మిర్చి రైతుల బాధ పట్టని కూటమి సర్కారు
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): మిర్చి పంటకు గిట్టుబాటు ధర దక్కక రైతులు అల్లాడుతుంటే కూటమి సర్కారు పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ విమర్శించారు. స్థానిక కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయం మల్లయ్య లింగం భవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికై నా సర్కారు స్పందించాలని, లేకుంటే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కేంద్ర బడ్జెట్‌లో పేద, కర్షక, కార్మిక వర్గాలను విస్మరించారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పచ్చల శివాజీ మాట్లాడుతూ మిర్చి ధర పతనం కావడంపై ఆందోళన వ్యక్తమవుతోందని వివరించారు. గత సంవత్సరం క్వింటాకు 23 వేల రూపాయలు పలికిన ధర ప్రస్తుతం రూ.10 వేలకు పరిమితమైందని, దీనికి కూటమి సర్కారు తీరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పి.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment