వీఐటీ– ఏపీ వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు
తాడికొండ: వీఐటీ– ఏపీ విశ్వ విద్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న బిజినెస్ ప్రాక్టీసెస్ ఇన్ డిజిటల్ ఎరాపై అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నీతి ఆయోగ్ ఆర్థిక శాస్త్ర సీనియర్ సలహాదారు డాక్టర్ ప్రవాకర్ సాహూ మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రాన్ని రూ.2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, ప్రభుత్వ దార్శనిక విధానం, స్వర్ణాంధ్రకు భారత ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చిందన్నారు. వికసిత్ భారత్ 2047కు ఇది అనుగుణంగా ఉన్న విధానాలను వివరించారు. వీఐటీ ఏపీ వర్సిటీ వీసీ డాక్టర్ ఎస్‌వీ కోటారెడ్డి మాట్లాడుతూ అనేక అంతర్జాతీయ విశ్వ విద్యాలయాలు, పరిశ్రమలతో చేసుకున్న ఎంఓయూలు తమ వర్సిటీకే తలమానికమన్నారు. తమ వర్శిటీలోని ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా విద్యార్థులలోని యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు నిధులను కూడా అందజేస్తున్నామని వివరించారు. గౌరవ అతిథులు న్యూకాలజీ బిజినెస్ స్కూల్, ఆస్ట్రేయా ప్రొఫెసర్ డాక్టర్ ప్రాన్సిస్కో పోలూచి, ఎడిన్‌బర్గ్ బిజినెస్ స్కూల్ హెరియట్– వాట్ యూనివర్సిటీ యూకే డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ స్వీనీలు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ద్వారా వ్యాపార సామ్రాజ్యం మెరుగు పడుతుందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, రీసెర్చ్ డీన్ డాక్టర్ రవీంద్ర ధూలి, అసోసియేట్ డీన్ డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ ఎ అస్రార్ అహ్మద్, డాక్టర్ సుహైల్ అహ్మద్,భట్, డాక్టర్ మొహమ్మద్, అబ్దుల్ ముఖీత్ మాజ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment