నిబంధనలు పాటించడం తప్పనిసరి
డీఎంహెచ్‌వో డాక్టర్ రవి
నరసరావుపేట: జిల్లాలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు వైద్య, ఆరోగ్యశాఖ నిబంధనలు కచ్చితంగా అమలుచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి ఆదేశించారు. జిల్లాలో అన్ని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన సీ–సెక్షన్ ఆపరేషన్ల ఆడిట్‌లో భాగంగా గురువారం ఆయన స్థానిక శ్రేయ ఐవీఎఫ్ సెంటర్‌ను తనిఖీ చేశారు. సీ–సెక్షన్ డెలివరీస్ రికార్డులను పరిశీలించారు. వీలైనంతవరకు సీజేరియన్ డెలివరీస్ తగ్గించాలని సూచించారు. అనంతరం స్కాన్ సెంటర్‌ను పరిశీలించారు. పీసీపీఎన్‌డీటీ యాక్ట్ నిబంధనలకు లోబడి అన్ని మార్పులు సరి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రిజిస్ట్రేషన్, రెన్యువల్స్ సకాలంలో చేసుకోవాలని తెలిపారు. లోపాలపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆయన వెంట స్టాటిస్టికల్ ఆఫీసర్ నీలకంఠేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment