గుంటూరువెస్ట్: ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇచ్చే అర్జీలను పెండింగ్ పెట్టి రీ ఓపెన్ వరకు తీసుకొస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల హడావుడి ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారం కూడా చాలా ముఖ్యమన్నారు. పరిష్కారం కాని అర్జీలు పెండింగ్‌లో పెట్టాల్సి వస్తే సదరు వ్యక్తికి కారణం చెప్పాలన్నారు. ప్రస్తుతం నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పట్టాలు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించి వారికి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చూడాలని చెప్పారు. అనంతరం వచ్చిన 220 అర్జీలను జేసీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లక్ష్మీకుమారి, కె.స్వాతి, రవీంద్రరావు, జిల్లా అధికారులు పరిశీలించారు.
అర్జీలు స్వీకరిస్తున్న జాయింట్ కలెక్టర్ రాజకుమారి
నీటి సౌకర్యం కల్పించండి
గుంటూరు రూరల్ పరిదిలోని లాలుపురం పంచాయతీలో ఉన్న లింగాయపాలెం సమీపంలోని రామరాజునగర్‌లో సుమారు 1700 ఇళ్లు ఉన్నాయి. 20 ఏళ్ల నుంచి ఇక్కడే నివసిస్తున్నాం. మాకు తాగునీటి సదుపాయం లేదు. ఇక్కడ వాటర్ మాఫియా చేరి మమ్మల్ని నిలువునా దోచుకుంటున్నారు. వారిని అరికట్టి మాకు తాగునీరు ఇప్పించండి.
– రాజమరాజునగర్ కాలనీ వాసులు
Comments
Please login to add a commentAdd a comment