్
ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. తమ ఫ్రాంచైజీ నుంచి హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ తప్పుకున్నాడని కేకేఆర్ యాజమాన్యం ట్విటర్ వేదికగా ప్రకటించింది.పండిట్ కొత్త అవకాశాలను అన్వేషించాలని నిర్ణయించుకున్నారు. ఇకపై అతను కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రధాన కోచ్‌గా కొనసాగరు. అతని అమూల్యమైన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు. 2024 ఎడిషన్‌లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించడంతో పాటు బలమైన, దృఢమైన జట్టును నిర్మించడంలో సహాయపడినందుకు అతనికి ధన్యవాదాలు. అతని నాయకత్వం మరియు క్రమశిక్షణ జట్టుపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. భవిష్యత్తు కోసం అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంటూ కేకేఆర్ యాజమాన్యం తమ ట్విటర్ మెసేజ్‌లో పేర్కొంది.కాగా, పండిట్ 2024 ఎడిషన్‌లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంతో కీలకపాత్ర పోషించాడు. అయితే గత సీజన్లో అతని ఆథ్వర్యంలో కేకేఆర్ పేలవ ప్రదర్శనలు చేసి ఎనిమిదో స్థానంలో (14 మ్యాచ్‌ల్లో కేవలం 5 విజయాలు) నిలిచింది. అప్పటి నుంచి కేకేఆర్ యాజమాన్యం పండిట్‌పై అసంతృప్తిగా ఉంది. తాజాగా పండిట్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు యాజమాన్యమే ముందుగా ప్రకటన చేసింది.పండిట్ 2022 ఆగస్ట్‌లో కేకేఆర్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. నాటి కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపిక కావడంతో కేకేఆర్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. పండిట్ ఆధ్వర్యంలో కేకేఆర్ 3 సీజన్లలో 42 మ్యాచ్‌లు ఆడి 22 మ్యాచ్‌ల్లో గెలిచి, 18 మ్యాచ్‌ల్లో ఓడింది. 2 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.బౌలింగ్ కోచ్ కూడా తప్పుకున్నాడు..కేకేఆర్ యాజమాన్యం హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా తప్పించినట్లు తెలుస్తుంది. భరత్ అరుణ్ త్వరలో చెన్నై సూపర్‌కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా జాయిన్ అవుతాడని సమాచారం. అరుణ్ 2014-2021 వరకు టీమిండియా బౌలింగ్ కోచ్‌గా అందరికీ సుపరిచితుడు.
బిజినెస్

అమెరికాకు స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో భారత్ టాప్
న్యూఢిల్లీ: టారిఫ్‌ల వివాదాలతో అమెరికాకు చైనా స్మార్ట్ఫోన్ల ఎగుమతులు నెమ్మదించడాన్ని భారత్ అవకాశంగా మల్చుకుంటోంది. 2025 రెండో త్రైమాసికంలో తొలిసారిగా అగ్రరాజ్యానికి చైనాకన్నా అధికంగా స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేసింది. కన్సల్టెన్సీ సంస్థ కెనాలిస్ నివేదికలో ఈ అంశం వెల్లడైంది. దీని ప్రకారం అమెరికాకు స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో చైనాలో అసెంబుల్ చేసిన ఫోన్ల వాటా గతేడాది ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 61 శాతంగా ఉండగా ఈ ఏడాది అదే వ్యవధిలో 25 శాతానికి తగ్గింది. అదే సమయంలో భారత్ వాటా 13 శాతం నుంచి 44 శాతానికి (సుమారు 240 శాతం వృద్ధి) పెరిగింది. క్యూ2లో ఐఫోన్ల ఎగుమతులు వార్షికంగా 11 శాతం తగ్గి 1.33 కోట్ల యూనిట్లకు పరిమితం కాగా, శాంసంగ్ ఫోన్ల ఎగుమతులు 38 శాతం పెరిగి 83 లక్షల యూనిట్లకు పెరిగాయి. టాప్ 5 ఫోన్లకు సంబంధించి అమెరికాకు మోటరోలా ఫోన్ల ఎగుమతులు రెండు శాతం పెరిగి 32 లక్షల యూనిట్లకు, గూగుల్ 13% పెరిగి 8 లక్షల యూనిట్లకు చేరగా, టీసీఎల్ 23% క్షీణించి 7 లక్షల యూనిట్లకు పరిమితమైంది. క్యూ2లో తొలిసారి...అమెరికాకు ఎగుమతయ్యే స్మార్ట్ఫోన్లకు సంబంధించి క్యూ2లో భారత్ తొలిసారిగా అగ్రగామి తయారీ హబ్‌గా నిల్చిందని కెనాలిస్ ప్రిన్సిపల్ అనలిస్ట్ సన్యమ్ చౌరాసియా తెలిపారు. అమెరికా–చైనా మధ్య వాణిజ్య అనిశ్చితి వల్ల యాపిల్ తమ సరఫరా వ్యవస్థను భారత్‌కు మళ్లిస్తుండటం ఇందుకు దోహదపడిందని వివరించారు. చైనా ప్లస్ వన్ వ్యూహంలో భాగంగా యాపిల్ గత కొన్నేళ్లుగా భారత్‌లో తమ ఉత్పత్తుల తయారీని పెంచుకుంటోందని చౌరాసియా చెప్పారు. అయితే, ఐఫోన్ 16 సిరీస్, ప్రో మోడల్స్ తయారీని భారత్‌లో ప్రారంభించినప్పటికీ, పెద్ద స్థాయిలో సరఫరా కోసం యాపిల్ ఇప్పటికీ చైనా తయారీ ప్లాంట్లపైనే ఎక్కువగా ఆధారపడుతోందని ఆయన వివరించారు. యాపిల్ తరహాలోనే మోటరోలా ఫోన్లకు కూడా ప్రధాన తయారీ హబ్‌గా చైనా నిలుస్తోంది. మరోవైపు, యాపిల్‌తో పోలిస్తే కాస్త తక్కువ పరిమాణమే అయినప్పటికీ అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తుల తయారీని శాంసంగ్, మోటరోలా కూడా భారత్‌లోనే ఎక్కువగా చేపడుతున్నాయని చౌరాసియా పేర్కొన్నారు. శాంసంగ్ అత్యధికంగా స్మార్ట్ఫోన్లను వియత్నాంలో ఉత్పత్తి చేస్తోంది.

ఇండియాలో డిజిటల్ చెల్లింపులు జోరు
ముంబై: ఇండియాలో డిజిటల్ చెల్లింపులు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఆర్బీఐ – డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ (ఆర్బీఐ–డీపీఐ) ఈ ఏడాది మార్చి నెలకు 493.22గా నమోదైంది. దీనికి ఆరు నెలల ముందు.. 2024 సెప్టెంబర్‌లో ఈ సూచీ 455.5గా ఉండడం గమనార్హం. అంటే డిజిటల్ చెల్లింపుల్లో 10.7% మేర వృద్ధి నమోదైంది. చెల్లింపుల సదుపాయాలు, సరఫరా వైపు అంశాలు ఆర్బీఐ–డీపీఐ సూచీ బలపడేందుకు దారితీసినట్టు ఆర్బీఐ తెలిపంది.ఐదు అంశాల ఆధారంగా చెల్లింపుల తీరును ఆర్బీఐ మదింపు వేస్తుంటుంది. ఇందులో చెల్లింపులు చేసే వారు (25% వెయిటేజీ), చెల్లింపులు సదుపాయాలు – డిమాండ్ వైపు అంశాలు (10%) పేమెంట్ (Payment) సదుపాయాలు – సరఫరా వైపు అంశాలు (15%), చెల్లింపుల పనితీరు (45%), వినియోగదారుల కేంద్రీకరణ 5% చొప్పున వెయిటేజీ కలిగి ఉన్నాయి.విప్రో ఇన్ఫ్రా నుంచి కొత్త బిజినెస్ న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, తయారీ సొల్యూషన్లు అందించే విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ (విన్) తాజాగా కొత్త బిజినెస్ విభాగానికి తెరతీసింది. విప్రో ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ పేరుతో ఏర్పాటు చేసిన విభాగంపై రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల(పీసీబీలు) తయారీలో ఉపయోగించే బేస్ మెటీరియల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం కర్ణాటకలో కాపర్ క్లాడ్ లామినేట్(సీసీఎల్) తయారీ యూనిట్‌ను నెలకొల్పుతున్నట్లు వివరించింది. దీంతో సుమారు 350 మందికి ఉపాధి లభించనుంది.చదవండి: టీసీఎస్ లేఆఫ్స్‌తో ఆర్థిక ప్రకంపనలుపెగాసిస్టమ్స్ డెవలపర్ల కోసం ఎక్స్పర్ట్ సర్కిల్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తమ డెవలపర్ల కోసం ఎక్స్పర్ట్ సర్కిల్స్ సెషన్లను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా తమ డెవలపర్లలో 50 శాతం మంది భారత్‌లో ఉన్నారని, వారు తమ నైపుణ్యాలను మరింతగా పెంచుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని పెగాఇన్నోవేట్ 2025 కార్యక్రమం సందర్భంగా కంపెనీ ఎండీ దీపక్ విశ్వేశ్వరయ్య తెలిపారు. పెగా ప్రధాన టెక్నాలజీలైన బ్లూప్రింట్, యాప్ డిజైన్‌లాంటి టెక్నాలజీలు తదితర అంశాల గురించి ఈ సెషన్స్‌లో చర్చిస్తారు. ఒక్కో సెషన్లో 50 మంది వరకు పాల్గొనవచ్చని దీపక్ చెప్పారు.

ఫైనాన్షియల్ మోసాలకు చెక్ పెట్టేలా 5 చర్యలు
డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక నియంత్రణ సంస్థలు అత్యవసర సర్వీసులు ప్రారంభిస్తున్నాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) సంయుక్తంగా పెట్టుబడిదారుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా హెచ్చరికలను జారీ చేస్తున్నాయి.డిజిటల్ ఫైనాన్షియల్ మోసాలు పెరుగుతున్నందున, రిటైల్ ఇన్వెస్టర్లను లక్ష్యంగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలో ఇన్వెస్టర్లకు పెట్టుబడి సాధనాలతోపాటు టెక్నాలజీపై అవగాహన కల్పించడమే లక్ష్యం పెట్టుకున్నాయి. మొబైల్ యాప్‌లు, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు, ఇన్ఫ్లుయెన్సర్ ఆధారిత కంటెంట్ పెరిగిపోతుండడంతో ఇన్వెస్టర్లు మోసాల బారిన పడుతున్నారు.గ్యారెంటీడ్ రిటర్న్స్.. ఇన్వెస్టర్ల పెట్టుబడులపై గ్యారెంటీడ్ రిటర్న్స్ అంటూ సైబర్ నేరగాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారు.డిజిటల్ హైజీన్: ఇన్వెస్టర్లు సెబీ రిజిస్టర్డ్ యాప్‌లను మాత్రమే ఉపయోగించాలి. అధికారిక ఛానెళ్లలో మధ్యవర్తులను వెరిఫై చేసుకోవాలి. కాదని ప్రత్యేకంగా నేరగాళ్లు పంపే లింక్‌లపై క్లిక్ చేస్తే మొదటికే మోసం వస్తుంది.పెట్టుబడి సలహాలు: ముఖ్యంగా సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లు లేదా ఈమెయిల్స్ లోని తెలియని సోర్స్ నుంచి వస్తున్న సమాచారాన్ని నమ్మవద్దు. ఉచిత సలహా వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఎవరికివారు నిత్యం ప్రశ్నించుకోవాలి.సెబీ రిజిస్టర్డ్ యాప్‌లు: సెబీ రిజిస్టర్డ్ యాప్‌లను మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలి. సదరు యాప్ సెబీ అధికారిక జాబితాలో లేకపోతే దాన్ని వెంటనే డిలీట్ చేయాలి. ఫిషింగ్, మోసం స్కీమ్‌ల్లో నకిలీ యాప్‌లే సాధనంగా ఉంటాయి.మధ్యవర్తులను వెరిఫై చేయడం: బ్రోకర్లు, సలహాదారులు, ఇతర ప్లాట్‌ఫామ్‌ల చట్టబద్ధతను ధ్రువీకరించుకోవాలి. అందుకు సెబీ అధికారిక పోర్టలో ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే రిపోర్ట్ చేయాలి. ముందస్తు రిపోర్టింగ్ ఇతరులను రక్షించడంలో సహాయపడుతుంది. రెగ్యులేటర్లు వేగంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది.

దేశంలోనే మొదటి క్లౌడ్ ఆధారిత డెస్క్‌టాప్
ఖరీదైన హార్డ్‌వేర్ అవసరం లేకుండా ఏ స్క్రీన్ నైనా పూర్తి స్థాయి కంప్యూటర్‌గా మార్చే గేమ్ ఛేంజింగ్ సర్వీస్‌ను రిలయన్స్ జియో ‘జియోపీసీ’ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో ఫైబర్ లేదా జియోఎయిర్ ఫైబర్‌తో నడిచే క్లౌడ్ ఆధారిత వర్చువల్ డెస్క్ టాప్‌ను జియోపీసీ అంటారు. దీనిద్వారా కేవలం కీబోర్డు, మౌస్ ఉపయోగించి టీవీ లేదా మానిటర్‌ను పర్సనల్ కంప్యూటర్‌గా మార్చుకోవచ్చు.పూర్తిగా క్లౌడ్ మీద ఆధారపది ఇది కంప్యూటింగ్ సర్వీసు అందిస్తుంది. ఇందులో సీపీయూ ఉండదు. అప్గ్రేడ్లు ఉండవు. మెయింటెనెన్స్ ఉండదు. ఈ క్లౌడ్ సర్వీస్ కోసం నెలకు రూ.400 నుంచి ‘పే-యాస్ యూ-గో’ మోడల్ ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త యూజర్లకు ఒక నెల ఉచిత ట్రయల్ అందిస్తారు. 8 జీబీ ర్యామ్, 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్, ఏఐ ఆధారిత టూల్స్ ఇందులో ఉంటాయి. అడోబ్ ఎక్స్ ప్రెస్‌ను ఉచితంగా అందిస్తారు. ఇది ఫైల్ డిజైన్, ఎడిటింగ్‌కు ఉపయోగపడుతుంది.లిబ్రే ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (బ్రౌజర్ కోసం), జియో వర్క్ స్పేస్ వంటి ఉత్పాదక అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది. ఈ క్లౌడ్‌లో డేటాను సురక్షితంగా స్టోర్ చేసేందుకు వైరస్ అటాక్‌ల నుంచి భద్రత కల్పిస్తారు.ఎవరికి ఉపయోగమంటే..ఆన్లైన్ లెర్నింగ్, కోడింగ్, రీసెర్చ్ కోసం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ముందస్తు పెట్టుబడి లేకుండా సరసమైన కంప్యూటింగ్ కోసం చిరు వ్యాపారాలకు తోడ్పడుతుంది. కుటుంబ సభ్యుల కోసం వినోదాన్ని అందిస్తుంది. క్లౌడ్ టూల్స్‌తో కంటెంట్ క్రియేటర్లు డిజైన్, ఎడిట్, పబ్లిషింగ్‌ను ఉపయోగించవచ్చు.ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’ఎలా సెట్ చేయాలంటే..జియో సెట్ టాప్ బాక్స్ ఆన్ చేయాలి.యాప్స్ విభాగానికి వెళ్లి జియోపీసీ యాప్‌ను లాంచ్ చేయాలి.కీబోర్డ్, మౌస్‌ను ప్లగ్ ఇన్ చేయాలి.జియో నంబర్‌తో రిజిస్టర్ అయి, సైన్ ఇన్ అవ్వాలి.
ఫ్యామిలీ

ఆ అమ్మ చర్మం బిడ్డ బుగ్గలపై చిగురించింది..
తల్లి తన బిడ్డల కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధపడుతుందనడానికి సిసలైన ఉదాహరణ ఇది. ఈ తల్లి ప్రమాదంలో చెంపలు కాలిపోయి అందవికారంగా తయారైన తన ఆరునెలల చిన్నారి కోసం తన చర్మాన్ని వొలిచి ఇచ్చింది. ఆ తల్లి త్యాగం ఫలించింది. ఇప్పుడా తల్లీ బిడ్డా ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా ఉన్నారు. తనకేం జరిగిందో తెలియకున్నా అమాయకంగా నవ్వుతూ బిడ్డ ధ్యాన్ష్... తన చర్మాన్నిచ్చి కాపాడుకున్నానన్న సంతోషంతో తల్లి మనీషా ఇద్దరూ ఫొటోకు పోజులిచ్చారు. గతనెల 12న అహమ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో విమానం కూలి మేఘనినగర్‌లోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్, నివాస గృహాలపై పడిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం జరిగిన సమయంలో సివిల్ హాస్పిటల్లో యూరాలజీ నిపుణుడైన డాక్టర్ కపిల్ కచ్చాడియా భార్య మనీషా, వాళ్ల ఆరు నెలల కుమారుడు ధ్యాన్ష్ ఇంట్లో ఉన్నారు. విమాన శకలం నుంచి చెలరేగిన మంటల్లో మనీషా చేతులు ముఖంపై 25 శాతం కాలిన గాయాలు కాగా, ధ్యాన్ష్ ముఖం, రెండు చేతులు, ఉదరం, ఛాతీ కాలి, గాయాలు కావడంతో ఇద్దరినీ కేడీ ఆసుపత్రికి తరలించారు, అక్కడ ధ్యాన్ష్ ను పీడియాట్రిక్ ఐసియులో చేర్చి వెంటిలేటర్‌పై ఉంచారు. 36 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న ధ్యాన్స్కు అతని తల్లి ముప్ఫై ఏళ్ల మనీషా చర్మాన్ని తీసి స్కిన్ గ్రాఫ్టింగ్ ద్వారా అమర్చారు. ఫలితంగా ఎనిమిది నెలల పసివాడు ధ్యాన్ష్ ఇప్పుడు చక్కగా నవ్వుతున్నాడు, ప్రాణాంతక కాలిన గాయాల నుండి బయటపడిన అతని బుగ్గలు ఇప్పుడు నునుపుతేలి ఆరోగ్యంతో మెరుస్తున్నాయి. తన నుంచి తీసిన చర్మాన్ని పిల్లాడికి అమర్చి, అతడు కోలుకున్న తర్వాత ఆ బోసి నవ్వులు చూస్తూ మనీషా కూడా త్వరలోనే కోలుకుంది. తల్లి, బిడ్డ ఇద్దరూ జూన్ 12న జరిగిన ఏఐ 171 విమాన ప్రమాదం తర్వాత తీవ్రమైన కాలిన గాయాలకు ఐదు వారాల చికిత్స తర్వాత ఇటీవల డిశ్చార్జ్ అయినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.‘ఒక్క క్షణం అంతా నల్లగా అయిపోయింది, ఆపై వేడి మా ఇంటిని చుట్టుముట్టింది. నేను ధ్యాన్ష్‌ను పట్టుకుని దట్టమైన పొగ, మంటల గుండా పరిగెత్తాను. మేము బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడగలమని అనుకోలేదు కానీ దేవుడి దయవల్ల, కేడీ హాస్పిటల్ వైద్యులు సకాలంలో స్పందించి చేసిన చికిత్స వల్ల ఇద్దరం ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాం. ఇప్పుడు నేను నా బిడ్డ అందమైన నవ్వును తిరిగి చూడగలుగుతున్నాను’’ అంటూ సంతోషం వెలిబుచ్చింది మనీషా. కేడీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆదిత్ దేశాయ్ మాట్లాడుతూ, ‘ఆ తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి చూపిన ధైర్యాన్ని, వైద్యులకు అందించిన సహకారాన్ని మాటలలో వర్ణించలేం. మా హాస్పిటల్లో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలనిచ్చింది’’ అని పత్రికలవారికి తెలిపారు. ఈ సంఘటనలో గాయపడిన ఆరుగురు ప్రమాద బాధితులకు తమ ఆస్పత్రి మానవతా దృక్పథంతో ఉచిత సేవలందించినట్లు తెలిపారు. (చదవండి: రుచిని ఆస్వాదిస్తూనే హాయిగా తినొచ్చు ఇలా..! గ్యాస్, అధిక బరువు..)

సేంద్రియ పశుపోషణపై దృష్టి
‘ఆర్గానిక్ ఆహారోత్పత్తులు అనగానే మనకు చప్పున గుర్తొచ్చేది ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు. కానీ, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు కూడా ఆర్గానిక్ బుట్టలో ప్రధాన భాగాన్ని ఆక్రమిస్తుంది. ప్రకృతి/సేంద్రియ సేద్య పద్ధతుల్లో సాగు చేస్తున్న రైతులు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత ఎక్కువ మంది మన దేశంలో ఉన్నారు. వారు పండిస్తున్న సేంద్రియ ఆహారాన్ని దేశీయంగా వినియోగిస్తుండడంతోపాటు చాలా రకాల సేంద్రియ ఉత్పత్తులను అనేక దేశాలకు మన దేశం ఎగుమతి చేస్తోంది. అయితే, సేంద్రియ పాలు/ పాల ఉత్పత్తులు, సేంద్రియ పశు / కోడి మాంసం తదితర ఉత్పత్తుల ఎగుమతి మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో లేదు.సేంద్రియ పశుపోషణ, సేంద్రియ కోళ్ల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి విధాన రూపుకల్పన కోసం కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఆర్గానిక్ లైవ్‌స్టాక్ ప్రొడక్షన్, సర్టిఫికేషన్ ప్రక్రియలకు సంబంధించి విధి విధానాలు, ప్రమాణాలను రూపొందించే కృషి ఊపందుకుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐసీఏఆర్ అనుబంధ సంస్థ జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఎన్ ఎంఆర్ఐ) ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తోంది. ఔత్సాహిక రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులతో ఇటీవల ఒక సమాలోచన కార్య శాలను సైతం ఎన్ ఎంఆర్ఐ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అసలు సేంద్రియ పద్ధతుల్లో పాడి పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం అంటే ఏమిటి? రసాయనాలు వాడకుండా పశుపోషణ ఎలా? వ్యాధుల నివారణ, చికిత్సకు రసాయనా లకు ప్రత్యామ్నాయం ఏమిటి? సేంద్రియ ధ్రువీకరణ పద్ధతులేమిటి? మన బలాబలాలు, సవాళ్లేమిటి? ఇటువంటి అంశాలపై విషయ నిపుణులు ‘సాక్షి సాగుబడి’తో ఏమన్నారంటే.. పంటలు/తోటలు లేదా జంతువులు / కోళ్లను రసాయనిక పురుగు మందులు, రసాయనిక ఎరువులు, హార్మోన్లు, అల్లోపతి మందులు వంటి సింథటిక్ ఉత్పాదకాలను ఉపయోగించకుండా పెంచటాన్ని సేంద్రియ వ్యవసాయంగా అంతర్జాతీయ సమాజం గుర్తిస్తోంది. ఈ విధంగా రసాయ నాలు, జన్యుమార్పిడి ఉత్పాదకాలు వాడకుండా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పెంచే ఆహారోత్పత్తులకు దేశ విదేశీ మార్కెట్లలో గిరాకీ అంతకంతకూ పెరుగుతోంది. ధ్రువీకరణ ప్రమాణాలకు అనుగుణంగా పెంచిన ఆరోగ్యదాయక మైన సేంద్రియ ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లతో పాటు సేంద్రియ పాలు, మాంసం, కోడిగుడ్లు, విలువ ఆధారిత సేంద్రియ ఆహారోత్పత్తులకు అధిక సొమ్ము చెల్లించటానికి ధనిక, మధ్యతరగతి వినియోగ దారులు వెనుకాడటం లేదు. ఈ ట్రెండ్ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలతో పాటు భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ కనిపిస్తోంది. ప్రపంచ సేంద్రియ మార్కెట్ జోరుఆర్గానిక్ పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. సేంద్రియ పాల మార్కెట్ ఏటా 6% పెరుగుతోంది. 2020లో 2 వేల కోట్ల డాలర్లుగా ఉండగా, 2026 నాటికి 3,200 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. అదేవిధంగా సేంద్రియ మాంసం ఉత్పత్తుల మార్కెట్ 7% పెరుగుతోంది. 2020లో 1,500 కోట్ల డాలర్ల నుంచి 2025 ఆఖరు నాటికి 2 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా. ఆర్గానిక్ ఎగ్ మార్కెట్ మరింత వేగంగా 12.5% పెరుగుతోంది. 2023లో 370 కోట్ల డాలర్ల వ్యాపారం జరగ్గా 2032 నాటికి ఇది 1,070 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. 20% పెరుగుతున్న దేశీయ మార్కెట్మన దేశంలో సేంద్రియ ఆహారోత్పత్తుల మార్కెట్ ఏటా 20% పెరుగుతోంది. కోవిడ్ తర్వాత సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. అనధికారిక పద్ధతుల్లో మార్కెటింగ్ ఊపందుకుంది. ఉత్పత్తిదారు నుంచి వినియోగదారులు నేరుగా కొంటున్నారు. ప్రభుత్వం ప్రకృతి/ సేంద్రియ పంటల సాగును చాలా ఏళ్లుగా విస్తృతంగా ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు సేంద్రియ పాడి పశువుల పెంపకం, సేంద్రియ గొర్రెలు/మేకల పెంపకం, సేంద్రియ కోడిగుడ్లు, కోడి మాంసం పెంపకంపై ఇప్పుడు దృష్టి సారించింది. ఎన్ పీఓపీ, పీజీఎస్ సర్టిఫికేషన్లు2023–24లో మన దేశంలో 44.75 లక్షల హెక్టార్లలో సేంద్రియ సాగు జరుగుతోంది. దీనితో పాటు 28.5 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం నుంచి సేంద్రియ ఉత్పత్తులు సేకరిస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలున్న నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్ పీఓపీ) సర్టిఫికేషన్ కలిగిన రైతులు 36 లక్షల టన్నుల సేంద్రియ దిగుబడులు పండించారు. దేశీయంగా అమ్ముకోవడానికి ఉద్దేశించిన పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పీజీఎస్) సర్టిఫికేషన్ ఉన్న రైతులు 6.20 లక్షల టన్నులు పండించారు. ఈ రెండు రకాల సర్టిఫికేషన్లు పంటలతో పాటు పాలు, మాంసం, గుడ్లు, తేనె, ఆక్వా ఉత్పత్తులకు కూడా ఇస్తారు. ఎగుమతులకు అవకాశాలు2023–24లో 2,61,029 టన్నుల (వీటి ఖరీదు రూ.4,008 కోట్లు) సేంద్రియ పత్తి, నూనెగింజలు, చెరకు, ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, ఔషధ మొక్కలను భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి చేశాం. అమెరికా, యూరోపియన్ యూనియన్, కెనడా, బ్రిటన్, శ్రీలంక, స్విట్జర్లాండ్, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర దేశాలకు మనం సేంద్రియ ఉత్పత్తులు అమ్మాం. ఆయా దేశాల సేంద్రియ ప్రమాణాలకు తగిన రీతిలో సేంద్రియ పాలు, మాంసం, గుడ్లు మన రైతులు ఉత్పత్తి చేస్తే, వాటిని ఎగుమతి చేయటం కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేసియా, కెనడా దేశాల్లో సేంద్రియ మాంసం, గుడ్లు, పాలు, తేనెకు డిమాండ్ ఉంది. ఆ మార్కెట్ల ప్రత్యేక నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలో సేంద్రియ పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌కు మౌలిక సదుపాయాలు, ఏర్పాటు చేసే పటిష్టమైన సమగ్ర విధానంతో పాటు రైతుల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. సేంద్రియ పశుపోషణలో ఎన్ ఎస్ఓపీ ప్రమాణాలు కీలకంసేంద్రియ పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తి చెయ్యాలనుకునే రైతులు, సంస్థలు నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్ ఎస్ఓపీ) ప్రమాణాలు పాటించాలి. అవి: సహజ బ్రీడింగ్ పద్ధతులను అనుసరించటం.. జంతువుల ఆరోగ్యం– సంక్షేమానికి రక్షణ చర్యలు తీసుకోవటం.. సేంద్రియంగా పండించిన దాణాను, పశుగ్రాసాలను మేపటం.. పశువులను ఒకేచోట కట్టేసి ఉంచకుండా సహజ ప్రవర్తనను వ్యక్తీకరించేలా స్వేచ్ఛనివ్వటంతో పాటు ఒత్తిడిని తగ్గించడం ముఖ్యం. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అల్లోపతి ఔషధాలు, యాంటీబయాటిక్స్, హార్మోన్లు, పెరుగుదలకు బూస్టర్లు, దాణా మిశ్రమాలు మొదలైన వాటి వాడకంపై నూటికి నూరు శాతం నిషేధం పాటించాలి. పెంచే పశువులు, జీవాల జాతుల ఎంపిక.. దాణా, ఆరోగ్య సంరక్షణ, పెంపకం, పేడ, మూత్రాల నిర్వహణ, సేంద్రియ పెంపక పద్ధతులకు మారే కాలం, షెడ్ల నిర్మాణంలో మెళకువలు, విశాలమైన స్థలం ఆవశ్యకత, ప్రతి పశువుకు గుర్తింపు చిహ్నం ఇవ్వటం, రవాణా పద్ధతులు, వధ–కోత అనంతర నిర్వహణలో నిర్దిష్ట పద్ధతులు పాటించాలి. అన్ని విషయాలపై రికార్డులు తయారు చేయటం ముఖ్యమైన విషయం. ఈ ప్రమాణాలు పాటిస్తూ సేంద్రియ పద్ధతులను అలవాటు చేసుకోవటంలో రైతులకు, విస్తరణ సిబ్బందికి అవగాహన కల్పించటం కోసం హయత్‌నగర్‌లోని ‘క్రీడా’ ప్రదర్శన క్షేత్రంలో సేంద్రియ గొర్రెల పెంపక యూనిట్‌ను ప్రారంభించాం. ఎన్పీఓపీ ధ్రువీకరణ ప్రమాణాలు పాటిస్తున్నాం. సేంద్రియ పశుపోషణ ద్వారా పాలు, మాంసం, సేంద్రియ కోళ్ల పెంపకంలో ఆసక్తి గల రైతులు, రైతు ఉత్పత్తి సంస్థలు(ఎఫ్పీఓలు), సహకార సంఘాలకు ప్రామాణిక శిక్షణ ఇస్తాం. – డాక్టర్ పి. బస్వారెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్– జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఎన్ ఎంఆర్ఐ), చెంగిచర్ల, హైదరాబాద్ 040–29801672ఏ జాతులనైనా సేంద్రియంగా పెంచవచ్చువిదేశాల్లో పంటలు పండించే పొలాలు, పశువుల్ని పెంచే క్షేత్రాలు కలిసి ఉండవు. మన దేశంలో పంటలు సాగు చేసే రైతులకు పశువుల పెంపకం కూడా ఉంటుంది. ప్రకృతి/సేంద్రియ సేద్యంలో పంటలు పండించే రైతుల పొలాల్లోనే సేంద్రియంగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకానికి ప్రోత్సహిస్తే సత్ఫలితాలు వస్తాయి. వారి సొంత పంట వ్యర్థాలను, సొంత ధాన్యాలను పశువులకు మేపటం ద్వారా నాణ్యతా ప్రమాణాలను సులువుగా ఆచరించవచ్చు. నేల–పశువు–పంట.. ఈ మూడింటి మధ్య సేంద్రియ అనుసంధానం చెయ్యాలి. ఈ విషయంలో మన దేశంలో చిన్న, సన్నకారు రైతులకు ఉన్న నైపుణ్యాలు వరంగా ఉపయోగపడతాయి. విదేశాలతో పోల్చితే రసాయనాలకు పెద్ద పీట వెయ్యని దేశం మనది. వ్యవసాయ రసాయనాలు వాడకం తక్కువగా ఉన్న కొండ/గిరిజన ప్రాంతాలపై తొలుత దృష్టిని కేంద్రీకరించి, ప్రోత్సహించాలి. దేశీ, నాటు పశువులను మాత్రమే సేంద్రియ పెంపకానికి వాడాలనేం లేదు. సంకరజాతి పశువులను నిస్సందేహంగా పెంచవచ్చు. – డాక్టర్ మహేశ్ చందర్, ప్రధాన శాస్త్రవేత్త, జాతీయ పశుపోషణ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఐవీఆర్ఐ), ఇజ్జత్‌నగర్, ఉత్తరప్రదేశ్పశు వ్యాధులకు సంప్రదాయ ఈవీఎం చికిత్స మేలుపశు వ్యాధుల నివారణలో, చికిత్సలో యాంటీబయాటిక్ ఔషధాలను అతిగా వాడుతూ వాటికి నిరోధకత పెంచుకోవటం ఇప్పుడు మానవాళి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. సుసంపన్న సంప్రదాయ సిద్ధ, ఆయుర్వేద విజ్ఞానంతో కూడిన మూలికా వైద్య చికిత్స (ఎత్నో వెటర్నరీ మెడిసిన్ –ఈవీఎం)ల ద్వారా పశువ్యాధులను జయించవచ్చు. 24 ఏళ్లుగా ఈవీఎంలపై కృషి చేస్తున్నా. వీటి పనితీరు ఎంత ప్రభావశీలంగా ఉందో 9 రాష్ట్రాల్లో 25 ఎన్ డీడీబీ అనుబంధ పాడి సహకార సంఘాల్లోని రైతుల అనుభవాలే తేటతెల్లం చేస్తున్నాయి. పొదుగువాపు, గాలికుంటు వ్యాధి వంటి అనేక తీవ్ర జబ్బులను సైతం కొద్ది రోజుల్లో ఈవీఎం మందులతో తగ్గించవచ్చని రుజువైంది. 11.2 లక్షల కేసుల్లో 80.4% జబ్బులు తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈవీఎంల ప్రభావశీలతను గుర్తించింది. ఈవీఎంకు ఎవిడెన్ ్స బేస్డ్ మెడిసిన్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. ఇవి తక్కువ ఖర్చుతో, కచ్చితంగా ఫలితాలనిచ్చే పర్యావరణ హితమైన, ఆరోగ్యదాయకమైన చికిత్సలని గుర్తించాలి.– ప్రొ. ఎన్ . పుణ్యమూర్తి, ఎన్ డీడీబీ కన్సల్టెంట్, టిఎఎన్ యువిఎఎస్ విశ్రాంత ఆచార్యులు, తంజావూరు, తమిళనాడుసమగ్ర విధానం ద్వారా రైతులకు మార్గదర్శనంప్రకృతి/సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆర్గానిక్ మాంసం, గుడ్లు, పాలు/పాల ఉత్పత్తుల పెంపకంపై కూడా దృష్టిని కేంద్రీకరించింది. సేంద్రియ మాంస ఉత్పత్తుల పెంపకం, మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులు, పారిశ్రామికవేత్తల ఆకాంక్షలతో పాటు మా అనుభవాలను జోడించి కేంద్రానికి నివేదిక పంపుతాం. సమగ్ర విధాన రూపకల్పనకు ఇది దోహదం చేస్తుంది. సేంద్రియ పశుపెంపకంపై పరిశోధనలకు, విస్తరణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. అపెడాలో సేంద్రియ పశు పెంపకం ప్రోత్సాహానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చెయ్యాలి. అమూల్ వంటి నమ్మదగిన బ్రాండ్ ద్వారా విక్రయిస్తే సేంద్రియ పాలు, గుడ్లు, మాంసం అధిక ధర ఇచ్చి కొనటానికి దేశంలో ప్రజలు ఆసక్తితో ఉన్నారు. యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు సేంద్రియ పాలు, మాంసం ఎగుమతి చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆసక్తి గల రైతులు మమ్మల్ని సంప్రదిస్తే మార్గదర్శనం చేస్తాం. – డా. ఎస్. బి. బర్బుదే, సంచాలకులు, ఐసీఏఆర్– జాతీయ మాంసం పరిశోధనా సంస్థ (ఎన్ ఎంఆర్ఐ), చెంగిచర్ల, హైదరాబాద్ – పంతంగి రాంబాబు

టైగర్ ప్రిన్సెస్
‘అమ్మో పులి’ అనుకునే రోజులు కావు ఇవి. ‘అయ్యో పులి’ అనుకునే రోజులు. పులుల మనుగడ ప్రమాదంలో పడిన నేపథ్యంలో వాటి పరిరక్షణకు నడుం కట్టిన అగ్రగణ్యులలో దిల్లీకి చెందిన లతికానాథ్ ఒకరు. ‘టైగర్ ప్రిన్సెస్’గా పేరు తెచ్చుకున్న లతిక చూడని అడవి లేదు. తన కెమెరా కన్ను ప్రపంచంలోని ఎన్నో పులుల విషయాలను, విశేషాలను, విషాదాలను ఆవిష్కరించింది.చిన్నప్పుడు లతికను తల్లిదండ్రులు నేషనల్ పార్క్‌కు తీసుకువెళ్లడం వల్ల ఆమెలో జంతువులపై ఆసక్తి, ప్రేమ పెరుగుతూ వచ్చాయి. జంతు పరిరక్షణ ఉద్యమ విశేషాలు వినడం, ఆ ఉద్యమాల్లో పాల్గొనడం లతిక కన్జర్వేషన్ ఎకాలజిస్ట్, ఫోటోగ్రాఫర్‌గా రూపుదిద్దుకోవడానికి కారణం అయింది.‘పులుల పరిరక్షణకు సంబంధించి మీరు చేసిన కృషిని డాక్యుమెంట్ చేయండి’ అంటూ లతికను సంప్రదించిన నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజీన్ నిర్వాహకులు ఆమెకు ‘టైగర్ ప్రిన్సెస్’ అనే బిరుదును ప్రదానం చేశారు. ‘డిస్కవరీ’ చానెల్ కోసం లతిక చేసిన ‘వైల్డ్ థింగ్స్’ డాక్యుమెంటరీ పాపులర్ అయింది. మన దేశంలో పులుల పరిరక్షణ, మేనేజ్మెంట్పై పరిశోధన చేసిన తొలి భారతీయురాలిగా లతిక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.పులుల ఉనికి, సంరక్షణకు సంబంధించిన అరకొర సమాచారం ఒక పరిమితిగా ఉండేది. ఆ పరిమితిని లతిక పరిశోధనలు అధిగమించాయి. డా. జార్జ్ షాలర్ తరువాత ఆ స్థాయిలో పులులపై పరిశోధన చేసిన వ్యక్తిగా లతికకు గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం పులుల పరిరక్షణ, మేనేజ్మెంట్కు సంబంధించి అధ్యయనాలు ఎక్కువగానే జరుగుతున్నాయి.‘గతంలో పోల్చితే పులుల పరిరక్షణపై ఎక్కువగా అధ్యయనాలు జరుగుతున్నప్పటికీ, పరిశోధన, అధ్యయనం అనేవి ఇప్పటికీ అంత సులభంగా ఏం లేవు. కావు. వైల్డ్‌లైఫ్ బయాలజిస్ట్, ఫొటోగ్రాఫర్‌గా చెప్పుకోదగ్గ స్థాయిలో జీవించడం కష్టంగా ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పులుల సంరక్షణకు సంబంధించి అధ్యయనాన్ని ప్రోత్సహించాలి’ అంటుంది లతిక.ప్రయాణాలు అంటే ఇష్టపడే లతిక యాభైకిపైగా దేశాలకు వెళ్లింది. ఎన్నో అడవులలో పులులతో సహా ఎన్నో జంతువుల ఫోటోలు తీసింది. ‘ప్రతి ఫోటోగ్రాఫ్‌కు ఒక కథ ఉంది. నేను చూసిన ప్రతి పులి నా మనసులో ముద్రించుకుపోయింది. ప్రతి పులి తనకు సంబంధించి ఒక కథ చెబుతున్నట్లుగానే ఉంటుంది. అవి క్షేమంగా ఉండాలని ఎప్పుడూ ప్రార్థించేదాన్ని’ అంటూ జ్ఞాపకాల్లోకి వెళుతుంది లతిక.లతిక తీసుకువచ్చిన ఫొటోగ్రాఫ్స్ కలెక్షన్ ‘హిడెన్ ఇండియా’ సమస్త జంతుజాలాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది. ఈ పుస్తకానికి వాడిన ముఖచిత్రం ఎంతో అర్థవంతంగా ఉంటుంది. అడవిలో ఒక శిథిల వృక్షం వెనకాల నుంచి భయంగా చూస్తూ ఉంటుంది పులి. ఆ పులి కళ్లు చెప్పకనే ఏవో బాధలు చెబుతున్నట్లుగానే ఉంటుంది. పిల్లల కోసం లతిక రాసిన ‘తక్దీర్ ది టైగర్ క్లబ్’ ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఇరవై భాషలలోకి అనువాదం అయింది.‘మనుషుల మనుగడ జంతువుల మనుగడతో ముడిపడి ఉంది. స్వల్పకాల స్వార్థప్రయోజనాల కోసం వాటికి హాని చేయడం అంటే భవిష్యత్ కాలంలో మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవడమే’ అంటున్న లతికానాథ్ అకాడమిక్ రిసెర్చ్ నుంచి కన్జర్వేషన్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి కన్సల్టెన్సీ వరకు పులుల పరిరక్షణకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది.వాటిని చూడడం అదృష్టంనేను పులులకు సమీపంలో ఉన్నప్పుడు, వాతావరణం వేడిగా ఉందా, చల్లగా ఉందా? అసౌకర్యంగా ఉందా? ఆకలిగా ఉందా? అనే స్పృహ ఉండదు. పులులు మాత్రమే నాకు కనిపిస్తాయి. పిట్ట కావచ్చు, పులి కావచ్చు వాటిని చూడడం అదృష్టంగా భావిస్తాను. వాటిని చూసినప్పుడల్లా వాటి పరిరక్షణకు ఇంకా ఏదైనా చేయాలనే స్ఫూర్తి కలుగుతుంది.– లతికానాథ్

రుచిని ఆస్వాదిస్తూనే హాయిగా తినొచ్చు ఇలా..! గ్యాస్, అధిక బరువు..
ఇటీవల కాలంలో అందరిని వేదించే సమస్య అధిక బరువు, జీర్ణ సంబంధిత సమస్యలు. ఎందుకంటే నచ్చిన ఆహారం కాస్త ఎక్కువగా తినకుండా ఉండలేరు చాలామంది. చెప్పాలంటే.. ఫుడ్ విషయంలో నోరు కంట్రోల్లో ఉంటే చాలా వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అది చాలా కష్టం. ఎందుకంటే నోరూరించే పదార్థాలు తినమని పిలుస్తుంటే ఆగకుండా ఉండటం ఎవరికి సాధ్యం. మరి అలాంటి సమస్యను అధిగమించి రుచిని ఆస్వాదిస్తూ..బి లిమిట్‌ని పాటించటం ఎలాగో తెలుసుకుందామా..!.బాలీవుడ్ నటి కరీనా కపూర్ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ ..మనసారా నచ్చిన ఆహారం తింటూనే అధిక బరువు, గ్యాస్ సమస్యకు ఎలా చెక్ పెట్టొచ్చొ షేర్ చేసుకున్నారు. నిజానికి మనం ఏ ఆహారాన్ని తింటున్నా..ఒకటి రెండు, మూడు..అలా అన్ని సార్లు పెట్టుకుంటూ లాగించేస్తాం. మరి ఇష్టమైన ఫుడ్ అయితే ..ఎంతలా తింటారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నియంత్రణ లేకుండా తినడాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవాలంటే..ఈ మైండ్‌ఫుల్‌నెస్ టెక్నీక్ అయినా జోర్డాన్ ఫార్ములాను ఫాలోకండని చెబుతున్నారామె. ఇంతకీ అదేంటంటే..అందుకు ఆమె ఒక స్నాక్స్ ఐటెంని ఉదాహారణ తీసుకుంటూ చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఉదాహరణకు సగ్గుబియ్యం వడలు స్నాక్స్‌గా తినాలనుకున్నారు. అప్పుడు వెంటనే ప్లేట్ ఓ ఐదు వడలు తక్కువ కాకుండా లాగించేస్తారు. కానీ అలా కాకుండా ఇంత వరకు తినాలని ఫిక్స్అవ్వాలి. వంటకాలు నోరూరించేలా ఉండొచ్చు..కానీ ఆరోగ్యంపై ధ్యాస..ఎలా తింటే బెటర్‌గా ఉంటానన్నది ఆ పదార్థాలను చూడగానే ఠక్కున గుర్తుకు రావాలి. అలాంటి ఆలోచన రాగానే తినాలనే ఆలోచన ఆటోమెటిగ్గా నియంత్రణలోకి వచ్చేస్తుంది. వేసుకునేటప్పుడే రెండు లేదా మూడుతో ఆపేస్తారని చెబుతున్నారామె. పైగా దాన్ని ఎంజాయ్ చేసేలా చట్నీ లేదా ఇతరత్రా వాటిని సిద్ధం చేసుకుని ప్రతి ముక్కను ఆస్వాదిస్తూ..తింటుంటే కడుపు నిండిన అనుభూతి ప్లస్..తక్కువ తినడం రెండు సాధ్యమవుతాయట. దీన్ని మైండ్‌ఫుల్‌నెస్ తినడం అంటారని అన్నారు. రుజుతా ఈ చిట్కాకు జోర్డాన్ ఫార్ములాగా పేర్కొన్నారు. మంచి జోష్‌తో నచ్చిన ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ లిమిట్‌గా తినడమే ఈ జోర్డాన్ ఫార్ములానట. ఈ టెక్నిక్‌లో బేసి సంఖ్యలో పదార్థాలను తీసుకునేలా ఫిక్స్ అవ్వడం తోపాటు..క్రమశిక్షణతో తినడం అలవడుతుందట. అయితే ఇక్కడ తప్పనిసరిగా బుద్ధిపూర్వకంగా, నెమ్మదిగా ఆస్వాదిస్తూ తినడం అనేది అత్యంత కీలకం. అప్పుడే తీసుకునే ఆహారంపై కంట్రోల్ ఉంటుందట. ఇది స్వీయ నియంత్రణను మెరుగుపరుస్తూ..ఆహారంపై అవగాహన ఉండేలా తీసుకునేలా చేస్తుందట. ఇది చక్కటి సత్ఫలితాలనిస్తుందని ఆమె ధీమాగా చెబుతున్నారు. మంచి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం, ఆకలే ప్రధానం. అందుకోసం ఆనందిస్తూ తినేలా..పరిమితంగా తినడం అనేదానిపై శ్రద్ధ పెట్టడం అనే జోర్డాన్ సూత్రం పాటిస్తే చాలు అని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. మరి ఇంకెందు ఆలస్యం ప్రయత్నంచి చూడండి. View this post on Instagram A post shared by Rujuta Diwekar (@rujuta.diwekar) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!))
ఫొటోలు
అంతర్జాతీయం

నిమిష ప్రియ మరణశిక్ష రద్దు!
సనా: భారతీయ నర్సు నిమిష ప్రియకు ఎట్టకేలకు మరణశిక్ష నుంచి విముక్తి లభించింది. యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న ఆమెకు గతంలో విధించిన మరణశిక్షను శాశ్వతంగా రద్దుచేసినట్లు భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ మత ప్రబోధకుడు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదలచేసింది. అయితే భారత విదేశాంగ శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆమెకు మరణశిక్ష రద్దుచేయాలంటూ వస్తున్న అభ్యర్థనలను పరిశీలించేందుకు యెమెన్ రాజధాని సనా సిటీలో ఒక అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

నిత్యం డ్రగ్స్.. రోజంతా మత్తులోనే
టెల్ అవీవ్: ఇజ్రాయెల్ గూఢచార విభాగం మొస్సాద్ సంబంధ సోషల్ మీడియా ఖాతాలో ఇరాన్ సుప్రీం నేత అయెతొల్లా ఖమేనీ గురించి తీవ్ర వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. ఖమేనీ పాలనకు తగిన వ్యక్తి కారని, డ్రగ్స్‌కు బానిసై ఎప్పుడూ మత్తులోనే జోగుతుంటారని ఆరోపించింది. పర్షియన్ భాషలోని ఈ అకౌంట్‌ను @Mossad Spokesman గా గుర్తించారు. ఇది ‘మొస్సాద్ ఫార్సి’గా కూడా పేరుతెచ్చుకుంది. అచ్చు మొస్సాద్ అధికార చానెల్ అకౌంట్ మాదిరిగానే కనిపిస్తుంది. ఇరాన్ లక్ష్యంగా ఇందులో పలు వివాదాస్పద వ్యాఖ్యలు ప్రత్యక్షమవుతుంటాయి. ఇరాన్‌కు ఇబ్బంది కలిగించేలా ఆ దేశ ప్రభుత్వ రహస్య సమాచారం వంటివి ఇందులో కనిపిస్తుంటాయి. అంతేకాదు, పలువురు ముఖ్య నేతలు, అధికారుల గురించిన రహస్య క్విజ్ పోటీలను సైతం ఈ అకౌంట్ నిర్వహిస్తుంటుంది. శుక్రవారం @MossadSpokesman ఎక్స్ అకౌంట్లో..‘రోజులో సగం నిద్రకు, మరో సగం డ్రగ్స్‌కు బానిసై గడిపే వ్యక్తి దేశాన్ని ఎలా నడపగలరు?..నీళ్లు, కరెంటు, జీవితం’అంటూ పేర్కొంది. అయితే, ఇందులో ఖమేనీ పేరును మాత్రం ప్రస్తావించలేదు. ఇరాన్లో కనీస మౌలిక సదుపాయాలైన నీళ్లు, విద్యుత్ కొరతలతోపాటు నిత్యం కనిపించే ప్రజాందోళనలను పరోక్షంగా పేర్కొంది. ఈ పోస్టుకు 48 గంటల్లోనే 1.80 లక్షల మంది స్పందించారు. గత నెలలో ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య 12 రోజులపాటు కొనసాగిన సంక్షోభం సమయంలో ఈ అకౌంట్లో ఇరాన్ నూతన సైనిక కమాండర్ ఎవరో చెప్పాలంటూ సవాల్ విసరగా ఒక వ్యక్తి కచ్చితమైన పేరును వెల్లడించడం విశేషం. ఈ అకౌంట్లో గతంలోనూ ఇలాంటి రెచ్చగొట్టే పోస్టులే ఉండేవి. డ్రగ్స్ వాడే వారు నాయకత్వం వహించగలరా అంటూ ప్రశ్నించింది. ఇందులో ప్రత్యేకంగా అయెతొల్లా ఖమేనీ పేరును ప్రస్తావించనప్పటికీ ఆ తీవ్రత, కంటెంట్‌ను బట్టి ఇరాన్ సుప్రీం లీడరే టార్గెట్ అన్న విషయం తేలిగ్గా ఎవరికైనా అర్థమవుతుంది. పర్షియా భాషలో ఉన్న ఈ పోస్టులను ఆటో–ట్రాన్స్లేషన్తో అందరూ చదవొచ్చు. ఈ అకౌంట్ తమదేనంటూ ఇజ్రాయెల్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయినప్పటికీ ఇరాన్ ప్రజలే లక్ష్యంగా మొస్సాద్ నిర్వహించే మెసేజింగ్ చానెల్గానే చెబుతుంటారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ వేళ... గత నెలలో ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన వేళ ఈ అకౌంట్ వచ్చిన ఒక పోస్టు తీవ్ర వివాదానికి కారణమైంది. ఇజ్రాయెల్ చేసిన మొట్టమొదటి దాడిలో ఇరాన్‌కు చెందిన ఘొలాం అలీ రషీద్ అనే మిలటరీ కమాండర్ చనిపోయారు. ఆ వెంటనే అలీ షాద్మానీ అనే ఆయన వారసుడు సైతం మృతి చెందారు. ఆయన స్థానంలో కొత్తగా నియమించిన కమాండర్ పేరును ఇరాన్ రహస్యంగా ఉంచింది. ఈ అంశంపై @Mossad Spokesman రెచ్చగొట్టే రీతిలో స్పందించింది. ఆ కమాండర్ ఎవరో తనకు తెలుసునంటూ, కొత్తగా నియమితులైన కమాండర్ పేరును తెలిస్తే చెప్పాలంటూ నెటిజన్లకు క్విజ్ పెట్టింది. ‘ఇరాన్ ప్రభుత్వం ఖతమ్ అల్ అన్బియాకు కొత్త కమాండర్‌ను నియమించింది. భద్రత కోసం ఆయన పేరును వెల్లడించలేదు. మాకు అతడెవరో తెలుసు, అతడితో ఉండే వారి పేర్లూ తెలుసు. దురదృష్టవశాత్తూ ఇటువంటి విషయాలను ఇరాన్ ప్రజలకు ప్రభుత్వం తెలియనివ్వడం లేదు. ఆ కొత్త కమాండర్ పేరు తెలిస్తే దయచేసి చెప్పండి’అని కోరింది. దీనికి 2,300 మంది స్పందించారు. ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ తదితర పేర్లను కొందరు ఊహించి చెప్పగా మరికొందరు మాత్రం తిట్టిపోశారు. తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ సోషల్ మీడియా యూజర్ బెహ్నమ్ గొలిపౌర్ మాత్రం కొత్త కమాండర్ పేరు అలీ అబ్దొల్లాహి అలియాబాది అంటూ కరెక్ట్‌గా గెస్ చేశారు. అతడి పేరును ప్రకటించిన మొస్సాద్ అకౌంట్..వ్యక్తిగతంగా తమను కలిసి, బహుమతి అందుకోవాలని కోరింది.

గాజాలో కరువు వాస్తవమే: ట్రంప్
స్కాట్లాండ్: గాజాలో కరువు పరిస్థితులున్న విష యం వాస్తవమేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. కరువు లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదన్నారు. ‘టీవీల్లో చూస్తే తెలుస్తుంది. అక్కడున్న చిన్నారులు ఎంత ఆకలితో ఉన్నారో... అక్కడ నిజంగానే కరువుంది. దీనిని దాచిపెట్టలేం’అని స్కాట్లాండ్లో పర్యటిస్తున్న ట్రంప్ సోమ వారం పేర్కొన్నారు. గాజా ప్రాంతంలో అమెరికా ఆహార కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, చిన్నారుల పొట్ట నింపుతుందని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా సంచరించే చోట, సరిహద్దులు లేని చోట తాము అవాంతరాలు కల్పించబోమన్నారు. గాజా లో హమాస్ చేయలేనిది ఎంతో చేయగలమన్నారు. ‘బందీలందరినీ హమాస్ ఎక్కడ దాచిందో తెలిసిన ఇజ్రాయెల్ హమాస్‌తో ఒప్పందం కష్టమంటోంది. అదే సమ యంలో, చిట్టచివరి 20 మంది బందీలను హమాస్ రక్షణ కవచాలుగా భావిస్తోంది. అందుకే, వారిని వి డుదల చేయడం లేదు’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.గాజాలో 17 టన్నుల ఆహారం జారవేతయూఏఈ వైమానిక దళం విమానాలు రెండో రోజు సోమవారం గాజాలోని పాలస్తీనియన్లకు 17 టన్నుల ఆహార పదార్థాలను జారవిడిచాయని జోర్డాన్ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 19 టన్నుల ఆహార పదార్థాలను ఒక ట్రక్కు కింద లెక్క. అంటే ట్రక్కు కంటే తక్కువ ఆహారాన్ని విడిచినట్లేనని ఐరాస పాలస్తీనా శరణార్థి విభాగం చీఫ్ ఫిలిప్ తెలిపారు. ఆదివారం 25 టన్నుల ఆహార ప్యాకెట్లను జారవిడవడం తెల్సిందే. ఇజ్రాయెల్ ఆర్మీ నెలలుగా అమలు చేస్తున్న దిగ్బంధంతో గాజాలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడటం, జనం, ముఖ్యంగా చిన్నారులు ఆకలి చావులకు గురవుతుండటంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.పుతిన్‌కు గడువు 10, 12 రోజులేఉక్రెయిన్తో ఒప్పందానికి రాకుంటే ఆంక్షలేట్రంప్ తాజా హెచ్చరికఉక్రెయన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు విధించిన 50 రోజుల గడువును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదించారు. అధ్యక్షుడు పుతిన్ 10, 12 రోజుల్లో ఉక్రెయిన్‌తో ఒప్పందం చేసుకోకుంటే ఆంక్షలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమవారం ఆయన స్కాట్లాండ్లో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని కావాలనే పొడిగిస్తూ పోతున్న పుతిన్ వైఖరితో అసహనంతో ఉన్నానన్నారు. ఇంత సుదీర్ఘకాలం వేచి ఉండటంలో అర్థం లేదంటూ, మున్ముందు ఏం జరగనుందో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. అందుకే పుతిన్‌కు తక్కువ సమయం ఇస్తున్నట్లు తెలిపారు. భారీ టారిఫ్‌ల ను రష్యాపై విధిస్తారా అన్న ప్రశ్నకు ఆయన.. ఇందుకు సంబంధించిన చర్యలపై ఇవ్వాళోరేపో ఒక అధికారిక ప్రకటన వెలువడుతుందని ప్రకటించారు. ప్రస్తుత పరిణామాలపై పుతిన్‌తో మాట్లా డాలనే ఆసక్తి తనకు అంతగా లేదని చెప్పారు.

షావోలిన్ గురువుపై చైనా విచారణ
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా పేరున్న షావోలిన్ టెంపుల్ అధిపతి షి యోంగ్ జిన్‌పై చైనా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. లంచాలు తీసుకోవడం, పలువురు మహిళలతో అనైతిక సంబంధాలు నెరపడం, అక్రమ సంతానాన్ని కలిగి ఉండటం వంటి ఆరోపణలను ఆయనపై మోపిందని టెంపుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ విభాగాలు దర్యాప్తు చేపట్టాయంది. దాదాపు 1,500 ఏళ్ల చరిత్ర కలిగిన షావోలిన్ టెంపుల్ సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంటా ఏటా వేలాదిగా శిష్యులు ఇక్కడికి వచ్చి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతుంటారు.షి యోంగ్ జిన్ ఈ షావోలిన్ టెంపుల్ అధిపతిగా 1999 నుంచి కొనసాగుతున్నారు. షావోలిన్ టెంపుల్ పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత సొంతం చేసుకున్న ఈయనకు సీఈవో మాంక్ అనే పేరూ ఉంది. షి హయాంలోనే షావోలిన్ టెంపుల్ చైనా వెలుపల కూడా స్కూళ్లను ప్రారంభించింది. సన్యాసుల బృందాలు షావోలిన్ కుంగ్‌ఫూ విన్యాసాల్లో పాల్గొనడం మొదలైంది. ‘షి యోంగ్జిన్ చర్యలు తీవ్రమైనవి, బౌద్ధ వర్గం, సన్యాసుల ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయి’అని బుద్ధిస్ట్ అసోసియేషన్ ఆఫ్ చైనా ఒక ప్రకటనలో పేర్కొంది.
జాతీయం

మన సైనికుల్ని యుద్ధానికి పంపి.. వారి చేతులు కట్టేశారు: రాహుల్
న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ అంశానికి సంబంధించి పార్లమెంట్లో వాడివేడి మాటల యుద్ధం జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ చర్చలో భాగంగా ఈరోజు(మంగళవారం, జూలై 29) కాంగ్రెస్ అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలు తమ మాటలతో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడగా, ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సైతం ఆపరేషన్ సిందూర్‌పై ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. మన సైనికుల్ని యుద్ధానికి పంపి వారి చేతుల్ని కేంద్ర ప్రభుత్వం కట్టేసిందని మండిపడ్డారు. అందుకే మన యుద్ధ విమానాలు కూలాయన్నారు. రాహుల్ ప్రసంగిస్తూ.. ‘ భారత్-పాక్‌ల యుద్ధాన్ని ఆపానని ట్రంప్ ఇప్పటికి 29 సార్లు చెప్పారు. ట్రంప్ అబద్ధాలు చెబుతున్నప్పుడు మోదీ తిరిగి ఎందుకు ప్రశ్నించడం లేదు?, ఇందిరాగాంధీ ప్రదర్శించిన ధైర్య సాహసాల్లో 50 శాతం కూడా మోదీ చూపించలేదు.భారత సైన్యం ఎటువంటి తప్పు చేయలేదు. తప్పంతా కేంద్ర ప్రభుత్వానిదే. పహల్గామ్ సూత్రధారి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. మరి ట్రంప్‌తో కలిసి మునీర్ లంచ్ చేస్తారు. ఆయన్ని ట్రంప్ ఆహ్వానిస్తారు. ట్రంప్-మునీర్‌ల లంచ్ విషయాన్ని మోదీ ఎందకు ఖండించలేదు?, జై శంకర్ విదేశాంగ విధానం ఫెయిల్ అయ్యింది’ అని రాహుల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదీ చదవండి: ఆహ్వానం లేకుండా పాక్‌కు వెళ్లింది ఎవరు? సీజ్ ఫైర్ నిర్ణయం ఎవరిది?

ఆహ్వానం లేకుండా పాక్‌కు వెళ్లింది ఎవరు? సీజ్ ఫైర్ నిర్ణయం ఎవరిది?
పహల్గాం ఘటన.. పూర్తిగా భద్రతా వైఫల్యమేనని, పైగా అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో మండిపడింది. ఆపరేషన్ సిందూర్‌పై చర్చలో భాగంగా.. ఇటు లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, అటు రాజ్యసభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో రెండో రోజు చర్చలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించారు. పర్యాటక ప్రాంతంలో భద్రత లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంపై ఆమె విమర్శలు గుప్పించారు. ‘‘ఈ అంశంపై రక్షణ శాఖ మంత్రి గంటసేపు మాట్లాడారు. అధికార కూటమి ఎంపీలు కూడా మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదంపై పోరు, జాతీయ భద్రత, చరిత్ర.. ఇలా అంశాలన్నింటిపై మాట్లాడారు. కానీ, ఒక్క విషయాన్ని వదిలేశారు. అసలు ఆ దాడి ఎందుకు?.. ఎలా జరిగింది? అనేది.. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో కుటుంబ సభ్యుల కళ్లెదుటే 26 మంది చంపారు. అసలు ఆ ఉగ్రదాడి ఎందుకు.. ఎలా జరిగిందో మాత్రం కేంద్రం చెప్పడం లేదు. #WATCH | In Lok Sabha, Congress MP Priyanka Gandhi Vadra says, "... Yesterday, the Defence Minister spoke for an hour, during which he spoke about terrorism, protecting the country, and also gave a history lesson. But one thing was left out- How did this attack happen?..." pic.twitter.com/as9gAbNCjr— ANI (@ANI) July 29, 2025కశ్మీర్లో ఉగ్రవాదం ముగిసిన అంకమని, అక్కడ పర్యటించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. కానీ.. జరిగింది మరొకటి. శుభం ద్వివేదీకి వివాహమై ఆరు నెలలే అయ్యింది. ఏప్రిల్ 22వ తేదీన అందరు పర్యాటకుల్లాగే ఆ జంట విహారంలో మునిగిపోయింది. సరిగ్గా అదే సమయంలో అడవుల్లో నుంచి వచ్చిన ఉగ్రవాదులు వాళ్లపై తెగబడ్డారు. భార్య కళ్ల ముందే శుభంను చంపేశారు. గంట వ్యవధిలో మరో 25 మందిని చంపేశారు. శుభం భార్య ఐశన్య ఓ మాట చెప్పింది.. నా కళ్ల ముందే నా ప్రపంచం చీకటి అయ్యింది. ఘటన సమయంలో అక్కడ ఒక్క భద్రతా సిబ్బంది లేరు. ఈ దేశం, ఈ ప్రభుత్వం మమ్మల్ని.. మా భద్రతను గాలికి వదిలేసింది అని. ఆమె అడిగిందే నేనూ అడుగుతున్నా.. ప్రతీరోజు 1,000 నుంచి 1,500 మంది పర్యటించే ఆ ప్రాంతంలో ఒక్క సైనికుడు కూడా కాపలాగా ఎందుకు లేడు?. వాళ్లు ప్రభుత్వాన్ని నమ్మి అక్కడికి వెళ్తే.. ఈ ప్రభుత్వం దేవుడ్ని మీద భారం వేసి వాళ్లను అలా వదిలేసిందా?. ఉగ్రదాడికి రక్షణమంత్రి, ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యత వహించారా? రాజీనామా చేశారా?. అసలు పౌరుల ప్రాణాలకు బాధ్యత ఎవరిది?. ప్రధానిదా?, హోం మంత్రిదా?, రక్షణ మంత్రిదా? ఎవరిది??సెక్యూరిటీ మాట అటుంచి కనీసం ప్రాథమిక చికిత్స అందించే ఏర్పాట్లు కూడా చేయలేకపోయారు?. ఇది నిఘా సంస్థ వైఫల్యం కాదా?.. అంటూ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఆర్మీనో, కేంద్రమో ఈ నిర్ణయం తీసుకోలేదు. అసలు సీజ్ ఫైర్ ప్రకటన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా చేస్తారు?. పాక్ భారత్ కాల్పుల విరమణ ఒప్పందం అసలు ఎలా జరిగింది?. దీనికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందే అని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఇటు రాజ్యసభలోనూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కేంద్రంపై విరుచుకుపడ్డారు. ‘‘పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచం మొత్తం చూసింది. తమ తండ్రి తమ కళ్ల ముందే చనిపోవడం చిన్న పిల్లలు చూశారు. అసలు పర్యాటక ప్రాంతంలోకి టెస్టులు ఎలా వచ్చారు?. పహల్గాం ఉగ్రదాడి ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే. దాడి జరగకుండా కేంద్రం ఎందుకు ఆపలేకపోయింది?. ఇంటెలిజెన్స్ వైఫల్యానికి బాధ్యులెవరు?. .. పహల్గాం ఘటనలో సంబంధం లేని అంశాలను లేవనెత్తుతున్నారు. పాకిస్తాన్‌కు విపక్షాలు మద్దతు ఇస్తున్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అసత్య ప్రచారాలతో ప్రజలను ఎక్కువ కాలం మభ్యపెట్టలేరు. కాంగ్రెస్ దేశాన్ని నిర్మించిన పార్టీ. ఆ పార్టీకి చాలా చరిత్ర ఉంది. మేం ఎప్పుడూ పాక్‌కు సపోర్ట్ చేయలేదు. ఆహ్వానించకుండా పాక్‌కు వెళ్లడం సిగ్గుచేటు. మాపై నిందలు వేస్తూ.. పాక్ నేతలను కౌగిలించుకుంటారు. మీరు తప్పు చేసి మాపై అసత్య ప్రచారాలు చేస్తారా?. ఇదేనా మీ దేశ భక్తి. #WATCH | Discussion on Operation Sindoor | Rajya Sabha LoP Mallikarjun Kharge says, "...We attended the meeting (all-party), but you went to Bihar for election campaigning. Is that your patriotism?...He should have been in the House today and heard us. If you do not have the… pic.twitter.com/XrcPafJoNp— ANI (@ANI) July 29, 2025కాంగ్రెస్‌ను నిందిస్తూ ఎంత కాలం బతుకాలనుకుంటున్నారు?. దేశ భద్రత కంటే రాజకీయాలే ఎక్కువ అయ్యాయా? పహల్గాం ఘటన తర్వాత జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌లో ప్రధాని ఎందుకు లేరు?. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొన్నారు?. ప్రధానికి దేశ భద్రత కంటే ఎన్నికల ర్యాలీలే ఎక్కువయ్యాయా?. దేశ భద్రత కంటే రాజకీయాలే ఎక్కువయ్యాయా?’’ అని ఖర్గే ధ్వజమెత్తారు.ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్-భారత్ కాల్పుల విరమణను భారత విదేశాంగ శాఖ మంత్రో, ప్రధానినో, లేకుంటే రక్షణ మంత్రినో ప్రకటించలేదు. ఎక్కడో వాషింగ్టన్ నుంచి ట్రంప్ ప్రకటించారు. కాల్పుల విమరణ తన విజయమేనని ట్రంప్ ఇప్పటిదాకా 29సార్లు ప్రకటించుకున్నారు. ఈ నా ప్రసంగం ముగిసేలోపు ఆయన మరోసారి ప్రకటించుకుంటే 30వ సారి అవుతుంది. అయినా ఆ నిజాన్ని కేంద్రం ఎందుకు ఒప్పుకోవడం లేదు అని ఖర్గే ఎద్దేవా చేశారు.

డింపుల్ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఎన్డీయే ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ/లక్నో: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్‌పై ముస్లిం మత బోధకుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. అధికార ఎన్డీయే ఎంపీలు పార్లమెంట్ కాంప్లెక్స్ వద్ద సోమవారం దీనిపై నిరసన తెలిపారు. ఈ వ్యవహారంపై సమాజ్‌వాదీ పార్టీతోపాటు ప్రతిపక్షం మౌనంగా ఉండటమేంటని ప్రశ్నించారు.ఓ మసీదులో ఇటీవల జరిగిన సమావేశానికి ఎంపీ డింపుల్ యాదవ్ (Dimple Yadav) చీర ధరించి వెళ్లడంపై మౌలానా సాజిద్ రషీద్ అనే బోధకుడు ఎస్పీకి చెందిన ఇక్రా హసన్ అనే ఎంపీతో పోల్చుతూ టీవీలో చర్చా కార్యక్రమం సమయంలో చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తమైంది. ఎంపీలు బీజేపీకి చెందిన బాన్సురీ స్వరాజ్, కాంగ్రెస్‌కు చెందిన రేణుకా చౌదరి సైతం ఖండించారు. పార్లమెంట్ కాంప్లెక్స్ వద్ద చేపట్టిన నిరసనలో పలువురు ఎన్డీఏ మహిళా ఎంపీలు కూడా పాల్గొన్నారు. చదవండి: డ్రెస్ కోడ్ వివాదం.. స్పందించిన డింపుల్ యాదవ్

ధర్మస్థళ కేసు: 15 అనుమానిత ప్రాంతాల గుర్తింపు!
ధర్మస్థళ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో ఆసక్తికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. దేవాలయ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఒకరు తాను ధర్మస్థళ పరిసరాల్లో వందలాది శవాల అంత్యక్రియలు నిర్వహించానని, ఈ నెల నాలుగున ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందం (ఎస్ఐటీ)ని ఏర్పాటు చేసింది కూడా. ఈ నేపథ్యంలో.. ఫిర్యాదుదారు తాజాగా తాను శవాలను కాల్చిన, పూడ్చిన 15 ప్రాంతాలను విచారణ అధికారులకు చూపించారు. వీటిల్లో ఒకటి హైవే పక్కనే ఉండగా మిగిలినవన్నీ నేత్రావతి నది ఒడ్డున ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఇతర కార్యకలాపాలు జరక్కుండా సిట్ అధికారులు వాటికి జియో ట్యాగింగ్ చేశారు. అంతేకాకుండా ఫొటోలు తీసి కాపలా కోసం సాయుధ పోలీసులను ఏర్పాటు చేశారు. 1998 -2014 మధ్య కాలంలో తాను కొందరి ఒత్తిడి కారణంగా వందలాది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించానని, వీరిలో చాలామంది మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసింది. జూలై నాలుగున ఫిర్యాదు ఇచ్చిన సందర్భంగా అతడు ఒక పుర్రెను సాక్ష్యంగా అందించారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం జూలై 19న డీజీపీ ప్రణబ్ మహంతి నేతృత్వంలో ఒక ఎస్ఐటీని ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు తరువాత ఫిర్యాదుదారుణ్ణి రెండు రోజుల పాటు మంగళూరులో ప్రశ్నించారు. దర్యాప్తు అధికారి జితేంద్ర కుమార్ దయామా ఆ వివరాలను రికార్డు చేశారు. ఆ తరువాత సోమవారం ఫిర్యాదుదారుడితో కలిసి ఆన్సైట్ పరిశీలనలను జరిపింది. మొత్తం 15 అనుమానిత ప్రాంతాలను గుర్తించింది. ఈ కార్యకలాపాల్లో ఫోరెన్సిక్స్, ఆంత్రోపాలజీ, రెవెన్యూ విభాగాల నిపుణులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లో త్వరలో తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.మరోవైపు ఈ దర్యాప్తును ధర్మస్థళ మంజునాథేశ్వర ఆలయం స్వాగతించింది. విచారణ పారదర్శకంగా జరగాలని కోరింది. ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కొందరు ఎస్ఐటీ విచారణపై న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ అవసరమని కోరారు. అలాగే నిస్పక్షికత కోసం ఫోరెన్సిక్స్ సాయం తీసుకోవాలని సూచించారు.
ఎన్ఆర్ఐ

బాలీవుడ్ తరహా ఈవెంట్లు, లగ్జరీ లైఫ్ : 100మందికి పైగా ముంచేసిన ఎన్ఆర్ఐ జంట
టెక్సాస్‌లోని ప్లానోకు చెందిన భారతీయ సంతతికిచెందిన దంపతులు రియల్ ఎస్టేట్ స్కామ్‌లో 100 మందికి పైగా వ్యక్తులను మోసం చేసినట్లు తెలుస్తోంది. నకిలీ రియల్ ఎస్టేట్ నకిలీ పత్రాలతో భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. రూ. 33 కోట్ల విలువైన పెట్టుబడి స్కాం ఆరోపణలపై వీరిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.ఉత్తర టెక్సాస్‌లోని ఇండియన్-అమెరికన్ సమాజంలో సిద్ధార్థ సామీముఖర్జీ , అతని భార్య సునీత ప్రముఖ వ్యక్తులుగా చలామణి అయ్యారు. రియల్ ఎస్టేట్ ఒప్పందాలు, ఛారిటీలు ,బాలీవుడ్ తరహా ఈవెంట్లతో పాపులారిటీ సంపాదించారు. అలా రూ.33 కోట్లకు నమ్మినవారిని ముంచేశారు. రియల్ ఎస్టేట్ నకిలీ పత్రాలు , మహమ్మారి సహాయ నిధుల దుర్వినియోగం, ఇలా పలు రకాలు ఏళ్ల తరబడి మోసపూరిత ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారనే అభియగాలు నమోదైనాయి.ఈ జంట నకిలీ కంపెనీని ఉపయోగించి, ఫేక్ సాలరీ స్లిప్పుల ద్వారా పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (PPP) రుణాన్ని పొందారని ఆరోపించారు.ఈ జంట 2024లో దివాలా కోసం దాఖలు చేశారు. ఈ జంట 2024లో దివాలా కోసం దాఖలు చేశారు.ఇదీ చదవండి: షార్జాలో మరో విషాదం : బర్త్‌డే రోజే కేరళ మహిళ అనుమానాస్పద మరణంఈ జంట ఇచ్చిన చెక్‌లు బౌన్స్ కావడంతో వీరి బండారం వెలుగులోకి వచ్చింది. కనీసం 20 మంది బాధితులను గుర్తించారు. తొలుత ఈ కేసును విచారించిన డిటెక్టివ్లు ఆ తరువాత ఈ కేసును FBIకి అప్పగించారు. 100 మందికి పైగా వ్యక్తులను మోసంచేశారంటూ అమెరికా ఫెడరల్ దర్యాప్తు సంస్థలు ఈ జంటను అరెస్ట్‌చేశాయి. నిజానికి బాధితుల సంఖ్య 100 దాటవచ్చని అధికారులు భావిస్తున్నారు. తన 23 ఏళ్ల సర్వీసులు ఇంతటి మోసగాడిని చూదడలేదని డిటెక్టివ్ బ్రియాన్ బ్రెన్నాన్ వ్యాఖ్యానించారు. అరెస్టు తర్వాత, సామీ , సునీతా ముఖర్జీ ఇద్దరూ 5 లక్షల డాలర్ల చొప్పున బెయిల్‌ను దాఖలు చేశారు. సామీని తరువాత యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అదుపులోకి తీసుకుంది. డబ్బును క్రిప్టోకరెన్సీ ఖాతాలుగా మార్చారా అనే విషయాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. ముంబైలో ముంబైలో కూడా సామిపై మోసానికి పాల్పడినట్టు ఆరోపలున్నాయట. విషయంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.మరోవైపు ఈ తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, ముఖర్జీ దంపతులు ఈ ఏడాది మేలో అంటే అరెస్టుకు కొన్ని వారాల ముందు, ప్లానోలో ఎన్జీవీ పేరుతో విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ బాలీవుడ్ నటి హేమ మాలిని, ప్లానో మేయర్ సహా ఉన్నత స్థాయి అతిథులు హాజరు కావడం గమనార్హం.చదవండి:

లవ్ ప్రపోజల్ తిరస్కరించిన ఇండియన్ టెకీకి బాస్ చుక్కలు : నెటిజన్లు ఏమన్నారంటే
పనిప్రదేశాల్లో ఉద్యోగాలు చేసే మహిళలపై వేధింపులకు నిదర్శనం ఈ ఘటన. కావాలనే జీతాలు పెంచకపోవడం, ప్రమోషన్లు నిరాకరించడం, జీతం ఆలస్యంగా ఇవ్వడం ఇలాంటివి సాధారణంగా కొంతమంది ఉద్యోగులెదుర్కొనే వేధింపులు. దీనికి అదనంగా మహిళలు లైంగిక వేధింపులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తన వేధింపుల పర్వంపై ఇండియన్ టెకీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.10 మంది ఉద్యోగులతో కూడిన ఒక చిన్న యూరోపియన్ టెక్ కంపెనీ అది. అలాంటి కంపెనీలో భారతీయ టెక్ రిమోట్‌గా పనిచేస్తోంది. అయితే ఆమెకు వివాహితుడైన మేనేజర్ ఒక అభ్యంతరకర ప్రపోజల్ పెట్టాడు. దీన్ని ఆమె అంగీకరించలేదు. అంతే అతగాడి వేధింపులు మొదలైనాయి. బాస్ ఇన్‌డైరెక్ట్‌గా పెట్టిన ప్రేమ ప్రతిపాదన తిరస్కరించిన తర్వాత తనను వృత్తిపరంగా లక్ష్యంగా చేసుకోవడం మొదలు పెట్టాడని రెడ్డిట్‌లో ఆరోపగించింది. చీటికి మాటికి కోపగించుకోవడం, పురుష సహోద్యోగులతో మాట్లాడుతున్నా కూడా సహించేవాడు కాదు. వృత్తిపరంగా, జీతాల జాప్యం, ఆమె చేయని తప్పులకు బహిరంగంగా మందలింపులు లాంటివి కూడా ఎదుర్కొన్నానని తెలిపింది. తన ప్రతీ పనినీ, ప్రతీ కదలికను ప్రశ్నించడం, అవమానించడం, అతనికి పరిపాటిగా మారిపోయిందని వాపోయింది. ఎన్ని రకాలుగా టార్చర్ చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నాడు. గతంలో, రెండు రోజులు సెలవు అడిగినా ఇచ్చేవాడని, దీనికి తన పనితీరు, టాలెంటే కారణమని భావించాను కానీ, దాని వెనుకున్న అతని దుర్బుద్ధి ఇపుడు అర్థమవుతోందని తెలిపింది. ఇంత జరుగుతున్నా, ఈ ఉద్యోగాన్ని వదల్లేను. ఎందుకంటే..రిమోట్‌గా వర్క్ చేసుకోడానికి అవకాశం ఉంది.ఈ సమయంలో తన కుటుంబానికితన అవసరం చాలా ఉంది. కానీ ఈ వేధింపులో భరించలేనిదిగా మారుతున్నాయి. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్ గొప్పగా లేదు, కాబట్టి మారడం కష్టం అని ఆమె పేర్కొంది.దీనిపై నెటిజన్లు చాలా మంది ఆమెకు సంఘీభావం తెలుపుతూ, కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం మారితేనే మంచిది. ఎందుకంటే ఎవరికి కంప్లయింట్ చేసినా. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు Prevention of Sexual Harassment (POSH) కేసు పనిచేస్తుందని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే HRలు కంపెనీల కోసం పనిచేస్తాయి తప్ప ఉద్యోగుల కోసం కాదు. కాబట్టి వీలైతే ఉద్యోగం మారిపోండి అని మరికొందరు సలహా ఇచ్చారు.‘‘నీ పని నువ్వు చూస్కో.. అనవసర మెసేజ్‌లు జోలికి పోకు. మరో ఉద్యోగం దొరికేవరకు జాగ్రత్తగా ఉండు’’ అని ఒకరు, ‘‘మున్ముందు పరిస్థితి మరింత టాక్సిక్‌గా మారుతుంది. మీ మెంటల్ హెల్త్‌ను కాపాడుకోండి’’ అని ఒకరు, ఇది చేదు నిజం.ఉద్యోగం మారడం ఒక్కటే ఆప్షన్ మరొకరు సూచించారు. మొత్తానికి ఆమె పోస్ట్ కార్యాలయంలో వేధింపుల గురించి ఆన్లైన్లో చర్చకు దారితీసింది. చాలామంది మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని , సురక్షితమైన ఆఫీసు వాతావరణాన్ని కోరుకోవాలని సూచించారు.

డల్లాస్‌లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంచ్
అమెరికాలోని డల్లాస్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ గా రీ లాంఛ్ అయింది. న్యూయార్క్, న్యూజెర్సీ నుండి వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, కాలిపోర్నియా, చికాగో, నార్త్ కరోలినా, అట్లాంటా, ఫ్లోరిడా మొదలగు నగరాలతో పాటు నార్త్ అమెరికాకు నలుదిక్కులా విస్తరించి.. పుట్టిన నేల నుంచి పెరిగిన గడ్డ వరకు.. ప్రవాసులకు అండగా.. మరింత చేరువగా.. సరికొత్తగా ఆవిష్కృతం అయింది సాక్షి టీవీ నార్త్ అమెరికా. టెక్సాస్, ఫెయిర్‌వ్యూ లోని సౌత్విండ్ ఎల్ఎన్ వేదికగా ఈ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. అమెరికా, భారత జాతీయగీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఈవెంట్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా, సాక్షి టీవీ స్టాప్, యాడ్ అమిరిండో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ AAA నుంచి రఘు వీరమల్లు , పవన్ కుమార్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, అసోసియేషన్ హెడ్స్, సబ్జెక్టు మేటర్ ఎక్స్పర్ట్స్, తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్లే చేసిన సాక్షి టీవీ నార్త్ అమెరికా AVని ప్రవాసులు ఎంతో ఆకసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ USA కి ప్రవాసులు తమ శుభాకాంక్షలు తెలిపారు.నార్త్ అమెరికాకు నలుదిక్కుల వ్యాప్తి చెంది.. US లో నెంబర్ 1 నెట్వర్క్ గా రూపాంతరం చెంది.. ప్రవాసుల గొంతుకగా Sakshi TV USA నిలుస్తోందని కె.కె. రెడ్డి పెర్కొన్నారు. డల్లాస్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్ అవటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాక్షి టీవీ ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరించారు. ఇక సాక్షి టీవీ ఎన్నారై ప్రత్యేక కార్యక్రమాల గురించి సింహా వివరించారు. అమెరికాలో ప్రవాసుల గొంతుకగా నిలుస్తోన్న సాక్షి టీవీని పలువురు ప్రముఖులు కొనియాడారు. సాక్షి ఎన్నారై కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రవాసులు సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్ ఈవెంట్ పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కె.కె. రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ నార్త్ అమెరికాను అందరూ ఆదరించాలని కోరారు.

అమెరికా నాసా ఎన్ఎస్ఎస్ ఐఎస్డీసిలో సత్తా చాటిన విద్యార్థులు
బంజారాహిల్స్: అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన ఐఎస్‌డీఎస్ కాన్ఫరెన్స్‌లో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని శ్రీ చైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్లో నాసా ఏర్పాటు చేసిన ఐఎస్‌డీఎస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుంచి 475 మంది విద్యార్థులు హాజరైతే అందులో 67 మంది భారత దేశం నుంచి పాల్గొనగా 45 మంది శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులే ఉండటం తమకు గర్వకారణంగా ఉందని అన్నారు. అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్‌లో అంతర్జాతీయ స్థాయిలో 60 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకొని తాము వరల్డ్ నెం1.గా నిలిచామని తెలిపారు. వీటిలో వరల్డ్ ఫస్ట్ ప్రైజ్ 3 ప్రాజెక్టులు, వరల్డ్ సెకండ్ ప్రైజ్ 4 ప్రాజెక్టులు, వరల్డ్‌లో మూడో ప్రైజ్ కింద 10 ప్రాజెక్టులు గెలుచు కోవడంతో పాటు 43 ప్రాజెక్టులకు హానరబుల్ మెన్షన్స్ సాధించాయని తెలిపారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి మరే ఏ ఇతర పాఠశాల నుంచి విద్యార్థులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనలేదన్నారు.ఈ కాన్ఫరెన్స్‌లో ఆర్టిస్టిక్ కేటగరిలో 500 డాలర్ల బహుమతి అందుకున్న ఏకైక టీం తమదేనని ఆమె వెల్లడించారు.
క్రైమ్

Hyderabad: అత్తను నరికి చంపిన అల్లుడు
మద్దూరు (హుస్నాబాద్): అల్లుడు వేట కొడవలితో అత్తను నరికి చంపాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని ముర్మాముల గ్రామ శివారు బంజెరలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జంగిలి వజ్రమ్మ (55)కు భర్త యాదగిరి, కుమార్తె భవాని ఉన్నారు. భవానిని ఎనిమిదేళ్ల కిందట మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన జక్కుల మహేశ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వజ్రమ్మ, భర్త యాదగిరి, కుమార్తె భవాని, అల్లుడు మహేశ్‌తో కలిసి కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని బోయిన్పల్లి అంజయ్యనగర్‌లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వజ్రమ్మ, కూతురు, అల్లుడి మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నాయి. వీటిని పరిష్కరించుకునేందుకు ఈనెల 22న స్వగ్రామమైన బంజెరకు వచ్చి పెద్ద మనుషుల సమక్షంలో వాటిని పరిష్కరించుకున్నారు. 26న భవానిని ధర్మారంలోని ఆమె అత్తగారింటికి పంపించారు. కుటుంబ కలహాలను మనసులో ఉంచుకున్న అల్లుడు మహేశ్ తన తమ్ముడైన హరీశ్‌ను వెంటబెట్టుకుని బైక్‌పై మధ్యాహ్నం బంజెరకు వెళ్లారు. గ్రామంలో ఓ ఇంటి వద్ద కనిపించిన అత్త వజ్రమ్మపై మహేశ్, హరీశ్ తమ వెంట తెచ్చుకున్న వేట కొడవలితో విచక్షణారహితంగా నరికి చంపారు. నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయి నేరుగా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఘటనా స్థలాన్ని హుస్నాబాద్ సీఐ కొండ శ్రీను, ఎస్సై షేక్ మహబూబ్, నవీన్ సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలి భర్త యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

కోనసీమ: మాచవరంలో దారుణం.. ప్రిన్సిపాల్ కాదు.. కీచకుడు
అంబేద్కర్ కోనసీమ: జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని తీర్చిదిద్దాల్సిన గురువే.. బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటన రాయవరం మండలం మాచవరం గ్రామంలో చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం 9వ తరగతి విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు లైంగిక దాడికి తెగపడ్డాడు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్పితే చంపేస్తానని బెదిరించాడు. భయపడి బాలిక కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ప్రస్తుతం ఆ బాలిక పదోవ తరగతి చదువుతుంది. మూడు నెలలుగా పిరియడ్స్ రావడంలేదని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళితే గర్భవతి అని వైద్యురాలు నిర్ధారించారు. దీనితో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. నిందితుడైన ప్రిన్సిపాల్ జయరాజ్ పై రాయవరం పోలీసు స్టేషన్లో బాధితురాలు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాయవరం పోలీసులు. ఈ మేరకు ప్రిన్సిపాల్ జయరాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.కాగా, పాఠశాలకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువు చెప్పేందుకు అనుమతి ఉంది. అయితే పాఠశాల కరస్పాండెంట్ అనుమతి లేకుండా 10వ తరగతి వరకు విద్యార్థులకు తన పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నాడు. పాఠశాలకు 7వ తరగతి వరకు అనుమతి ఉంటే.. పదవ తరగతి బాలికలు ఏ విధంగా చదువుతున్నారన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. బాలికలను వేరే పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చి, అనధికారికంగా ఈ పాఠశాలలో విద్యాబోధన చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏ పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చారన్నది తేలాల్సి ఉంది. దీనిపై రాయవరం ఎస్సై డి.సురేష్‌బాబును వివరణ కోరగా, ఫిర్యాదు వచ్చిన విషయం వాస్తవమేనని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

ఫోన్లో యువకుడితో మాట్లాడుతోందని..
హైదరాబాద్: సెల్ఫోన్లో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆవేశానికి లోనైన ఓ తమ్ముడు అక్క గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాఘవేంద్ర, సునీత దంపతులకు రుచిత (21), రోహిత్ (20) వైష్ణవి (18) సంతానం. పెద్ద కూతురు రుచిత ఇటీవలే డిగ్రీ పూర్తి చేసి, ఎంబీఏలో చేరేందుకు సిద్ధమవుతోంది. రుచిత ఇదే గ్రామానికి చెందిన దినేశ్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయంలో పలుమార్లు ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగ్గా, ఒకరితో ఒకరు మాట్లాడకూడదని తీర్మానించుకున్నారు. తల్లిదండ్రులు పని నిమిత్తం ఉదయాన్నే బయటకు వెళ్లగా.. ఉదయం 11 గంటలకు తమ్ముడు రోహిత్ ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో రుచిత ఫోన్లో దినేశ్‌తో మాట్లాడటాన్ని గమనించి అక్కతో వాగ్వాదానికి దిగాడు.ఇరువురి మధ్య మాటామాటా పెరిగి, ఆగ్రహానికి గురైన రోహిత్ గొంతు నులిమి సోదరిని హత్య చేశాడు. అనంతరం కొడిచర్లలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి, అక్కకు శ్వాస ఆడటం లేదని, కిందపడిపోయిందని చెప్పాడు. వారు వచ్చి పరిశీలించగా అప్పటికే రుచిత చనిపోయింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు దినేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దినేశ్ కారణంగానే తన కూతురు చనిపోయిందని, మృతురాలి తండ్రి రాఘవేంద్ర ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నర్సింహారావు తెలిపారు.

ఆగని టీడీపీ నేత అకృత్యాలు
చిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అధికారం అండతో రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలు, అకృత్యాలపై ఫిర్యాదు చేసిన బాధితులను మరింతగా వేధిస్తున్నారు. టీడీపీ హిందూపురం నాయకుడు యుగంధర్ అలియాస్ చింటు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పారిశుద్ధ్య కారి్మకురాలిని వేధించిన ఆడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో టీడీపీ నేతల తీరుపై వైఎస్సార్సీపీ మహిళా విభాగం తీవ్రంగా స్పందించి బాధిత మహిళకు అండగా నిలిచింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.ఈ నేపథ్యంలో టీడీపీ మొక్కుబడి చర్యగా ఆడియోలో మాట్లాడిన కగ్గల్లప్ప, అతడి సోదరుడు నగేష్ కు పార్టినుంచి సస్పెండ్ చేసి, ప్రధాన నిందితుడైన చింటును మాత్రం వదిలేసింది. ఇప్పుడు చింటు బాధిత మహిళపై ప్రతీకార చర్యకు దిగారు. ఆమెను ఊరి నుంచి ఖాళీ చేసేయాలని ఒత్తిడి తీసుకురావడంతో పాటు చంపేస్తానని బెదిరించారు. దీంతో ఆమె పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించింది. అక్కడా సీఐ స్పందించకపోవడంతో ఓ వీడియో ద్వారా తన ఆవేదనను బయటపెట్టింది. తనను చింటు వేధిస్తున్నాడని, ఇల్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నాడని, పోలీసులు పట్టించుకోవడంలేదని వాపోయింది. చింటు తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారా? మహిళలను వేధించే నాయకులకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారా అని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టి.ఎన్.దీపిక ప్రశ్నించారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ అధికార మదంతో మహిళను ఉద్యోగం నుంచి తొలగించి, లైంగిక వేధింపులకు పాల్పడిన టీడీపీ నేతలను జైలుకు పంపించాల్సింది పోయి.. నిందితుడైన వ్యక్తిని వెనకేసుకురావడం ఏమిటని నిలదీశారు. ఈ ఘటన జరిగిన తర్వాతే ఎమ్మెల్యే సతీమణి వసుంధరాదేవి హిందూపురంలో పర్యటించారని, నిందితుడి నుంచి బొకే తీసుకున్నారని గుర్తుచేశారు. అతడు మహిళను వేధించాడని తెలిసి కూడా చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. టీడీపీ కార్యకర్తలు మహిళల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బాధిత మహిళకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆమె తెలిపారు.బాధితురాలి ఆత్మగౌరవం దెబ్బతీసేలా సీఐ ప్రవర్తనటీడీపీ నేత నుంచి లైంగిక వేధింపులకు గురైన మహిళ పేరు, ఆమె భర్త పేరు, నివాస ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ హిందూపురం వన్‌టౌన్ సీఐ రాజగోపాల్‌నాయుడు వీడియో చేసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీలను కూడా జతచేసి పోస్ట్ చేయడం ద్వారా బాధితురాలి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సీఐ వ్యవహరించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఐ రాజగోపాల్‌నాయుడు ఆది నుంచి టీడీపీకి అనుకూలంగా ఉంటూ ఆ పార్టీ లీడర్లా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధితురాలి భద్రత, ఆత్మగౌరవాన్ని పట్టించుకోకుండా.. ఆమె గోప్యతకు భంగం కలిగిస్తూ టీడీపీ నేతల స్క్రిప్ట్ ప్రకారం నడుచుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.